For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : ఆల్కహాల్ మానేయడానికి 8 నేచురల్ రెమెడీస్

|

కొంచెం సంతోషమైనా లేదా బాధ అనిపించినా మందు బాటిల్ చేతిలోకి రావాల్సిందే . ఈమోడ్రన్ ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితిలో తాగకుండా ఉంటే అదో వింత అన్నట్లు తయారువుతున్నారు జనం . అయితే అసలు మందుకు అలవాటు పడకండి బాబూ ...మీ ఆరోగ్యానికి మంచిది ాకదు అని ఎంత మంది అన్నా...ఆల్కహాల్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని మందు బాటిల్స్ మీద రాసినా...చివరకు సినిమా థియేటర్,లో యాడ్ వేసినా చూపించినా మందు అలవాటును మాత్రం చాలా మంది మానడం లేదు..

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల 15 మేజర్ హెల్త్ ప్రాబ్లెమ్స్ ఇవే....

రీసెంట్ గా జరిపిన పరిశోధనల ప్రకారం ప్రపంచం వ్యాప్తంగా 76 మిలియన్ ప్రజలు ఆల్కహాల్ తీసుకుంటున్నట్లు సర్వేలో వెల్లడి చేశారు. ఆల్కహాల్ అలవాటు పడివారు లేదా ఆల్కహాల్ కు భానిసలైనవారు, లేదా పార్టీలు, పబ్ లు అని తిరిగే వారు , ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకోకుండా మితంగా తీసుకోవడం వల్ల ఇటు సామాజికంగా గౌరవమర్యాదలతో పాటు, ఆర్థికంగా ఉంటారు.

ఒక సారి తాగుడుకు అలవాటు పడితే, అది తిరిగి తాగాలనే ఆలోచనలను మనస్సులో రేకెత్తిస్తుంది, ప్రారంభంలో ఇలా చేయడం ఆల్కలిజ్ అంటారు. ఇది అత్యంత ప్రమాధకరమ పరిస్థితిగా గుర్తించాలి. ఇలా దిన చర్యలో ఒక భాగమైనప్పుడు ఆరోగ్య మీద తీవ్రప్రభావాలు చూపుతాయి. ఇలా ఆల్కహాల్ కు బానిసలవ్వడం వల్ల ఇటు పర్సనల్ గాను మరియు ప్రొఫిషినల్ గా ను దెబ్బతింటారు.

మద్యం తీసుకొనే ముందు తినాల్సినటువంటి ఆహారాలు

కాబటి, పరిస్థితితులు చేజారకముందే, ఆల్కహాల్ తాగడం మానేయాలి . ఆల్కహాల్ ను మానేయడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆల్కహాల్ అలవాటును దూరం చేసుకోవచ్చు. ఈ నేచురల్ రెమెడీస్ ఆల్కహాల్ తాగాలనే ఆలోచనలకు వ్యతిరేఖంగా పనిచేస్తుంది . ఆల్కహాల్ తాగడం వల్ల బాడీ డ్యామేజ్ కాకుండ ఉండేందుకు ఆ నేచురల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. మెడిక‌ల్ గా కంటే.. న్యాచుర‌ల్ రెమిడీస్ ద్వారా ఆల్క‌హాల్ సేవించ‌కుండా అడ్డుక‌ట్ట‌వేసే మార్గాలున్నాయి. ఇలాంటి స‌హ‌జ మార్గాల వ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు. మంచి ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు. మానేయ‌ల‌ని భావించే వాళ్లు.. ఈ రెమిడీస్ ట్రై చేస్తే మంచి ఫ‌లితాలుంటాయి.

డేట్స్(ఖర్జూరం):

డేట్స్(ఖర్జూరం):

ఆల్కలిజంను నివారించడంలో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్న వాటిలో ఇది ఒక గ్రేట్ రెమెడీ. ఎందుకంటే డేట్స్ లో యాంటీయాక్సిడెంట్స్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇంకా టానిన్స్ అధికంగా ఉండటం వల్ల ఇది లివర్ ను డిటాక్సిఫై చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ప్రతి రోజూ డేట్స్ తినడం వల్ల ఆల్కహాల్ తీసుకోవాలనే కోరిక తగ్గుతుంది.

