For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆకలి అవ్వడం లేదా? ఇవి తింటే ఖచ్చితంగా ఆకలి పెరుగుతుంది.!

By Super Admin
|

ఆకలి లేకపోవడం అనేది మనం చాలా మందిలో చూస్తూనే ఉంటాము. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. భోజనం చేయడానికి చాలా మారం చేస్తుంటారు. దాంతో పిల్లల్లో న్యూట్రీషయన్ లోపం ఏర్పడుతుంది. తద్వారా పిల్లల్లో వ్యాధినిరోధకశక్తి త్వరగా లోపించి వివిధ రకాల జబ్బులను ఎదుర్కుంటారు.

దాంతో పెద్దలు పిల్లల్ని తీసుకొని డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. వారి పిల్లలు భోజనం చేయడం లేదని వారికి ఆకలి పెరగడానికి అవసరం అయ్యే మందులను, టానిక్స్ ను సూచించమని కోరుతుంటారు. ఇలాంటి ఇంగ్లీష్ మందులను అనుసరించడం కంటే, కొన్ని నేచురల్ గా అందుబాటులో ఉండే హోం రెమెడీలను ఉపయోగించడం వల్ల ఆకలి పెరుగుతుంది . ఆ వ్యాత్యాసాన్ని కూడా మీరు గమనించవచ్చు. ఈ ఆహారాలను పెద్దలలతో పాటు పిల్లలు కూడా తినడం వల్ల పిల్లల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది.

ముఖ్యంగా మీరు తీసుకొనే ఆహారంను ప్రత్యేకంగా గమనించినట్లైతే, అది ఖచ్చితంగా మీకు, లేదా పిల్లలకు ఇష్టంలేనివై కూడా ఉండవచ్చు. రెగ్యులర్ డైట్లో ఒకే విధమైన కూరలు, దుంపలు చేయడం వల్ల ఆకలి లేనట్లు ప్రదర్శిస్తుంటారు . ఇలాంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకుండా, మీరు వెంటనే ఆకలి పెరగడానికి కొన్ని హెల్తీ ఫుడ్స్ గురించి తెలుసుకోవాలి.

మందులు తీసుకోవడానికి బదులుగా కొన్నిసింపుల్ రెగ్యులర్ గా మన వంటగదిలో ఉండే హోం రెమెడీస్, ఆహారాలను తీసుకోవడం వల్ల ఆకలిని పెరుగుతుంది . వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . ఇవి శరీర ఆరోగ్యానికి పూర్తిగా సహాయపడుతాయి. ఆకలి పెంచే ఆ ఉత్తమ ఆహారాలు,, సింపుల్ హోం రెమెడీస్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం....

ఆమ్లా జ్యూస్:

ఆమ్లా జ్యూస్:

ఆయుర్వేదంలో ఆమ్లా ఎక్కువగా సూచిస్తున్నారు.ఆయుర్వేదంలో రిజువేటింగ్ ప్రొపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది మీ శరీరానికి టానిక్ లా పనిచేస్తుంది. వికారం తగ్గిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది . ఇది శరీరంలోని జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది . లివర్ ను క్లీన్ చేస్తుంది . ఆమ్లాలో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధక శక్తి పెంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది యాంటీ డయాబెటిక్, గ్యాస్ట్రో ఇంటెన్షినల్ మరియు సెరెబ్రల్ లక్షణాలు కలిగి ఉన్నాయి.ప్రతి రోజూ ఉదయం రెండు టేబుల్ స్పూన్ల ఆమ్లా జ్యూస్ లో కొద్దిగా తేనె మిక్స్ తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది

తులసి:

తులసి:

కొన్ని తులసి ఆకులు నీటిలో వేసి ఉడికించి, అందులో కొద్దిగా యాలకల పొడి, చిటికెడు షుగర్ మిక్స్ చేసి తీసుకోవాలి. ఆకలిని పెంచడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది.

చమోమెలీ టీ

చమోమెలీ టీ

కొన్ని చామంతి పువ్వు రేకులను నీటిలో వేసి మరిగించి, తేనె మిక్స్ చేసి తాగడం వల్ల ఆకలి పెరుగుతుంది.

అల్లం:

అల్లం:

అల్లం అజీర్తిని మరియు వికారాన్ని నివారించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . అంతే కాదు ఇది ఆకలిని పెంచడంలో ఉత్తమ హోం రెమెడీ . కాబట్టి, పచ్చి అల్లంను వంటలకు వాడం లేదా టీలో చేర్చడం లేదా అలాగే కొద్దిగా నమిలి తినడం ద్వారా ఉత్తమ ఫలితం ఉంటుంది.

పెప్పర్ పౌడర్ :

పెప్పర్ పౌడర్ :

పెప్పర్ పౌడర్ లో కొద్దిగా బెల్లం చేర్చి తినడం వల్ల ఇది నేచురల్ గానే ఆకలిని పెంచుతుంది.

