For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్ఞానదంతాల నొప్పి నివారణకు గ్రేట్ ఆయుర్వేద రెమెడీస్ ...

|

జ్ఞానదంతం వచ్చే సమయంలో కొన్ని సమస్యలు వస్తాయి. సాధారణంగా ఇవి 18 నుంచి 24 ఏళ్ల వయసులో అంటే జ్ఞానం వచ్చాక వస్తాయి. అందుకే వీటిని జ్ఞానదంతాలు అంటారు. ఇలా ఇవి వచ్చే సమయంలో పన్ను అమరడానికి తగినంత చోటు లేక ఒక్కోసారి ఇది సగమే రావచ్చు. దాన్ని ఇంపాక్టెడ్ విజ్‌డమ్ టీత్ అంటారు. సగమే బయటకు వచ్చిన ఈ పంటి చుట్టూ ఆహార కణాలు చేరుతాయి. ఈ సమస్య ఉన్నప్పుడు జ్ఞానదంతం ప్రాంతంలో భరించరాని నొప్పి, వాపు రావడం, నోరు తెరవలేకపోవడం, నోటి నొప్పి, చెవి, మెడకు వ్యాపించడం, తలనొప్పి, పక్కపళ్లకూ నొప్పి వ్యాపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

అలాంటి సమయంలో ఏదైనా ఆహారం తిన్నా భరించలేని నొప్పి?అలాంటప్పుడు మనం ఏం చేయాలి?సున్నితంగా మ్యానేజ్ చేయాలి? లేదా కడుపు నింపుకోవడనానికి, అదే సమయంలో నిప్పిని నివారించేటటువంటి మృదువైన ఆహారాలు తీసుకోవాలి. జ్ఞానదంతం వచ్చేసమయంలో భరించలేని నొప్పి ఉన్నప్పుడు , ఫైబర్ , విత్తనాలు కలిగి ఆహారాలు తీసుకోకూడదని చాలా మంది సూచిస్తుంటారు. అందుకు ముఖ్య కారణం ఇటువంటి ఆహారాలు పళ్ళలో ఇరుక్కుపోతాయి, తర్వాత పరిస్థితి తీవ్రతను పెచి నొప్పి మరింత ఎక్కువచేస్తాయి.ఈ నొప్పితో పాటు, చెడు శ్వాస, నమలడంలో మరియు ఆహారాన్ని మ్రింగడంలో కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది. ఇంకా, తలనొప్పి, మరియు దంతాల మద్య నొప్పి కలిగి ఉంటుంది.

ఈ జ్ఞానదంతాల నొప్పిని భరించలేకున్నంతగా మరియు మీ దినచర్యలు దినదినానికి మరింత తీవ్రంగా కష్టంగా మార్చేస్తుంది. ఈ జ్ఞానదంతాల నొప్పిని నివారించడానికి కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించడం వల్ల నొప్పిని నివారించుకోవచ్చు. అదేవిధంగా, నొప్పి తిరిగి పునరావ్రుతం అవుతుంటే, ఆ దంతాన్నిడెంటిస్ట్ ద్వారా తొలగించడం ఒక ఉత్తమ మార్గం. అయితే, డెంటిస్ట్ ను కలవాడనికి ముందుగా జ్ఞానదంతాల నొప్పిని నివారించడానికి కొన్ని ఉత్తమ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి....

1. గార్లిక్:

1. గార్లిక్:

వెల్లుల్లి వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్, యాంటీబయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు ఇతర ఔషధగుణాలు కలిగి ఉండటం వల్ల, ఇది జ్ఞానదంతాల నొప్పిని నివారిస్తుంది. మరియు ఇది నోట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా నివారిస్తుంది. వెల్లుల్లి ఒక చిన్న వెల్లుల్లి రెబ్బను రఫ్ గా నమిలిన నొప్పిఉన్న దంత మీద అలాగే కొద్ది సమయం ఉంచుకోవాలి , ఇలా చేయడం వల్ల జ్ఞానదంతాల నొప్పిని నివారించుకోవచ్చు. ఇంకా ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను నమలడం వల్ల కూడా జ్ఞానదంతాల నొప్పిని నివారించుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా , ఒకటి,రెండు వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ చేసి అందులో బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసి, నొప్పి ఉన్నప్రదేశంలో ఈ పేస్ట్ ను అప్లై చేయాలి. దీన్నికొన్నినిముషాలు అలాగే ఉంచి తర్వాత ఉమ్మివేయాలి . ఈ చిట్కాలను రోజులో ఒకటి లేదా రెండు సార్లు అనుసరించాల్సి ఉంటుంది.