క్యారెట్స్ జ్యూస్:

క్యారెట్స్ జ్యూస్:

క్యారెట్ జ్యూస్ లో ఆరోగ్య ప్రయోనాలు అధికంగా ఉన్నాయి. క్యారెట్ లో ఉండే పొటాసియం, క్యాల్షియం, మరియు ఇతర పోషకాలు అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్కహాల్ తాగాలనే కోరికను తగ్గిస్తాయి.

కాకరకాయ:

కాకరకాయ:

కాకరకాయ ఆల్కహాల్ అడిక్షన్ ను మరియు లక్షణాలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . ప్రతి రోజూ ఉదయం కొద్దిగా కాకరకాయ రసాన్ని తీసుకోవడం అలవాటు చేసుకొన్నట్లైతే ఆల్కహాల్ అడిక్షన్ ను నివారించుకోవచ్చు.

ఆపిల్స్:

ఆపిల్స్:

రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకొనే వారి శరీరంలో టాక్సిన్స్ ఎక్కువగా చేరుతాయి . ఇటువంటి టాక్సిన్స్ ను శరీరం నుండి తొలగించడానికి ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి. ఆల్కలిజంతో బాధపడే వారు రోజూ ఒక్క ఆపిల్ తినడం వల్ల సమస్యను నివారించుకోవచ్చు.

సెలరీ జ్యూస్:

సెలరీ జ్యూస్:

సెలరీ జ్యూస్ నేచురల్ క్లెన్సర్ గా పనిచేస్తుంది. కాబట్టి, శరీరంలోని టాక్సిన్స్ ను మరియు రక్తంలోని మలినాలను తొలగించడంలో ఇది గ్రేట్ గా సమాయపడుతుంది. ఆల్కలిజంతో పోరాడుతుంది. ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆల్కహాల్ తీసుకోవడం తగ్గిస్తారు.

ద్రాక్ష:

ద్రాక్ష:

ఆల్కహాల్ తీసుకోవాలనే కోరికను తగ్గించడంలో మరో ఎపెక్టివ్ హోం రెమెడీ . ద్రాక్షలో క్లెన్సింగ్ గుణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి, శరీరం లోపలి నుండి మలినాలను శుద్ది చేస్తుంది . ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ అయిన అవయవాలను నయం చేయడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

లికోరైస్:

లికోరైస్:

ఆల్కహాల్ తో పోరాడే గొప్ప గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి . దీన్నివివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు . అంతే కాదు ,ఆరోగ్య పరంగా కూడా వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. కాలేయం మరియు శ్వాససంబంధిత సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . అందుకు ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఆల్కహాల్ తాగడం తగ్గించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది.

బాదం ఆయిల్:

బాదం ఆయిల్:

ఆల్కహాల్ తాగడం వల్ల సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ ను బలహీనపరుస్తుంది . కాబట్టి, బాదం ఆయిల్ ప్రధాన నాడీవ్యవస్థ మీద పనిచేసి, ఆల్కహాల్ తీసుకోకుండా కంట్రోల్ చేస్తుంది. బాదం నూనెలో ఉండే అమినో యాసిడ్స్, విటమిన్స్, మినిరల్స్, మొదలగునవి మానసిక క్రియల మీద ప్రభావం చూపి, ఆల్కహాల్ తీసుకోకుండా చేస్తుంది.

English summary

8 Home Remedies That Will Help You Stop Drinking Naturally

These excellent home remedies will help you fight the battle against drinking and also heal your body from the damage caused by alcohol. In this article, we at Boldsky will let you know about 8 of the most effective home remedies that will help you stop drinking, naturally. Take a look at these:
Story first published:Tuesday, May 3, 2016, 17:23 [IST]
Desktop Bottom Promotion