మగవారిలో లైంగిక సమస్యలను నివారించే న్యాచురల్ రెమెడీస్?

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

మహిళలు మాత్రమే కాదు, పురుషులు కూడా లైంగిక సమస్యలతో బాధపడుతుంటారు. పురుషుల ఆరోగ్య సమస్యలో ముఖ్యమైనది, పెద్ద సమస్య సెక్స్ సామర్థ్యం తగ్గిపోవడం లేదా అంగస్తంభన లోపాలు. మగవారిలో వయస్సు పెరిగే కొద్ది ఈ సెక్సువల్ సమస్యలు పెరుగుతాయి.

ఇటువంటి పరిస్థితి ముఖ్యంగా 40ఏళ్ళ నుండి ఆ పైబడిన వారిలో చూస్తుంటాము. మగవారిలో సెక్స్ మీద కోరికలు కలగకపోవడానికి కారణం అంగస్తంభన లోపాలే లేదా సెక్సువల్ అపోహలు, లేదా ఇతర సమస్యలు.

ఈ పరిస్థితిలో, చాలా సందర్భాల్లో మగవారి చాలా క్రుంగిపోతుంటారు, వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంటుంది. ఈ సమస్య దీర్ఘకాలం కొనసాగితే డిప్రెషన్ కు గురి అయ్యే అవకాశం ఉంటుంది.

home remedies for male impotency

మగవారిలో సెక్స్ సామర్థ్యం తగ్గిపోవడానికి అనేక కారణాలున్నాయి, హార్మోనుల్లో మార్పులు, ఏజింగ్ సమస్యలు ఈ రెండు ప్రధానమైన కారణాలు కాగ, కొంతదరిలో హైబ్లడ్ ప్రెజర్, హై కొలెస్ట్రాల్ లెవల్, డయాబెటిస్, ఓబేసిటి, రక్తనాళాల సమస్యలు కారణం అవుతాయి. వీటి మూలంగా అంగస్తంభన లోపాలు ఏర్పడుతాయి.

స్ట్రెస్, ఆందోళన మరియు డిప్రెషన్ మరియు కొన్ని మానసిక పరిస్థితులు కూడా మగవారి ఆరోగ్యం మీద ప్రభావం చూపి, అంగస్తంభన లోపాలకు గురిచేస్తుంది.

అందుకు, మగవారు భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ సమస్య నుండి భయటపడటానికి కొన్ని హోం రెమెడీస్ సహాయపడుతాయి. ఇవి చాలా సులభంగా ఇంట్లోనే అందుబాటులో ఉంటాయి. ఈ సింపుల్ రెమెడీస్ మగవారిలో అంగస్తంభన లోపాలను, సమస్యలను నివారిస్తాయి.

మరి ఆ న్యాచురల్ రెమెడీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

1. అల్లం:

1. అల్లం:

అల్లంలో సెక్స్ సామర్థ్యంను పెంచే లక్షణాలు అధికంగా ఉన్నాయి. అల్లంలో ఉండే జింజరోల్ అనే కాంపౌండ్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది. అంగస్తంభన లోపాలను శీఘ్రస్కలన సమస్యలను నివారిస్తుంది. సెక్స్ సామర్థంను పెంచుతుంది.

2. వెల్లుల్లి:

2. వెల్లుల్లి:

వెల్లుల్లి అందరికి తెలిసిన ఒక ఆహార పదార్థం. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షనాలు అధికంగా ఉన్నాయి. రోజుకు రెండు, మూడు వెల్లుల్లి రెబ్బలను నమిలి తినడం వల్ల , ఇది మగవారిలో సెక్స్ సామర్థ్యంను పెంచుతుంది. ఇంకా ఆరోగ్యకరమైన స్పెర్మ్ ను ఉత్పత్తి చేస్తుంది.

3. మునక్కాయలు

3. మునక్కాయలు

మునక్కాయలలో లైంగిక సామర్థ్యంను పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. మునగాకు పువ్వులను తీసుకుని, ఒక గ్లాసు పాలలో మిక్స్ చేసి బాయిల్ చేసి గోరువెచ్చగా రోజుకు రెండు, మూడు సార్లు తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే పురుషుల్లో సెక్స్ సామర్థ్యం మెరుగుపడుతుంది.

