For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీలో హై కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే 17 మిరాకిల్ ఫుడ్స్..!!

|

సాధారణంగా ప్రతి ఒక్కరికీ రోజూ 20 గ్రాముల ఫ్యాట్‌ అవసరం అవుతుంది. ఇది రోజూ వంట నూనెలో లభిస్తుంది. ఇది శరీరానికి సరిపోతుంది. కాబట్టి ఇతర ఆహార పదార్థాల్లో అదనంగా లభించే ఫ్యాట్‌ను తగ్గించుకోవడంపై దృష్టి సారించాలి.

సాధారణంగా స్థూలకాయం ఉన్నవారు పొట్ట, నడుం చుట్టూ చేరిన కొవ్వును తగ్గించుకునేందుకు పడరాని కష్టాలు పడుతుండడం మనం చూస్తూనే ఉంటాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పొట్టలో కొవ్వు వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గుండెకు సంబంధించినవి, చక్కెర వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. పొట్టలో కొవ్వు చేరడానికి ప్రధాన కారణాలలో హార్మోన్ల అసమతుల్యత, అతిగా తినడం, అధికంగా మద్యం తీసుకోవడం, స్వీట్లు, చాకలెట్లు ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడం.

ఇవి కాక కొవ్వు చేరేందుకు ప్రధాన కారణం ఒత్తిడి కూడా. ఒత్తిడి వల్ల కార్టిసాల్‌ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. కార్టిసాల్‌ అతిగా విడుదలైనప్పుడు అది పొట్ట చుట్టూ కొవ్వు చేరడాన్ని ఉత్తేజితం చేస్తుంది. మరొక ప్రధాన కారణం జీర్ణ ప్రక్రియ సవ్యంగా లేకపోవడం. జీర్ణ ప్రక్రియ సరిగా లేనప్పుడు వాయు సంబంధిత సమస్యలు వచ్చి పొట్ట ఉబ్బరంగా అవుతుంది. వయసు పెరిగే కొద్దీ కాలరీలు ఖర్చు చేయడం తగ్గిపోయి పొట్ట చుట్టూ కొవ్వు చేరడం జరుగుతుంది.

శరీరంలో అధిక కొలెస్ట్రాలె చేరడానికి ప్రధాన కారణం ఒకటి డైట్ మరియు అధిక బరువు. కొలెస్ట్రాల్ ఎవరిలో నైనా అధికం కావచ్చు. అందుకు వయస్సు తో పనిలేదు. చిన్న పెద్ద అందరిలోనూ కొలెస్ట్రాల ఉంటుంది. అది మోతాదుకు మించితే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. కాబట్టి. ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉండాలన్నా, అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలన్నా ఈక్రింది ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి...

ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్:

ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్:

ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ లో సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి బాడీలోని కొలెస్ట్రాల్ లెవల్స తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. గ్రీన్ లీఫ్ లో ఉండే స్టెరోల్స్ ఫ్యాట్ నిల్వచేరకుండా సహాయపడుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించుకోవాలి లేదా తగ్గించుకోవాలి అనుకునేవారు ఎవరైనా తాము తీసుకునే ఆహారంలో క్యాబేజ్, క్యారెట్లు, దోసకాయలు, ఆకుకూరలు ఉండేట్లు చూసుకోవాలి. కూరగాయలే కాకుండా, తాజా పండ్లను కూడా తీసుకోవాలి. ఈ పదార్ధాలలో కొవ్వు స్థాయి చాలా చాలా తక్కువ. ఈ ఆహారంలో సహజంగా మినరల్స్, విటమిన్లు ఉంటాయి.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో ఐసిన్‌ అనే యాంటి అక్సిడెంట్‌ ఉంటుంది. ఇది చెడు కొలెసా్ట్రల్‌ను తగ్గిస్తుంది. రక్తనాళాల్లో క్లాట్స్‌ ఏర్పడకుండా కాపాడుతుంది.ఇందులోని యాంటీ బాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా తగ్గిస్తాయి. అందుకే వెల్లుల్లిని 'ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్' అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటు సమస్యను నివారించడంలో వెల్లుల్లి పాత్ర ఎనలేనిది.

