For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్లో హై బ్లడ్ ప్రెజర్ ను తగ్గించే 13 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!!

చాలా వరకూ, వయస్సైన వారిలో ఎక్కువ మంది హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడటం చూస్తుంటాము. అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండటానికి కొన్ని ముందులు తీసుకోవడం మంచిది.

|

సహజంగా మనిషి పైకి ఎంత ఆరోగ్యంగా కనబడ్డా, అంతర్గతంగా ఏ చిన్నసమస్య ఉన్నా, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అటువంటి వాటిలో హైబ్లడ్ ప్రెజర్ ఒకటి. హైబ్లడ్ ప్రెజర్ హార్ట్ కు అత్యంత ప్రమాదకరమైనది. హైబ్లడ్ ప్రెజర్ ను నివారించుకోవడానికి కొన్ని ప్రత్యేమైన హోం రెమెడీస్ ఉన్నాయి. హార్ట్ రక్తంను ప్రసరింపచేస్తుంది. రక్తం గుండె నుండి బాడీ మొత్తం ధమనుల ద్వారా అన్ని అవయావాలకు ప్రసరిస్తుంది. రక్తప్రసరణలో ఏ చిన్న లోపం వచ్చినా పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ధమనలు ప్రసరించే రక్తం ప్రవాహం మీదనే బ్లడ్ ప్రెజర్ ఆధారపడి ఉంటుంది. బ్లడ్ ప్రెజర్ అత్యంత ప్రమాదకరం. బిపి గరించి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బ్లడ్ ప్రెజర్ కు ఎలాంటి లక్షణాలను కనబడకుండానే బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతుంటారు.

చాలా వరకూ, వయస్సైన వారిలో ఎక్కువ మంది హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడటం చూస్తుంటాము. అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండటానికి కొన్ని ముందులు తీసుకోవడం మంచిది. మొదట డాక్టర్ ను కలిసి, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం చాలా అవసరం. ఇవే కాకుండా హైబ్లడ్ ప్రెజ్ ను తగ్గించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ను ఉపయోగించుకోవచ్చు. ఈ హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేసి, హైబ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తాయి . దాంతో మనిషి ఆరోగ్యంగా జీవించగలడు. ఈ హోం రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల ఎలాంటి హాని జరగదు మరియు డాక్టర్ కూడా అంగీకరిస్తారు.

వింటర్ సీజన్లో హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ...

వెల్లుల్లి:

వెల్లుల్లి:

హైబ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేసే హోం రెమెడీస్ లో వెల్లుల్లి గ్రేట్ రెమెడీ. వెల్లుల్లిలో వుండే అల్లీసిన్ అనే కంటెంట్ బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది. దీన్ని పచ్చిగా, లేదా ఫ్రై చేసిన లేదా వంటలో జోడించి తినవచ్చు. అయితే బ్లడ్ ప్రెజర్ ఉన్నవారు, పచ్చిగా అలాగే నమిలి తినడం ఉత్తమ పద్దతి.

 కొబ్బరి నీళ్ళు:

కొబ్బరి నీళ్ళు:

రెగ్యులర్ గా కోకనట్ వాటర్ తాగడం వల్లహైబిపి కంట్రోల్లో ఉంటుంది. హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో ఇది బెస్ట్ హోం రెమెడీ. కొబ్బరి నీళ్ళలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి హైబిపిని కంట్రోల్ చేస్తుంది.

అరటి పండ్లు :

అరటి పండ్లు :

హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారు రెగ్యులర్ గా అరటిపండ్లను తినడం మంచిది. అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బాడీలో సోడియంను గ్రహించడానికి సహాయపడుతుంది.

ఆరెంజ్ జ్యూస్ :

ఆరెంజ్ జ్యూస్ :

రెగ్యులర్ గా ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల హైపర్ టెన్షన్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా హైబ్లడ్ ప్రెజర్ లో మార్పులు వస్తాయి.

 బేక్ చేసిన స్వీట్ పొటాటో :

బేక్ చేసిన స్వీట్ పొటాటో :

ఈ హోం రెమెడీని ప్రయత్నించడానికి ముందు డాక్టర్ ను కన్సల్ట్ అవ్వడం మంచిది. బేక్డ్ స్వీట్ పొటాటో తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవుతుంది.

