For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : హెచ్ ఐ వి (HIV/AIDS) లక్షణాలు, సంకేతాలు ఇవే

|

హెచ్ ఐ వి (HIV) లేదా ఎయిడ్స్ ఒక ప్రాణాంతకమైన, చికిత్సలేని సుఖ వ్యాధి. ఈ వ్యాధి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ (హెచ్.ఐ.వి.) ద్వారా సంక్రమిస్తుంది. ఈ వైరస్ కారణంగా మనిషి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా క్షీణించి పోయి హెచ్.ఐ.వి. సోకిన వ్యక్తి వివిధ వ్యాధులకు గురవుతాడు. అటువంటి వాటిలో ప్రధానంగా క్షయ, న్యూమోనియాకు సంబంధించిన న్యూమోసిస్టస్ కార్నియో, చర్మం మీద కంతులుగా ఏర్పడే కాషాసిస్ సార్కొమా, హెర్పిస్, షింగిల్స్, క్రిప్టోస్నోరియాసిస్ వంటి అంటు వ్యాధులు కలుగుతాయి.

హెచ్ ఐవి సోకిన వారి శరీరంలో కొన్ని స్రవాలను కనుగొనబడతుంది (సెమెన్ మరియు వైజినల్ ఫ్లూయిడ్, బ్లడ్ మరియు బ్రెస్ట్ మిల్క్). ఈ వైరస్ ఒకరి నుండి మరొకరి రక్తం ద్వారా లేదా సెక్యువల్ కాంటాక్ట్ ద్వారా సంక్రమిస్తుంది. మరియు ప్రెగ్నెట్ మహిళలకు ఇన్ఫెక్షన్ ద్వారా హెచ్ ఐవి సంక్రమించవచ్చు. గర్భిణీస్త్రీకి హెచ్ ఐవి సోకితే కడుపులో పెరుగుతున్న శిశువుకు కూడా సంక్రమించే ప్రమాదం ఉంది. శిశువులకు ప్రసవం ద్వారా లేదా బ్రెస్ట్ ఫీడ్ ద్వారా కూడా హెచ్ ఐవి సోకే ప్రమాదం ఉంది.

హెచ్ ఐవి వివిధ రకాలుగా సంక్రమించవచ్చు. వైజినల్, ఓరల్ సెక్స్, ఆనల్ సెక్స్, రక్త మార్పిడి, మరియు హైపోడెర్మిక్ నీడిల్స్ మొదలగు వాటి ద్వారా సంక్రమించవచ్చు. HIV సంకేతాలు అనేక సంవత్సరాలు సుషుప్తిలో ఉండి తర్వాత మాత్రమే బయటకు వస్తాయి. మీకు HIV ఉందని సందేహం ఉంటే కనుక వెంటనే సరైన స్పెషలిస్ట్ తో మాట్లాడి పరీక్ష చేయించుకోవటం మంచిది. ఇక్కడ మీరు గమనించవలసిన కొన్ని HIV సంకేతాలు ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ సమస్యలు వుంటే ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించి నిర్ధారించండి. ఆ తరువాతే యే నిర్ణయమైనా తీసుకోండి...

ఎయిడ్స్ -హెచ్ఐవి మీద కొన్ని అపోహలు..!

1. అలసట:

1. అలసట:

HIV ఉన్నవారికి తప్పకుండా అలసట వస్తుంది. అయితే ఇది సాధారణంగా కాదు చాలా రెట్లు అధికంగా వస్తుంది.

2. నెమోనియా:

2. నెమోనియా:

HIV ఉన్న వారిలో మనం తరచుగా జలుబు లక్షణాలు గమనిస్తూవుంటాం. ఇది నెమోనియా వాళ్ళకు మాత్రమే తరచూ రావచ్చు.

3. జ్వరం:

3. జ్వరం:

HIV ఉన్న వారిలో మనం విపర్రెతమైన జ్వరం రావడం గమనించవచ్చు.తరచూ విడిచివిడిచి జర్వం వస్తూనే ఉంటుంది. ఇలా జ్వరం రాగానే వారిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి.

