For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జలుబు చేసిందా...? ఐతే వీటికి నో చెప్పండి...

|

సాధారణంగా ఆరోగ్యం సంవత్సరం అంతా ఒకేలాగ ఉండదు. వాతావరణ మార్పులతో పాటు మన శరీరంలో కూడా అనేక మార్పులకు చోటు చేసుకుంటుంది. కాలాన్ని బట్టి జబ్బులు కూడా వస్తుంటాయి. వేసవికాలంలో శరీరం మీద ఎండవేడమి ప్రభావం, శరీరం వేడెక్కడం, చెమటలు, డీహైడ్రేషన్, డయోరీయా ఇలా అనేక జబ్బులు చుట్టుముడుతాయి. అలాగే శీతాకాలం మరియు వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ జబ్బులు ఎక్కువగా ఉంటాయి.

సాధారణమైన జలుబుకి ఇంట్లోనే పరిష్కార మార్గం...

ఏ సీజన్ లో వచ్చే బజ్బులైనా సరే వాటి లక్షణాలు బట్టి వ్యాధిని గుర్తించి, తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చలికాలంలో జలుబు, దగ్గు, ఫీవర్ ఎక్కువగా బాధిస్తుంటాయి. జలుబు చేసిందంటే మనం తీసుకొనే ఆహార పానీయాల మీద ఎక్కువ శ్రద్ద తీసుకోవాలి. ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే జబ్బులను ఎదుర్కోవడానికి శక్తివంతమైన ఆహారాలను కొన్నింటిని చేర్చుకుంటే, అనారోగ్యాలకు గురిచే కొన్ని ఆహారాల ఈ సీజన్లో రెగ్యులర్ డైట్ నుండి మినహాయించాలి. ముఖ్యంగా జలుబు ఉన్నప్పుడు ఖచ్చితంగా వీటికి దూరంగా ఉండాలి.

సాధారణ జలుబును నివారించే ఉత్తమ ఆహారాలు

ఈ కాలంలో కామన్ కోల్డ్ మరియు ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవడానికి హిస్టమైన్ అధికంగా ఉన్న ఆహారాలు లేదా శరీరంలో హిస్టైమైన్ లెవల్స్ ను పెంచే ఆహారాలకు ఖచ్చితంగా నో చెప్పాలి. అదే విధంగా శరీరంలో గల్ల(మ్యూకస్)ఉత్పత్తిని ప్రోత్సహించే ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. ఇవి పొట్టలో ఆమ్లాలాల ఉత్పత్తికి మరియు శరీరంలో అసిడిక్ రిఫ్లెక్షన్ కు దారితీస్తుంది.

యాపిల్ తింటే డాక్టర్ అవసం ఉండదా..ఎంత వరకూ నిజమో చూడండి..!

పండ్లలో అరటి మరియు అవొకాడో వంటి వాటిని తినకపోవడమే మంచిది . ఈ పండ్లలో ఉండే కొన్ని మ్యూకస్ లక్షణాలు వల్ల శరీరంలో త్వరగా కోల్డ్ బారిన పడేట్లు చేస్తుంది. అదే విధంగా క్యాల్షియం అత్యధికంగా ఉండే డైరీ ఫుడ్స్ కు కూడా దూరంగా ఉండాలి. ఇవి శరీరంలో పొట్టలో చేరి వికారానికి గురి చేస్తాయి. జలుబు చేసినప్పుడు ఇవి మీ జబ్బులను నయం చేయకపోగా మరింత జబ్బుపడేలా చేసే ఈ క్రింది తెలిపిన ఆహారాలకు నో చెప్పండి...జలుబు నుండి తేరుకోండి...

డైరీ ఫుడ్స్:

డైరీ ఫుడ్స్:

శరీరంలో వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ కు కారణం అవుతాయి ఈ డైరీ ప్రొడక్ట్స్ . డైరీ ఫ్రొడక్ట్స్ లో ఉండే క్యాల్షియం శరీరంలో మ్యూకస్ ఏర్పడటానికి కారణం అవుతుంది . కాబట్టి డైరీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి. వీటికి ప్రత్యామ్యాయంగా లోఫ్యాట్ కలిగిన ఫ్రోజ్ పెరుగు తీసుకోవచ్చు.

