For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోకాలి నొప్పులనుండి తక్షణ ఉపశమనం కోసం ఈ హోంరెమెడీస్ ను ప్రయత్నించండి

|

మోకాలి నొప్పి అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ జీవితంలోని శారీరక ఒత్తిడి వలన లేదా స్పోర్ట్స్ఆడటం ద్వారా మోకాలి నొప్పి ఏర్పడవచ్చు.

ఇంతకు ముందు, అర్త్రైటిస్ వలన మోకాలి నొప్పి అనేది కేవలం వృద్ధులలో మాత్రమే కనిపించేది. ఈ సమస్య కీళ్ళ ద్రవాలు ఎండిపోవటంచేత తలెత్తుతుంది.

కానీ, ఈ రోజుల్లోని వృత్తి రీత్యా ఎక్కువసేపు కూర్చుని పనిచేయటం అలాగే కొన్ని అనారోగ్యకరమైన లైఫ్ స్టైల్ హేబిట్స్ వలన వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మోకాలి నొప్పి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. యువతలో కూడా ఈ సమస్య సర్వసాధారణమైపోయింది.

Home Remedies To Get Rid Of Knee Pain Fast

మోకాలి కీళ్లు అనేవి మొత్తం శరీర బరువును బాలన్స్ చేయడానికి సహాయపడతాయి. శరీరంలో వీటిపాత్ర కీలకమైనది.

మోకాలి నొప్పి వలన సాధారణ రోజువారి పనులను నిర్వహించడం కూడా ఎంతో కష్టతరంగా మారుతుంది. సరైన సమయంలో ఈ సమస్యను నిర్మూలించకపోతే ఈ సమస్య దీర్ఘకాల ఇబ్బందిగా మారుతుంది.

మోకాలి నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఈ హోంరెమెడీస్ ని ప్రయత్నించండి.

#1 కేరట్స్ ని బాగా తీసుకోండి

#1 కేరట్స్ ని బాగా తీసుకోండి

చైనీయుల సాంప్రదాయ వైద్య పద్దతిలో మోకాలి వద్ద కీళ్ల నొప్పులను నయం చేయడానికి కేరట్స్ ని విరివిగా ఉపయోగిస్తారు. పోషకాలతో పాటు శరీరానికి అవసరమైన ఫైబర్ కేరట్ లో పుష్కలంగా లభిస్తుంది. తద్వారా, మోకాలి కీళ్ల నొప్పులు పూర్తిగా నయం అవుతాయి. రెండు కేరట్స్ ని తురుముకుని అందులో కొంత నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే మోకాలి నొప్పుల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కేరట్ జ్యూస్ ని తాగినా చక్కటి ఫలితం లభిస్తుంది. లిగ్మెంట్ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేరట్ చక్కటి ఔషధంగా పనిచేస్తోంది.

#2 నీళ్లను సమృద్ధిగా తీసుకోండి

#2 నీళ్లను సమృద్ధిగా తీసుకోండి

శరీరం పనితీరు సవ్యంగా ఉండేందుకు నీళ్లను సమృద్ధిగా తీసుకోవాలి. గాలి పీల్చుకోవడం ఎంత ముఖ్యమైనదో నీరు కూడా శరీరానికి అంత అవసరం. గ్లాసుడు నీళ్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. మోకాలి చుట్టూ ఉన్న కార్టిలేజ్ ను లూబ్రికేట్ చేసి మృదువుగా చేయడానికి సరైన మోతాదులో నీళ్లను తీసుకోవాలి. రక్తప్రసరణ సజావుగా సాగేందుకు అలాగే మోకాలి వరకు పోషకాలు అందేందుకు నీరు ఉపయోగపడుతుంది.

