For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాణానికి మూలాధారమైన ‘‘లంగ్స్’’ ,హెల్తీగా ఉండాలంటే ఇవి ఖచ్చితంగా తినాల్సిందే..!

|

మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం చాలా ముఖ్యమైనది. అందులో ఊపిరితిత్తులు కూడా ఒకటి. మనం ఆరోగ్యంగా జీవించాలంటే ఆక్సిజన్ చాలా అవసరం. రక్తంతో పాటు గుండెకు ఆక్సిజన్ అందితేనే మనషి ఆరోగ్యంగా జీవించగలడు. ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఊపిరితిత్తులు ప్రధాన పాత్ర వహిస్తాయి.

Eat These 8 Foods To Have Healthy Lungs

మనకు ప్రాణాధారణమై ఊపిరితిత్తులు కాలుష్యానికి, స్మోకింగ్ వల్ల పొగకు గురైందంటే, వెంటే ఆయుష్యు తగ్గడం ఖాయం. ఆయుష్యు తగ్గడానికి కాలుష్యం, పొగ వల్ల ఊపిరితిత్తులకు సోకే క్యాన్సర్, క్రోనిక్ ఆబ్ స్ట్రాక్టివ్ పలిమనరీ డిసీజ్ , ఆస్త్మా మొదలగు వ్యాధుల వల్ల జీవిత కాలం(ఆయుష్యు) తగ్గుతుంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్ : ప్రారంభ లక్షణాలు

ఇటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎప్పటికప్పడు లంగ్స్ ను శుభ్రం చేసుకోవడం వల్ల ఆయుష్యును పెంచుకోవచ్చు. ఫ్రెష్ గా ఎయిర్ ను పీల్చుకోవడం, లంగ్స్ క్లెన్సింగ్ ఫుడ్స్ తీసుకోవడం, రెగ్యులర్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో టాక్సిన్స్ చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతాయి.

లంగ్స్ శుభ్ర పరిచే కొన్నిఎఫెక్టివ్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి, వెల్లుల్లి ఆరోగ్య పరంగా వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఫ్రీరాడికల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. దాంతో ఆస్త్మాకు వ్యతిరేఖంగా పనిచేస్తుంది.

యాపిల్స్ :

యాపిల్స్ :

యాపిల్ ను డాక్టర్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆపిల్లో అనేక ఔషధ గుణాలున్నాయి. ఆస్త్మా ఉన్నవారు వారంలో 2 నుండి 5 ఆపిల్స్ తిన్న వారిలో ఆస్త్మా రిస్క్ తగ్గినట్టు సూచిస్తున్నారు . ఆపిల్స్ లో ఉండే ఫ్లెవనాయిడ్స్ , ముఖ్యంగా కెల్లిన్ ఫ్లెవనాయిడ్ శ్వాసనాళాన్ని శుభ్రం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుందని సూచిస్తున్నారు.

క్యారెట్స్ :

క్యారెట్స్ :

క్యారెట్ లో బీటాకెరోటీన్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి.ఆస్త్మా సమస్యను నివారించడంలో క్యారెట్స్ సహాయపడుతాయి. పల్మనరీ స్టడీ రిపోర్ట్ ప్రకారం, బీటా కెరోటిన్ శరీరంలో చేరిన తర్వాత విటమిన్ ఎగా మారుతుంది. ఇది ఆస్త్మా నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. అలాగే క్యారెట్ లో ఉండే కెరోటినాయిడ్ ఫ్యామిలీకి చెందిన ఫైటోన్యూట్రీషియన్స్ లంగ్ క్యాన్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే బీటాక్రిప్టాక్సథిన్ కూడా లంగ్ క్యాన్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది .

కాంటలోప్(కర్బూజ):

కాంటలోప్(కర్బూజ):

కర్బూజలో విటమిన్ సి అనే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉంది. ఇది ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. ఫ్రీరాడికల్స్ నుండి ఊపిరితిత్తులకు రక్షణగా ఉంటుంది. రెగ్యులర్ డైట్ లో కర్బూజను తీసుకునే వారు ఆస్త్మాను దూరం చేస్తారు. ఇందులో ఉండే విటమిన్ సి వివిధ రకాల సిట్రస్ ఫ్రూట్ ఆరెంజ్ , గ్రేఫ్ ఫ్రూట్, నిమ్మ, వెజిటేబుల్స్, బ్రొకోలిలో కూడా అధికంగా ఉంటాయి.

ఫ్లాక్స్ సీడ్స్ :

ఫ్లాక్స్ సీడ్స్ :

ఫ్లాక్స్ సీడ్స్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం అధికంగా ఉంటుంది, ఈ ఫ్యాటీ యాసిడ్స్ వివిధ రకాల చేపల్లో కూడా కనుగొనడం జరిగింది. ఇవి ఆస్త్మాను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మెగ్నీషియం, మజిల్ రిలాక్సేషన్ కు కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. ముక్కులు బ్లాక్ అవ్వకుండా సహాయపడుతుంది.

అవొకాడో:

అవొకాడో:

అవొకాడోలో ముఖ్యమైన గ్లూథైయోన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంది, ఇది ఫ్రీరాడికల్స్ నుండి కణాలు డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తాయి.

ఫొల్లెట్ కంటెంట్ :

ఫొల్లెట్ కంటెంట్ :

ఫొల్లెట్ లేదా విటమిన్ బి అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల నుండి రక్షణ కల్పిస్తుంది. ఇది వివిధ రకాల లంగ్ డిజార్డ్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. బ్లాక్ బీన్స్, లెంటిల్స్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే, రోజుకు అవసరమయ్యే ఫొల్లెట్ అందుతుంది.

కెఫిన్ :

కెఫిన్ :

కెఫిన్ లో మంచి మరియు చెడు రెండూ ఉండవచ్చు. అయితే ఆస్త్మా విషయానికొస్తే ఇది మంచిదనే చెబుతారు. కెఫిన్ ఎయిర్ వే ను మెరుగుపరుస్తుంది. అయితే అందుకు కొద్ది సమయం తీసుకుంటుంది.

English summary

Eat These 8 Foods To Have Healthy Lungs

Healthy lungs are required for a healthy living. But apart from fresh air, healthy eating is also required to have green lungs. This article lists 8 super foods that help our lungs’ health.
Story first published: Thursday, December 8, 2016, 16:27 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more