ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కు చెక్ పెట్టేయండి ఇలా!

Posted By: Bharath
Subscribe to Boldsky

సీజన్ మారితే చాలు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ప్రతాపం చూపిస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ కు గురైతే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ఇన్ఫెక్షన్‌ బారి నుంచి దూరంగా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలామంచిది. ఈ ఇన్ఫెక్షన్స్ కు కొన్ని రకాల హోం రెమిడీస్ ఉపయోగించడం ద్వారా త్వరగా నయం అవుతాయి. మరి ఆ సూచనలు ఏమిటో ఒక్కసారి చూద్దామా.

1. కోల్డ్ కంప్రెస్

1. కోల్డ్ కంప్రెస్

దద్దుర్లు బొబ్బలుగా మారి ఉంటే మీరు కోల్డ్ కంప్రెస్ ద్వారా మంచి ఉపశమనం పొందొచ్చు. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి. అందులో ఐస్ ముక్కలను నింపండి. ఆ కవర్ ను ఒక తడిగుడ్డలో ఉంచండి. దాని ద్వారా 10 నుంచి 15 నిమిషాల పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన చోట మసాజ్ మాదిరిగా చేస్తూ ఉండాలి. ఒకవేళ అలా చేస్తున్నప్పుడు మీకు తిమ్మిర్లు వస్తూ ఉంటే మాత్రం వెంటనే ఆపేయండి. ఇలా చేయడం వల్ల ఈజీగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కు దూరం కావొచ్చు.

2. వేప

2. వేప

చర్మానికి సంబంధించిన దద్దుర్లకు వేప బాగా పని చేస్తుంది. ఒక గిన్నెలో నీరు తీసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించండి. పది నిమిషాల పాటు ఆ నీటిని మరిగించండి. దీంతో ఆకుల్లోని ఔషధ గుణాలన్నీ నీటిలో కలిసిపోతాయి. ఆ నీటిని మీరు స్నానానికి ఉపయోగించే నీటిలో కలపుకుని స్నానం చేయండి. వేపలోని యాంటీమైక్రోబయాల్ లక్షణాలు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేకంగా పోరాడగలవు.

3. కలబంద

3. కలబంద

కలబందలోనూ చాలా ఔషధ గుణాలుంటాయి. చర్మంపై ఉండే దద్దుర్ల నుంచి ఉపశమనం పొందేందుకు కలబంద బాగా ఉపయోగపడుతుంది. కలబంద రసాన్ని మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన చోట పూయండి. అరగంట పాటు అలాగే ఉంచండి. రోజుకు ఇలా 2 నుంచి 3 సార్లు చేయండి. కలబందలో మాగ్యుస్, లాక్టోస్, స్టెరాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ వ్యాధుల నివారణకు బాగా ఉపయోగపడతాయి. అందువల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మీరు త్వరగా ఉపశమనం పొందొచ్చు.

4. ఆపిల్ సైడర్ వినెగర్

4. ఆపిల్ సైడర్ వినెగర్

ఇది మనకు బాగా తెలిసిన ఔషధం. దీన్ని మీరు అన్ని రకాల చర్మవ్యాధులకు ఉపయోగించొచ్చు. యాపిల్ సైడర్ వినెగర్ లో ఉండే రసాయనాలు చర్మ సంరక్షణకు బాగా ఉపయోగపడతాయి. కాస్త పత్తి తీసుకుని ఆపిల్ సైడర్ వినెగర్ లో ముంచి దాంతో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న చోట అప్లై చేయండి. ఆపిల్ సైడర్ వినెగర్ లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీకు వెంటనే ఉపశమనం కలుగుతుంది.

English summary

home remedies to treat fungal infections during monsoon

Medically termed dermatitis, skin rashes may be caused by fungal growth due to the humidity in the weather.
Story first published: Wednesday, November 22, 2017, 12:00 [IST]
Subscribe Newsletter