For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లిగ్మెంట్స్ ను స్ట్రాంగ్ గా ఉంచే ఒకే ఒక హెల్తీ డ్రింక్..!

|

మన శరీరంలో ప్రతి కీలులోనూ ఎముక బంధనాలుంటాయి. వీటినే 'లిగమెంట్లు' అంటాం. ఇవి కీలులోని రెండు ఎముకలూ ఒకవైపు కదులుతూనే.. బిగువుగా, దగ్గరగా పట్టుకుని ఉండేందుకు దోహదం చేస్తాయి. ఈ బంధనాల వల్ల కీలు కదులుతూనే ఉంటుంది.. అలాగని ఎలా పడితే అలా కదిలిపోకుండా, బెసిగిపోకుండా స్థిరంగా కూడా ఉంటుంది. అందుకే కీలుకు లిగమెంట్లు అంత్యత కీలకమైనవి. అయితే వీటితో పాటు.. కీలు మొత్తాన్నీ కప్పి ఉండే కాప్స్యూల్‌ పొర, కొంత వరకూ కండరాలనూ-ఎముకలనూ పట్టి ఉంచే టెండాన్ల వంటివీ కీలు స్థిరత్వానికి సహకరిస్తుంటాయి.

కానీ వీటిలో ప్రధాన పాత్ర మాత్రం లిగమెంట్లదే. ఇవి దృఢంగా, భద్రంగా ఉంటేనే కీలు చక్కగా కదులుతుంటుంది. మన మోకాలి కీలులో ఈ లిగమెంట్ల పాత్ర మరీ కీలకం. ఎందుకంటే శరీరం బరువు మొత్తాన్నీ ఈ మోకీలే మోస్తుంటుంది, దానిచుట్టూ పెద్దగా దృఢమైన కండరాలూ అంతగా ఉండవు. అయినా మనం ఒంటి కాలు మీద కూడా స్థిరంగా నిలబడగలుగుతున్నామంటే అందుకు లిగమెంట్లు, కొంతవరకూ కీలు చుట్టూ ఉండే కాప్స్యూలే మూలం.

One Drink That Will Help Strengthen Your Ligaments

మోకీలుకు మూలాధారం 4 లిగమెంట్లు! మోకీలులో- పైనుంచి వచ్చే తొడ ఎముక (ఫీమర్‌), కింది నుంచి వచ్చేపిక్క ఎముక (టిబియా).. ప్రధానంగా ఈ రెండూ ఒకదాని మీద మరోటి మడత బందులా ఆడుతుంటాయి. ఇవి ముందుకూ-వెనక్కూ మాత్రమే కాదు.. కొద్దిగా గుండ్రంగా, కాస్త పక్కలకు కూడా కూడా తిరుగుతుంటాయి. దీనివల్ల మనం నడిచేటప్పుడు చటుక్కున అటూఇటూ తిరిగినా, పక్కకు ఒరిగినా.. ఆ అనూహ్యమైన కుదుపును తట్టుకునే శక్తి కీలుకు ఉంటుంది. దీనికింతటి వెసులుబాటును తెచ్చేందుకు కీలులో ప్రధానంగా 4 లిగమెంట్లు ఉంటాయి.

సాగటం.. తెగటం! సాధారణంగా లిగమెంట్లు ఎన్నేళ్త్లెనా దృఢంగానే ఉంటాయి, వీటికి ఎలాంటి జబ్బులూ రావు. కాకపోతే ఆటల్లోనో, ప్రమాదాల్లోనో.. మన మోకీలు మీద విపరీతమైన ఒత్తిడి పడి.. అసాధారమైన కదలికలు వచ్చినప్పుడు.. ఇవి విపరీతంగా సాగిపోవచ్చు. ఇంకా ఒత్తిడి పడితే ఏకంగా తెగిపోవచ్చు. లేదూ, ఏదో ఒక వైపు నుంచి చిన్న ఎముక ముక్కతో సహా వూడిరావచ్చు. ఇవే పెద్ద సమస్యలు! ఇలాంటివి క్రీడాకారుల్లో ఎక్కువ. అలాగే బరువు ఎక్కువ ఉండే వారిలో, లేదా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, నడుస్తుంటే ముందుకు తూగటం.. పడిపోవటం వంటి అసాధారణ కదలికలు వచ్చినప్పుడు ఇవి గాయపడే అవకాశాలు చాలా ఎక్కువ. వీటికి జరిగే నష్టం.. ఒత్తిడి తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది.

