For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసుపుతో ఆర్థ్రైటిస్ ట్రీట్మెంట్: కీళ్ళనొప్పులు, వాపులను తగ్గించే పసుపు

|

పసుపు సర్వసాధారణంగా లభించే సుగుంధ ద్రవ్యం. దీనిని "సుగుంధ ద్రవ్యాల రాణి" అని కూడా పిలుస్తారు. పసుపులో 'కుర్కుమిన్' అధికంగా ఉండటం వల్ల పసుపును కుర్కుమిన్ లాంగో అని కూడా పిలుస్తుంటారు. పసుపు మంచి రుచిని, సువాసనను మరియు బంగారు పసుపు రంగు యొక్క లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఆర్థ్రైటిస్ కు సంబంధించిన సమస్యలను నివారించడంలో పసుపు గొప్పగా సహాయపడుతుంది. అందుకే దీన్ని పురాతన కాలం నుండినే వ్యాధులను నివారించుకోవడం కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

పసుపులో కుర్కుమిన్ అనే కంటెంట్ తో పాటు ప్రోటీన్, ఆహార సంబంధిత పీచు, విటమన్ ఇ, నియాసిన్, విటమన్ సి, పొటాషియం, రాగి, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం మరియు జింక్ వంటి పలు ఆరోగ్యవంతమైన పోషకాలను కూడా లభిస్తాయి. పసుపులో ఇన్ని అత్యధిక పోషక విలువలే కాకుండా, పలు ప్రయోజనాలు ఉంటాయని నిరూపించబడింది.

Ways To Use Turmeric For Arthritis Treatment

పసుపులో వాపును తగ్గించే గుణాలు వలన ఎముకల కీళ్ళ వ్యాధి మరియు రుమాటాయిడ్ కీళ్ళ వ్యాధి రెండింటిలోనూ మంచి ఫలితాలు లభిస్తాయి. వీటితో పాటు, దీని యాంటీయాక్సిడెంట్ గుణాల వలన శరీర కణాలను నాశనం చేసే శరీరంలోని ఫ్రీరాడికల్స్ (స్వేచ్ఛా ధాత్వంశాల)ను కూడా నాశనం చేస్తుంది. తరచూ పసుపును ఉపయోగించడం వల్ల రుమాటాయిడ్ కీళ్ళ వ్యాధితో బాధపడుతున్న వారు కీళ్ళ నొప్పులు, అలాగే కీళ్ళ వాపులకు కొంతవరకు ఉపశమనం పొందినట్లు పేర్కొన్నారు.

<strong>పొట్ట చుట్టూ కొవ్వు కరిగించే మన వంటింటి నేస్తాలు: పసుపు+నిమ్మరసం.!</strong>పొట్ట చుట్టూ కొవ్వు కరిగించే మన వంటింటి నేస్తాలు: పసుపు+నిమ్మరసం.!

పసుపులో ఉండే సైటోకిన్స్ మరియు ఎంజైమ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడం, నొప్పులను నివారించడం మరియు జాయింట్ స్టిఫ్ నెస్ ను ఫ్రీచేయడంలో గొప్పగా సహాయపడుతాయి. అందువల్ల పసుపు, పసుపుతో పాటు ఇతర నేచురల్ పదార్థాలను ఉపయోగించి కీళ్ళ నొప్పులు మరియు కీళ్ల వాపులను ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆర్థ్రైటిస్ కు పసుపు ఏవిధంగా సహాయపడుతుందో చూద్దాం..

1. పసుపు :

1. పసుపు :

ఒక స్పూన్ పసుపును ఒక కప్పు పాలలో మిక్స్ చేసి, రాత్రి నిద్రించడానికి ముందు తాగడం వల్ల మంచి నిద్రపడుతుంది. అలాగే పసుపును రెగ్యులర్ డైట్ లో ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఆర్థ్రైటిస్ కు సంబంధించిన కీళ్ళ నొప్పులు, వాపులు తగ్గుతాయి. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే కంటెంట్ రుమటాయిడ్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.