యాలకలు:

యాలకలు:

అజీర్తి, ఎసిడిటితో బాధపడే వారు ఆప్టిటైటిస్ మరియు గ్యాస్ట్రిక్ సమస్యలను ఎదుర్కవోడానికి యాలకలు గ్రేట్ గా సహాయపడుతాయి .. ఇది మంచి టానిక్ గా పనిచేస్తుంది . జీర్ణవాహిక యొక్క పనితీరు మెరుగుపరుస్తుంది. దాంతో ఆకలి పెరుగుతుంది. జీర్ణ రసాలు పెరుగుతాయి. దాంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. రెగ్యులర్ డైట్ లో యాలకలను చేర్చుకోవాలి. కార్డమమ్ టీ తయారుచేసి తాగాలి.

కారమ్ సీడ్స్ :

కారమ్ సీడ్స్ :

కారమ్ సీడ్స్ త్రేన్పులను నివారిస్తుంది మరియు మొత్తానికి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు దీన్ని ప్రతి భోజనానికి ముందు చిటికెడు ఉప్పు మిక్స్ చేసి తీసుకోవాలి . ఇది మీ టేస్ట్ బడ్స్ ను మరింత రుచికరంగా మార్చుతుంది.

 వెలుల్లుల్లి:

వెలుల్లుల్లి:

నీటిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి ఉడికించిన వెల్లుల్లిని తిన్నా కూడా ఆకలి బాగా పెరుగుతుంది. ఆకలి పెరగడానికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ. అవసరమైతే కొద్దిగా నిమ్మరసం చేర్చి తీసుకోవాలి

కొత్తిమీర:

కొత్తిమీర:

కొత్తమీరను ఉడికించిన నీటిని ఒకటి లేదా రెండు టీబుల్ స్పూన్లను తీసుకోవడం ద్వారా , వ్యక్తిలో ఆకలి క్రమంగా రోజురోజుకు పెరుగుతుంది. కొద్దిగా నిమ్మరసం, ఉప్పు మిక్స్ జోడించి తీసుకోవచ్చు.

చింతపండు:

చింతపండు:

ఆకలిపెంచే మరో హోం రెమెడీ ఆకలి కోరికను పెంచడానికి మరియు రుచి కలిగించడానికి దీన్ని చాలా వరకూ మన భారతీయ వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు . ఆకలిని క్రమంగా పెంచుకోవడానికి చింతపండు మీరు తయారుచేసే వంటల్లో జోడించాలి.

సోంపు:

సోంపు:

సోంపు ఆకలిని పెంచడంలో గ్రేట్ గా పనిచేస్తుంది. సోంపును పొడిచేసి, నీటిలో వేసి మరిగించాలి. ఈ వాటర్ ను వడగట్టి, టీ లా తీసుకోవాలి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు దీన్ని ప్రతి భోజనానికి ముందు చిటికెడు తినాలి. ఇది మీ టేస్ట్ బడ్స్ ను మరింత రుచికరంగా మార్చుతుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

జీర్ణక్రియకు ఇది చాలా మంచిది. ఇది శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ ను నివారిస్తుంది, దాంతో ఏదైనా తినాలనే కోరుక పెరుగుతుంది. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసాన్ని పిండి, కొద్దిగా ఉప్పు లేదా కొద్దిగా తేనె మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం తీసుకోవాలి.

దానిమ్మ:

దానిమ్మ:

దానిమ్మలో విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి, దీన్ని విత్తనాలు లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటే ఆకలి క్రమంగా పెరుగుతుంది.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

ఆకలి పెంచే మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ దాల్చిన చెక్క. ఆకలి కాకుండా నియంత్రించే వికారానికి మరియు వాంతులను నివారించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కను పొడి చేసి, మీరు తినే గ్రేవీలలో మరియు టోస్ట్ లలో కొద్దిగా జోడించాలి . లేదా కొద్దిగా షుగర్ మరియు తేనెకు మిక్స్ చేసి నేరుగా తీసుకోవచ్చు.

ఆరెంజెస్ :

ఆరెంజెస్ :

ఆరెంజ్ లో విటమిన్ సి, ఫైబర్లు అధికంగా ఉన్నాయి. ఆరెంజెస్ ను రెగ్యులర్ గా తినడం వల్ల ఆకలి క్రమంగా పెరుగుతుంది

ఎండు ద్రాక్ష:

ఎండు ద్రాక్ష:

ద్రాక్షలో చాలా తక్కువగా యాసిడ్స్ ఉంటాయి . పుల్లని రసం ఉంటుంది . క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి జీర్ణక్రియకు సహాయపడుతాయి. దాంతో ఆకలి పెరుగుతుంది . భోజనానికి భోజనానికి మద్య తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

English summary

Suffering From Appetite Loss? These Common Foods Will Help To Get Back Your Appetite In A Week!

You do not feel hungry or feel like eating whenever you have fever or a stomach upset. This is something temporary and normal. But, when this loss of appetite increases, it is something abnormal and might lead to other health problems as well.
Desktop Bottom Promotion