For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ లివర్ పొందడానికి ఆయుర్వేదం ఎలా ఉపయోగపడుతుంది ??

By Swathi
|

మనుషులకు జీర్ణవ్యవస్థ, కాలేయం అనేది చాలా ముఖ్యమైన అవయవాలు. జీర్ణవ్యవస్థ తీసుకున్న ఆహారం జీర్ణమవడానికి, కాలేయం శరీరం నుంచి మలినాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది శరీరాన్ని డెటాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో అవసరం లేని మలినాలను బయటకు పంపి.. శరీరాన్ని శుభ్రం చేస్తుంది.

ఫ్యాటీ యాసిడ్స్ ని కూడా బ్రేక్ చేయడంలో లివర్ సహాయపడుతుంది. చాలా విషయాలు లివర్ పనితీరుని అడ్డుకోవడానికి కారణమవుతాయి. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, పోషకాహార లోపం, మెటబాలిక్ డిజార్డర్స్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వంటివన్నీ.. కాలేయ వ్యాధులకు కారణమవుతాయి.

కాలేయం పనితీరు సక్రమంగా లేదని తెలిపే హెచ్చరిక సంకేతాలు..!

అలాగే లివర్ డ్యామేజ్ అనేది.. పుట్టుకతోనే వచ్చే అవకాశం ఉంది. అయితే.. కాలేయ వ్యాధిని గుర్తించడం ఎలా ? ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గిపోవడం, వికారం, పొట్టలో నొప్పి, డార్క్ యూరిన్, డయేరియా వంటి లక్షణాలన్నీ.. కాలేయ వ్యాధిని సూచిస్తాయి.

అయితే కాలేయ వ్యాధిని ట్రీట్ చేయడానికి చాలా రకాల పరిష్కారాలు, ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హెల్తీ లివర్ పొందడానికి ఆయుర్వేదం చాలా మంచిదని స్టడీస్ చెబుతున్నాయి. ఆయుర్వేదం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా.. మెరుగ్గా, తేలికగా వ్యాధి నుంచి బయటపడవచ్చు. మరి.. కాలేయ వ్యాధి నివారించి.. హెల్తీ లివర్ పొందడానికి ఆయుర్వేద రెమిడీస్ ఏంటో చూద్దామా..

ఉసిరి

ఉసిరి

ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాలేయం నుంచి మలినాలు తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేసే.. అద్భుతమైన ఆయుర్వేద మెడిసిన్ ఇది. అలాగే.. కాలేయం డ్యామేజ్ అవకుండా.. నివారించడంలోనూ సహాయపడుతుంది.

పసుపు

పసుపు

పసుపును పూర్వకాలం నుంచి ఆయుర్వేద మెడిసిన్ గా ఉపయోగిస్తున్నాం. వంటలు, ఆహారాల ద్వారా లివర్ ని డ్యామేజ్ చేసే మలినాలను తొలగించడంలో పసుపులోని ఎంజైమ్స్ సహాయపడతాయి.

ఫ్లాక్స్ సీడ్స్

ఫ్లాక్స్ సీడ్స్

ఫ్లాక్స్ సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కాలేయ వ్యాధి రాకుండా.. అడ్డుకోవడంలో సహాయపడతాయి.

బొప్పాయి విత్తనాలు

బొప్పాయి విత్తనాలు

బొప్పాయి విత్తనాలను దంచి.. నిమ్మరసంలో కలిపి రోజుకి రెండు సార్లు తీసుకుంటే.. హానికరమైన మలినాలను కాలేయం నుంచి తొలగిస్తుంది.

జీలకర్ర పొడి

జీలకర్ర పొడి

జీలకర్ర అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్న ఆయుర్వేద పదార్థం. ఈ పౌడర్ ని నీళ్లు, ఉప్పు, పెరుగు కలిపి తీసుకుంటూ ఉండటం వల్ల.. కాలేయం హెల్తీగా ఉంటుంది.

తిప్పతీగ ఆకు

తిప్పతీగ ఆకు

తిప్పతీగ ఆకులో చాలా ఔషధగుణాలు దాగున్నాయి. ఇది.. కాలేయం నుంచి.. మలినాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

లిక్టోరైస్

లిక్టోరైస్

లిక్టోరైస్ లో గ్లిజర్ హిజిన్ అనేది ఉంటుంది. ఇది.. కాలేయంపై ఎలాంటి కెమికల్ రియాక్షన్ నైనా నివారిస్తుంది. అలాగే లివర్ డ్యామేజ్ అవకుండా అడ్డుకుంటుంది.

English summary

Here Is How Ayurveda Helps You To Have A Healthy Liver

Here Is How Ayurveda Helps You To Have A Healthy Liver. Wonder how human beings would have survived had there been no digestive system and the organ that helps to remove the toxins from the body.
Story first published:Tuesday, August 23, 2016, 6:07 [IST]
Desktop Bottom Promotion