#3 ఉల్లిపాయలు

#3 ఉల్లిపాయలు

యాంటీ ఇంఫ్లేమేటరీ పదార్థాలు ఉల్లిపాయలతో సమృద్ధిగా కలవు. ఇవి మోకాలి నొప్పులను తగ్గించేందుకు తోడ్పడతాయి. అలాగే, శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పనితీరుని మెరుగుపరచడానికి దోహదపడతాయి. ఉల్లిపాయలలోనున్న సల్ఫర్ కంటెంట్ అనేది మోకాలి కీళ్ల వద్ద నున్న నొప్పులను తగ్గించేందుకు సహకరిస్తాయి.

#4 మసాజ్ చేయండి

#4 మసాజ్ చేయండి

శరీరంలోని ఒత్తిడిని తగ్గించి ఏ భాగంలోనైనా నొప్పులను తగ్గించేందుకు మసాజ్ ఉపయోగపడుతుంది. వివిధ రకాల ఔషధ నూనెలతో బామ్మా, అమ్మమ్మలు మోకాలికి మసాజ్ చేసుకోవడం మనం గమనించిన విషయమే. మసాజ్ చేయడం ద్వారా రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. అలాగే, కీళ్ల వద్ద లూబ్రికేషన్ తగిన మోతాదులో ఉంటుంది. వీటివల్ల మోకాలి నొప్పి తగ్గుముఖం పడుతుంది.

#5 యోగా

#5 యోగా

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజలు యోగా ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారు. శరీరానికి అలాగే మనసుకు ఆరోగ్యాన్ని ప్రసాదించేది యోగా. మోకాలికి అనువుగా ఉండే ఆసనాల ద్వారా మోకాలి నొప్పుల సమస్యను నివారించుకోవచ్చు. అయితే, మోకాలిపై అధిక ఒత్తిడిని కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా, మోకాలి నొప్పి నుంచి ఉపశమనం పొందండి.

#6 కొబ్బరి నూనెను అప్లై చేయండి

#6 కొబ్బరి నూనెను అప్లై చేయండి

కొబ్బరి నూనెలో లభించే ఔషధ గుణాలు వివిధరకాల ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు తోడ్పడతాయి. ఒక కప్పుడు కొబ్బరినూనెను తీసుకుని కాస్త వెచ్చగా చేసి ఈ వెచ్చటి నూనెతో మోకాలిపై మసాజ్ చేయండి. ఇలా చేస్తే, కీళ్ల వద్దకు రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

#7 బతువా ఆకులు

#7 బతువా ఆకులు

మోకాలి నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఈ రెమెడీని ప్రయత్నించండి. గుప్పెడు బతువా ఆకులను తీసుకుని వాటిని నూరి వాటినుంచి కాస్తంత రసాన్ని తీసుకోండి. ఈ రసాన్ని రోజూ పరగడుపునే తీసుకోవడం వలన మోకాలి నొప్పుల బాధ తగ్గుతుంది.

#8 పాలు మరియు పసుపు

#8 పాలు మరియు పసుపు

భారతీయ మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన పదార్థం పసుపు. ఇందులో అనేక క్రిమిసంహారక లక్షణాలు కలవు. వివిధ రకాల ఆరోగ్యసమస్యలను నివారించడానికి పసుపు అమితంగా ఉపయోగపడుతుంది. పసుపుని ప్రభావిత ప్రదేశంపై అప్లై చేయడం ద్వారా లేదా పసుపుని ఆహారంలో తీసుకోవడం ద్వారా అద్భుత ఫలితాలు పొందవచ్చు. కొన్ని టేబుల్ స్పూన్ల పసుపును ఒక గ్లాసుడు పాలలో కలిపి ప్రతి రోజూ తీసుకుంటే ఆశించిన ఫలితాలను పొందవచ్చు.

