For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దగ్గు, జలుబును చిటికెలో మాయం చేసే చిట్కాలు

By Nutheti
|

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. దగ్గు, జలుబు వేధిస్తూ ఉంటాయి. ఎన్ని మందులు వాడినా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అసలు వదిలిపెట్టవు. పిల్లల విషయంలో ఇవి మరీ ఇబ్బంది పెడుతుంటాయి. స్కూల్లో ఒకరిని ఒకరు తాకడం, దగ్గరగా కూర్చోవడం వల్ల ఇన్ఫెక్షన్ త్వరగా సోకుతుంది.

READ MORE: బ్రాందీతో జలుబు మరియు దగ్గు మటు మాయం..

సీజనల్ చేంజెస్ వల్ల, వర్షాల వల్ల తరచుగా ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది. ఇక వర్షాకాలంలో అప్పుడప్పుడు వర్షంలో తడవడం వల్ల.. వెంటనే దగ్గు, జలుబు పట్టుకుంటాయి. దాంతో పాటు సైనస్, కఫం, గొంతునొప్పి ఎక్కువగా వ్యాపిస్తాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే చికిత్స చేయకపోతే... చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇవి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లే అయినే త్వరగా వదిలిపెట్టవు. కాబట్టి వీటికి ట్యాబ్లెట్ల కంటే.. వంటింట్లో ఉండే ఔషధాలు మంచి ఫలితాన్నిస్తాయి. త్వరగా ఉపశమనం కలిగిస్తాయి.

జలుబు, దగ్గును తరిమికొట్టే హోం రెమిడీస్

జలుబు, దగ్గును తరిమికొట్టే హోం రెమిడీస్

ఒక టీ స్పూన్ సొంఠి, టీ స్పూన్ మిరియాల పొడి, అయిదారు తులసి ఆకులు తీసుకుని నీటిలో కలిపి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత వడబోసి ఒక స్పూన్ తేనె కలిపి రోజుకు మూడు సార్లు తాగితే.. జలుబు, దగ్గు తగ్గుతాయి.

జలుబు, దగ్గును తరిమికొట్టే హోం రెమిడీస్

జలుబు, దగ్గును తరిమికొట్టే హోం రెమిడీస్

జలుబు పూర్తీగా తగ్గేవరకు రోజుకు మూడుసార్లు వేడినీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది.

జలుబు, దగ్గును తరిమికొట్టే హోం రెమిడీస్

జలుబు, దగ్గును తరిమికొట్టే హోం రెమిడీస్

వెల్లుల్లిని బాగా నూరాలి. గంటక ఒకసారి దాని వాసన పీలిస్తే.. మంచి ఫలితం ఉంటుంది. అప్పుడప్పుడు వెల్లుల్లి రెబ్బలు నమిలి మింగడం వల్ల కూడా జలుబు తగ్గిపోతుంది.

జలుబు, దగ్గును తరిమికొట్టే హోం రెమిడీస్

జలుబు, దగ్గును తరిమికొట్టే హోం రెమిడీస్

ఒక టేబుల్ స్పూన్ తేనెలో సగం టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి పడుకునేటప్పుడు తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.

జలుబు, దగ్గును తరిమికొట్టే హోం రెమిడీస్

జలుబు, దగ్గును తరిమికొట్టే హోం రెమిడీస్

జలుబు, తుమ్ములు వేధిస్తుంటే నీటిని బాగా ఉడకబెట్టి అందులో పసుపు వేసి ఆవిరి పట్టుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయడం వల్ల త్వరగా తగ్గుతుంది.

జలుబు, దగ్గును తరిమికొట్టే హోం రెమిడీస్

జలుబు, దగ్గును తరిమికొట్టే హోం రెమిడీస్

2 లేదా 3 తులసి ఆకులను నీళ్లలో కలిపి కాసేపు ఉడకపెట్టాలి. నీళ్లు చల్లారిన తర్వాత ఆ నీటిని పుక్కిలిస్తే గొంతునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

జలుబు, దగ్గును తరిమికొట్టే హోం రెమిడీస్

జలుబు, దగ్గును తరిమికొట్టే హోం రెమిడీస్

జలుబు, ముక్కుదిబ్బడ తీవ్రంగా వేధిస్తుంటే.. కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ ను కర్చీఫ్ పై వేసుకుని వాసన పీలుస్తూ ఉండాలి. ఈ పరిష్కారం చక్కటి ఫలితాన్నిస్తుంది.

జలుబు, దగ్గును తరిమికొట్టే హోం రెమిడీస్

జలుబు, దగ్గును తరిమికొట్టే హోం రెమిడీస్

తులసి, మిరియాలతో కషాయం చేసుకుని తాగుతూ ఉంటే.. జలుబు దరిచేరకుండా ఉంటుంది.

English summary

Home remedies to cure cold and cough in telugu

Are you suffering from cold every other week? Frequent cold can be a really troublesome health condition where you will find it hard to do your day to day work. There are many people who suffer from cold most of the times.
Story first published: Tuesday, November 3, 2015, 17:06 [IST]
Desktop Bottom Promotion