For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోకాలి నొప్పులను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

By Super
|

మారుతున్న జీవనవిధానం, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులను తెచ్చిపెడుతున్నాయి. ఆరవై ఏళ్ల వయసులో వచ్చే మోకాళ్ల నొప్పులు ఇప్పుడు నలభైఐదేళ్లకే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో మోకాళ్ల నొప్పుల సమస్య తీవ్రంగా ఉంటోంది. ఆరోగ్యంపై శ్రద్ధ కొరవడటం, కాల్షియం లోపం, వ్యాయామం చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. స్త్రీలలో రుతుస్రావం ఆగిపోయిన తరువాత కాల్షియం లోపం ఇంకా ఎక్కువవుతుంది. పాలు, ఆకుకూరలు తగినంత తీసుకోకపోవడం వల్ల శరీరంలో కాల్షియం పరిమాణం తగ్గిపోతుంది.

నేటి ఆధునిక జీవనశైలి కారణంగా వ్యాయామానికి అస్సలు చోటు లేకుండా పోయింది. కూర్చున్న చోటు నుండి లేవకుండా అదేపనిగా 12 గంటలకు పైగా పనిచేయటం మామూలైపోయింది. ఇలా ఎక్కువ సేపు సీట్లో కూర్చుని అటూఇటూ కదలకుండా పనిచేయటం వల్ల స్థూలకాయంతో పాటు మోకాళ్ళ నొప్పులు మొదలవుతాయి. ప్రధానంగా మోకాళ్ళ జాయింట్‌ మధ్యలో వున్న మృధులాస్తి, సైనోవియల్‌ ఫ్లూయిడ్‌ లో వచ్చే మార్పుల వల్ల మోకాలి ఎముకల అరుగుదల చోటు చేసుకోవడంతో నొప్పులు మొదలవుతాయి. అధిక బరువు కూడా దీనికి తోడవడంతో మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉంటాయి. మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాళ్ళు బాగా నొప్పి పెడుతాయి. అదే విధంగా కూర్చొనిపైకి లేచేటప్పుడు మోకాళ్ళు పట్టుకు పోతాయి. ఉదయం పూట వగానే నడిచేందుకు మోకాళ్ళు సహకరించ కుండా వుంటాయి. నడుస్తున్నప్పుడు మోకాళ్ళ వద్ద చిన్న చిన్న శబ్దాలు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇటువంటి లక్షణాలుంటే ఇక అశ్రద్ధ చేయ కూడదు.

మోకాళ్ళ నొప్పులకు కారణం ఏదైనా, మనకు ఒక ప్రదేశంలోనే ఉండాలని హద్దులు పెడుతుంటారు, మోకాళ్ళ నొప్పులకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా ఈ హోం రెమెడీస్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చాలా మ్యాజికల్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తాయి. మోకాళ్ళ నొప్పులను ఏవిధంగా నివారించాలి?మోకాళ్ళ నొప్పులకు వైద్యపరమైన మందులతో విసెగెత్తినప్పుడు, ఇప్పటికీ మీకు నొప్పి తగ్గక పోతే, ఈ హోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

క్యారెట్స్:

క్యారెట్స్:

మోకాళ్ళలో నొప్పులను నివారించడానికి క్యారెట్స్ చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్. క్యారెట్ లో లిగ్నెంట్స్ మరియు కీళ్ళనొప్పల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జాయింట్ పెయిన్స్ నివారించడానికి ఉడికించిన లేదా పచ్చి క్యారెట్స్ ను తీసుకోవచ్చు.

మెంతులు:

మెంతులు:

మెంతులను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి, ఉదయం వాటిని నమిలి తినాలి. మోకాళ్ళ నొప్పులను నివారించడానికి ఇది ఒక సింపుల్ హోం రెమడీ జాయింట్ పెయిన్ నుండి ఉపశమనం పొందడానికి మెంతుల పేస్ట్ ను కూడా అప్లై చేసుకోవచ్చు.

వాటర్:

వాటర్:

రోజులో బాడీకి సరిపడా నీరు త్రాగాలి . నీరు ఎక్కువగా త్రాగడం వల్ల జాయింట్ పెయిన్స్ నివారించుకోవచ్చు . నీరు శరీరానికి సరిపడా ఉన్నప్పుడు ఇది మోకాలి చుట్టూ కార్టిలేజ్ ను సాప్ట్ చేస్తుంది మోకాలనొప్పులను తగ్గిస్తుంది మరియు తేమను అందిస్తుంది

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు:

ఉల్లిపాయల్లో సల్ఫర్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఉల్లిపాయలో ఉండే ఎంజైమ్స్ నొప్పులకు కారణం అవుతుంది. అయితే ఉల్లిపాయలు జీర్ణక్రియకు చాలా మంచిది మరియు బౌల్ మూమెంట్ మెరుగ్గా ఉంటుంది.