#9 మెంతిగింజల పేస్ట్

#9 మెంతిగింజల పేస్ట్

పసుపులో నున్నటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు మెంతులలో కూడా కలవు. కొన్ని టేబుల్ స్పూన్ల మెంతిగింజలను వేచుకుని వాటిని పొడిగా చేసుకోవాలి. ఆ తరువాత కొన్ని నీళ్లను వేయించిన మెంతిగింజల పొడితో కలిపి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రదేశంపై అప్లై చేస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

#10 పసుపుతో అల్లం టీ

#10 పసుపుతో అల్లం టీ

పసుపుతో పాటు అల్లంలో అద్భుతమైన యాంటీ ఇంఫ్లేమ్మెటరీ ప్రాపర్టీలు కలవు. నొప్పులను నివారించడానికి ఈ రెండూ అద్భుతంగా ఉపయోగపడతాయి. అర్త్రైటిస్ ద్వారా కలిగే నొప్పులను తగ్గించేందుకు ఈ రెండూ ప్రభావవంతంగా పనిచేస్తాయి. పసుపులోనున్న కుర్కుమిన్ అనే పదార్థం నొప్పులను నివారించేందుకు తోడ్పడుతుంది. మూడు కప్పుల నీళ్ళల్లో కొంత అల్లాన్ని కొంత పసుపుని కలిపి మరిగించుకోవాలి. ఈ నీటిని తాగి మంచి ఫలితాలను పొందవచ్చు.

#11 ఎప్సమ్ సాల్ట్

#11 ఎప్సమ్ సాల్ట్

కాళ్ళనొప్పులను తగ్గించుకోవటం కోసం ఎప్సమ్ సాల్ట్ వాటర్ లో కాసేపు కాళ్లను ముంచి ఉంచే టెక్నిక్ వలన ఉపశమనం కలిగి ఉండటం మీరు గమనించే ఉంటారు. ఇదే చిట్కాను మోకాలికి పాటించాలి. ఎప్సమ్ సాల్ట్ లో మెగ్నీషియం అధిక మోతాదులో లభిస్తుంది. ఇది, దీర్ఘకాలిక మోకాలి నొప్పిని సత్వరమే మాయం చేస్తుంది. సమర్థవంతమైన ఫలితాల కోసం ప్రభావిత ప్రదేశాన్ని ఎప్సమ్ సాల్ట్ వాటర్ లో పదిహేను నుంచి ముప్పై నిమిషాల వరకు మునిగేలా చూడాలి.

#12 తీసుకునే ఆహారంలో మెగ్నీషియం మోతాదుని పెంచండి

#12 తీసుకునే ఆహారంలో మెగ్నీషియం మోతాదుని పెంచండి

శరీరంలోని బయోకెమికల్ రెస్పాన్సులని తగ్గించే గుణం మెగ్నీషియంలో కలదు. ఈ విధంగా నొప్పి కలిగే ప్రదేశాన్ని మొద్దుబారేలా చేసి తద్వారా మోకాలి వద్ద దీర్ఘకాల నొప్పిని తగ్గించేలా చేస్తుంది. నాడులు మరియు కండరాలు రిలాక్స్ అవడానికి కూడా మెగ్నీషియం తోడ్పడుతుంది. ఎముకల సాంద్రతను మెరుగుపరచి శరీరంలోని ఎముకలన్నిటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

13. వర్జిన్ ఆలివ్ ఆయిల్

13. వర్జిన్ ఆలివ్ ఆయిల్

కీళ్ళకు తగిన మోతాదులో లూబ్రికేషన్ ను అందించి బాధాకరమైన ప్రాంతానికి ఉపశమనం కలిగిస్తుంది. ఓలియోకేంతల్ అనే పదార్థాన్ని కలిగి ఉండటం వలన ఆలివ్ ఆయిల్ అనేది నొప్పులను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

#14 దండేలియన్ లీవ్స్

#14 దండేలియన్ లీవ్స్

దండేలియన్ లీవ్స్ తో ఆడుకోవడం మనలో చాలా మందికి నచ్చే అంశం. అయితే, ఈ ఆకులలో దీర్ఘకాలిక నొప్పులను తగ్గించే లక్షణం ఉందన్న విషయం తెలుసుకోవాలి. ఈ ఆకులలో లభించే విటమిన్స్ ