వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయడానికి డైలీ హ్యాబిట్స్

By Mallikarjuna
Subscribe to Boldsky

ప్రముఖ అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ ఒకసారి ఇలా అన్నాడు, "వయసు సమస్య అనేది మనస్సుకు సంబంధించినది, దాన్ని మీరు పట్టించుకోకపోతే, అది పెద్ద సమస్యే కాదు’’.

ఇప్పుడు మనలో కొంత మంది ఇలా వయస్సై అయిపోతా వుందని, యవ్వనాన్ని కోల్పోతున్నామని భావిస్తుంటే మాత్రం పైన అమెరికన్ రచయిత చెప్పిన కోట్ కొంత వరకూ ఓదార్పునిస్తుంది.

ఎందుకంటే, రచయిత మార్క్ ట్వైన్ చెప్పినట్లు గా ఒక వ్యక్తి వయస్సు అయిపోతోందని బాధపడటం మరియు నిరాశ చెందడం వంటి మానసిక లక్షణాలు కూడా ఏజింగ్ ను సూచిస్తుంది, ఇటువంటి సమయంలో వృద్ధాప్య లక్షనాలు మరింత వరెస్ట్ గా మారుతాయి. వ్యక్తి మరింత ఒత్తిడికి లోనయ్యేలా చేస్తుంది.

వ్యక్తి అలా ఆలోచించడానికి బదులుగా ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉండటానికి ప్రయత్నించాలి, అలా ఉన్నప్పుడే, వయస్సైనా కూడా హెల్తీగా, మరియు యాక్టివ్ గా కనబడుతారు.

అయితే అలా ఉండగలడం ఒక మనిషిగా అది అసాధ్యమనుకోండి, ఎందుకంటే మానసికంగా, శరీరకంగా అది న్యాచురల్ గా జరిగే ఒక ప్రక్రియ, దాన్ని మనం ఆహ్వానించక తప్పదు, ప్రతి ఒక్కరిలో వయస్సు రిత్యా మార్పులు జరుగుతూనే ఉంటాయి.

మనలో చాలా మంది ఈ రోజుల్లో 30ఏళ్ళు వచ్చే సరికి , ఎనర్జీలెవల్స్ క్రమంగా తగ్గడం మరియు ఆరోగ్యం విషయంలో క్రమంగా మార్పులు జరుగుతుంటాయి.

ఒక వయస్సు వచ్చిన తర్వాత వృద్ధాప్య లక్షణాలను బహిర్గతంగా అయితే తెల్ల జుట్టు, చర్మంలో సన్నిని చారలు, ముడుతలు, సాగిన చర్మం, బరువులో హెచ్చుతగ్గులు మొదలగు లక్షణాలు బహిర్గతంగా కనబడుతాయి. అంతే కాదు అంతర్గతంగా కూడా మార్పులు జరగుతాయి.

40 ఏళ్ళ తర్వాత, మనలో జీవక్రియల రేటు, ఎనర్జీ లెవల్స్, వ్యాధినిరోధకశక్తి తగ్గుముఖం పడుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఒకటికొకటి పెరుగుతుంటాయి.

అదనంగా, శరీరంలో వయస్సు రిత్యా హార్మోనుల్లో మార్పులు జరగడం వల్ల మన మీద వ్యతిరేఖ లక్షణాలు అధికంగా కనబడుతాయి.

పైన సూచించిన ఈ లక్షణాలన్నీ కూడా 30-35 సంవత్సరాలు పైబడిన వారిలో కనబడుతాయి. లేదా క్రమంగా పెరుగుతుంటాయి.

అందువల్ల , మీరు రెగ్యులర్ గా ప్రతి దినం అనుసరించాల్సిన అలవాట్లు కొన్ని ఉన్నాయి. ఇవి ఏజింగ్ కు కారణమయ్యే సెల్స్ ను పునరుత్పత్తి చేస్తుంది. త్వరగా వయస్సైన వారిలా కనబడనివ్వకుండా చేస్తాయి. మరి అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

1. ఎక్కువ నవ్వాలి లేదా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి!

1. ఎక్కువ నవ్వాలి లేదా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి!

నవ్వు అందన్నా రెట్టింపు చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు, నవ్వు అందమాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందనంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. నవ్వు వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, ముఖ కండారాలు వదులై ముడుతలు, ఫైన్ లైన్స్ తగ్గుతాయి!

2. ఎక్కువగా పండ్లు తినాలి

2. ఎక్కువగా పండ్లు తినాలి

పండ్లు ముఖ్యంగా హెల్తీ పండ్లు రెగ్యులర్ గా తినడం వల్ల అనేక వ్యాధులను నివారించుకోవచ్చు. బెర్రీస్, ద్రాక్ష, ప్లమ్ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల చర్మానికి కావల్సిన మాయిశ్చరైజర్ అందుతుంది. అది ఏజ్ స్పాట్స్, ముడతలు, చారలను నివారిస్తుంది.

