For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మోకర్స్ క్యాన్సర్ ప్రమాదం నుండి బయటపడటానికి 8 మార్గాలు

|

క్యాన్సర్ కు ముఖ్య కారణం స్మోకింగ్. అంతే కాదు ఇది ఇరత అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. ముఖ్యంగా సెకెండ్ హ్యాండ్ స్మోకింగ్ చాలా ప్రమాధకరమైనది మరియు క్యాన్సర్ ప్రమాదంతో పాటు ఇతర సమస్యలను కూడా పెంచుతుంది .

స్మోకింగ్ వల్ల వచ్చే క్యాన్సర్స్ లో వివిధ రకాలున్నాయి. అందులో స్టొమక్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, ఓసియోఫోగల్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మరియు నాజల్ క్యావిటి క్యాన్సర్ మొదలగునవన్నీ కేవల స్మోకింగ్ వల్లే వచ్చే క్యాన్సర్సే...

స్మోకింగ్ హ్యాబిట్స్: అపోహలు-వాస్తవాలు..!

ఇలాంటి క్యాన్సర్ రిస్క్ సాధారణ వ్యక్తులు(నాన్ స్మోకర్స్) కంటే స్మోక్ చేసే వారిలో 10రెట్లు ఎక్కువగా ఉంటుంది. అది కూడా వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుండి త్రాగుతున్నారు, రోజులో ఏ మాత్రం తాగుతారు. ఎన్ని సిగరెట్స్ ను వాడుతారన్నవిషయం మీద ఆధారపడి ఉంటుంది.

ప్రపంచంలో చాలా వరకూ స్మోక్ చేసే వారిలో లంగ్ క్యాన్సర్ వల్ల ఎక్కువగా చనిపోతున్నట్లు పరిశోధనలు కూడా వెల్లడి చేస్తున్నాయి.

ధూమపానం మానేయడానికి 10 సహాజ మార్గాలు

ఒక వ్యక్తి స్మోక్ చేస్తున్నప్పుడు అతను వదిలే పొగ నాన్ స్మోకర్ వాళ్ళు పీల్చడాన్ని పాసివ్ స్మోకింగ్ అని పిలుస్తారు. ఇలా కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

కాబట్టి, ఈ క్రింది తెలిపిన 8 మార్గాలను అనుసరించినట్లైతే క్యాన్సర్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు...

స్మోక్ చేయడం తగ్గించాలి:

స్మోక్ చేయడం తగ్గించాలి:

స్మోక్ చేసే వారు ఒకసారిగా స్మోక్ చేయడం నిలపాలనుకున్నప్పడు, పూర్తిగా ఒకే సారి నిలపలేకపోయాని, రోజు రోజుకూ సిగరెట్స్ ను పరిమితం చేసుకుంటూ, పూర్తిగా తగ్గించడం మంచిది. దాంతో లంగ్ క్యాన్సర్ ప్రమాదం నుండి బయటపడవచ్చు.

ఆహారపు అలవాట్లు:

ఆహారపు అలవాట్లు:

స్మోకర్స్ సిగెర్స్ తాగడం ఆపు చేయాలని నిర్ణయించుకొన్నప్పుడు, సెడన్ గా ఆకలి పెరుగుతుంది. అటువంటి సమయంలో షుగర్ ఫుడ్స్ లేదా ఫ్యాటీ ఫుడ్స్ ను పొట్టలోకి తోసేయకుండా..ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆకలి కోరికలను తగ్గిస్తుంది.

మందులు తీసుకోవాలి:

మందులు తీసుకోవాలి:

డాక్టర్ ను కలిసి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, నికోటిన్ రీప్లేస్ మెంట్ ప్రొడక్ట్స్ ను తీసుకోవాలి. అలాగే లోకల్ ఫిజీషియన్ మరియు ఫార్మాసిస్ట్స్ మీకు అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయ పద్దతులతో స్మోకింగ్ వదిలించుకోవడానికి సహాయపడుతారు. ఇలాంటి ప్రత్యామ్నాయ పద్దతుల ద్వారా లంగ్ క్యాన్సర్ ను తగ్గించుకోవచ్చు.

ప్రోత్సహించడం :

ప్రోత్సహించడం :

మీ ఇంట్లో వారు, లేదా స్నేహితులు స్మోకింగ్ కు కొన్ని సంవత్సరాలుగా బానిసలైనట్లైతే వారిని స్మోక్ తగ్గించడానికి ప్రోత్సహించి ఆరోగ్యం మీద అవగాహన కలిగించాలి. ప్రోత్సహించడం వల్ల వారిలో కొంత ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. దాంతో స్మోక్ నిలపడానికి ప్రయత్నం చేస్తారు.

స్మోకింగ్ క్విట్ లైన్స్ హెల్ఫ్ అవుతాయి:

స్మోకింగ్ క్విట్ లైన్స్ హెల్ఫ్ అవుతాయి:

స్మోకింగ్ క్విట్ లైన్స్ అంటే టెలిఫోన్ హెల్ప్ లైన్ నెంబర్స్ . ఇవి టుబాకో అడిక్షన్ ట్రీట్మెంట్ కు సహాయపడుతాయి. స్మోక్ నిలిపే మార్గాల్లో ఇది ఒక ఎఫెక్టివ్ మార్గం . దాంతో లంగ్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

అవగాహన కలిగించాలి:

అవగాహన కలిగించాలి:

స్మోక్ చేసేవారిలో , స్మోకింగ్ వల్ల ఆరోగ్యానికి ఎదురయ్యే సమస్యలను, వివరించాలి. భవిష్యత్తులో ఏం జరగబోతుంది. వారి జీవితకాలన్ని ఎంత తగ్గించుకోబోతున్నారన్న విషయాన్ని వివరించి స్మోకింగ్ విడిచిపెట్టట్లు చేయాలి. స్మోకర్స్ స్మోక్ చేయడం నిలపడానికి ఇది ఒక ఇండైరెక్ట్ పద్దతి .

తరచూ విమర్షించకూడదు:

తరచూ విమర్షించకూడదు:

మీకు అత్యంత సన్నిహితులు, ఆత్మీయులు, మీరు ప్రేమించే వారు స్మోకింగ్ కు బానిసలైనప్పుడు, వారి బానిసత్వాన్ని తరచూ ఎత్తిపొడుస్తూ, విమర్శించకూడదు. దానికి బదులుగా స్మోకింగ్ నిలపడం వల్ల గతంలో కోల్పోయిన విషయాలన్ని గుర్తుచేయాలి.

స్మోకింగ్ క్లీనిక్స్ నిలుపు చేయాలి:

స్మోకింగ్ క్లీనిక్స్ నిలుపు చేయాలి:

మీరు ప్రేమించే వారు, స్మోకింగ్ కు బానిసలై ఎంతకీ మానలేనప్పుడు, వారితో మీరు మాన్పించలేనప్పడు స్టాప్ స్మోకింగ్ క్లీనిక్స్ ను సూచించాలి .ఈ 8 మార్గాల్లో ఇది కూడా ఒక ఎఫెక్టివ్ మార్గం . ఈ చిన్న మార్పులు చేసుకోవడం వల్ల జీవితంలో క్యాన్సర్ ముప్పు నుండి బయటపడవచ్చు.

English summary

8 Ways Smokers Can Reduce Cancer Risk

The main cause of cancer is smoking. It causes various other health issues as well. Moreover, the secondhand smoke is also very dangerous and can raise the risk of cancer and other ailments.
Desktop Bottom Promotion