For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలనొప్పి నివారించే న్యాచురల్ పెయిన్ కిల్లర్స్

By Swathi
|

తలనొప్పి అనేది చాలా కామన్ ప్రాబ్లమ్స్. ఇది ప్రతి ఒక్కరిలో కనిపించే సమస్య. అయితే తలనొప్పి రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి టెన్షన్ తో తలనొప్పి వస్తే, మరికొందరికి ఫుడ్ తీసుకోకపోవడం, నీళ్లు తాగకపోవడం వల్ల వస్తుంది. అలాగే మరికొందరిలో మైగ్రేన్ తలనొప్పి వేధిస్తుంటుంది.

మీకు మైగ్రేన్ తలనొప్పి ఉందో లేదో తెలుసుకోవడం ఎలా... మీకు మైగ్రేన్ తలనొప్పి ఉందో లేదో తెలుసుకోవడం ఎలా...

ఇలా కారణమేదైనా, ఎలాంటి తలనొప్పి అయినా.. ఆ పెయిన్ మాత్రం భరించలేదనే చెప్పాలి. తలనొప్పిగా ఉన్నప్పుడు ఏ పనిచేయలేక, ఆ పెయిన్ నుంచి రిలీఫ్ పొందడానికి చాలామంది రోజూ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. కానీ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదు.

పార్శ్వతలనొప్పి నివారణకు సహాయపడే 8 యోగాసనాలు పార్శ్వతలనొప్పి నివారణకు సహాయపడే 8 యోగాసనాలు

తలనొప్పి, మైగ్రేన్ నివారించడానికి న్యాచురల్ రెమిడీస్ వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో లభించే వస్తువులతోనే తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. ఈ న్యాచురల్ రెమిడీస్ ప్రయత్నించి.. తలనొప్పికి గుడ్ చెప్పండి.

లావెండర్ ఆయిల్

లావెండర్ ఆయిల్

తలనొప్పి, మైగ్రేన్ కి లావెండర్ ఆయిల్ చక్కటి పరిష్కారం. ఈ ఆయిల్ ని రాసుకున్నా, ముక్కు ద్వారా పీల్చుకున్నా వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. మూడు కప్పుల వేడిన నీటిలో రెండు నుంచి నాలుగు చుక్కల లావెండర్ ఆయిల్ కలిపాలి. ఇప్పుడు బాగా పీల్చడం వల్ల ఫలితం ఉంటుంది. లేదా లావెండర్ ఆయిల్ ని డైరెక్ట్ గా రాసుకున్నా మంచిదే.

మింట్ ఆయిల్

మింట్ ఆయిల్

టెన్షన్ వచ్చే తలనొప్పి నివారించడానికి మింట్ ఆయిల్ చక్కగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు బ్లడ్ ఫ్లోని తగ్గిస్తాయి. కాబట్టి తలనొప్పితో బాధపడుతున్నప్పుడు ఈ ఆయిల్ ని రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

తులసి ఆయిల్

తులసి ఆయిల్

తలనొప్పిని న్యాచురల్ గా తగ్గించుకోవడానికి తులసి ఆయిల్ మంచి పరిష్కారం. ఇది కండరాలకు మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. కాబట్టి తలనొప్పిగా ఉన్నప్పుడు తులసి ఆయిల్ రాసుకుంటే వెంటనే ఉపశమనం పొందవచ్చు.

డైట్

డైట్

ఎప్పుడూ ఒకేరకం డైట్ కాకుండా.. డైట్ లో మార్పులు తీసుకురావడం వల్ల కూడా తలనొప్పి, మైగ్రేన్ నివారించవచ్చు. కొన్ని రకాల ఆహారాలు తలనొప్పి, మైగ్రేన్ పెయిన్ నివారిస్తాయి. అలాంటి వాటిల్లో చాక్లెట్, పీనట్ బట్టర్, అవకాడో, అరటిపండ్లు, సిట్రస్, ఉల్లిపాయలు ఉన్నాయి. కాబట్టి వీటిని మీ డైట్ లో చేర్చుకుని చూడండి.

స్కాల్ఫ్ మసాజ్

స్కాల్ఫ్ మసాజ్

స్కాల్ఫ్ మసాజ్ చేయడం వల్ల మైగ్రేన్ పెయిన్ నివారించవచ్చు. తల వెనక భాగానికి బాగా మసాజ్ చేయడం వల్ల మైగ్రేన్ పెయిన్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎలాంటి తలనొప్పి నుంచి అయినా ఉపశమనం పొందడానికి ఇదో న్యాచురల్ రెమిడీ.

ఫ్లాక్స్ సీడ్

ఫ్లాక్స్ సీడ్

ఫ్లాక్స్ సీడ్ చక్కటి హోం రెమిడీలా ఉపయోగపడుతుంది. కొన్ని తలనొప్పులకు ఇన్ల్ఫమేషన్ వల్ల వస్తాయి. అలాంటి వాటిని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల తగ్గించవచ్చు. కాబట్టి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లభించే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల తలనొప్పి నివారించడం తేలికవుతుంది.

English summary

Natural Headache and Migraine Pain Killers

Natural Headache and Migraine Pain Killers. Headaches are very common. They can come from vast range of causes, some of them seek daily treatment. We gathered few natural remedies for headaches and migraine pain that can be found in almost every home !!
Story first published: Wednesday, February 24, 2016, 16:08 [IST]
Desktop Bottom Promotion