2. టర్మరిక్ వాటర్ :

2. టర్మరిక్ వాటర్ :

ఒక స్పూన్ పసుపును ఒక గ్లాసు నీళ్లలో కలిపి 15 నిముషాలు బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ చేయడం వల్ల పుసుపులో ఉండే కుర్కుమిన్ కంటెంట్ వాటర్ లోనికి బాగా కలుస్తుంది. ఇలా వేడి చేసిన టర్మరిక్ వాటర్ ను 4 గంటలలోపే తాగాలి. లేదంటే వాటర్ లో కలిసిన కుర్కుమిన్ కంటెంట్ క్రమంగా తగ్గిపోతుంది. ఆ తర్వాత తాగినా ప్రయోజనం ఉండదు.

3. పసుపు మరియు అల్లం :

3. పసుపు మరియు అల్లం :

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి కీళ్ళనొప్పులను నివారించడంలో గొప్పగా సహాయపడుతాయి. అరస్పూన్ పసుపు తీసుకుని, దీనికి డ్రై జింజర్ పొడి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వేడి నీటిలో వేసి 15-20నిముషాలు ఉడికించాలి. ఈ జింజర్ టర్మరిక్ టీని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.

<strong>‘టర్మరిక్ టీ' ! క్యాన్సర్ తో పాటు ఇతర ఇన్ఫెక్షన్స్ అన్నీ పరార్.........</strong>‘టర్మరిక్ టీ' ! క్యాన్సర్ తో పాటు ఇతర ఇన్ఫెక్షన్స్ అన్నీ పరార్.........

4. పసుపు, కొబ్బరి నూనె:

4. పసుపు, కొబ్బరి నూనె:

ఒక స్పూన్ పసుపులో కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేయాలి. దీన్ని పేస్ట్ చేసి కీళ్ళ నొప్పులు, వాపులున్న ప్రదేశంలో అప్లై చేయాలి. అప్లై చేసి కొన్ని గంటల సేపు అలాగే ఉంచి తర్వాత వేడి నీళ్ళతో శుభ్రం చేసుకుంటే నొప్పిని పూర్తిగా నివారించుకోవచ్చు .

5. పసుపు, నిమ్మ పౌడర్ మరియు పొటాషియం నైట్రేట్:

5. పసుపు, నిమ్మ పౌడర్ మరియు పొటాషియం నైట్రేట్:

పసుపు, లెమన్ పౌడర్ మరియు పొటాషియం నైట్రేట్ ను సమంగా తీసుకుని, మిక్స్ చేయాలి. తర్వాత పేస్ట్ చేసి, నొప్పి, వాపులున్న ప్రదేశంలో దీన్ని అప్లై చేయడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఈ రెమెడీని రెగ్యులర్ గా అనుసరిస్తే కొద్ది రోజులకు కీళ్ళనొప్పులు వాపులు, వాటి లక్షణాలు ఎఫెక్టివ్ గా తగ్గిపోతాయి .

6. పసుపు పేస్ట్ :

6. పసుపు పేస్ట్ :

పసుపు పొడిని ¼కప్పు తీసుకోవాలి, అందులో ½ కప్పు వాటర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద వేడి చేసుకోవాలి. కొద్ది సేపటి తర్వాత స్టౌ మీద నుండి క్రిందికి దింపి చల్లార్చాలి. దీన్ని రిఫ్రిజరేటర్ లో ఉంచి అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి. నొప్పి, వాపులున్న ప్రదేశంలో దీన్ని అప్లై చేయడం వల్ల నొప్పులు, వాపుల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

<strong>ఎఫెక్టివ్ మొటిమలను నివారించుకోవడానికి పసుపుతో 8 సింపుల్ చిట్కాలు..!!</strong>ఎఫెక్టివ్ మొటిమలను నివారించుకోవడానికి పసుపుతో 8 సింపుల్ చిట్కాలు..!!

