For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్యాన్సిల్స్ నివారించడానికి ఎఫెక్టివ్ రెమెడీ.. ఆనియన్ జ్యూస్..!

By Swathi
|

ట్యాన్సిల్స్ వచ్చాయంటే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది. గొంతులో నొప్పి కారణంగా ఏది తినడానికి, మింగడానికి కూడా రాదు. ఆఖరికి నీళ్లు కూడా తాగలేని పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి ట్యాన్సిల్స్ 3 నుంచి 4 రోజులైనా నొప్పి ఉంటాయి. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే.. ఇంకా ఎక్కువ సమయం కూడా తీసుకోవచ్చు.

డైట్, వాతావరణం వల్ల ట్యాన్సిల్స్ రావడానికి కారణమవుతుంది. ఇది చాలా సాధారణ సమస్య. అయితే దీన్ని ట్రీట్ చేయడానికి మెడిసిన్స్ కాకుండా.. న్యాచురల్ పద్ధతులు ఫాలో అయితే.. తేలికగా, త్వరగా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా ట్యాన్సిల్స్ నివారించడానికి ఆనియన్ జ్యూస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

Treat Tonsillitis With The Help Of Onion Juice

ఆనియన్ జ్యూస్ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇన్ల్ఫమేషన్ ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియా నివారిస్తుంది. మరి దీన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా తయారు చేయాలో చూద్దామా..

కావాల్సిన పదార్థాలు
1 ఉల్లిపాయ
1 కప్పు గోరువెచ్చని నీళ్లు

Treat Tonsillitis With The Help Of Onion Juice

తయారు చేసేవిధానం
ఉల్లిపాయ నుంచి రసం తీయాలి. దాన్ని గోరువెచ్చని నీటిలో కలపాలి. దీన్ని పుక్కలించడానికి ఉపయోగించాలి. రోజుకి రెండు మూడు సార్లు ఇలా చేయడం వల్ల ట్యాన్సిల్స్ తగ్గిపోతాయి. ఇకపై ట్యాన్సిల్స్ సమస్య వచ్చినప్పుడే.. వెంటనే టిప్ ఫాలో అయిపోండి..

English summary

Treat Tonsillitis With The Help Of Onion Juice

Treat Tonsillitis With The Help Of Onion Juice. Tonsillitis is nothing but an infection in the tonsils, which can cause a great deal of discomfort. It could either be acute or chronic in nature.
Story first published:Saturday, June 4, 2016, 14:21 [IST]
Desktop Bottom Promotion