For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓస్టియో ఆర్థరైటిస్ కు తక్షణ ఉపశమనం కలిగించే ఆయుర్వేదిక్ రెమెడీస్

|

ప్రస్తుత పరిస్థితిలో మానవుడి జీవిత విధానం ప్రకృతి సహజ విధానాలకు విరుద్దగా ఉండడం వల్ల సరైన వ్యాయమం లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, పౌష్టికాహార లోపం వలన చాలా మంది ఆర్థరైటిస్‌కు గురి అవుతున్నారు. అందుకే జనాభాలో 50 శాతం మంది 40 సం॥దాటినవారు ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య 2030 నాటికి గణనీయంగా పెరుగుతుందని వైద్యనిపుణుల అంచనా వేస్తున్నారు. ఆర్థరైటిస్ అంటే కీళ్ళలో ఉండే కార్టిలేజ్ (మృదులాస్థి) అనే మెత్తని రబ్బరుపదార్థం అరుగుదలకు గురి అవడం వలన ఎముకలలో రాపిడి ఏర్పడి ఇన్‌ఫ్లమేషన్‌కు దారి తీస్తుంది. దాంతో జాయింట్ పెయిన్స్, కాళ్ళు, కీళ్ళు, మోకాలు, తొడలు, వద్ద ఎక్కువగా నొప్పి ఉంటుంది . ఇవి చాలా సాధారణ లక్షణాలు .

అయితే పెద్దవారిలో చాలా ఓస్టిరియో ఫోసిస్ ఆర్థరైటిస్ చాలా డిఫెరెంట్ గా పెయిన్ ఫుల్ గా ఉంటుంది. తీవ్రస్థితికి గురిచేస్తుంది. ఇది చేతులు, మోకాళ్ళు, హిప్స్, వెన్నెముక ప్రమాదం కలిగిస్తుంది . ఇవన్నీ ఎముకల్లో స్టిఫ్ నెస్, పెయిన్ ఫుల్ గా ఉండటంతో కదల్చలేని స్థితి ఏర్పడుతుంది. ఓస్ట్రియో ఆర్థరైటిస్ బేసిక్ జాయింట్స్ కు ఎక్కువగా వస్తుంది. కార్టిలేజ్ డ్యామేజ్ వల్ల జాయింట్స్ మరియు బోన్స్ ఆర్థైటిస్ కు గురి అవుతుంది.

కారణాలు: అధికబరువు, వయస్సు, ఇన్ఫెక్షన్స్, వంశ పారంపార్యం, ఇన్‌ఫ్లమేటరీ కారణాలు, ప్రమాదాలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మొదలైన కారణాల చేత రకరకాలుగా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది.

లక్షణాలు: మోకాళ్లనొప్పి, వాపు, చేతితో స్పర్శించినప్పుడు వేడిగా ఉండటం, నడుస్తున్నప్పుడు కిరకిరమని శబ్దం రావడం (క్రిస్ట్) కీళ్లు వాపుకు గురై కదలికలు తగ్గడం వలన నడవడానికి చాలా ఇబ్బంది పడటం, అధిక బరువు ఉన్న రోగిలో మోకాళ్లు అరుగుదలకు గురి అయి నడకలో మార్పు వచ్చి కుంటినట్లుగా నడవడం, కింద కూర్చోవడం.. ఇలా.. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా రోగి ఉదయం నిద్రలేచి నడవడం అంటే చాలా బాధతో కూడుకున్నటు వంటి పని అవుతుంది.

ఆర్థరైటిస్ ను కలిగి ఉన్న చాలా మంది అల్లోపతి మందులను వాడి, తరువాత సహజ ఔషదాల వైపు మొగ్గు చూపుతున్నారు. సహజంగా అల్లోపతి వైద్యంలో ఆర్థరైటిస్ ను తగ్గించటానికి "ఐబుప్రోఫెన్" మరియు "నాప్రోక్సిన్" వంటి మందులను వాడటం వలన ఇతర సమస్యకు కూడా కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఆర్థరైటిస్ వ్యాధిని తగ్గించే కొన్ని ముఖ్య ఆయుర్వేదం ఔషధాలున్నాయి, ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, శరీరంలోని టాక్సిన్స్ తొలగించి , జీర్ణవక్తిని మెరుగుపరిచి, ఓస్టిరియోసిస్ ఆర్థరైటిస్ నుండి ఉపశమనం కలిగిస్తాయి. మనం తీసుకొనే ఆహారం సరిగా జీర్ణమవ్వలేందంటే అవి శరీరంలో టాక్సిన్స్ గా మారి ఎముకల్లో, జాయింట్స్ లో చేరడం వల్ల ఓస్టియోఆర్థరైటిస్ కు కారణం అవుతుంది. ఓస్టియో ఆర్థరైటిస్ ను నివాిరంచడాినకి కొన్ని ఆయుర్వేదిక్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. అవేంటో తెలుసుకుందా..ఆర్థరైటిస్ నుండి ఉపశమనం పొందుదాము..

