For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ఫ్లమేషన్ తో పోరాడే ఎఫెక్టివ్ ఫుడ్స్!, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్

By Mallikarjuna
|

ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఆహారాల గురించి తెలుసుకునే ముందు ఇన్ఫ్లమేషన్ అంటే ఏమిటో తెలుసుకుందాం...

మన శరీరంలో మనకు తెలియకుండా వాపులకు మంటకు కారణం అయ్యే బ్యాక్టీరియా చేయడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ కు అంతరాయం కలుగుతుంది. దాంతో జీవక్రియలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ కు గురి అవుతుంది.

మనకు తెలియకుండా బరువును పెంచేసే ఆహారాలేంటో తెలుసా ?మనకు తెలియకుండా బరువును పెంచేసే ఆహారాలేంటో తెలుసా ?

ఇన్ఫ్లమేషన్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ కు మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుంది. మన శరీరంలోని వైరస్ లేదా బ్యాక్టీరియా వంటి వ్యాధికారక క్రిములు చేరడం వల్ల ఇన్ఫ్లమేషన్ కు గురిచేస్తుంది. ఇది అత్యంత ప్రమాదకర స్థితిని ఏర్పరుస్తుంది.

ఇన్ఫ్లమేషన్ ఎక్కువ కాలం ఉన్నట్లైతే అది క్యాన్సర్, డయాబెటిస్, హార్ట్ డిసీజ్, ఆర్థ్రైటిస్ మొదలగు ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది.

foods to fight inflammation

అందువల్ల ఇన్ఫ్లమేషన్ కు గురి కాకుండా ఉండాలంటే అందుకు తగ్గ ఆహారాలను తీసుకోవాలి. ఇన్ఫ్లమేషన్ తో పాటు వ్యాధులను దూరం చేసుకోవాలంటే అందుకు తగ్గ కరెక్టైన ఫుడ్స్ ను తీసుకోవాలి. అలాగే ఇన్ఫ్లమేషన్ కు గురిచేసే ఆహారాలకు దూరంగా ఉండాలి.

ఇన్ఫ్లమేషన్ కు చక్కటి పరిష్కారం : హెల్తీ ఫుడ్స్ఇన్ఫ్లమేషన్ కు చక్కటి పరిష్కారం : హెల్తీ ఫుడ్స్

ఇన్ఫ్లమేషన్ (వాపు మరియు మంటలు)తగ్గించుకోవడానికి ఫార్మసీలోని మందులు తినడం కంటే, ఇన్ఫ్లమేషన్ తో పోరాడే ఆహారాలను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులతోపాటు దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవచ్చు.

ఇన్ఫ్లమేషన్ తో పోరాడే కొన్ని ఆహారాల గురించి ఈ ఆర్గికల్లో తెలియజేయడం జరిగింది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

బొప్పాయి:

బొప్పాయి:

బొప్పాయి అంటే ఇష్టపడని వారుండరు. బొప్పాయిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పి నివారిణిగా పనిచేస్తాయి. ఇందులో ఉండే ప్రోటోలైటిక్ ఎంజైమ్ అందుకు బాగా సహాయపడుతుంది. ఈ ఎంజైమ్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పెపైన్ తో తయారుచేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ కూడా ఫార్మసీలో అందుబాటులో ఉంది

బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు యాంటీ మైక్రోబయల్, యాంటీహైపో గ్లిసమిక్, యాంటీహైపర్ టెన్షన్, యాంటీ క్యాన్సేరియస్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో ఉండే అనేక విటమిన్స్, మరియు మినిరల్స్ వల్ల ఈ పండ్లు స్ట్రాంగ్ గా ఇన్ఫ్లమేషన్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది.

అల్లం:

అల్లం:

అల్లంలో మెడిసినల్ గుణాలు అధికంగా ఉన్నాయి. అందుకే దీన్ని పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. అల్లంలో జింజరోల్, స్లోగోల్, జింజరిన్ మొదలగు ఫైటో కెమికల్స్ ఉన్నాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ వెజిటేబుల్ ప్రక్రుతి ప్రసాధించిన ఒక విలువైన బహుమతి.ఇది ఇన్ఫ్లమేషన్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. . ఫార్మసీలో దొరికే జింజరోల్ డ్రగ్స్ ఓస్టిరియో ఫోసిస్ ను ఎఫెక్టివ్ గా నయం చేస్తాయి.