2. లవంగాల నూనె:

2. లవంగాల నూనె:

చాలా నొప్పిపెడుతున్నజ్ఞానదంతానికి లవంగం నూనెలో అద్దిన కాటన్ బాల్ తో మర్దన చేయాలి. నొప్పి ఉన్న దంతానికి చుట్టూ కూడా లవంగం ఆయిల్ ను అప్లై చేయాలి. ఇలా రోజులో రెండు మూడు సార్లు చేయవచ్చు. లవంగం నూనె మరీ ఘాటుగా అనిపిస్తే, అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసుకోవచ్చు.

3. పసుపు:

3. పసుపు:

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షనాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని నేచురల్ టీతూ రెమెడీగా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇది ఆయుర్వేదిక్ రెమెడీ . పసుపులో డిప్ చేసిన కాటన్ క్లాత్ ను పంటిమీద పెట్టాలి. నొప్పి నివారించుకోవచ్చు.

4. కీరదోస:

4. కీరదోస:

కీరదోస కాయలో కూలింగ్ ప్రొపర్టీస్ అధికంగా ఉండాలి. ఆయుర్వేదంలో ఈ కూలింగ్ ఎఫెక్ట్ వల్ల పెస్కి టూత్ పెయిన్ నివారిస్తుంది.

5. అషోక ట్రీ:

5. అషోక ట్రీ:

ఇది ఒక హెర్బల్ . ఆయుర్వేదంలో ఇది ఒక గొప్పమెడిసిన్. దాంతాల నొప్పి నివారించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది. ఇందులో అద్భుతమైన హీలింగ్ ప్రొపర్టీస్ ఉన్నాయి . ఆషోక మొక్క ఆకులు లేదా కాండాలను ఉడికించి ఆనీటితో గార్గిలింగ్ చేయాలి.

6. త్రిఫలం:

6. త్రిఫలం:

త్రిఫలం ఇది మూడు హెర్బ్ ల కాంబినేషన్. ఇది పెయిన్ రిలీఫ్ ను ఎక్సలెంట్ గా తగ్గింస్తుంది. త్రిఫల పౌడర్ ను నీటిలో మరిగించి గోరువెచ్చగా మారిన తర్వాత గార్గిలింగ్ చేయాలి.

7. తులసి:

7. తులసి:

తులసి కి మన ఇండియన్ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉండి. ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని ఆవనూనెతో మిక్స్ చేసి అఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాలి.

8. అల్లం:

8. అల్లం:

అల్లం ఇంట్లో ఉంటే చాలు దంతాల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి మరే ఔషదం అవసరముండదు . అల్లంశుభ్రంగా కడిగి పొట్టు తొలగించి సన్న ముక్కలుగా కట్ చేసుకొని, కొన్ని పీసులను నోట్లో వేసుకొని బాగా మలలానలి . ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ఉపశమనం పొందుతారు.

9. జామఆకులు:

9. జామఆకులు:

జామ ఆకు జామ ఆకు జ్ఞానదంతాల నొప్పి నుండి అద్భుతంగా ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే, ఇందులో బయో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇందులో ఉండే యాంటీస్పాస్మోడిక్ లక్షణాల వల్ల కూడా నొప్పి తగ్గుతుంది. ఇంకా ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ మరియు అనాలజీస్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.పచ్చగా మరియు తాజాగా ఉండే జామ ఆకులు ఒకటి లేదా రెండు ఆకులను నోట్లో వేసుకొని నమలడం ద్వారా జ్ఞానదంతాల నొప్పినుండి ఉపశమనం పొందవచ్చు.

