తలనొప్పి మరియు టెన్షన్ తగ్గించుకోవడానికి 15 హోం రెమెడీస్

Posted By: Staff
Subscribe to Boldsky

ప్రతి ఒక్కరు, వారి జీవిత కాలంలో ఏదో ఒక వయస్సులో, ఏదో ఒక సందర్భంలో తలనొప్పికి గురి అవుతారు. తలనొప్పి వస్తే ఇక ఆరోజంతా అసౌకర్యంగా ఉంటుంది. మనస్సుకు విశ్రాంతి అనేది ఉండదు. తలనొప్పి వస్తే అది త్వరగా తగ్గకుండా..తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తుంటే జీవితమే తలక్రిందులైనట్లు అనిపిస్తుంది.

తలనొప్పి ఇన్ స్టాంట్ గా తగ్గించుకోవడానికి ఫార్మసీలో ఉండే పిల్స్ తీసుకుని ఉపశమనం పొందుతుంటారు. . అయితే, ఈ పిల్స్ తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం కలిగిస్తాయి?అయితే ఇది ఇలా కొనసాగితే ఆరోగ్యపరంగా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోకతప్పదు.

కాబట్టి, తలనొప్పిని నివారించుకోవడం కోసం కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీ ఉన్నాయి. ఇవి తలనొప్పితో పాటు, తలనొప్పికి కారణమయ్యే టెన్షన్ కూడా తగ్గిస్తాయి. ఈ స్ట్రెస్ ఫుల్ లైఫ్ లో తలనొప్పి సహజం . అందువల్ల తలనొప్పిని, టెన్సన్ ను సహజ పద్దతిలో తగ్గించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

1. కేయాన్ :

1. కేయాన్ :

కేయాన్ లో క్యాప్సెసిన్ అనే కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది బాడీ పెయిన్ తో పాటు, తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. తలనొప్పిని తగ్గించడంలో ఇది ఎఫెక్టివ్ గా పనిచేసినట్లు బొటానికల్ మెడీస్ ఫర్ హెడ్ ఏక్ ' రీసెర్చ్ లో కనుగొన్నారు.

1/4స్పూన్ కేయాన్ పెప్పర్ పౌడర్ ను 4ఔన్సుల నీటిలో మిక్స్ చేసి ముక్కు రంద్రాల్లో అప్లై చేయాలి. అలాగే తలనుదురును కుడి, ఎడమవైపు అప్లై చేస్తే చాలు కొద్దినిముషాల్లోనే ఉపశమనం కలుగుతుంది.

2. నట్స్ :

2. నట్స్ :

తలనొప్పి ఉన్నప్పుడు నట్స్ తీసుకోవడానికి బదులు కొన్ని బాదంలు తింటే మంచిది.టెన్షన్ తో వచ్చే తలనొప్పిని తగ్గించుకోవడంలో నట్స్ ను తినడం మంచిది. ఇవి పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. నట్స్ లో సాలిసిన్ అనేవి పెయిన్ కల్లింగ్ ఏజెంట్ గా పనిచేస్తాయి.

3. ఫీవర్ఫీ:

3. ఫీవర్ఫీ:

తలనొప్పి, ప్రతేక్యంగా మైగ్రేన్ తలనొప్పి ని తగ్గించుకోవడానికి ఫీవర్ఫీ ప్లాంట్ గ్రేట్ గా సహాయపడుతుంది. మైగ్రేన్ తలనొప్పి, తలలో బ్లడ్ వెజిల్స్ ఎక్స్ పాండ్ అవ్వడం వల్ల నరాల మీద ఒత్తిడి పెరిగి తలనొప్పి మరింత తీవ్రం చేస్తుంది. ఈ నొప్పిని తగ్గించడంలో ఫీవర్ ఫ్యూ మూలిక గొప్పగా సహాయపడుతుంది. ఇందులో పారథెనాలిడ్ ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పి తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది ఆస్పిరిన్ టాబ్లెట్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటుంది. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

4. యాపిల్ సైడర్ వెనిగర్ కంప్రెసర్ :

