For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రోనిక్ డైజెస్టివ్ డిసీజ్(దీర్ఘకాలిక జీర్ణ సమస్యల)ను నివారిచే ఎఫెక్టివ్ రెమెడీస్.!

|

ఏకారణంచేతైనా, పొట్టలోని అసిడ్స్(ఆమ్లాలు) ఫుడ్ పైప్ (ఓసియోఫోగస్ /అన్నవాహిక)లోనికి రివర్స్ లో వచ్చి చేరినప్పుడు అసిడిక్ రిఫ్లెక్షన్ లేదా ఇన్ఫ్లమేషన్ లేదా హార్ట్ బర్న్ కు కారణమవుతుంది. దీన్ని GERD(క్రోనిక్ డైజెస్టివ్ డిసీజ్ )అని పిలుస్తారు.

GERD(క్రోనిక్ డైజెస్టివ్ డిసీజ్ ) నివారణకు కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల యాంటాసిడ్స్ లా పనిచేస్తాయి. అయితే డాక్టర్ ను కన్సల్ట్ కాకుండా వీటిని తీసుకోవడం సురక్షితం కాదు. దానికి ముందు అసిడిక్ రిఫ్లెక్షన్ కారణాలు మరియు లక్షణాలను తెలుసుకోవాలి.

GERD( క్రోనిక్ డైజెస్టివ్ డిసీజ్)నివారణకు ఉపయోగించే హోం రెమెడీస్ గురించి డిస్కస్ చేయడానికి ముందు, GERD(క్రోనిక్ డైజెస్టివ్ డిసీజ్ )లక్షణాలను తెలుసుకోవాలి . తరచూ హార్ట్ లేదా చెస్ట్ మరియు గొంతులో బర్నింగ్ సెన్షేషన్ మరియు సోర్ టేస్ట్ (పుల్లని త్రేంపులు) వస్తుంటే.. లేదా ఏది తిన్నాపుల్లగా అనిపించడం వంటి లక్షణాలు GERD(క్రోనిక్ డైజెస్టివ్ డిసీజ్ ) తో బాధపడే వారిలో కనబడుతాయి.

పొట్ట ఉబ్బరం..గ్యాస్..ఎసిడిటిని తగ్గించే ఆహారాలు..!

వీటితో పాటు, చెస్ట్ పెయిన్, డ్రై కఫ్ , సోర్ థ్రోట్ , ఆహారం మింగడానికి ఇబ్బందిగా ఫీలవుతుంటారు. GERD(క్రోనిక్ డైజెస్టివ్ డిసీజ్ ) చెస్ట్ పెయిన్ తో బాధపడేవారు ఈ క్రింది సూచించిన హోం రెమెడీస్ ఉపయోగించడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి సమస్యను తగ్గించడానికి సహాయపడుతాయి.

అయితే, GERD( క్రోనిక్ డైజెస్టివ్ డిసీజ్)తో బాధపడే వారిలో చెస్ట్ పెయిన్ తో పాటు, బ్రీతింగ్ సమస్యలు కూడా ఉన్నట్లైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం చాలా అవసరం. ఇది హార్ట్ అటాక్ కు సంకేతంగా భావించాలి.

GERD( క్రోనిక్ డైజెస్టివ్ డిసీజ్) నివారించుకోవడానికి సహాయపడే హోం రెమెడీస్ ఏంటి?GERD( క్రోనిక్ డైజెస్టివ్ డిసీజ్)నివారణకు చాలా హోం రెమెడీస్ ఉన్నాయి. అయితే వీటిలో మీకు సూట్ అయ్యేటివి మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ఎసిడిటి(అజీర్తి)కి 10 ఇన్ స్టాంట్ ఆయుర్వేదిక్ రెమెడీస్...

ఉదాహరణకు, చల్లటి పాలు , అసిడిక్ రిఫ్లెక్స్ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి..కానీ కొంత మందికి పాలు అలర్జీ లేదా పాలు జీర్ణించుకోకపోవడం వల్ల వీటి తీసుకోవడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకు, వారికి సూట్ అయ్యే హోం రెమెడీస్ మాత్రమే ఎంపిక చేసుకోవాలి. మరి GERD( క్రోనిక్ డైజెస్టివ్ డిసీజ్)నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా....

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడలో పిహెచ్ 7.0కంటే ఎక్కువగా ఉంటే, ఇది స్టొమక్ యాసిడ్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది మరియు బాడీలో ఎసిడ్ లెవల్స్ తగ్గిస్తుంది. ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని అందులో 1/2టీస్పూన్ బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి తర్వాత తాగాలి . బేకింగ్ సోడా క్వాంటిటీ ఎక్కువ కాకుండా జాగ్రత్తపడాలి.