చేపలు:

చేపలు:

ఫిష్ రెగ్యులర్ గా తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. చేపల్లో ఉండే ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్ బాడీలోని అధిక కొలెస్ట్రాల్ కు కారణమయ్యే లిపోప్రోటీన్ లెవల్స్ , ట్రైగ్లిజరైడ్స్ మరియు బ్లడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతాయి.కొలెస్ట్రాల్ నియంత్రణ ఆహారం చేపలను ఎక్కువగా కలిగి ఉండాలి. కాడ్, సాల్మన్, ట్యున వంటి కొవ్వు చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించి శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలను సమృద్ధి పరుస్తాయి. మాంసం తినడం మానలేని వారు, పౌల్ట్రీ నుండి చర్మం లేని మాంసాన్ని ఎంపిక చేసుకోవాలి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీ బ్యాడ్ కొలెస్టాల్ ను తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి. రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు, బ్లడ్ క్లాట్స్ కాకుండా నివారిస్తుంది. బ్లడ్ వెజల్స్ రిలాక్స్ చేస్తుంది. టీలో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. బ్లడ్ ప్లెజర్ లెవల్స్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

 డైరీ ప్రొడక్ట్స్ :

డైరీ ప్రొడక్ట్స్ :

పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవాలి. పాల ఉత్పత్తులో ఫ్యాటీ యాసిడ్స్‌ యాంటీ అక్సిడెంట్లు, పాలిఫెనాల్స్‌ ఉంటాయి. పాలిఫెనాల్స్‌ రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి.

 ఆపిల్స్:

ఆపిల్స్:

రోజూ ఒక ఆపిల్‌ తినడం అలవాటు చేసుకోవాలి. ఆపిల్‌లో ఐరన్‌, ఫాస్పరస్‌, కాల్షియం, పొటాషియం, విటమిన్‌-ఎ, బి, సి ఉంటాయి. ఆపిల్స్ లో విటమిన్ సి మరియు పెక్టిన్ అనే పదార్థం పుష్కలంగా ఉంది. పెక్టిన్ అనే ఫైబర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

ఫైబర్ ఫుడ్స్ :

ఫైబర్ ఫుడ్స్ :

పీచు పదార్ధం అధికంగా ఉన్న ఆహారం తినడం: కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రించడానికి, తగ్గించడానికి, ప్రత్యేకంగా తక్కువ శుద్ది చేసిన పిండితో చేసిన రొట్టె వంటి పీచు పదార్ధాలు ఎక్కువగా వుండే ఆహారాలను తప్పక తీసుకోండి. అదనంగా మీరు గింజలు, తృణ ధాన్యాలను అధికంగా తీసుకోవాలి. ఈ ఆహారం కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడమే కాకుండా, మీరు వినియోగించే క్యాలరీల మొత్తాన్నీ కూడా తగ్గిస్తుంది. అధిక క్యాలరీలు సహజంగా శరీరంలో కొవ్వుగా మార్చబడతాయి. మీ శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే, దానివల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి ప్రమాదం కలుగుతుంది.

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లు:

నిమ్మజాతికి చెందిన పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. బాగా పండిన నారింజలో విటమిన్ -ఏ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఫోలేట్ పొటాషియమ్, ఫైబర్ ఎక్కువ. పొటాషియమ్ వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండెకు రక్షణ కలుగుతుంది. వీటిలో పదార్ధాలలో కొవ్వు స్థాయి చాలా చాలా తక్కువ. ఈ ఆహారంలో సహజంగా మినరల్స్, విటమిన్లు ఉంటాయి.

పసుపు:

పసుపు:

రోజూ తినే తిండిలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. 'లో డెన్సిటీ లిపొప్రొటైన్' (ఎల్.డి.ఎల్) అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది పసుపు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది. నీళ్లలో కాస్తంత పసుపు వేసి ఆవిరి పడితే జలుబు, దగ్గు మటు మాయమైపోతుంది.

