For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రి హాయిగా నిద్రపట్టడానికి సహాయపడే సింపుల్ ట్రిక్స్..!!

By Swathi
|

మన ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. చాలా కారణాల వల్ల మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొన్ని రకాల టిప్స్ హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతాయి. రోజంతా యాక్టివిటీస్ లో నిద్రపై ప్రభావం చూపుతాయి.

నిద్రలేమి వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. నిద్రలేమి వల్ల హార్మోన్ లెవెల్స్ లో మార్పులు వచ్చి ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అలాగే మెమరీపై ప్రభావం చూపి.. ఆలోచించడానికి, గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా మారుతుంది.

నిద్రలేమి వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. హైబ్లడ్ ప్రెజర్, గుండె సమస్యలు, డయాబెటిస్ వంటి రకరకాల అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. ఇలాంటి సమస్యలన్నింటినీ నివారించుకోవడానికి నిద్ట్యాబ్లెట్స్ వాడతారు. అలా వీటికి అలవాటు పడిపోతారు. కానీ వీటివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే నిద్రలేమి సమస్యను చాలా తేలికగా ఎదుర్కోవచ్చు.

మార్నింగ్ వాక్

మార్నింగ్ వాక్

ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల.. చెమట పడుతుంది. దీనివల్ల రాత్రి హాయిగా నిద్రపోవచ్చు.

బ్రేక్ ఫాస్ట్ మానేయకూడదు

బ్రేక్ ఫాస్ట్ మానేయకూడదు

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. బ్రేక్ ఫాస్ట్ నిద్రపై ప్రభావం చూపుతుంది. కాబట్టి..ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా బ్రేక్ ఫాస్ట్ చేయండి.

సాయంత్రం 4లోపు వ్యాయామం

సాయంత్రం 4లోపు వ్యాయామం

సాయంత్రం 4గంటలలోపు వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం చేయడం వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది. దీనివల్ల రాత్రి హాయిగా నిద్రపడుతుంది.

హైడ్రేట్ గా ఉండటం

హైడ్రేట్ గా ఉండటం

సరైన మోతాదులో నీళ్లు తాగడం చాలా అవసరం. మరీ ఎక్కువ హైడ్రేట్ గా శరీరాన్ని ఉంచుకున్నా సరిగా నిద్రపోలేరు. కాబట్టి.. ఎక్కువ హైడ్రేట్ గా లేకుండా.. సరైన మోతాదులో నీళ్లు తాగండి.

డిన్నర్ లో మాంసం

డిన్నర్ లో మాంసం

మాంసం జీర్ణం అవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి రాత్రి భోజనంలో మాంసం తీసుకుంటే.. నిద్రపోవడానికి ఇబ్బందిగా మారుతుంది.

ఎప్సమ్ సాల్ట్ బాత్

ఎప్సమ్ సాల్ట్ బాత్

ఎప్సమ్ సాల్ట్ లో మెగ్నీషియం ఉంటుంది. ఇది మైండ్, బాడీ రిలాక్స్ అవడానికి సహాయపడుతుంది. అలా హాయిగా నిద్రపోవచ్చు.

రాత్రి నిద్రపోయేటప్పుడు ఫోన్ ఆఫ్ చేయడం

రాత్రి నిద్రపోయేటప్పుడు ఫోన్ ఆఫ్ చేయడం

మొబైల్ లో బ్లూలైట్ చూడటం వల్ల శరీరం, మెదడుపై రిథమ్ ఏర్పడుతుంది. ఇది నిద్రపై దుష్ర్పభావం చూపుతుంది. అందుకే నిద్రకు ముందు మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేయడం చాలా అవసరం.

ఉప్పు, పంచదార కలిపిన నీళ్లు తాగడం

ఉప్పు, పంచదార కలిపిన నీళ్లు తాగడం

పంచదార, ఉప్పు కలిపిన నీళ్లు.. స్ట్రెస్ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. దీనివల్ల రాత్రిపూట హాయిగా నిద్రపోవచ్చు.

English summary

8 Easy Tips That Will Help You Sleep Better Tonight

8 Easy Tips That Will Help You Sleep Better Tonight. A good night's sleep is essential to get recharged for another day and remain healthy. This article deals with a few tips that will help one sleep better.
Story first published:Monday, December 5, 2016, 14:24 [IST]
Desktop Bottom Promotion