For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హై అలర్ట్ : బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి ? బ్రెయిన్ స్ట్రోక్ నివారించడం ఎలా..

|

మెదడు లోని కొంత భాగానికి రక్తం సరఫరా కాకుండా అంతరాయం ఏర్పడినపుడు ... ఆ భాగానికి ఆక్షిజన్ , పోశాకపదర్దాలు అందకపోవడం వలన ఆ భాగములోని మెదడు కణాలూ నిర్జీవమవడం వలన ... తత్సంభంద శరీర భాగాలు పనిచేయక పోవదాన్నే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు . బ్రెయిన్ స్ట్రోక్ కుడా గండే పోటు లాగానే ఒక అత్యవసర వైద్య స్థితి . స్ట్రోక్ లక్షణాలు ముందుగా సకాలం లో గుర్తిస్తే సరైన చికిత్స లభిస్తే వ్యక్తికి ప్రాణ భయం ఉండదు . వ్యక్తికి స్ట్రోక్ రాకపోయినా ఇక ముందు వచ్చే అవకాశాలు ఉన్నాయని గుర్తిస్తే , స్ట్రోక్ ను నిరోధించడానికి వీలుంటుంది .

బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం. ఇది రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రధానంగా మారుతున్న జీవనశైలి, జంక్‌ఫుడ్స్, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, స్థూలకాయం, మధుమేహం, హైబీపీ వంటి కారణాలతో ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా సకాలంలో సరైన చికిత్స అందిస్తే మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

స్ట్రోక్ రెండు రకాలున్నాయి : ఒక్కోదానికి ఒక్కో కారణం ఉన్నది .
1. మెదడుకు రక్తం సరఫరాచేసే రక్తం గడ్డకట్టి అవరోధం ఏర్పడితే " ఇస్కీమిక్ స్ట్రోక్ " వస్తుంది . కొవ్వు నిక్షెపాలు , కొలెస్ట్రాల్ .. కారణం గా ఈ మార్గం ముడుచుకు పోయి గట్టిపడుతుంది
2. మెదడు లోని ఒక నాళం లో రంద్రాలు ఏర్పదదమో , చిట్లి పోవడమో జరిగితే " హెమరేజిక్ స్ట్రోక్" వస్తుంది . అధిక రక్తపోటు వల్ల ,నాళం గోడలు పలుచబడి పోవడం వల్ల మెదడులో రక్త స్రావం జరుగ వచ్చును.

కారణాలు : 65 ఏళ్ళు దాటినవారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కుటుంబం లో ట్రాన్స్ సియంట్ ఇస్కీమిక్ ఎటాక్ రికార్డు ఉంటే కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశాలు ఎక్కువ . అధిక రక్త పోటు, అధిక కొలెస్టిరాల్, క్రమబద్ధం గా గుండె కొట్టుకోకపోవడం (irregular heart beat). గుండె రక్తాన్ని సరిగా పంపించాక పోవడం . గతం లో గుండె పోటు వచ్చి ఉంటే ..మధుమేహము, స్థూల కాయం, సంతాన నిరోధక మాత్రలు వాడడం, ఎక్కువ గా పొగత్రాగడం , వంటివి స్ట్రోక్ కు దారి తీయవచ్చును.

లక్షణాలు : శరీరము లో కుదివైపో , ఎడమ వైపో ముఖ్యం గా మొహం ,చెయ్యి ,కాలు చచ్చు పడిపోయినట్లు అనిపించడం, బలహీన పడినా , మాట్లాడడం లో మేస రావడం ,మాటలు అర్ధం చేసుకోవదానికు ఇబ్బంది పడినా , కంటిచూపు మందగించినా ,వక్రీకరించినా , ఒక వస్తువు రెండు గా కనిపించినా , కారణం లేకుండా అతిగా అసాధారణంగా తలనొప్పి వచ్చినా , ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. పక్షవాతం విషయంలో చికిత్స గురించి ఆలోచించడం కంటే నివారణ ఎంతో మేలు. ఇది చిన్నప్పట్నుంచే మొదలు కావాలి. నివారణ మార్గాలు కూడా చాలా సులభం.

బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు :

 1. లైఫ్ స్టైల్:

1. లైఫ్ స్టైల్:

మంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. పొగ, మత్తుమందులు , మధ్యపానీయంలకు దూరం గా ఉండాలి ,

 2. ఆహారపు అలవాట్లు:

2. ఆహారపు అలవాట్లు:

ఆహారంలో కొవ్వులు/ నూనెలు /మసాలాలు తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

3. ఉప్పు తగ్గించాలి:

3. ఉప్పు తగ్గించాలి:

ఆహారంలో ఉప్పు బాగా తగ్గించాలి. ఒకసారి అన్నం పెట్టుకున్న తర్వాత పైనుంచి ఉప్పు వేసుకోవడం అలవాటును మానుకోవాలి.

4. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

4. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

తాజా ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు వంటి పోషకాహారాలను తీసుకోవాలి. కూరల్లో పసుపు ఎక్కువగా వాడటం పక్షవాతం నివారణకు బాగా మేలు చేస్తుంది.

5. వ్యాయామం:

5. వ్యాయామం:

శరీరానికి తగినంత శ్రమ ఉండాలి. క్రమం తప్పకుండా రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి.

 6. ఒత్తిడి తగ్గించుకోవాలి:

6. ఒత్తిడి తగ్గించుకోవాలి:

మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలి.

 7. ఆలివ్ ఆయిల్ :

7. ఆలివ్ ఆయిల్ :

తాజా అధ్యయనాల ప్రకారం వంటకు ఆలివ్ ఆయిల్ వాడటం, ముదురు రంగులో ఉండే చాక్లెట్లు పక్షవాతం నివారణకు ఉపయోగపడతాయని తేలింది.

8. ఆల్కహాల్ మానేయాలి:

8. ఆల్కహాల్ మానేయాలి:

ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి.

9. బర్త్ కంట్రోల్ పిల్స్ :

9. బర్త్ కంట్రోల్ పిల్స్ :

సంతాన నిరోధక మాత్రలు వాడుతున్నపుడు .. తరచూ గా వైద్య పరీక్షలు చేసుకోవాలి .

10 నీరు బాగా త్రాగాలి:

10 నీరు బాగా త్రాగాలి:

ఒంట్లో నీరు బాగా తగ్గిపోవటం (డీహైడ్రేషన్‌) వంటివీ పక్షవాతానికి కారణమవుతాయి. ఇలాంటి ముప్పు కారకాల విషయంలో మనం ముందే జాగ్రత్తగా ఉండటం అవసరం.ముఖ్యంగా వృద్ధులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విరేచనాలు అవుతున్నప్పుడు ఒంట్లో నీరు తగ్గకుండా చూసుకోవాలి. ఎండాకాలంలో పక్షవాతం బారినపడేవారి సంఖ్య ఎక్కువ.

11. బరువు తగ్గించుకోవాలి:

11. బరువు తగ్గించుకోవాలి:

అధిక బరువు తగ్గడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ,అధిక బరువు వాళ్ళ ఊబకాయం వస్తుంది. ప్రపంచం మొత్తంలో ఎక్కువమంది పిల్లలు వూబకాయంతో బాధపడుతున్నారు. దీనివల్ల గుండెజబ్బులు, స్ట్రోక్ లు వస్తాయి. అధిక బరువును తగ్గించడానికి మీరు తీసుకునే ఆహారపు అలవాట్లు, ఇతర కార్యక్రమాల పట్ల ప్రత్యెక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. మీరు మీ BMI స్థాయి 25 కంటే తక్కువ ఉండేట్టు చూసుకోవడం అవసరం. పరిమిత ఆహరం తీసుకుంటూ, ప్రత్యేకంగా గుండె సంబంధ నిపుణుడైన వైద్యునితో సంప్రది౦చడం అవసరం. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడం ఎలా అనేది చాలా అద్భుతమా? అధిక బరువును తగ్గించుకోవడం. ఈ సూచనను గుర్తుంచుకోండి.

12. రక్తపోటు అదుపులో ఉంచుకోవాలి:

12. రక్తపోటు అదుపులో ఉంచుకోవాలి:

అధిక రక్తపోటు గుండెకు చాలా ప్రమాదం. రక్తపోటును తగ్గించుకోవడం, దాన్ని సున్నితంగా నిర్వహించుకోవడం స్ట్రోక్ ను నివారించడానికి అత్యంత ఫలవంతమైన ఉపశమనం. ఆధునిక జీవనశైలిలో వత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. క్రమపధ్ధతిలో వైద్యుడిని సంప్రదించడం, రక్తపోటుని పరీక్షించుకోవడం చాలా అవసరం. ఉప్పును తీసుకోవడం తగ్గిస్తే రక్తపోటు తగ్గుతుంది. వైద్యుల సలహామేరకు ప్రతిరోజూ మందులు తీసుకోవాలి.

English summary

12 things you can do to prevent a stroke

Lifestyle counts, and in stroke prevention, the sum of one's efforts appears to be greater than singular prevention elements. Here are eight ways to start reining in your risks today, before a stroke has the chance to strike.
Story first published:Tuesday, April 19, 2016, 16:15 [IST]
Desktop Bottom Promotion