For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరైన నిద్రలేకపోతే శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి..

|

ఈ మద్యన జరిపిన కొన్ని పరిశోధనల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు కనుగొన్నారు., ఈ సమస్యకు ముఖ్య కారణం టెక్నాలజీ. ఫ్రెండ్ మొబైల్స్, కంప్యూటర్స్, లాప్ టాప్స్. నిద్రలేమి సమస్యతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. ముఖ్యంగా మెడికేషన్ తీసుకొనే వారికి మంతి హాని జరిగే అవకాశం ఎక్కువ.

నిద్రలేమి సమస్య మెంటల్ గా మరియు ఫిజికల్ చాలా క్రుంగదీస్తుంది. నిద్రలేమి సమస్య మీ జీవనశైలిమీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు. అలాంటి కొన్ని విషయాలను ఈ క్రింది లిస్ట్ లో తెలపడం జరిగింది.

ఈక్రింది లిస్ట్ లో తెలిపిన విషయాలు సరైన నిద్రపొందకపోవడం లేదా కనీసం రోజులో 8గంటలు నిద్ర పొందలేని వారిలో ఎక్కువగా కనిపించే లక్షణాలు. కాబట్టి, ఈ విషయాలు తెలుసుకొన్నాక కూడా మీకు ఏమాత్రం మీ ఆరోగ్యం మీద శ్రద్ద ఉన్నట్లైతే నిద్రించే ముందు గాడ్జెట్లకు దూరంగా ఉంటారు. నిద్రలేమి వల్ల కలిగే దుష్ప్రభావాలేంటో ఒక సారి చూద్దాం...

 శరీరం సహకరించదు:

శరీరం సహకరించదు:

నిద్రలేమి వల్ల శరీరంలో ఎనర్జీ లెవల్స్ తగ్గుతాయి. దాంతో నిద్రలేమితో పోరాడే శక్తి లేక అనారోగ్యం పాలవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీలో వ్యాధినిరోధకత పెరుగుతుంది .

కాబట్టి ప్రతి రోజూ సరిపడా నిద్రించడం వల్ల శరీరం ఫిట్ గా మరియు హెల్తీగా ఉంచుకోవచ్చు.

హార్ట్ మీద దుష్ప్రభావం:

హార్ట్ మీద దుష్ప్రభావం:

నిద్రలేమి వల్ల హార్ట్ ఎక్కువగా సఫర్ అవుతుంది . విశ్రాంతి కలగకపోవడం వల్ల గుండె నుండి సరైన రక్తప్రసరణ జరగక హార్ట్ సమస్యలను కొనితెచ్చుకొన్నట్లైవుతుంది.

క్యాన్సర్ వచ్చే అవకాశాలు:

క్యాన్సర్ వచ్చే అవకాశాలు:

ప్రతి రోజూ సరిగా నిద్రపోనట్లై క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్, కాలరెక్టల్, మరియు ప్రొస్టెట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది .:

మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది .:

మనిషికి సరిగా నిద్రలేకపోతే కాగ్నిటివ్ సమస్యలు ఎక్కువ. ఇది దినచర్యమీద ప్రభావం చూపడం మాత్రమే కాదు, మనస్సు మీద కూడా ప్రభావం చూపతుంుది . ఇది మీరు చేసే పనిమీద ఎక్కువ ప్రభావం చూపుతుంది.

మతిమరుపు:

మతిమరుపు:

నిద్రలేమి సమస్య వల్ల మెదడుకు నిద్రసరిపోలేదని సంకేతాలు వెళుతాయి. దాంతో నిద్రలేదనే మానసిక స్థితి మెంటల్ గా అప్ సెట్ అయ్యి, మతిమరుపుకు దారితీస్తుంది.

కోరికలు తగ్గిస్తుంది:

కోరికలు తగ్గిస్తుంది:

నిద్రలేమి వల్ల పురుషుల్లో కామవాంఛ సన్నగిల్లుతుంది . నాలుగైదు గంటలు మాత్రమే నిద్రపోవడం వల్ల పురుషుల్లో సెక్స్ హార్మోన్లు తగ్గుతాయి దాంతో కామవాంఛ తగ్గుతుంది.

బరువు పెరుగుతారు:

బరువు పెరుగుతారు:

నిద్రలేమి వల్ల సడెన్ గా బరువు పెరుగుతుంది. ఇది ఒక ముఖ్య కారణంగా చెప్పవచ్చు.

డయాబెటిస్:

డయాబెటిస్:

డయాబెటిస్: నిద్రలేమి వల్ల త్వరగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ . శరీరంకు నిద్రవల్ల తగినంత విశ్రాంతి అందకపోవడం వల్ల ఇన్సులిన్ లెవల్స్ పెరుగుతాయి. దాంతో చిన్న వయస్సులోనే ఒకరకమైన డయాబెటిస్ ను ఎదుర్కోవల్సి వస్తుంది.

శరీరం కంట్రోల్ తప్పుతుంది.:

శరీరం కంట్రోల్ తప్పుతుంది.:

సరైన నిద్రలేకపోతే శరీరం కంట్రోల్ తప్పుతుంది. దాంతో వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

అందం మీద ప్రభావం:

అందం మీద ప్రభావం:

సరైన నిద్రలేకపోవడం వల్ల అందం పాడవుతుంది. ముఖంలో ముడతలు, ఫైన్ లైన్స్ మరియు పిగ్మెంటేషన్ సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది . ఇవి నిద్రలేమి వల్ల శరీరంలో జరిగే అనుకోని పరిణామాలు....

Story first published: Tuesday, October 20, 2015, 18:26 [IST]
Desktop Bottom Promotion