10.ఆయిల్ పుల్లింగ్ థెరఫి:

10.ఆయిల్ పుల్లింగ్ థెరఫి:

మరికొన్ని చిట్కాలు దవడలకు ఐస్ ప్యాక్ ను అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల దంతాల నొప్పి నివారించడబడుతుంది ఆయిల్ పుల్లింగ్ మంచి ఉపాయం.ఓరల్ హెల్త ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్ ను నివారించండి . ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

11. బంగాళదుంపలు:

11. బంగాళదుంపలు:

నాలుగు బంగాళదుంపలను ఉప్పు వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత పొట్టు తీసి, చిదిమి, మిరియాలపొడి చల్లి తీసుకోవచ్చు. పంటి నొప్పి నుండి ఉపశనమం కలిగించే ఐరన్ మరియు జింక్ బంగాలదుంపలో పుష్కలంగా ఉన్నాయి. అలాగే మిరయాల్లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా కాపాడుతాయి.

12. బబూల్ ట్రీ:

12. బబూల్ ట్రీ:

బబూల్ ట్రీని ఆయుర్వేదంలో గ్రేట్ గా ఉపయోగిస్తున్నారు. ఇది పట్టినొప్పిని నివారించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. బబూల్ ట్రీ బెరడను నీటిలో వేసి బమరిగించి , ఈ నీటితో గార్గిలింగ్ చేయడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది.

13. ఇంగువ:

13. ఇంగువ:

ఇది ఒక పురాత హోం రెమెడీజ్ఞానదంతాల నొప్పికి చాలా విరివిగా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ మరియు యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ దంతాలనొప్పి నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.రెండు చెంచాల నిమ్మరసంలో కొద్దిగా ఇంగువను మిక్స్ చేసి , లైట్ గా వేడి చేసి,కాటన్ బాల్ ను అందులో డిప్ చేసి నొప్పి ఉన్నచిగుళ్లు మరియు దంతాల మీద అప్లై చేయాలి.నొప్పి తగ్గే వరకూ రోజులో ఎన్నిసార్లైనా ఇలా చేయవచ్చు.

14. వీట్ గ్రాస్:

14. వీట్ గ్రాస్:

గోధుమ గడ్డి గోధుమ గడ్డి మరో నేచురల్ హోం రెమెడీ. జ్ఞానదంతాల నొప్పినివారించడంలో సహాయపడుతుంది. ఇందులో నేచులర్ యాంటీ బయోటిక్, బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది మరియు నోట్లోని టాక్సిన్స్ ను నివారిస్తుంది. నొప్పిని అరికడుతుంది.కొద్దిగా గోధుమ గడ్డిని నోట్లో వేసుకొని నమలాలి, తర్వాత వాటిని ఉమ్మివేయాలి . అవసరం అయినప్పు ఇలా చేస్తుంటే నొప్పిని తగ్గించుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా ,గోధుమ గడ్డి జ్యూస్ ను మౌత్ వాష్ కోసం కూడా ఉపయోగించి, నొప్పిని తగ్గించుకోవచ్చు.

15. పుదీనా:

15. పుదీనా:

పుదీనా పుదీనా మరో ఎఫెక్టి హోం రెమెడీ . ఈ హెర్బ్ లో అనస్తిటిక్ లక్షణాలు పుష్కలంగా ఉండి, జ్ఞానదంతాల నొప్పినుండి ఉపశమనం కలిగిస్తాయి. మరియు, నోట్లో బ్యాక్టీరియాను నివారించడంలో సహాయపడుతాయి. జ్ఞానదంతాల నొప్పి ఉన్నప్రదేశంలో కొద్దిగా పుదీనా ఆయిల్ ను అప్లై చేయాల్సి ఉంటుంది. కొద్ది నిముషాలు అలాగేవదిలేసి, తర్వాత గోరువెచ్చని ఉప్పునీటితో శుభ్రం చేసుకోవాలి.

పుదీనా ఒక కప్పు వేడి నీళ్ళలో కొన్ని ఎండిన పుదీనా ఆకులను వేసి, ఆవిరిలో బాగా నాననివ్వాలి. ఈ నీటిని నోట్లో పోసుకొని30 సెకండ్లు అలాగే ఉంచి, తర్వాత ఉమ్మివేయాలి. ఇలా నీరు కాలీ అయ్యేవరకూ చేయవచ్చు.ఈ చిట్కాను రోజులో రెండు మూడు సార్లు అనుసరించవచ్చు.

English summary

15 Ayurvedic Home Remedies For Wisdom Tooth Pain

Whether or not wisdom tooth gives you wisdom, is a debatable issue; but when you have unbearable pain in the wisdom tooth, then your wisdom really goes out for a toss.
Desktop Bottom Promotion