7. పసుపు, కొబ్బరి నూనె మరియు గుడ్డులోని పచ్చసొన:

7. పసుపు, కొబ్బరి నూనె మరియు గుడ్డులోని పచ్చసొన:

ఒక గిన్నెలోనికి గుడ్డులోని పచ్చసొన, కొబ్బరి నూనె, పసుపు వేసి మూడు బాగా కలిసే వరకూ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు ఒకటి, రెండు సార్లు తీసుకుంటే ఆర్థ్రైటిస్ నొప్పులు, వాపుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.

8. పసుపు, లెమన్ గ్రాస్, కొబ్బరి నూనె, కేయాన్ పెప్పర్ :

8. పసుపు, లెమన్ గ్రాస్, కొబ్బరి నూనె, కేయాన్ పెప్పర్ :

5 స్పూన్ల కేయాన్ పెప్పర్ లో, 5 స్పూన్ల పసుపు మిక్స్ చేయాలి. ఇందులో డ్రై ఆర్గానిక్ లెమన్ గ్రాస్ , కొబ్బరి నూనె వేసి, మూడు ఒవెన్ లో 150 డిగ్రీస్ వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసు జార్ లోనికి వడగట్టుకుని, మూత గట్టిగా పెట్టి, నిల్వచేసుకోవాలి. అవసరం అయినప్పుడు, నొప్పి, వాపులున్న ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. దీన్ని అప్లై చేయడం వల్ల ఆర్థ్రైటిస్ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

9. పసుపు, మెంతి పౌడర్ మరియ డ్రై జింజర్ :

9. పసుపు, మెంతి పౌడర్ మరియ డ్రై జింజర్ :

అల్లంలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు, జింజరోల్ గా పిలిచే ఫైటో న్యూట్రీషియన్స్ అధికంగా ఉండటం వల్ల ఇది ఇన్ఫ్లమేషన్ మరియు ఆర్థ్రైటిస్ తో పోరాడుతుంది. ఒక స్పూన్ పసుపుకు , ఒక స్పూన్ మెంతి పౌడర్, డ్రై జింజర్ పౌడర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వాటర్ లో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.

10. పసుపు మరియు డైమిథైల్ సల్ఫేట్ ద్రవం:

10. పసుపు మరియు డైమిథైల్ సల్ఫేట్ ద్రవం:

ఒక స్పూన్ డైమిథైల్ సల్ఫేట్ ద్రవంలో పసుపును మిక్స్ చేయాలి. ఈ రెండూ బాగ కలిసే వరకూ మిక్స్ చేసి, నొప్పి ఉన్న జాయింట్స్ మీద అప్లై చేయాలి. ప్లాస్టిక్ వ్రాపర్ ను చుట్టాలి. దాని మీద హీటింగ్ ప్యాడ్ ను 30నిముషాలు చుట్టాలి. ఇలా చేయడం వల్ల ఆర్థ్రైటిస్ నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

11. పసుపు మరియు నిమ్మరసం :

11. పసుపు మరియు నిమ్మరసం :

2 స్పూన్ల పసుపు తీసుకుని, అందులో నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ రెండూ మిక్స్ చేసిన తర్వాత, కొద్దిగా వేడి నీళ్ళు కలుపుకుంటూ మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను నొప్పి, వాపులున్న ప్రదేశంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఆర్థ్రైటిస్ కు సంబంధించిన నొప్పులు వాపులను తగ్గించుకోవడంలో పసుపు బెస్ట్ నేచురల్ రెమెడీ.

English summary

11 Ways To Use Turmeric For Arthritis Treatment

Arthritis is an inflammation or pain that can commonly occur in the fingers, elbow, knees, hip, jaw or any other area between the joints.So, here's a gist on how to use turmeric for arthritis treatment. Continue reading to know more.
Desktop Bottom Promotion