 కేయాన్ పెప్పర్:

కేయాన్ పెప్పర్:

వీటిని (ఆహారంలో భాగంగా) తిన్నాక కేవలం 20 నిమిషాల్లోనే ప్రభావం కనిపిస్తుంది. మిరపలోని క్యాప్‌సైసిన్ క్యాలరీలను వేగంగా ఖర్చుచేస్తుంది. క్యాలరీలు తొందరగా ఖర్చయ్యేకొద్దీ కొలెస్ట్రాల్ పెరగదు.

మష్రుమ్:

మష్రుమ్:

మష్రుమ్ లో ఎరిటేడినైన్ శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకా ఇందులో లెటినిన్ అనే పోషకాంశం కొలెస్ట్రాల్ మాత్రమే తగ్గించడం మాత్రమే కాదు ఇది క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

చాలామందికి కాయగూరలే ఆరోగ్యానికి మంచిదని తెలిసినప్పటికీ వాటిని ఇష్టంగా తినరు. అటువంటి వారే కూరల్లో కొద్ది ఆలివ్‌ ఆయిల్‌ వేసుకుంటే వాటి ఫ్లేవరే కాదు రుచి కూడా పెరుగుతుంది. అంతేకాదు, పొట్ట తగ్గేందుకు దోహదం చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. వంట నూనెల్లో రారాజు ఆలివ్ ఆయిల్. సన్‌ ఫ్లవర్, గ్రౌండ్‌ నట్ ఆయిల్స్‌ తో పోల్చుకుంటే దీని ఖరీదు ఎక్కువ. అయినా అన్ని నూనెలకంటే ఇందులోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌ లోని యాంటీ ఆక్సిడెంట్స్ హృద్రోగులకు ఎంతో మేలు చేస్తాయి.

 క్యారెట్స్:

క్యారెట్స్:

బీటా కెరోటిన్, క్యారెట్ లో పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ ను నేచురల్ గా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ను సహజంగా ట్రాక్ లో ఉంచుకోవడానికి ఇది ఒక ఉత్తమమైనటువంటి వెజిటేబుల్.

 బీన్స్:

బీన్స్:

బీన్స్ లో కరిగే ఫైబర్ కలిగి ఉంది. ఇది జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ ను మరియు బరువును తగ్గిస్తుంది. బీన్స్ లో ఉండే హై ఫైబర్ కంటెంట్ శరీరంలో షోషింపబడుతుంది.

టమోటా:

టమోటా:

టమోటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. లైకోపిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. కాబట్టి సలాడ్స్, సాండ్ విచ్ లు, సైడ్ డిష్ గా టమోటాలను తీసుకోండి. వీలైతే.. టమోటా జ్యూస్ తాగితే.. మంచిది.

ఓట్ మీల్:

ఓట్ మీల్:

ఓట్ మీల్ లో సొల్యుబుల్ ఫైబర్ మాత్రమే కాదు.. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బ్రేక్ ఫాస్ట్ గా ఓట్ మీల్ తీసుకోవడం మంచిది. లేదా ఓట్ బ్రాన్ ని పెరుగపై చల్లుకుని తిన్నా మంచి ఫలితం ఉంటుంది.

సోయా బీన్స్:

సోయా బీన్స్:

సోయా బీన్స్ లో శ్యాచురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని డైట్ లో చేర్చుకోవడం వల్ల ప్రొటీన్స్ ని శరీరంలో పెంచడం మాత్రమే కాదు.. 8 నుంచి 10 శాతం కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.

English summary

17 Miracle Cholesterol Reducing Foods

There are various cholesterol treatment choices available nowadays. Your doctor might prescribe specific drugs that lower cholesterol levels, but there have been many cases suggesting that these drugs have harmful effects.
Story first published: Friday, July 15, 2016, 12:03 [IST]
Desktop Bottom Promotion