లెమన్ జ్యూస్ :

లెమన్ జ్యూస్ :

బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేయడంలో లెమన్ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. బ్లడ్ వెజల్స్ లో రక్తం స్మూత్ గా, ఫ్లెక్సిబుల్ గా ప్రసరించడానికి సహాయపడుతుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి, హార్ట్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ప్రతి రోజూ ఉదయం పరగడపును లెమన్ హాట్ వాటర్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

తేనె:

తేనె:

బ్లడ్ ప్రెజర్ కు తేనె ఎక్సలెంట్ రెమెడీ. బ్లడ్ వెజల్స్ ను రిలాక్స్ చేస్తుంది. హైబ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది. ఒక టీస్పూన్ తేనె తీసుకుని, నేరుగా తినవచ్చు. బ్రేక్ ఫాస్ట్ కు ముందు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

స్పినాచ్ జ్యూస్ :

స్పినాచ్ జ్యూస్ :

ఆకుకూరలతో తయారుచేసిన జ్యూస్ హార్ట్ కు చాలా మేలు చేస్తుంది. కొన్ని వారలా పాటు రెగ్యులర్ గా తింటుంటే మంచి ఫలితం చూస్తారు. రిలీఫ్ అనిపిస్తుంది.

వాటర్ ఎక్కువగా తాగాలి:

వాటర్ ఎక్కువగా తాగాలి:

రోజుకు సరిపడా నీళ్ళు కనీసం 8 గ్లాసుల నీళ్ళు తాగడం ఆరోగ్యానికి మంచిది. బాడీ హైడ్రేషన్ లో ఉంటుంది. ఈ నేచురల్ రెమెడీ హైబ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బ్లడ్ ప్రెజర్ ను మెంటైన్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

హైబ్లడ్ ప్రెజర్ తగ్గించడంలో వాటర్ మెలోన్ కూడా ఒకటి. ఇందులో ఉండే బ్లడ్ కాపిల్లర్స్ బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. వ వాటర్ మెలోన్ లోని సీడ్స్ ను ఎండబెట్టి, పొడి చేసి ఉదయం, సాయంత్రం తినడం మంచిది.

ఉల్లిపాయలు గ్రేట్ గా సహాయపడుతాయి:

ఉల్లిపాయలు గ్రేట్ గా సహాయపడుతాయి:

ఉల్లిపాయలు బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తాయన్న విషయం మీకు తెలుసా? ఉల్లిపాయల్ని పచ్చిగా తింటే మరింత మంచిది. రెగ్యులర్ గా ఉల్లి పాయలు తినడం వల్ల బిపి కంట్రోల్లో ఉంటుంది.

 మెంతులు :

మెంతులు :

మెంతులు బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. మెంతుల్లో ఉండే ఫైబర్ , పొటాషియంలు అందుకు గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ హోం రెమెడీస్ ప్రయత్నించడానికి ముందు వీటిని నీళ్ళలో వేసి బాయిల్ చేసి, పేస్ట్ చేయాలి. దీన్ని రోజుకు రెండు సార్లు తాగితే మంచిది.

కేయాన్ పెప్పర్ :

కేయాన్ పెప్పర్ :

కేయాన్ పెపర్ బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేయడంలో గ్రేట్ రెమెడీ. కేయాన్ పెప్పర్ ను రెగ్యులర్ గా తినడం వల్ల రక్తం స్మూత్ గా ప్రసరిస్తుంది. శరీరం హెల్తీగా ఉంటుంది. అందువల్ల కేయాన్ పెప్పర్ ను సలాడ్స్, మరియు ఇతర ఫుడ్స్ లో చిలకరించి తీసుకోవడం మంచిది.

English summary

13 Home Remedies For High Blood Pressure In Winter

High BP could be dangerous to your heart. It is important to follow certain home remedies for high blood pressure. Your heart pumps blood. When your blood circulates throughout your body, if it faces any resistance in the arteries, things get worse. If your arteries get narrow, your BP increases which is very dangerous. One can suffer from high BP without any evident symptoms.
Desktop Bottom Promotion