For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సర్జరీ లేకుండానే.. కిడ్నీల్లో ఆ రాళ్లను తొలగించుకోవొచ్చు

కిడ్నీ స్టోన్స్, కిడ్నీల నొప్పి అనే స‌మ‌స్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. అయితే 5 ఎంఎం క‌న్నా త‌క్కువ సైజ్‌లో ఉండే రాళ్లను సుల‌భంగా క‌రిగించుకోవ‌చ్చు. మరి అది ఎలాగో మీరూ తెలుసుకోండి.

By Bharath
|

కిడ్నీ స్టోన్స్, కిడ్నీల నొప్పి అనే స‌మ‌స్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. అయితే 5 ఎంఎం క‌న్నా త‌క్కువ సైజ్‌లో ఉండే రాళ్లను సుల‌భంగా క‌రిగించుకోవ‌చ్చు. రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి. ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా రక్తంలో కాల్షియం, ఫాస్పేట్, యూరిక్ యాసిడ్ లవణాలు అధికం కావడం వలన మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి.

కొన్ని సందర్భాల్లో మూత్ర వ్యవస్ధలో ఇన్ ఫెక్షన్ కారణంగా స్టోన్స్ ఏర్పడతాయి. మూత్రపిండాలు, మూత్ర నాళము, మూత్రాశయ భాగాల్లో ఎక్కువగా ఈ రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయి. దీంతో బ్యాక్ సైడ్ నొప్పి వస్తుంది. ఒక్కోసారి దీన్ని భరించలేము. అయితే కొన్ని రకాల టిప్స్ పాటిస్తే త్వరగా రాళ్లను కరిగించి, కిడ్నీ పెయిన్ ఏర్పడకుండా చేసుకోవొచ్చు. మరి ఆ టిప్స్ ఏమిటో మీరూ చూడండి.

1. హైడ్రేటెడ్ గా ఉండండి

1. హైడ్రేటెడ్ గా ఉండండి

బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుకోండి. నీరు ఎక్కువగా తాగుతూ ఉండండి. దీంతో మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. మీరు 160 పౌండ్లు బరువు ఉంటే, కనీసం 80 ఔన్సుల నీరు తాగాలి. టీ, కాఫీలాంటివి తాగకపోవడం మంచిది.

నీరు శరీరంలోని ఉప్పు, యాసిడ్ స్ధాయిలను సమన్వయపరచగలదు. శరీరానికి 8 నుంచి 10 గ్లాసుల నీరు సరిపోతుంది. నీరు తక్కువగా తీసుకోకూడదు.

2. నిమ్మ రసం

2. నిమ్మ రసం

నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. నిమ్మలో ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది. ఇది మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించడానికి బాగా పని చేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో 4 స్పూన్ల నిమ్మరసం కలిపి తాగడం చాలా మంచిది. అలాగే ఆలివ్ నూనెలో కాస్త నిమ్మరసం కలిపి తాగినా మంచి ప్రయోజనం ఉంటుంది.

3. ప్రోబయోటిక్స్

3. ప్రోబయోటిక్స్

ప్రోబయోటిక్స్ కూడా కిడ్నీలకు సంబంధించిన నొప్పి తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. ప్రతి రోజూ వీటిని తీసుకుంటూ ఉండాలి. దీంతో జీర్ణవ్యవస్థ మెరగువుతుంది. అలాగే మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించడానికి కూడా ప్రోబయోటిక్స్ బాగా ఉపయోగపడతాయి.

4. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి

4. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి

రోజూ ఆరోగ్యకరమైన ఆహారం తింటే చాలా మంచిది. పుచ్చకాయ, ఆపిల్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఆలివ్ నూనె వంటివి మీ రెగ్యులర్ ఆహారాల్లో భాగం కావాలి. వీటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే బెర్రీస్ కూడా ఎక్కువగా తినాలి.

5. డాండెలైన్ టీ

5. డాండెలైన్ టీ

డాండెలైన్ టీ మీకు ఎక్కువ మూత్రవిసర్జన వచ్చేలా చేస్తుంది. మీమూత్రపిండాల్లోని మలినాలను బయటకు పంపేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. కిడ్నీలు ఇన్ ఫెక్షన్స్ బారిన పడకుండా, కిడ్నీల్లోని రాళ్లను కరిగించడానికి ఈ టీ బాగా ఉపయోగపడుతుంది.

6. పుచ్చకాయ విత్తనాల టీ

6. పుచ్చకాయ విత్తనాల టీ

పుచ్చకాయ విత్తనాలు కూడా కిడ్నీల ఆరోగ్యానికి చాలా మంచిది. దీని ద్వారా మూత్రవిసర్జన ఎక్కువగా అవుతుంది. దీంతో మూత్రపిండాల్లోని రాళ్లు కరిగిపోతాయి. అందువల్ల పుచ్చకాయ విత్తనాల ద్వారా తయారు చేసే టీని రెగ్యులర్ గా తాడం మంచిది.