4. యాపిల్ సైడర్ వెనిగర్ కంప్రెసర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ క్షణాల్లో పెయిన్ ను తొలగిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ తో స్టీమ్ స్టైల్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. తలనొప్పి తగ్గించడంలో ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ. మైగ్రేన్ తలనొప్పి కూడా తగ్గిస్తుంది. 1/4కప్పు యాపిల్ సైడర్ వెనిగర్ ను బౌల్లో వేసి, అందులో టవల్ ను డిప్ చేసి తల నుదిరి మీద అప్లై చేయాలి. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ నీళ్ళలో వేసి ఆవిరి పట్టాలి. 5నుండి 10 నిముషాలు ఆవిరి పట్టడం వల్ల శ్వాసనాళం కూడా క్లియర్ అవుతుంది.

5. స్ట్రెచ్, రిలాక్స్ అండ్ బ్రీత్ :

5. స్ట్రెచ్, రిలాక్స్ అండ్ బ్రీత్ :

లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఫుల్ గా ఉన్నప్పుడు మైండ్ మరియు బాడీలో కండరాలు టెన్సింగ్, కండరాలు స్టిఫ్గ్ మారడం వల్ల అప్పర్ బ్యాక్, నెక్ మరియు షోల్డర్ కండరాలు స్టిప్ గా మారుతాయి. కండరాలు స్ట్రెచ్ అవ్వాలంటే, యోగా స్ట్రెచ్చింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. డీప్ బ్రీత్ టెన్షన్ మరియు తలనొప్పిని తగ్గిస్తాయి.

6. మూవింగ్:

6. మూవింగ్:

తలనొప్పి ఉన్నప్పుడు ఒకే చోట కూర్చోడం, లేదా పడుకోవడం చేయకుండి ఫ్రెష్ గా గాలి వీచే ప్రదేశంలో తిరగాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పికి కారణమయ్యే మజిల్స్ ఫ్రీ అవుతాయి. అలాగే రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల కూడా తలనొప్పి తగ్గించుకవోచ్చు. వ్యాయామానికి ముందు వార్మ్ అప్, వ్యాయామం తర్వాత కూల్ డౌన్ అవ్వాలి. టెన్షన్ తలనొప్పిని తగ్గించుకోవడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ.

7. ఫిష్ ఆయిల్ :

7. ఫిష్ ఆయిల్ :

నార్మల్ తలనొప్పితో పాటు, మైగ్రేన్ తలనొప్పిని కూడా తగ్గించడంలో ఫిష్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఫిష్ ఆయిల్లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇన్ఫ్లమేషన్ , బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది. అందుకు కారణం బ్లడ్ సెల్ ఇన్ఫ్లమేషన్ మరియు నరాల స్టిప్ నెస్ ను తగ్గిస్తుంది. ఫిష్ ఆయిల్ క్యాప్స్యుల్స్ డ్రగ్ స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి.

8. హాట్ అండ్ కోల్డ్ కంప్రెసెర్:

8. హాట్ అండ్ కోల్డ్ కంప్రెసెర్:

ఒక్కో వ్యక్తిలో ఒక్కోవిధమైన తలనపొ్పి ఉంటుంది. ఈ తలనొప్పిని తగ్గించుకోవడానికి కోల్డ్ లేదా హాట్ కంప్రెసర్ ట్రీట్మెంట్ బాగా సహాయపడుతుంది. కొన్ని రకాల తలనొప్పి నరాలు ఉబ్బడం వల్ల వస్తే, అలాంటి వారు కోల్డ్ కంప్రెసర్ అప్లైచేయాలి. కొంత మందిలో కోల్డ్ వల్ల వచ్చే నొప్పిని నివారించుకోవడానికి వార్మ్ కంప్రెసర్ సహాయపడుతుంది. కోల్డ్ కంప్రెసర్ కు ఐస్ క్యూబ్స్ ను ఐస్ బ్యాగ్ లో వేసి నొప్పిని ఉన్నప్రదేశంలో అప్లై చేసి మర్ధనచేయాలి.