అసిడిక్ ఫుడ్స్:

అసిడిక్ ఫుడ్స్:

అసిడిక్ ఫుడ్స్ కు కంప్లీట్ గా దూరంగా ఉండాలి. అసిడిక్ ఫుడ్స్ లో రెడ్ మీట్ లో ఎక్కువ అసిడిక్ లక్షనాలుండి, నేచురల్ అసిడ్స్ తో కలిసిపోవడం వల్ల త్వరగా జబ్బుపడేందుకు కారణం అవుతాయి . జలుబు చేసినప్పుడు అసిడిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అధికంగా ఇన్ఫ్లమేషన్ కు మరియు శరీరంలో మరిన్ని ఆమ్లాలాలు ప్రసరణకు కారణం అవుతుంది.

షుగర్ ఫుడ్స్:

షుగర్ ఫుడ్స్:

నేచురల్ షుగర్స్ మరియు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఇల్ నెస్ ను దూరం చేస్తాయి . ఆర్టిఫిషియల్ షుగర్స్ ను నివారించుకోవాలి . ఆర్టిఫిషియల్ షుగర్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు గురిచేస్తాయి . దాంతో మరింత అనారోగ్యానికి గురికావల్సి వస్తుంది.

ఫ్యాటీ ఫుడ్స్:

ఫ్యాటీ ఫుడ్స్:

కోల్డ్ అండ్ కఫ్ తో బాధపడేటప్పుడు ఫ్యాటీ ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది . ఇవి శరీర ఆరోగ్యంను మరింత బలహీనపరిచి త్వరగా సిక్ అయ్యేలా చేస్తాయి . కాబట్టి ఫ్యాటీ ఫుడ్స్ ను చలికాలంలో ఎంత ఎక్కువగా తగ్గిస్తే అంత మంచిది.

ఆల్కహాల్:

ఆల్కహాల్:

ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఆల్కహాల్ కు దూరంగా ఉంటే మంచిది. అనారోగ్యంలో కూడా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వ్యాధినిరోధకతను బలహీనం చేస్తుంది. దాంతో తక్కువ ఉష్ణోగ్రతలో జలుబు మరింత పెరిగే అవకాశం ఉంది

 ఫాస్ట్ ఫుడ్స్:

ఫాస్ట్ ఫుడ్స్:

ఫాస్ట్ ఫుడ్స్ కు పూర్తిగా నో చెప్పాల్సిండే . జలుబుతో బాధపడుతున్నప్పుడు , జీరో న్యూట్రీషియన్స్ , అధిక క్యాలరీలున్న ఫాస్ట్ ఫుడ్స్ ఫుడ్ తినడం వల్ల, బాడీ మెటబాలిజం రేటును తగ్గించేసి, వ్యాధులను మరియు ఇన్ఫెక్షన్స్ ను ఎదుర్కొనే శక్తిని తగ్గిస్తుంది.

 జ్యూస్ డైట్ :

జ్యూస్ డైట్ :

అనారోగ్యంగా ఉన్నప్పుడు జ్యూస్ డైట్ తీసుకోవడం అంత మంచిది కాదు. జ్యూస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అది ఆరోగ్యానికి మంచిదే, అయితే వాటిలో ఉండే షుగర్స్ ఇమ్యూన్ సిస్టమ్ కు హాని కలిగిస్తుంది కాబట్టి, చలికాలంలో జ్యూస్ డైట్ కు దూరంగా ఉండాలి.

English summary

Foods You Should Avoid When You Have A Cold

We are often told that when we're down with an illness like common cold or fever, it is best to watch the diet and amount of fluid intake. Though, there are several foods to add to the diet during a perfect weather, there are certain foods that you should avoid too, especially when you have a cold.
Story first published: Wednesday, December 16, 2015, 18:03 [IST]
Desktop Bottom Promotion