For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విటమిన్ సి లోపంతో పోరాడే అమేజింగ్ డైట్ ఫుడ్స్ ...

|

సాధారణంగా శరీరంలో విటమిన్ల పాత్ర కీలకమైనది. శరీరానికి కావల్సిన విటమిన్లలో(ఎ,బి, సి,డి,ఇ, బి12,బి11....మొదలగునవి) ఏ ఒక్క విటమిన్ లోపించినా అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.

ప్రస్తుతం మనం రెగ్యులర్ గా తీసుకొనే డైట్ లో విటమిన్ సి ఆహారాలు ఒకటి. ఇది శరీరంలో సెల్యులార్ గ్రోత్ కు మరియు బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ప్రొపర్ ఫంక్షనింగ్ కోసం సహాయపడుతుంది. ఇది శరీర ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తుంది, టిష్యు రిపేర్ చేసి, గాయలను మాన్పడం మరియు కొల్లాజెన్ ప్రొడక్షన్ కు సహాయపడుతుంది. విటమిన్ సి ఒక హెల్తీ యాంటీఆక్సిడెంట్. ఇది శరీరంలో ఫ్రీరాడికల్ డ్యామేజ్ నివారిస్తుంది.

విటమిన్స్ సి లోపం వల్ల కొన్ని సీరియస్ హెల్త్ ప్రాబ్లెమ్స్ వస్తుంటాయి. బలహీనత, సడెన్ గా బరువు తగ్గడం, అలసట, దంతక్షయం, దంతవాపులు, జాయిట్ పెయిన్ , గాయాలు మానకపోవడం, దంతాల్లో రక్తం కారడం, హెయిర్ మరియు స్కిన్ స్ట్రక్చర్ మార్చడం వంటి లక్షణాలు కనబడుతాయి. అంతే కాదు విటమిన్ సి లోపం వల్ల మరికొన్ని వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయి. క్యాన్సర్, ఆస్త్మా, వ్యాధినిరోధకశక్తి లోపించడం, హార్ట్ డిసీజస్, అనీమియా వంటి వ్యాధులకు గురిఅవుతారు.

అందువల్ల మన రెగ్యులర్ డైట్ లో విటమిన్ సి ఏమాత్రం తగ్గకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మన శరీరంలో విటమిన్ సి ఇతర న్యూట్రీషియన్స్ వలే స్రవించదు. కాబట్టి విటమిన్ సి ఫుడ్స్ ను కంపల్సరీగా తీసుకోవల్సి ఉంటుంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ సి ఫుడ్స్ ను ఎక్కువగా సహాయపడుతాయి.

విటమిన్ సి డైలీ 75మిల్లీ గ్రాములు తీసుకోవాలి. పురుషులు 90 మిల్లీగ్రాములను తీసుకోవాలి. ఈ క్వాంటిటీ కంటే తక్కువ తీసుకుంటే అది విటమిన్ సి లోపం అని అంటారు. శరీరంలో విటమిన్ సి లోపం జరగకుండా ఉండాలంటే విటమిన్ సి నేచురల్ ఫుడ్స్ మరియు డైటరీ సప్లిమెంట్ తీసుకోవాలి. విటమిన్ సి లోపం వల్ల వచ్చే సమస్యలను నివారించడానికి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ రెగ్యులర్ గా తీసుకోవాలి. మరి అలాంటో ఫుడ్స్ ఎంటో తెలుసుకుందాం....

 రెడ్ బెల్ పెప్పర్:

రెడ్ బెల్ పెప్పర్:

విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహారాల్లో రెడ్ బెల్ పెప్పర్ ఒకటి, చాలా మందికి ఈ విషయం తెలియదు. ఒక రోజుకు 100గ్రాముల రెడ్ బెల్ ప్పర్ తీసుకుంటే మనకు ఆరోజుకు సరిపడా విటమిన్ సి అందినట్లే..

 జామ:

జామ:

నిపుణుల అభిప్రాయం ప్రకారం జామకాలో విటమిన్ సి అత్యధికంగా ఉంది. రోజుకు ఒక్క జామకాయ తినడం వల్ల 200గ్రాముల విటమిన్ సి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు . ఇది టేస్టీ ఫ్రూట్ . ఇది మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది.

కివి ఫ్రూట్ :

కివి ఫ్రూట్ :

విటమిన్ సి లోపంతో బాధపడే వారికి నిపుణులు తరచూ ఈ పండ్లను సూచిస్తుంటారు. ఈఫ్రూట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల విటమిన్ సి లోపాన్ని నియంత్రించడం మాత్రమే కాదు, వ్యాధినిరోధకతను పెంచుతుంది మరియు ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

ఈ గ్రీన్ వెజిటేబుల్ ను ఒక స్టార్ ఫుడ్ గా తీసుకుంటారు. బ్రొకోలీలో అద్భుతమైన మినిరల్స్, విటమిన్స్ , న్యూట్రీషియన్స్ , ముఖ్యంగా విటమిన్ సి ఉన్నాయి . కేవలం 100 గ్రాముల బ్రొకోలీలో 89.2మిల్లీగ్రాముల విటమిన్ సి పొందవచ్చు.