One Drink That Will Help Strengthen Your Ligaments

లిగమెంట్‌ బెణకటం (స్ప్రెయిన్‌): కీలు మీద తీవ్రమైన ఒత్తిడి పడి.. లిగమెంట్‌లోని తంత్రుల్లో చాలా కొద్దిగా మాత్రమే తెగితే దీన్ని గ్రేడ్‌-1 స్ప్రైన్‌ అంటారు. దీనివల్ల లిగమెంట్‌ బలం పెద్దగా తగ్గదుగానీ.. కొద్దిగా నొప్పి, వాపు ఉంటుంది. కొన్నిసార్లు తీవ్రత ఎక్కువగా ఉండి ఇది బాగా సాగి లూజుగా తయారవ్వచ్చు (గ్రేడ్‌-2). మొత్తానికి ఇవి చిన్న తరహా గాయాలే.

లిగమెంట్‌ తెగిపోవటం (టేర్‌): లిగమెంట్‌ తట్టుకోలేనంతటి స్థాయిలోఅసాధారణ కదలికలు, ఒత్తిడి ఎదురైతే లిగమెంట్‌ తెగిపోవచ్చు. దీనిలో ప్రధానంగా రెండు రకాలు.

One Drink That Will Help Strengthen Your Ligaments

1. లిగమెంట్‌ ఎముకను అతుక్కునే చోట తెగి.. ఎముక ముక్కతో సహా పెళ్లలా వూడిరావటం. దీన్నే 'అవల్షన్‌' అంటారు, దీన్ని సర్జరీ చేసి.. తిరిగి వెనక్కి తీసుకువెళ్లి దాని స్థానంలో ఉంచి, స్క్రూలతో బిగించేస్తే ఎముకా-ఎముకా తేలిగ్గా అతుక్కుపోతాయి, ఇది పూర్తిగా నయమైపోతుంది.

2. లిగమెంట్‌ మధ్యలో చిరిగినట్లుగా తెగిపోవటం. ఇలా తరచుగా తెగేది.. కీలు మధ్యలో ఉండే ఏసీఎల్‌. దీనితో ఎదురయ్యే పెద్ద సమస్యేమంటే- ఇది ఉండేదే ఒక అంగుళం. తెగిపోతే తిరిగి అతకటానికి, కుట్టటానికి ఆధారంగా కూడా ఏమీ ఉండదు. అందుకే ఏసీఎల్‌గానీ, పీసీఎల్‌గానీ తెగితే.. కచ్చితంగా మరో ప్రత్యామ్నాయం ఏదైనా తీసుకొచ్చి.. మరమ్మతు చెయ్యాల్సిందేగానీ వీటినే తిరిగి కుట్టటానికి ఆస్కారం ఉండదు. పక్కలనుండే కొల్లేటరల్స్‌ తెగితే వాటిని సర్జరీతో సరిచేస్తారు.

కొన్నికొన్ని ప్రత్యేక సందర్భాల్లో దెబ్బలు, గాయాల తీవ్రతను బట్టి రెండు, మూడు లిగమెంట్లు కూడా తెగిపోతాయి. ముఖ్యంగా ఫుట్‌బాల్‌ క్రీడాకారుల్లో ఏసీఎల్‌, ఎన్‌సీఎల్‌ రెండే కాదు.. కీలులో కింది వైపున ఉండే మినస్కస్‌ పొర కూడా దెబ్బతింటుంది.తెగటం.. ఎవరిలో ఎక్కువ? లిగమెంట్లు, ముఖ్యంగా ఏసీఎల్‌ తెగిపోవటమన్నది క్రీడాకారులు, డ్యాన్సర్లలోనే కాదు.. పిల్లల్లో కూడా ఎక్కువే. అలాగే టీనేజీ ఆడపిల్లల్లో ఎక్కువ. పడిపోవటం, మోకాలు బలంగా నేలనుగానీ మరేదైనా గట్టి తలాన్ని ఢీకొనటం, నడుస్తూనో మెట్లు దిగుతూనే కాలు బెసగటం.. ఇలా ఏ సందర్భంలోనైనా ఇవి తెగిపోవచ్చు.

One Drink That Will Help Strengthen Your Ligaments

లక్షణాలు.. వెంటనే కనబడకపోవచ్చు!
లిగమెంట్లు బెణికినా, తెగినా.. వెంటనే నొప్పి, వాపు, నడక కష్టం కావటం వంటి సాధారణ లక్షణాలు ఉండొచ్చు. అయితే ఇవి అన్నిసార్లూ అంత తీవ్రంగా ఉండాలనేం లేదు. ముఖ్యంగా ఏసీఎల్‌ తెగినా.. వెంటనే లేచి తిరుగుతారు. మెల్లగా వాపు వంటివన్నీ తగ్గిపోతాయి కూడా. కానీ ఒకటి, రెండు వారాల తర్వాత కొద్దిగా వాపు, నడిచేటప్పుడు పట్టు వదిలేసినట్టు.. కీలు తొలిగిపోయినట్లు అనిపించటం వంటి ఇబ్బందులు మొదలవుతాయి. ఎక్స్‌-రే తీసినా అంతా బాగున్నట్టే అనిపించొచ్చు. ఎందుకంటే సాధారణ ఎక్స్‌రేలో ఎముకలు మాత్రమే కనబడతాయి.

