గ్యాస్ట్రైటిస్‌ (పొట్ట) లో ఇన్ఫెక్షన్ తగ్గేదెలా..?

Posted By:
Subscribe to Boldsky

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించకపోవడంతో గ్యాస్ట్రైటిస్‌ సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల అందరిలోనూ నెలకొంటున్న తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం అనే అంశం దీనికి ఆజ్యం పోస్తోంది. శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఇటీవల చాలామంది గ్యాస్ట్రైటిస్‌ సమస్య బారిన పడుతున్నారు.

గ్యాస్ట్రైటిస్‌ అంటే: జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్‌ పొర ఇన్‌ఫ్లమేషన్‌ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్‌ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్‌ లేదా పుండ్లుగా ఏర్పడతాయి.

గ్యాస్ట్రైటిస్‌ (పొట్ట) లో ఇన్ఫెక్షన్ తగ్గేదెలా..?

కారణాలు: దాదాపు 20 నుంచి 50 శాతం అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడటం , పైత్య రసం వెనక్కి ప్రవహించడం, కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్‌ డిసీజ్‌), కొన్ని ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు. శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో n ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్‌ సమస్య కనిపిస్తుంది.

లక్షణాలు: కడుపు నొప్పి, మంట, కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం, అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు, ఆకలి తగ్గిపోవడం, కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గ్యాస్ట్రైటిస్‌ సమస్య నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి.

1. కొబ్బరి నీళ్ళు :

1. కొబ్బరి నీళ్ళు :

కొబ్బరినీళ్లు గ్యాస్‌ట్రైటిస్‌కి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇది శరీరానికి అవసరమైన విటమిన్లను, పోషకాలను అందిస్తుంది. కడుపులో ఇన్ఫెక్షన్ (గ్యాస్‌ట్రైటిస్) వల్ల మంటతో కూడిన నొప్పి వచ్చి, వాంతులవుతుంటే కొన్ని చిట్కాల ద్వారా ఉపశమనం పొందొచ్చు.

2. పొటాటో జ్యూస్ :

2. పొటాటో జ్యూస్ :

బంగాళదుంపకు తొక్క తొలగించి, జ్యూస్ చేయాలి. ఈ జ్యూస్ ను గోరువెచ్చని నీటితో పాటు తీసుకుంటే జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. అలాగే కాలేయంను కూడా శుభ్రం చేస్తుంది. పొట్టను ఆల్కలైజ్ చేస్తుంది.

3. బొప్పాయి:

3. బొప్పాయి:

బొప్పాయిలో బీటా కెరోటిన్ ఉండటం వల్ల ఇది పొట్టలోపల లైనింగ్ మంట, వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి, వారంలో ఒకటి రెండు సార్లు బొప్పాయి ముక్కలు తినడం మంచిది.

4. సోంపు :

4. సోంపు :

కొన్ని సోంపు గింజలను దోరగా వేయించి, వాటిని నోట్లో వేసుకుని నమిలి మింగాలి. ఇలా భోజనం చేసిన ప్రతి సారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే సోంపును ఒక గ్లాసు నీటిలో వేసి ఉడికించి తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

5.పైనాపిల్ :

5.పైనాపిల్ :

పైనాపిల్లో డైజెస్టివ్ ఎంజమ్స్ ఉంటాయి. ఇవి గ్యాస్ట్రైటిస్‌ ను లక్షణాలను నివారిస్తుంది. పొట్ట ఇన్ఫ్లమేషన్ కు గురైనప్పుడు పైనాపిల్ తినడం వ్ల మంచి ఉపశమనం కలుగుతుంది.

6. అల్లం:

6. అల్లం:

అల్లంలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. కాబట్టి,అల్లం టీ తయారుచేసుకుని తాగాలి. ఇది పొట్టకు సంబందించిన కొన్ని లక్షణాలను నివారిస్తుంది. అలాగే పచ్చి అల్లం చిన్న ముక్కను తినడం కూడా మంచిదే.

7. నీళ్ళు:

7. నీళ్ళు:

శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా నీరు ఎక్కువగా తాగాలి. పొట్టలో గ్యాస్, యాసిడ్స్ ను నివారించాలంటే రోజులో సరిపడా నీళ్ళు తాగాలి. నీరు ఎసిడిటిని తగ్గిస్తుంది.

English summary

7 Home Remedies For Gastritis

Gastritis is a disorder that is related to your digestive system. You might feel bloated all the time. Also, stomach pain, nausea and acid reflux may also trouble you when you suffer gastritis.
Story first published: Thursday, August 24, 2017, 16:23 [IST]