పీరియడ్స్ లో నొప్పి తగ్గించడానికి ఈ చిట్కాను బొడ్డుకు ఉపయోగించండి

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మహిళలుగా, మనలో చాలా మంది ప్రతి నెల అనుభవించే భయంకరమైన ఋతుస్రావం నొప్పి గురించి తెలిసే ఉంటుంది, అవునా?

పీరియడ్స్ కలిగి ఉన్న రోజులలో చాలామంది మహిళలకు చాలా అసౌకర్యంగా ఉండును మరియు వారి రోజువారీ కార్యకలాపాలను (పనులను) సులభంగా కొనసాగించలేకపోవచ్చు.

బీట్ రూట్ జ్యూస్ తో పీరియడ్స్ సమస్యలకు చెక్..

వాస్తవానికి, ఒక స్త్రీ పీరియడ్స్ కి గురైనప్పుడు, ఒక ఆడదాని గా పుట్టకూడదని చాలా సార్లు కోరుకొనే వారు మొదటి స్థానంలో ఉన్నారు, ఎందుకంటే ఆ సమయంలో వచ్చే నొప్పిని వారు భరించలేక.

Home Remedy On Your Bellybutton

అయితే, ఒక మానవుడు అనుభవించే ఇతర సహజ శరీర ప్రక్రియల మాదిరిగానే, ఋతుస్రావం నుండి కూడా తప్పించుకొలేకపోయారు.

ఋతుస్రావం ప్రతి మహిళ అనుభవిస్తుంది, ఆమె యుక్త వయస్సు ప్రారంభంలో నుండి ఆమె రుతువిరతి వరకు ఒక సహజమైన శరీర ప్రక్రియగా వర్ణించవచ్చు.

ఒక మహిళ గర్భవతి కాకపోయినా, గర్భాశయ గోడ తొలగిపోవడం వల్ల, ఆమె యోని నుండి ప్రతి నెల కనీసం 4-5 రోజులు రక్తస్రావం జరుగుతూ ఉంటుంది.

ఋతుస్రావం సమయంలో, గర్భాశయ గోడల యొక్క వాపును కలిగించే హార్మోన్ల మార్పులు శరీరంలో చోటు చేసుకుంటాయి, దీని వలన ఆ ప్రాంతంలో నొప్పి మరియు అసౌకర్యం చాలా ఎక్కువగా ఉండిపోతాయి.

Home Remedy On Your Bellybutton

చాలామంది మహిళలు ఆ భరించలేని నొప్పిని అనుభవిస్తారు మరియు మరి కొంతమంది ఆ నొప్పిని తగ్గించేందుకు నివారణ చర్యలను ఆశ్రయించారు, ఇది వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

అంతేకాకుండా, వారి శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం కారణంగా, అనేక మంది మహిళలలో ఆకలి ఎక్కువగా ఉండటం, మానసిక కల్లోలం, అలసట మరియు సాధారణ బలహీనత వంటి లక్షణాలను అనుభవిస్తారు.

అనేక సార్లు, ఋతుస్రావం నొప్పిని భరించలేని మహిళలు ​​పెయిన్ కిల్లర్స్ వంటి మాత్రలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, అది ఆరోగ్యానికి హానికరమని గుర్తించండి.

కాబట్టి, ఇక్కడ చెప్పబడిన కొన్ని ఇంటి చిట్కాలు మీకు పీరియడ్స్ కారణంగా వచ్చే నొప్పిని తగ్గించటంలో సహాయపడుతుంది.

మెనుష్ట్రువల్ పెయిన్ తగ్గించడానికి ఒకే ఒక్క నేచురల్ రెమెడీ..!

కావలసిన పదార్ధాలు :

ఆల్కహాల్ (ప్రాధాన్యత కలిగిన వోడ్కా లేదా బ్రాందీ) - 4 టేబుల్ స్పూన్లు

లావెండర్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్

ఈ చిట్కాను - మీ ఇంటిలోనే, పైన చెప్పిన పదార్థాలను సరైన పరిమాణంలో తీసుకుని, సరైన పద్ధతిలో ఉపయోగించడం వల్ల ఈ సహజ నివారిణి, ఋతుస్రావం కలిగే నొప్పిని తగ్గించడానికి చాలా సహాయపడుతుంది.

Home Remedy On Your Bellybutton

మొదటి నెలలో ఈ పరిహారాన్ని ఉపయోగించడం వల్ల మీరు అనుభవించే నొప్పిలో ఎలాంటి తేడాను గుర్తించకపోయినా, మీరు సహనంగా ఉండటమనేది చాలా కీలకం. ఎందుకంటే ఈ పరిహారాన్ని రెండవసారి ఉపయోగించినప్పటి నుండి నెమ్మదిగా పని చేస్తుంది.

ఈ చిట్కాని పాటించినప్పుడు, మీలో తాపజనక పదార్థాలైన నూనెలో బాగా వేయించిన (లేదా) బాగా కారంగా ఉన్న అల్పాహారాలను తీసుకోవడం మాని వేయండి, ఎందుకంటే అవి తిమ్మిర్లు కలిగించేందుకు హానికరమైనదిగా ఉంటుంది.

ఇంకా అదనంగా, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన శరీరంలో హార్మోన్ల సమతుల్యంగా ఉండి ఆ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.

ఆల్కహాల్ మరియు లావెండర్ ఆయిల్ అనే ఈ రెండు కూడా గర్భాశయం చుట్టూ ఉన్న వాపు వల్ల వచ్చే మంటను (నొప్పిని) తగ్గించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి, తద్వారా అవి ఈ నొప్పిని అరికడతాయి.

ఆల్కహాల్ మరియు లావెండర్ ఆయిల్స్ లో గల ఎంజైమ్లు, చర్మం ద్వారా గర్భాశయం యొక్క బయటి పొరను చేరుకొని, నొప్పిని తగ్గించటానికి సహాయం చేస్తాయి.

ఉపయోగించే పద్ధతి:

మొదట లావెన్డేర్ నూనెని బొడ్డు చుట్టూ ఉన్న ప్రాంతంలో కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేస్తూ ఉండండి.

ఆ తరువాత, మద్యంతో కూడా అదే విధానాన్ని పునరావృతం (మళ్లీ) చెయ్యండి.

మీ బొడ్డులో ఈ పదార్ధాలను దూదిని ఉపయోగించటం ద్వారా అప్లై చేయాలి.

మీరు ఋతుస్రావాన్ని ఎదుర్కొన్న ప్రతిసారీ ఇదే పద్ధతిని అనుసరించడం వల్ల మీకు ఆ నొప్పినుండి విముక్తి లభిస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Apply This Home Remedy On Your Bellybutton To Reduce Menstrual Pain!

    During menstruation, a lot of hormonal changes occur in the body that can cause inflammation of the uterine walls, as it is ready to shed, thus causing a lot of pain and discomfort in the lower abdominal region.
    Story first published: Sunday, October 1, 2017, 10:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more