9. ఎంఎస్ జిని నివారించాలి:

9. ఎంఎస్ జిని నివారించాలి:

మోనో సోడియం గ్లూటామేట్ ను ఆహారాలకు మంచి ఫ్లేవర్ కోసం కలుపుతుంటారు ఎంఎస్ జి కలిపిన ఫుడ్ తినడం వల్ల చాలా మంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతారు. కాబట్టి, ఇలాంటి ఆహారాలు తీసుకోకపోవడం మంచిది.

10. భంగిమన మార్చుకోవాలి:

10. భంగిమన మార్చుకోవాలి:

టెన్సన్ మరియు తలనొప్పిని తగ్గించుకోవడానికి కూర్చొనే భంగిమను మార్చుకోవాలి. ముందుకు, వెనకు స్ట్రెచ్ అవ్వడం, పక్కలకు తిరగడం వల్ల మజిల్స్ స్ట్రెచ్ అయ్ తలనొప్పిని తగ్గిస్తుంది. భుజాలు, వెన్ను, చెస్ట్, మెడను నిటారుగా ఉండేట్లు కూర్చోవాలి.

11. ఇమ్యాజినేషన్ సహాయపడుతుంది:

11. ఇమ్యాజినేషన్ సహాయపడుతుంది:

మెంటల్ ఇమాజినరీని తగ్గించడం మంచిది. తలనొప్ని తక్కువ ఉన్నా, లేదా ఎక్కువ ఉన్నా, రిలాక్షన్ ఉన్నవారు నొప్పి విపరీతంగా ఉన్నా, నొప్పి తగ్గించడానికిసహాయపడుతుంది. మనస్సును ప్రశాంతగా ఉంచుకోవడం వల్ల తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

12. అల్లం :

12. అల్లం :

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుడంలో అల్లం గ్రేట్ గా సహాయపడుతుంది. వికారం తగ్గిస్తుంది. అల్లంలో ఉండే ప్రోస్టాంగ్లాండిన్ సింథసిస్ ఇన్ఫ్లమేషన్ నొప్పిని తగ్గించడంలో పూర్తి బాధ్యత వహిస్తుంది. ఇది ఆస్పిరిన్ వలే పనిచేస్తుంది. అల్లం టీ మజిల్స్ రిలాక్స్ చేసి తలనొప్పి తగ్గిస్తుంది.

13. పిప్పర్మెంట్ ఆయిల్ :

13. పిప్పర్మెంట్ ఆయిల్ :

పిప్పర్మెంట్ ఆయిల్ స్మూతింగ్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది. ఇది తలనొప్పిని తగ్గిస్తుంది. అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. మైండ్ క్లియర్చేస్తుంది. ఇది నొప్పిని త్వరగా తగ్గిస్తుంది. ఈ పిప్పర్మెంట్ ను ఫోర్ హెడ్ కు అప్లై చేసి మసాజ్ చేయాలి.

14. తక్కువగా చాక్లెట్ తినాలి:

14. తక్కువగా చాక్లెట్ తినాలి:

కామన్ హెడ్ ఎక్ ను తగ్గించుకోవడానికి కెఫిన్ ఉన్న చాక్లెట్ ను మంచిది. చాక్లెట్స్ మైగ్రేన్ తలనొప్పికి కారణమవుతుంది. కాబట్టి, మైగ్రే్ ఉన్నవారు చాక్లెట్ తినకపోవడమే మంచిది.

15. నీళ్లు ఎక్కువ తాగాలి:

15. నీళ్లు ఎక్కువ తాగాలి:

నీళ్లు సరిపడా తాగకపోతే మైగ్రేన్ తలనొప్పికి కారణమవుతుంది. కాబట్టి, శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలంటే ఎక్కువ నీళ్లు తాగాలి. కాఫీ, ఆల్కహాల్, షుగర్ డ్రింక్స్ శరీరాన్ని డీహైడ్రేషన్ కు గురిచేస్తాయి, కాబట్టి, తలనొప్పి తగ్గించుకోవడానికి నీళ్లు అధికంగా తాగాలి.

English summary

15 Helpful Home Remedies For Headache And Tension

Read this article to know more about the best Indian home remedies for headache.
Subscribe Newsletter