For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాణహాని కలిగించే స్లీప్ ఆప్నియా నుండి విముక్తి కలిగించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!!

జీవితాన్ని దుర్భరం చేయడమే కాదు, ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా పరిణమించే ఒక ప్రమాదకర వ్యాధి (ఓఎస్‌ఏ) ఆబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని, దాదాపు ప్రతి ఐదుగురిలో ఒకరిని వేధి

|

ప్రపంచంలోని ప్రతి జీవిని మైమరిపింపజేసేది నిద్ర. ప్రతిరోజూ మనల్ని నూతనోత్తేజంతో ఆవిష్కరింపజేసే నిద్ర ఎంత అమృత ప్రాయంగా ఉంటుందో నిద్రలేమితో బాధపడేవారికే తెలుస్తుంది. క్లాస్‌లో పాఠం వినేప్పుడు, ఆఫీస్ లో పనిచేసేప్పుడు ఆవులింతలు తీయడం, ఏ సభకో, సమావేశానికో వెళ్లినప్పుడు ఒకరో ఇద్దరో ఓ మూల కూర్చుని గురకపెట్టడం గమనిస్తూనే ఉంటాం. రాత్రంతా గురకపెట్టి నిద్రపోయినా మర్నాటి ఉదయం మగతగా ఉండేవాళ్లూ కనిపిస్తూనే ఉంటారు. ఇలాంటివాళ్లకు ఉండే సమస్యనే స్లీప్ అప్నియా సిండ్రోమ్ అంటారు. స్థూలకాయంతో బాధపడేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

ఎంతటి ఉన్నతమైన హోదాలో ఉన్నా, ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నా నిద్ర ఒక్కటి కరువైతే అన్నీ ఉండి ఏమీ లేనట్లే. ఎందుకంటే నిద్రలేమితో మొత్తం జీవక్రియలన్నీ కుంటుపడతాయి. వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ పూర్తిగా వెనకబడతారు. ఆబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా సమస్యతో వచ్చే తంటాయే ఇది. ఏనాడూ కంటినిండా నిద్రలేకుండా చేసే ఈ వ్యాధి వల్ల రోగి క్రమంగా డిప్రెషన్‌లోకి జారిపోవడమే కాదు, ఒక్కోసారి శ్వాస అందక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

జీవితాన్ని దుర్భరం చేయడమే కాదు, ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా పరిణమించే ఒక ప్రమాదకర వ్యాధి (ఓఎస్‌ఏ) ఆబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని, దాదాపు ప్రతి ఐదుగురిలో ఒకరిని వేధిస్తున్న సమస్య ఇది. అయితే చాలా మందికి తమకు ఆ సమస్య ఉన్నట్లు కూడా తెలియదు. దాంతో నిద్రలో మధ్య మధ్యలో కొన్ని క్షణాలపాటు శ్వాస ఆగిపోయి, మళ్లీ మామూలైపోతుంది. ఇలాంటి వారికి తమకు ఓఎస్ఏ సమస్య ఉన్నట్లు కూడా తెలియకపోవచ్చు. మరికొందరిలో ఇది కొన్ని క్షణాల నుంచి కొన్ని నిమిషాల దాకా కొనసాగవచ్చు. ఇలాంటి వారు నిద్రాభంగంతో పదే పదే లేచి కూర్చుంటారు.

10 Effective Home Remedies For Sleep Apnea; A Must Try

గంటకు 10 నుంచి 30 సార్లు వరకు ఇలా నిద్రాభంగం జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల రాత్రంతా మంచం మీదే ఉన్నా, నిద్ర వల్ల వచ్చే విరామం, ఉల్లాసమే ఉండవు. ఒకవేళ ఎప్పుడైనా నిద్రలోకి జారినా పెద్దగా గురక వస్తుంది. ఇలా శ్వాస ఆగిపోవడానికి, శ్వాసనాళాలు పాక్షికంగానో, మొత్తంగానో తమ ప్రక్రియలో విఫలం కావడమే కారణం. ఎక్కువ మందిలో ఈ స్థితి ఏర్పడటానికి నాలుక వెనుక భాగానికి తిరిగి గొంతులో అడ్డుపడటమే ప్రధాన కారణం. ఈ సమస్య వల్ల రక్తంలో ఆక్సిజన్‌ నిలువలు పడిపోతాయి.

ఓఎస్‌ఏ సమస్య ఎవరికైనా రావొచ్చు. కాకపోతే పురుషుల్లో రెండింతలు ఎక్కువగా కనిపిస్తుంది. స్థూలకాయం, అధిక రక్తపోటు, శ్వాస నాళాలు చిన్నవిగా ఉండడం, నాసికా రంధ్రాలు ముడుచుకుపోవడం, మధుమేహం వీటితో పాటు పొగతాగడం, మద్యపానం వంటివి ప్రధాన కారణంగా కనిపిస్తాయి.

పగటి పూట అతిగా నిద్రించడం, పెద్దగా గురక పెట్టడం, నిద్రా సమయంలో శ్వాసపరంగా పదేపదే అంతరాయం ఏర్పడటం. శ్వాస తీసుకోవడం కష్టమై హఠాత్తుగా మెలకువ రావడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. వీటితో పాటు మేల్కొన్నప్పుడు గొంతు ఎండిపోవడం లేదా గొంతు నొప్పిగా ఉండడం, ఛాతీ నొప్పితో మెలకువ రావడం, ఉదయం లేవగానే తలనొప్పి అనిపించడం, రోజంతా ఏ విషయం మీదా మనసు లగ్నం చేయలేకపోవడం, డిప్రెషన్‌, అసహనం వంటి మానసిక స్థితికి లోనుకావడం వంటి లక్షణాలు కూడా ఎక్కువగానే కనిపిస్తాయి. స్లీప్ ఆప్నియాను నివారించుకోవడానికి లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకురావాలి. స్లీప్ ఆప్నియాను నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ నేచురల్ ట్రీట్మెంట్ ఈ క్రింది విధంగా..

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ప్రతి రోజో రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను పరగడపున తినడం వల్ల శ్వాసలో ఇబ్బందులు తొలుగుతాయి.

టర్మరిక్ మిల్క్ :

టర్మరిక్ మిల్క్ :

ఒక గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు మిక్స్ చేసి తాగాలి. ఇలా రోజూ రాత్రి నిద్రించడడానికి ముందు తాగడం వల్ల స్లీప్ ఆప్నియాను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఇది బ్రీతింగ్ సమస్యలను నివారిస్తుంది. గాయలను, వ్యాధులను త్వరగా నయం చేస్తుంది. నిద్రలేమి సమస్యలను నివారిస్తుంది. కాబట్టి రెగ్యులర్ వంటకాల్లో దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేయడం మంచిది. లేదా ఒక గ్లాసు హాట్ వాటర్ లో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేసి తాగాలి.

 తేనె:

తేనె:

తేనెలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. శ్వాసక్రియకు ఇబ్బంది కలిగించే గొంతు నొప్పి, గొంతు వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే నిద్రలేమి సమస్యను నివారిస్తుంది. ఒక గ్లాసు వేడి నీటిలో తేనె మిక్స్ చేసి నిద్రించే ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

పుదీనా:

పుదీనా:

ఒక గ్లాసు నీటిలో పిప్పర్మెంట్ ఆయిల్ ను కొన్ని చుక్కలు వేసి ఆ నీటితో గార్గిలింగ్ చేయాలి. ముఖ్యంగా రాత్రుల్లో చేస్తే మంచి ఫలితం ఉంటుంది. శ్వాససమస్యలను నివారిస్తుంది. నిద్రబాగా పడుతుంది.

ల్యావెండర్ ఆయిల్ :

ల్యావెండర్ ఆయిల్ :

కొన్ని చుక్కల ల్యావెండర్ ఆయిల్ ను ఒక బౌల్ హాట్ వాటర్ లో మిక్స్ చేసి, స్టీమ్ చేయాలి. రాత్రి నిద్రించి ముందు ఆవిరి పడితే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. స్లీప్ ఆప్నియా లక్షణాలను నివారిస్తుంది.

యాలకలు:

యాలకలు:

యాలకల్లో డికాగ్నసెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది నాజల్ బ్లాకేజ్ ను క్లియర్ చేస్తుంది. నిద్ర సమస్యను దూరం చేస్తుంది. ఒక గ్లాసు వేడి నీటిలో చిటికె యాలకలపొడి మిక్స్ చేసి, నిద్రించడానికి అరగంట ముందు తాగాలి.

 చమోమెలీ టీ:

చమోమెలీ టీ:

చమోమెలీ టీలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి మజిల్స్ ను రిలాక్స్ చేస్తుంది. నిద్రబాగా పట్టడానికి సహాయపడుతుంది. ఎండిన చమోమెలీ లీవ్స్ ను వేడి నీటిలో వేసి మరిగించాలి. బాగా మరిగిన తర్వాత వడగట్టి రాత్రి నిద్రించడానికి ముందు తాగాలి.

 బాదం:

బాదం:

బాదంలో మజిల్ రిలాక్స్ చేసే గుణాలు అధికంగా ఉంటాయి. ప్రతి రోజూ 10 బాదాంలను నీటిలో నానబెట్టి రోజూ తినడం వల్ల స్లీప్ ఆప్నియా తొలగిపోతుంది.

హాట్ వాటర్ స్టీమ్ :

హాట్ వాటర్ స్టీమ్ :

ఒక బౌల్ హాట్ వాటర్ తో ఆవిరి పట్టాలి. నిద్రించడానికి 10 నిముషాల ముందు ఆవిరి పట్టడం వల్ల ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

English summary

10 Effective Home Remedies For Sleep Apnea; A Must Try

who are obese, have a heart problem and have the habit of excess smoking and drinking alcohol and those with a family history of sleep apnea are among those who are at a higher risk. Hence, bringing about a change in the lifestyle also helps prevent sleep apnea.
Story first published: Wednesday, December 14, 2016, 16:52 [IST]
Desktop Bottom Promotion