3. మసాజ్

3. మసాజ్

ప్రొఫిషినల్ గా మసాజ్ చేయించుకోవడం, ముఖం, , శరీరం, కాళ్ళు చేతుల మీద ఎక్కువ ఏకాగ్రత పెట్టడం వల్ల కొత్త కణాలను ఉత్పత్తి పెరుగుతుంది. సెల్ డిజనరేషన్ ప్రొసెస్ పెరుగుతుంది. ముడుతలు, మచ్చలు, చారలు తగ్గుతాయి.

4. గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి

4. గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి

పిల్లలు లాగా, మనం ఎప్పుడూ గ్రీన్ వెజిటేబుల్స్ ను తీసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి, అలాగే వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల ఏజింగ్ లక్షణాలు దూరం అవుతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ కె అధికం. అందుకోసం ఆకుకూరలు, కేలు, పుదీనా వంటివి తీసుకోవడం వల్ల కణాల ఉత్పత్తి మెరుగుపడుతుంది.

5. చేపలు తినాలి

5. చేపలు తినాలి

మీరు వెజిటేరియన్ కాకపోతే, మీరు చేపలకు అలర్జీక్ కాకపోతే, మీ రెగ్యులర్ డైట్ లో చేపలను చేర్చుకొనే అవకాశం వచ్చింది. సాల్మన్, తున వంటి చేపల్లో విటమిన్ ఇ, డిమిథైల్ లామినో ఇథనోల్ ఈ రెండూ సెల్ డిజనరేషన్ ప్రొసెస్ ను ప్రోత్సహిస్తాయి.

6. వ్యాయామం ఎక్కువగా చేయాలి

6. వ్యాయామం ఎక్కువగా చేయాలి

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం మంచి అలవాటు, ఇది బరువు తగ్గడానికి సహాయపడటమే కాదు, హార్ట్ సమస్యలను నివారిస్తుంది, వ్యాధినిరోధకతను మెరుగుపరుస్తుంది. రోజూ లేదా ఎక్కువ సార్లు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం సాగడం, జాయింట్ పెయిన్, ఏజ్ కు సంబంధించిన సమస్యలు, అలసట వంటి సమస్యలు తగ్గుముఖం పడుతాయి.

7. ప్రొసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి

7. ప్రొసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి

ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్, చిప్స్ మొదలగునవి, ఆరోగ్యానికి మంచిది కాదు, వాటిలో బరువును పెంచే గుణాలు, హార్ట్ సమస్యలకు ఇతర, ఆరోగ్య సమస్యలకు కారణం అయ్యేవి ఎక్కువగా ఉంటాయి. మరో ఫ్యాక్ట్ ఇలాంటి అనారోగ్యకరమైన ఫ్యాట్స్, టాక్సిన్స్ కారణంగా చిన్న వయస్సులోనే శరీరంలో కణాలు పాడవడం వల్ల ఏజింగ్ లక్షణాలు కనబడుతాయి. వీటిని నివారించాలంటే ప్రొసెస్ చేసి ఆహారాలకు దూరంగా ఉండాలి!

8. ఒత్తిడి తగ్గించుకోవాలి

8. ఒత్తిడి తగ్గించుకోవాలి

ఒత్తిడి వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. డిప్రెషన్, హైబ్లడ్ ప్రెజర్, హార్ట్ ఎలిమెంట్ సమస్యలు వస్తాయి. ఒత్తిడి వల్ల అంతర్గతంగా కూడా మార్పులు జరగుతాయి. కాబట్టి ఏజింగ్ లక్షణాలు కనబడకూడదనుకుంటే ఒత్తిడి తగ్గించుకోవాలి.

9. గాడ్జెట్స్ ఉపయోగించడం తగ్గించాలి

9. గాడ్జెట్స్ ఉపయోగించడం తగ్గించాలి

ఈ ఆధునిక యుగంలో కంప్యూటర్, ఫోన్స్, ట్యాబ్లెట్స్ వినియోగించకుండా ఉండలేరు,, ఎందుకంటే, ఇవి మన దినచర్యలో ఒక భాగం అయ్యాయి. గాడ్జెట్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కళ్ళ చుట్టూ ముడుతలు, చారలు, ఏర్పడి వయస్సైన వారిలా కనబడేలా చేస్తాయి!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Daily Habits To Slow Down Ageing

    Daily Habits To Slow Down Ageing , If you want to slow down the ageing process and look younger for a long time, follow these tips!
    Story first published: Monday, December 25, 2017, 12:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more