ఓ మోస్తరు బెణుకు అయితే పెద్దపెద్ద చికిత్సల అవసరం ఉండదు. కొద్దిరోజులు ఐస్‌ కాపడం, ఎత్తు మీద పెట్టటం, నొప్పి తగ్గే మందులు, కొద్దిపాటి విశ్రాంతి, వాపు తగ్గిన తర్వాత వ్యాయామాలు చేస్తే చాలా వరకూ సర్దుకుంటుంది.

One Drink That Will Help Strengthen Your Ligaments

లిగ్మెంట్ టీర్ కు నివారించుకోవడానికి అలోపతి మరియు ఇతర ఆల్టర్నేటివ్ మెడికేషన్స్ వివిధ రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి.

లిగ్మెంట్ టీర్ నొప్పి, ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి దాల్చిన చెక్క, పైనాపిల్, ఓట్ మీల్, ఆరెంజ్ జ్యూస్, బాదం, మరియు హానీతో తయారుచేసిన డ్రింక్ తీసుకోవాలి. ఇది నొప్పిని తగ్గించడం మాత్రమే కాదు, ఇది లిగ్మెంట్స్ ను బలోపేతం చేస్తుంది.

పైన సూచించిన పదార్థాలన్నింటిలోఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. దాల్చిన చెక్కలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

పైనాపిల్లో బ్రొమలిన్ అనే ఎంజైమ్స్ పుష్కలంగా ఉన్ానయి . ఇది ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పి తగ్గించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . బ్రొమలిన్ లో కూడా విటమిన్ సి మరియు మెగ్నీష్నీయం కూడా ఉన్నాయి.

ఇక మరో పదార్థం ఓట్ మీల్. ఓట్ మీల్లో ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, ఈ మూడింటి కాంబినేషన్లో తయారుచేసిన హెల్తీ డ్రింక్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లిగ్మెంట్ కు అవసరమయ్యే శక్తిని అందిస్తాయి.

1. ఒక గ్లాసు నీరు తీసుకోవాలి. అందులో 5 గ్రాముల దాల్చిన చెక్క పొడి వేయాలి.
2. స్లైస్ గా కట్ చేసిన పైనాపిల్ ముక్కలు తీసుకుని, జ్యూస్ చేసుకోవాలి.
3. ఒక కప్పు ఓట్ మీల్ మరియు ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి.
4. 20 గ్రాములు బాదం (పొడి ) మరియు 20 గ్రాలము తేనె తీసుకోవాలి.
5. ఓట్ మీల్ ను మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
6. ఆరెంజ్ జ్యూస్, తేనె, బాదం, మరియు దాల్చిన చెక్కను మిక్సీలో వేసి ఒక సారి బ్లెడ్ చేసి, ఈ మిశ్రమాన్ని ఉడికించి పెట్టుకున్న ఓట్ మీల్ లో పెట్టుకోవాలి.
7. తర్వాత ఈ మొత్తం మిశ్రమంలో పైనాపిల్ జ్యూస్ మిక్స్ చేసి అన్ని కలిపి బ్లెడ్ చేయాలి . అంతే లిగ్మెంట్ సమస్యలను నివారించే హెల్తీ డ్రింక్ రెడీ...

ఈ డ్రింక్ తాగడం వల్ల ఖచ్చితంగా కొన్ని ఎఫెక్టివ్ రిజల్ట్ ను మీరు గుర్తిస్తారు . ఈ హెల్తీ డ్రింక్ తాగడంతో పాటు లిగ్మెంట్స్ ను బలోపేతం చేసే కొన్ని వ్యాయామాలను రెగ్యులర్ గా చేస్తుంటే ఎఫెక్టివ్ బెనిఫిట్స్ ను పొందుతారు.

English summary

One Drink That Will Help Strengthen Your Ligaments

You might have heard people complaining of an extreme pain due to the tear in the ligament, which makes them have a lot of pain while walking or doing any movement.
Story first published: Friday, June 17, 2016, 17:06 [IST]
Desktop Bottom Promotion