పసుపు :

పసుపు :

కుర్కుమిన్ ఒక ముఖ్యమైన పదార్థం. ఇది పసుపపచ్చగా ఉండే మసాలా దినుసు. ఇన్ఫమేషన్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. . పసుపులో ఉండే కుర్కుమిన్ అనే కంటెంట్ ఇన్ఫ్లమేషన్ కు కారణమయ్యే మోలిక్యులస్ అనే సైక్లోఆక్సిజెనేస్ 2 , లిపోక్సిజెనేస్ , ల్యూకొట్రైన్స్ మరియు థ్రోబోక్సిన్ వంటి వాటితో ఎఫెక్టివ్ గా పోరాడి ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి.

చియా సీడ్స్ :

చియా సీడ్స్ :

చియా సీడ్స్ లో పోషకాలు మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉన్నాయి. వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ఆల్ఫా లినోలిక్ లినోలిక్ , మ్యూసిన్ మరియు స్ట్రోంటియం వంటివి ఇన్ఫ్ల హేషన్ తగ్గించడంలో షార్ట్ హోం రెమెడీ. ఇన్ఫ్లమేషన్ కు వ్యతిరేఖంగా పోరాడి. కొలెస్ట్రాల్ మరియు బ్లడ్ ప్రజర్ ను తగ్గిస్తుంది.

సెలరీ :

సెలరీ :

సెలరీలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గొప్పగా సహాయపడుతాయి. సెలరీ లోని మినిరల్స్ ను జీవక్రియలను బ్యాలెన్స్ చేస్తాయి. దాంతో ఇన్ఫ్లమేషన్ ఎఫెక్టివ్ గా తగ్గుతుంది.

క్రాన్ బెర్రీస్ :

క్రాన్ బెర్రీస్ :

ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో క్రాన్ బెర్రీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ , మరియు పొట్టకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫ్లమేషన్ అయినా , ఇంకా కార్డియో వ్యాస్కులర్ సిస్టమ్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి .

ఇంకా ఇది వ్యాధినిరోధకతను పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కు ఒక స్టోర్ హౌస్ వంటిది. ఫైటో న్యూట్రీయంట్స్, క్రాన్ బెర్రీస్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఇన్ స్టాంట్ హోం రెమెడీ

వాల్ నట్స్ :

వాల్ నట్స్ :

వాల్ నట్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఆహారాల్లో ఇది ఒకటి. మరి ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం...వాల్ నట్స్ న్యూరో ట్రాన్స్మిటర్ వంటి ఉత్పత్తి పెంచడంలో బ్రాడికినిన్స్ నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ కలిగించడంలో మోసపూరితం వంటింది. కాబట్టి, వాల్ నట్స్ ఎలాంటి నొప్పులు, వాపులునైనా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. న్యూరో ట్రాన్స్ మీటర్స్ గొప్పగా పనిచేస్తుంది. ఇది శరీరంలో గొప్పగా ఉపశమనం కలిగిస్తుంది

బ్రొకోలీ:

బ్రొకోలీ:

బ్రొకోలీలో కూడా యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. బ్రొకోలీలో సల్ఫరోఫేన్ అనే పవర్ ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుండటం వల్ల సైటోకినిన్స్ వంటివని తగ్గించడానికి పూర్తి బాధ్యత వహిస్తుంది. దాంతో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

కాబట్టి, నొప్పులు, వాపులు వంటివి నివారించుకోవడానికి అస్తమానం ఫార్మసీలోని మందులు తినకుండా నేచురల్ గా ప్రక్రుతి ప్రసాధించిన ఆహారాలతో తగ్గించుకోవడం ఆరోగ్యానికి ఉత్తమైన మార్గం. ఇవి ఇన్ఫ్లమేషన్ తగ్గించడంతో పాటు, శరీరంను ఫ్రీ చేస్తుంది.

English summary

Foods That Help To Fight Inflammation

Know about a few of the foods that help to fight inflammation here on Boldsky.
Story first published:Saturday, October 14, 2017, 8:16 [IST]
Desktop Bottom Promotion