ఆరెంజ్ :

ఆరెంజ్ :

ఆరెంజ్ లో విటమిన్ సి అత్యధికం. ఈఫ్రూట్ ను నిపుణులు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . రోజుకు ఒక ఆరెంజ్ తింటే చాలు విటమిన్ సి లోపంతో వచ్చే వ్యాధులతో ఎఫెక్టివ్ గా పోరాడవచ్చు . ఆరెంజ్ వలె మరో సిట్రస్ ఫ్రూట్ నిమ్మ, గ్రేఫ్ ఫ్రూట్ లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

బొప్పాయి:

బొప్పాయి:

నేచురల్ గా విటమిన్ సి అధించే మరో ఎక్సలెంట్ ఫ్రూట్ బొప్పాయి . రోజుకొక సింగిల్ సర్వింగ్ తో శరీరంలో జీవిక్రియలు ఆరోగ్యంగా పనిచేస్తాయి.

 స్ట్రాబెర్రీస్ :

స్ట్రాబెర్రీస్ :

స్ట్రాబెర్రీస్ విటమిన్ సి లోపంను నివారిస్తుంది. రోజుకు రెండు మూడు స్ట్రాబెర్రీలు తింటే చాలు, శరీరానికి అవసరమయ్యే విటమిన్ సి అందుతుంది .

పైనాపిల్:

పైనాపిల్:

పైనాపిల్లో బ్రొమైలిన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ కలిగి ఉంది. ఇది మనం తీసుకొనే ఆహారంను విచ్చిన్న చేస్తుంది కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది. పైనాపిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షనాలు అధికంగా ఉండటం వల్ల త్వరగా వ్యాధినిరోధక శక్తిని అందిస్తుంది . పైనాపిల్లో 78.9మిల్లీ గ్రాములు విటమిన్ సి ఉంది.

కివి ఫ్రూట్:

కివి ఫ్రూట్:

రెండు కివి ఫ్రూట్స్ లో 137.2 మిల్లీ గ్రాములు విటిమన్ సి ఉంది. ఈ ఫ్రూట్ లో విటమిన్ సి తో పాటు పొటాషియం, కాపర్ కూడా ఎక్కువగా ఉన్నాయి.

మామిడిపండ్లు:

మామిడిపండ్లు:

టేస్టీ అండ్ జ్యూస్ మ్యాంగో లో 122.3మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంది ఉంటుంది. ఇంకా ఇందులో విటమిన్ ఎ కూడా ఎక్కువగా ఉండి, విటమిన్ సి అంధించే లాభాలన్నీ విటమిన్ కె కూడా అందిస్తుంది. దాంతో విటమిన్ సి లోపాన్ని నివారించుకోవచ్చు.

టమోటోలు:

టమోటోలు:

2 మీడియం టమోటోల్లో (100గ్రాముల టమోటోల్లో )22.8మిల్లీ గ్రాములు విటమిన్ సి ఉంటుంది. కాబట్టి, రెగ్యులర్ వంటకాల్లో తప్పనిసరిగా టమోటోలను ఉపయోగించుకోచ్చు.

మస్క్ మెలోన్ :

మస్క్ మెలోన్ :

ఒక క్వాటర్ కర్పూజ పీస్ లో 47 మిల్లీ గ్రాముల విటమిన్ సి మరియు 51గ్రాముల క్యాలరీలున్నాయి.

 బ్రసెల్స్ స్ప్రాట్స్:

బ్రసెల్స్ స్ప్రాట్స్:

క్రూసిఫెరస్ కుటుంబానికి చెందని క్యాబేజ్ లో 48 గ్రాముల విటమిన్ సి, 300మైక్రోగ్రామ్స్ విటమిన్ కె , కేవలం 28మిల్లీ గ్రాముల క్యాలరీలు కలిగి ఉన్నాయి.

ఆమ్లా:

ఆమ్లా:

మరో ఎక్సోటిక్ ఫ్రూట్ ఆమ్లా. ఇంది ఒక సూపర్ ఫుడ్. ఆయుర్వేదంలో ఇది అత్యంత ముఖ్యమైన హెర్బ్. ఈ ఫ్రూట్ ను ఫ్రెష్ గా మరియు డ్రై చేసి, పౌడర్ రూపంలో తీసుకోవడం వల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు . అందుకే దీన్ని కొన్ని వేల సంవత్సరాలను నుండి ఉపయోగిస్తున్నారు. వ్యాధినిరోధకతను పెంచడంలో ఇది ఒక గ్రేట్ ఫుడ్.

హెర్బ్స్ :

హెర్బ్స్ :

చాలా వరకూ కొన్ని హెర్బ్స్ కొత్తిమీర, తులసి, పార్ల్సే వంటి వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే విటమిన్ సి ని పొందవచ్చు.

English summary

15 Foods To Fix Vitamin C Deficiency

15 Foods To Fix Vitamin C Deficiency,Vitamin C deficiency is an exceedingly common health condition. As per a few studies, people all over the globe have low levels of vitamin C. It is a well-known in fact that vitamin C is an essential nutrient that plays an instrumental role in the functioning of the body.
Story first published: Thursday, May 26, 2016, 13:39 [IST]
Desktop Bottom Promotion