మసాజ్:

మసాజ్:

హెర్బల్ మసాజ్ కొన్ని మూలికల యొక్క ఆకులను నీళ్ళలో వేసి, బాగా మరిగించి తర్వాత పెయిన్ ఉన్న చోట అప్లై చేయాలి . ఈ హెర్బల్ వాటర్ ను తాగితే కూడా మంచి ఉపశమనం కలిగిస్తుంది.

యోగ:

యోగ:

యోగాసనాలను ప్రతి రోజూ ప్రాక్టీస్ చేయాలి.అంతకు ముందు యోగా నిపుణులను లేదా డాక్టర్ ను సంప్రదించాలి .

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెను గోరువెచ్చగా కాచి, జాయింట్ పెయిన్ ఉన్న చోట వేసి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తే చాలు.

పాలు మరియు పసుపు:ఇది ఒక బెస్ట్ హోం రెమడీ . ఇది మోకాళ్ళ నొప్పులను నివారిస్తుంది . ఈ యాంటీసెప్టిక్ , యాంటీఇన్ల్ఫమేటరి పసుపు పాలు ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

మెంతుల పేస్ట్:

మెంతుల పేస్ట్:

రాత్రంతా మెంతులను నీటిలో నానబెట్టి, ఉదయం మెత్తగా పేస్ట్ చేయాలి . మోకాళ్ళు నొప్పులన్న ప్రదేశంలో అప్లై చేయాలి . మోకాలి నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

పసుపు మరియు అల్లం టీ:

పసుపు మరియు అల్లం టీ:

పసుపు మరియు అల్లం టీలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి .ఇది రుమటాయిడ్ ఆర్దరైటిస్ కు సంబంధించిన నొప్పిని తగ్గిస్తుంది.

ఎప్సమ్ సాల్ట్ :

ఎప్సమ్ సాల్ట్ :

ఎప్సమ్ సాల్ట్ లో ఉండే హైలెవల్స్ మెగ్నీషియం మోకాళ్ళనొప్పులను చాలా ఎఫెక్టిగ్ నివారిస్తుంది. ఈ సాల్ట్ ను నీళ్ళలో వేసి, కరిగిన తర్వాత ఈ నీటిలో కాళ్ళను డిప్ చేయాలి . ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. ఇంకా మీరు ఈ ఎప్సమ్ సాల్ట్ యొక్క నీటితో స్నానం కూడా చేయవచ్చు.

స్వచ్చమైన ఆలివ్

స్వచ్చమైన ఆలివ్

ఆయిల్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ దీన్ని ఓలియోకాంథల్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా ఇతర పెయిన్ కిల్లర్స్ లాగే , ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ఆ ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ మరియు జాయింట్ పెయిన్ నివారించబడుతుంది.

పెప్పర్ మింట్ ఆయిల్

పెప్పర్ మింట్ ఆయిల్

మోకాళ్ళు నొప్పి ఉన్న ప్రదేశంలో పెప్పర్ మింట్ ఆయిల్ ను అప్లైచేయవచ్చు. దీన్నిఅప్లై చేయడం వల్ల నొప్పి ఉన్న ఆ ప్రదేశంలో చల్లగా అనిపిస్తుంది . పెప్పర్ మింట్ ఆయిల్ నొప్పిని నివారించే హోం రెమెడీ.

ఐస్ ప్యాక్

ఐస్ ప్యాక్

మోకాళ్ళ నొప్పులను తక్షణం నివారించుకోవడానికి ఐస్ ప్యాక్ లేదా కోల్డ్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల నొప్పి తగ్గించబడుతుంది. ఐస్ ప్యాక్ ను పది నుండి ఇరవై నిముషాలు అప్లైచేయాల్సిఉంటుంది. ఇది ఒక తక్షణ హోం రెమెడీ.

వ్యాయామం.

వ్యాయామం.

మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి, కండరాలా పట్టివేతకు గురియ్యే వారికి ఉత్తమ హోం రెమెడీ వ్యాయామం. వ్యాయామం వల్ల బరువును కంట్రల్ చేయవచ్చు, జాయింట్ మరియు కండరాలకు బలాన్ని చేకూర్చవచ్చు . మరియువాటిని చలా సులభంగా ఫ్రీగా కదిలించడానికి సహాయపడుతుంది.

English summary

Effective Home Remedies For Knee Joint Pain

Knee pain can strike suddenly or may creep up silently. No matter how one gets it, knee pain can become worse pretty quickly. No longer an ailment that inflicts only the old, knee pain today has become common for people of all ages.
Story first published: Sunday, February 21, 2016, 15:55 [IST]
Desktop Bottom Promotion