వర్షాకాలంలో కళ్ళ ఇన్ఫెక్షన్ నివారించే హోం రెమెడీస్

Posted By:
Subscribe to Boldsky

వర్షంతో వేసవి, ఎండలు, వేడి, చెమటల నుండి కాస్త ఉపశమనం కలిగింది. అయితే వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ మాత్రం చిరాకు పెడుతాయి. చిన్న ఇన్ఫెక్షన్సే అయినా, పెద్ద అనారోగ్యాలకు దారితీస్తాయి. అయితే ఇన్ఫెక్షన్స్ ను ప్రారంభ దశలోనే గుర్తించి, జాగ్రత్తలు తీసుకుంటే జబ్బు పడే అవసరం ఉండదు. వర్షాకాలంలో వాతావరణంలో మార్పులు, తేమ కారణంగా ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి.

ఇన్ఫెక్షన్ తో పాటు డేంగ్యూ, మలేరియా, చికెన్ గునియా, దగ్గు, జలుబు, పాదాలలో ఇన్ఫెక్షన్స్ మరియు కళ్ళ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. ఇవన్నీ వర్షాకాలంలో వచ్చే అత్యంత సాధారణమైన ఇన్ఫెక్షన్స్.

కళ్ళ ఇన్ఫెక్షన్స్, కళ్ళ వాపు, కళ్ళు పొడి బారడం మరియు కార్నిల్ అల్సర్ వంటివి ఇన్ఫెక్షన్ వర్షకాలంలో బాధిస్తాయి.

వర్షాకాలంలో కళ్ళ ఇన్ఫెక్షన్ నివారించే హోం రెమెడీస్

వర్షకాలంలో పరిశుభ్రతను పాటించాలి, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వర్షాకాలంలో పరిశుభ్రతను పాటించడం వల్ల కంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇంటి నుండి బయటకు వెళ్ళే సమయంలో కళ్ళ జోడు పెట్టుకోవడం మంచిది. అలాగే కళ్ళను అస్తమానం చేత్తో తాకకుండా ఉండటం మంచిది. ఇంకా కళ్ళ ఇన్ఫెక్షన్స్ నివారించుకోవడానికి కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

కళ్ల ఆకారం చెప్పె ఆశ్చర్యకర అంశాలు

కళ్ళ ఇన్ఫెక్షన్ నివారించడంలో హోం రెమెడీస్ బాగా సహాయపడుతాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వర్షాకాలంలో కళ్ళ ఇన్ఫెక్షన్ నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ గురించి తెలుసుకుందాం..

1. కోల్డ్ కంప్రెసర్ :

1. కోల్డ్ కంప్రెసర్ :

కళ్ళకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కోల్డ్ కంప్రెసర్ వాడటం మంచిది. ఒక కాటన్ ను కోల్డ్ వాటర్ లో డిప్ చేసి, కళ్ళ చుట్టూ అప్లై చేయాలి. కొన్ని నిముషాలు అప్లై చేసిన తర్వాత మంచి ఉపశమనం కలుగుతుంది. ఒక రోజులో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

2. టీ బ్యాగ్స్ :

2. టీ బ్యాగ్స్ :

కళ్ళకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు చమోమెలీ టీ బ్యాగ్స్ ను కళ్ళకు అప్లై చేయడం వల్ల స్మూత్ ఎఫెక్ట్ కలుగుతుంది. చమోమెలీ టీ బ్యాగ్స్ ను ఫ్రిజ్ లో కొన్ని గంటల పాటు పెట్టి, తర్వాత బయటకు తీసి 5 - 10 నిముషాలు కళ్ళ మీద ఉంచాలి. ఈ పద్దతిని రోజుకు నాలుగు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

కళ్లు హెల్తీగా..ఫ్రెష్ గా..అందంగా కనబడటానికి సింపుల్ హోం రెమెడీస్

3. సాల్ట్ వాటర్ :

3. సాల్ట్ వాటర్ :

నీళ్ళు మరియు ఉప్పు, ఈ రెండింటి కాంబినేషన్ కళ్ళ ఇన్ఫెక్షన్, కళ్ళ దురదను తగ్గించడానికి సహాయపడుతుంది. నీళ్ళలో సాల్ట్ మిక్స్ చేసి ఆ నీటితో కళ్ళను కడుక్కోవడం వల్ల స్కిన్ ఇరిటేషన్, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఉప్పు యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఒక కప్పు డిస్టిల్డ్ వాటర్లో ఉప్పు మిక్స్ చేసి, ఆ నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవాలి.

4. గ్రీన్ టీ :

4. గ్రీన్ టీ :

గ్రీన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి కళ్ళ ఇన్ఫెక్షన్ దూరం చేస్తాయి. రెండు గ్రీన్ టీ బ్యాగ్స్ ను బాయిల్ చేసి, ఆ నీటిని చల్లార్చాలి. తర్వాత ఆ నీటితో కళ్ళను రోజుకు రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి.

5. అలోవెర :

5. అలోవెర :

అలోవెరలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది. దురదను తగ్గిస్తుంది.

వందేళ్ళ కంటి చూపుకోసం తినండి విటమిన్ రిచ్ ఫుడ్స్

6. కీరదోసకాయ:

6. కీరదోసకాయ:

కళ్ళ దురద, కళ్ళు ఎర్రబడటం, కళ్ళలో ఇన్ఫ్లమేషన్ వంటి కంటి సమస్యలను నివారించడంలో కీరదోసకాయ ఒకటి. కీరదోసకాయలో యాంటీ ఇరిటేషన్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కీరదోసకాయను గుండ్రంగా చక్రాల్లా కళ్ళ మీద పెట్టుకోవడానికి సరిపోయేలా స్లైస్ లా కట్ చేసుకోవాలి. వీటిని రెండు కళ్ళ మీద పెట్టుకుని, 10నిముషాల తర్వాత తీసేసి, కళ్ళను శుభ్రం చేసుకోవాలి. అలాగే కీరదోసకాయ పేస్ట్ ను కానీ, కీరదోసకాయ రసాన్ని కానీ కళ్ళకు అప్లై చేయడం వల్ల నొప్పి, దురద తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల కళ్ళకు ఉపశమనం కలుగుతుంది.

7. మెంతులు :

7. మెంతులు :

మెంతులను నీళ్ళలో నానబెట్టి, మెత్తగా పేస్ట్ చేసి, ఈ పేస్ట్ ను కళ్ళ మీద అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల కళ్ళు ఎర్రబడటం తగ్గుతుంది, దురద, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.

English summary

Home Remedies For Eye Infections During Monsoon

Conjunctivitis, swelling of the eyes, stye, dry eyes and corneal ulcer are few of the major eye infections that can be caused during the monsoon season. Listed in this article are a few of the best home remedies to treat eye infections during the monsoon season. Take a look.
Story first published: Monday, June 26, 2017, 16:20 [IST]
Subscribe Newsletter