4.ఇన్ఫెక్షన్:

4.ఇన్ఫెక్షన్:

వీరిలో తరచూ ఇన్ఫెక్షన్ రావడం గమనించవచ్చు. దీని వలన వారు ఎప్పుడూ చిరాకుగా ఉంటారు.

5. గోర్లు పుచ్చిపోవడం:

5. గోర్లు పుచ్చిపోవడం:

HIV ఉన్నవారి వేలిగోర్లు చూడటానికి వికారంగా కనపడుతుంటాయి.

డిసెంబర్ 1: ప్రపంచ ఎయిడ్స్ డే: నిశ్శబద్దంతో పాటు అపోహలనూ చేధించండి...

6.చెమటలు పట్టడం:

6.చెమటలు పట్టడం:

HIV గలవారికి రాత్రుల్లో చమటలు పట్టడం మనం తరచూ చూడవచ్చు.

7. కీళ్ళ నొప్పులు:

7. కీళ్ళ నొప్పులు:

కీళ్ళ నొప్పులు అధికంగా వస్తుంటాయి వీరికి.

8. తల తిప్పడం:

8. తల తిప్పడం:

HIV ఉన్నవారికి ఎప్పుడూ వికారంగా ఉంటుంది. ఎక్కువ సేపు యే పనీ చేయలేరు.

9. మచ్చలు:

9. మచ్చలు:

వీరికి చర్మంపై మచ్చలు వస్తూ వుంటాయి.

10. జీర్ణ సమస్యలు :

10. జీర్ణ సమస్యలు :

HIV ఉన్న వారికి జీర్ణాశయం బలహీనంగా ఉండటంతో తరచూ జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

11. బరువు తగ్గడం:

11. బరువు తగ్గడం:

HIV వ్యాధి సోకిన వారు త్వరగా బరువు తగ్గడం గమనించవచ్చు. చూడటానికి చాల సన్నగా అవుతారు.

సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా అశ్వగంధ తినాల్సిందే..!!

12. ఎలర్జీలు:

12. ఎలర్జీలు:

HIV వైరస్ సోకినా వారికి తరచూ ఎలేర్జీలు వస్తూ ఉంటాయి.

13. ఫోకస్ లేకపోవడం:

13. ఫోకస్ లేకపోవడం:

వీరు పని మీద కానీ చదువు మీద కాని దృష్టి సారించలేరు.

14. పుండ్లు:

14. పుండ్లు:

HIV సోకినా వారందరికీ పుండ్లు రావడం మనం చూడవచ్చు.

15. తిమ్మిర్లు:

15. తిమ్మిర్లు:

HIV వస్తే ఎక్కువగా తిమ్మిర్లు రావడం సహజమే.

16. అల్సర్:

16. అల్సర్:

వీరికి నోటిలో, ఇతర అంగాలలో అల్సర్లు వస్తూ ఉంటాయి. చాల ఇబ్బందిగా ఉంటుంది.

17. వాంతులు :

17. వాంతులు :

వీరు ఏది తిన్న కూడా జీర్నాసయం బలహీనంగా ఉండటంతో వెంటనే వాంతులు చేసుకుంటారు.

18. బ్రెయిన్ వ్యాధులు:

18. బ్రెయిన్ వ్యాధులు:

వీరికి మతిమరుపు, పిచ్చి పట్టడం వంటి వ్యాధులు వస్తుంటాయి.

 19 .మీకు నిరంతరాయంగా దగ్గు ఉంటే

19 .మీకు నిరంతరాయంగా దగ్గు ఉంటే

పొడి దగ్గు కూడా HIV సంకేతాలలో ఒకటి.మీరు దుమ్ము అలెర్జీ అని పొరబడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వ్యాపించే సమయంలో మీకు లక్షణాలు మరీ తీవ్రంగా ఉన్నాయేమో గమనించండి.

20. డయేరియా:

20. డయేరియా:

HIV ఉంటే డయేరియ నిత్యం ఉండే ఒక సమస్య.

English summary

Early signs and symptoms Of HIV

Sometimes HIV symptoms don't appear for years—sometimes even a decade—after infection.Here are some signs that you may be HIV-positive.