షుగర్ ఫ్రీ గమ్:

షుగర్ ఫ్రీ గమ్:

ఫేమస్ ఇంటర్నేషనల్ స్టడీ ప్రకారం షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ నోట్లో వేసుకుని నమలడం వల్ల GERD( క్రోనిక్ డైజెస్టివ్ డిసీజ్)కు కామన్ సిమ్టమ్స్ ను నివారిస్తుంది. భోజనం చేసిన తర్వాత షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ అర గంట పాటు నమలడం వల్ల అసిడిక్ లెవల్స్ ను తగ్గించడంలో గ్రేట్ గా హెల్ప్ అవుతుంది.

అలోవెర జ్యూస్:

అలోవెర జ్యూస్:

స్కిన్ మరియు హెయిర్ కు అలోవెర జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. GERD( క్రోనిక్ డైజెస్టివ్ డిసీజ్)నివారణకు బెస్ట్ రెమెడీ అని మీకు తెలుసా?భోజనానికి ముందు అరకప్పు అలోవెర జ్యూస్ తాగడం వల్ల హార్ట్ బర్న్ ఇరిటేషన్ మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ అసిడిక్ రిఫ్లెక్షన్ తగ్గిస్తుందా? ఖచ్చితంగా అవును. పొట్టలో సరిగా యాసిడ్స్ ఉత్పత్తి కాకపోవడం వల్ల క్రోనిక్ డైజెస్టివ్ డిసీజ్ తో బాధపడాల్సి తుంది . ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను మిక్స్ చేసి, రాత్రి భోజనానికి ముందు తీసుకోవాలి. ఈ ప్రొసెస్ ను రెండు మూడు రోజులు ఫాలో అయితే పాజిటివ్ రిజల్ట్ పొందవచ్చు.

అరటి/ఆపిల్:

అరటి/ఆపిల్:

అరటి, ఆపిల్ పండ్లలో నేచురల్ యాంటాసిడ్స్ ఉంటాయి. సెల్ఫ్ మెడికేషన్స్ తీసుకోవడానికి బదులు , ప్రతి రోజూ ఒక అరటిపండు తినాలి. అలాగే యాపిల్ తినడం వల్ల వల్ల అసిడిక్ రిఫ్లెక్స్ తగ్గుతుంది. రాత్రుల్లో తీసుకుంటే మరీ మంచిది.

అల్లం టీ:

అల్లం టీ:

ఈ హోం రెమెడీ అసిడిక్ బఫర్ గా పనిచేస్తుంది. అల్లం ముక్కలు గా కట్ చేసి నీటిలో వేసి మరిగించి తర్వాత వడగట్టి తాగాలి. భోజనానికి ముందు దీన్ని తాగడం వల్ల స్టొమక్ యాసిడ్స్ తగ్గతాయి. వికారం మరియు డ్రై కఫ్ నుండి ఉపశమనం కలుగుతుంది.

స్మోకింగ్ మరియు డ్రింకింగ్ నివారించవచ్చు:

స్మోకింగ్ మరియు డ్రింకింగ్ నివారించవచ్చు:

స్మోకింగ్ వల్ల నికోటిన్, ఆల్కల్, జీర్ణశక్తిని వీక్ గా మార్చుతుంది. కాబట్టి, అసిడిక్ రిఫ్లెక్షన్ ఉన్నవారు ఈ అలవాట్లను త్వరగా మానుకోవాలి. ఈ రెండూ అలవాట్ల వల్ల పొట్టలో అసిడిక్ లెవల్స్ పెరుగుతాయి . కాబట్టి, వీటికి దూరంగా ఉండటం మంచింది.

ఆహారపు అలవాట్లు:

ఆహారపు అలవాట్లు:

GERD( క్రోనిక్ డైజెస్టివ్ డిసీజ్)ను నివారించుకోవాలంటే, రెగ్యులర్ డైట్ లో మార్పులు చేసుకోవాలి. తినే ఆహారం నిదానంగా నమిలి తినడం మంచిది. అలాగే అసిడిక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. తగినన్ని నీరు తాగాలి.

English summary

Natural Remedies To Treat GERD

Are you familiar with the term 'GERD'? GERD or Gastroesophageal Reflux Disease is a type of chronic digestive disease. When, for any reason, the stomach acid returns to the food pipe or oesophagus, you can feel an acidic reflux or inflammation and heartburn. This is known as GERD.
Desktop Bottom Promotion