నువ్వుల నూనె:

నువ్వుల నూనె:

నువ్వుల నూనెతో ఆర్థరైటిస్ నొప్పిని నివారించుకోవచ్చు. కొద్దిగా నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి, నొప్పి ఉన్నచోట అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల జాయింట్ స్టిఫ్ నెస్ తగ్గి, నొప్పి తగ్గిస్తుంది.

మెంతులు:

మెంతులు:

ఒక టీస్పూన్ మెంతులను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి, ప్రతి రోజూ ఉదయం పరగడపున తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా తీసుకుంటే నొప్పుల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

 గుగ్గుల్:

గుగ్గుల్:

ఒక టిక్చర్ గుగుల్ ను ఒక టీస్పూన్ వాటర్ తో మిక్స్ చేసి , భోజనానికి అరగంట ముందు ప్రతి రోజూ తీసుకోవాలి. ఇది ఓస్టియో ఆర్థరైటిస్ ను గ్రేట్ గా నివారిస్తుంది.

పసుపు:

పసుపు:

భారతదేశంలో విరివిగా లభించే సుగంధ ద్రవ్యంగా దీనిని పెర్కొనవచ్చు. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుందని అందరికి తెలిసిందే. వేడి పాలలో పసుపు కలుపుకొని తాగటం వలన లేదా రోజులో 3 నుండి 4 సార్లు కాప్సిల్ ల రూపంలో లభించే పసుపును తీసుకోవటం వలన ఆర్థరైటిస్ వ్యాధి తీవ్రతలు గణనీయంగా తగ్గుతాయని చెప్పవచ్చు.

అల్లం:

అల్లం:

అల్లం కొద్దిగా తీసుకొని ఒక మగ్గు నీటిలోవేసి బాగా మరిగించాలి. తర్వాత గోరువెచ్చగా చేసి తాగాలి. ఈ జింజర్ టీ ఆర్థరైటిస్ పెయిన్ నివారించడానికి గ్రేట్ గా పనిచేస్తుంది.

అశ్వగంధ:

అశ్వగంధ:

రెండు గ్రాలము అశ్వగంధ తీసుకొని ఒక గ్లాసు వేడి నీటిలో వేసి ప్రతి రోజూ తాగుతుంటే నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో ఎక్కువగా అల్లీసిన్ ఉంటుంది. జాయింట్ డీజనరేషన్ కు కారణమయ్యే ఎంజైమ్స్ ను కరిగిస్తుంది దాంతో ఆర్థరైటిస్ పెయిన్ తగ్గించుకోవచ్చు.

ట్రిఫల:

ట్రిఫల:

ఒక టీస్పూన్ ట్రిఫలను ఒక గ్లాసు వేడి నీటిలో వేసి రాత్రి నిద్రించే ముందు తీసుకోవడం వల్ల పెయిన్ తగ్గించుకోవచ్చు.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి,ి ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మిక్స్ చేసి ఉదయం మరియు రాత్రి నిద్రించే ముందు తాగాలి.

డియోడర్ ట్రీ:

డియోడర్ ట్రీ:

డియోడర్ ట్రీ బెరడును డికాషన్ గా తయారుచేసి రోజులో మూడు సార్లు తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.

English summary

How To Treat Arthritis (Osteoarthritis) With Ayurveda In Elderly

How To Treat Arthritis (Osteoarthritis) With Ayurveda In Elderly,Osteoarthritis is a condition in which the hands, knees, hips and spine are affected. All of these tend to be numb, stiff and painful, making it difficult to function.
Story first published: Thursday, June 9, 2016, 11:20 [IST]
Desktop Bottom Promotion