4. డేట్స్ :

4. డేట్స్ :

డేట్స్ (ఖర్జూరం)శరీరానికి మంచి బలాన్ని అందిస్తుంది. ముఖ్యంగా మగవారు రెగ్యులర్ గా డేట్స్ తీసుకుంటే సెక్సువల్ సామర్థ్యంను పెంచుతుంది. మగవారిలో అంగస్తంభన సమస్యలను నివారించడానికి డేట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.

5. క్యారెట్స్ :

5. క్యారెట్స్ :

క్యారెట్స్ తినడం వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు, సెక్స్ సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. క్యారెట్ లో బీటా కెరోటీన్ అధికంగా ఉండటం వల్ల అంగస్తంభన లోపాలను పోగొడుతుంది. క్యారెట్ ను రెగ్యులర్ డైట్ లచేర్చుకోవచ్చు.రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుమును ఒక గ్లాసు వేడి పాలలో వేసి తాగాలి.

6. కుంకుమపువ్వు:

6. కుంకుమపువ్వు:

కుంకుమపువ్వును పురాతన కాలం నుండి వినియోగిస్తున్నారు. ముఖ్యంగా వంద్యత్వాన్ని నివారించడం కోసం , లైంగక సమస్యలను నివారణకు , నరాల బలహీనతలు పోగొట్టడానికి కుంకుమపువ్వును పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. రెగ్యులర్ డైట్ లో చిటికెడు కుంకుమపువ్వును జోడించడం వల్ల ప్రయోజనాలు పొందుతారు.

7. ఉల్లిపాయలు:

7. ఉల్లిపాయలు:

సెక్స్ సామర్థ్యంను పెంచడంలో ఉల్లిపాయలు గ్రేట్ రెమెడీ. ఉల్లిపాయల్లో న్యాచురల్ లైంగక పటుత్వ లక్షణాలను కలిగి ఉంటుంది,. ఇది పురుషుల్లో లైంగిక సమస్యలను నివారిస్తుంది.

అందుకు మీరు చేయాల్సిందల్లా, ఒక ఉల్లిపాయ తీసుకుని పొట్టు తీసి, సన్నగా కట్ చేసి, ఫ్రై చేయాలి. దీనికి ఒక టీస్పూన్ తేనె కలుపుకుని తినడాలి. ఉదయం పరగడపున అంటే అల్పాహారం తినడానికి రెండు గంటల ముందు తింటే మంచి పలితం ఉంటుంది. ఇది అంగస్తంభన లోపాలు, శీఘ్రస్కలన సమస్యలను నివారిస్తుంది.

8. ఆస్పరాగస్:

8. ఆస్పరాగస్:

ఆస్పరాగస్ లో లైంగిక సామర్థ్యంను పెంచే లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని పోటెంట్ ట్రీట్మెంట్స్ లో ఎక్కువగా వాడుతుంటారు. ఇది మేల్ ఇంపోటెన్సీ తగ్గించడానికి సహాయపడుతుంది. ఆస్పరాగస్ ను పురాతన కాలం నుండి ఎరిక్టైల్ డిస్ ఫంక్షన్ నివారించడానికి వినియోగిస్తున్నారు.

ఎండిన ఆస్పరాగస్ వేర్లను పాలలో వేసి వేడి చేసి రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

9.బాదం

9.బాదం

బాదంలో విటమిన్ ఇ, మినిరల్స్, హెల్తీ ఫ్యాట్స్ ఉన్నాయి. అందుకే ఇవి ఒక ఉత్తమ ఆహారంగా , మగవారి లిబిడో సమస్యలను తీర్చడానికి సహాయపడుతుంది. బాదంలు రక్తప్రసరణనుమెరుగుపరుస్తాయి.

ఒక టీస్పూన్ బాదం తీసుకుని ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలపి, రోజూ రాత్రి నిద్రించడానికి ముందు తాగాలి.

10. దానిమ్మ జ్యూస్:

10. దానిమ్మ జ్యూస్:

దానిమ్మ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇది రక్తంను సరఫరా చేయడంలో రక్తంప్రసరణ మెరుగుపరచడానికి, ఒత్తిడి తగ్గించడానికి, అంగస్తంభన లోపాలను నివారించడానికి సహాయపడుతుంది. రెగ్యులర్ గా ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగడం మంచిది.

English summary

Top 10 Home Remedies For Male Impotency

Male impotency is a condition wherein a man fails to get an erection. Male impotency can be caused by several reasons. Hormonal changes and ageing are 2 of the major factors that can cause erectile dysfunction. There are a few natural home remedies that help in preventing this condition.
Story first published: Friday, December 22, 2017, 12:00 [IST]