7. సెలెరీ విత్తనాల టీ

7. సెలెరీ విత్తనాల టీ

మూత్రపిండాల్లోని వ్యర్థాలను తొలగించేందుకు ఈ టీ కూడా బాగా పని చేస్తుంది. కిడ్నీల పని తీరు మెరుగుపరిచేందుకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల దీన్ని కూడా రెగ్యులర్ గా తాగుతూ ఉండడం మంచిది.

8. మొక్కజొన్న సిల్క్ టీ

8. మొక్కజొన్న సిల్క్ టీ

ఇది కూడా కిడ్నీలకు సంబంధించిన ఇన్ ఫెక్షన్స్ ను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. దీన్నే కార్న్ సిల్క్ టీ అంటారు. మూత్రపిండాలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులను ఇది నయం చేయగలుగుతుంది.

9. కొత్తిమీర టీ

9. కొత్తిమీర టీ

కొత్తిమీర టీ కూడా మూత్రపిండాల సమస్యను బాగా పరిష్కరించగలదు. కొత్తిమీర టీ వల్ల మూత్రవిసర్జన బాగా అవుతుంది. ఫలితంగా కిడ్నీల్లోని వ్యర్థ్యాలు మొత్తం కూడా బయటకు వెళ్లి పోతాయి. ఇది యాంటీ వైరల్ గా పని చేస్తుంది.

10. క్యాబేజీ ఆకుల పౌల్టీస్

10. క్యాబేజీ ఆకుల పౌల్టీస్

క్యాబేజీ కూడా కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను బాగా నయం చేయగలదు. క్యాబేజీ పౌల్టీస్ తయారు చేసుకుని తీసుకోవడం వల్ల త్వరగా కిడ్నీ వ్యాధులు నయం అవుతాయి. క్యాబేజ్ ఆకులు, తరిగిన ఉల్లిపాయలతో, బ్రాన్, నీరు తదితర వాటితో దీన్ని తయారు చేసుకోవొచ్చు.

11. మార్ష్ మల్లో రూట్

11. మార్ష్ మల్లో రూట్

మార్ష్ మల్లో రూట్ కూడా మూత్రవిసర్జనకు బాగా ఉపయోగపడుతుంది. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తేనే, నీటితో కలిపి తీసుకుంటే మంచిది.

12. మెగ్నీషియం, ఆముదంతో తయారు చేసే ప్యాక్

12. మెగ్నీషియం, ఆముదంతో తయారు చేసే ప్యాక్

ఇది మూత్రపిండాల నొప్పిని వెంటనే తగ్గించగలదు. ఒక ఉలెన్ క్లాత్ తీసుకుని ఆముదంలో ముంచండి. దాన్ని కొద్ది సేపు అలాగే ఉంచండి. తర్వాత నొప్పి ఉండే ప్రాంతంలో దాన్ని పెట్టుకోండి. ఇందులో ఇంకో ప్రక్రియ కూడా ఉంది. అలాగే ఎప్సోమ్ సాల్ట్ ద్రావణంలో ఉలెన్ క్లాత్ ను ముంచి కూడా నొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టుకుంటే చాలా మంచిది.

13. అరటికాయ

13. అరటికాయ

అరటి పండుకాకుండా అరటి కాయ మూత్రపిండాలకు సంబంధించిన నొప్పిని, రాళ్లను కరిగించడానికి బాగా ఉపయోపడుతుంది. దీనిలో యాంటీబాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దీన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మంచిది.

14. ఉవా ఉర్సీ

14. ఉవా ఉర్సీ

దీన్ని బేర్ బెర్రీ అని కూడా అంటారు. దీన్ని తరుచుగా తీసుకుంటే మూత్ర సమస్య అనేది ఉండదు. మూత్రపిండ వ్యాధులకు కారణమయ్యే బాక్టీరియాను శరీరం నుంచి బయటకు పంపించడానికి ఇది బాగా పని చేస్తుంది.

15. ఆవాలపిండితో తయారు చేసే ప్లాస్టర్

15. ఆవాలపిండితో తయారు చేసే ప్లాస్టర్

ఆవపిండిని ఉపయోగించి తయారు చేసే ఈ ప్లాస్టర్ వల్ల కూడా త్వరగా ఉపశమనం పొందొచ్చు. ఆవపిండి, గోధుమ పిండి, గుడ్డులోని తెలుపు పదార్థాన్ని తీసుకోవాలి. వీటిని మిక్స్ చేసి పేస్ట్ ను తయారు చేసుకోవాలి. ముందుగా నొప్పి ఉండే ప్రాంతంలో వాసెలిన్ ను పూయాలి. తర్వాత మస్టర్డ్ ప్లాస్టర్ ను అప్లై చేయాలి.

English summary

home remedies to treat kidney pain

15 Effective Home Remedies To Treat Kidney Pain
Story first published:Thursday, December 7, 2017, 11:23 [IST]
Desktop Bottom Promotion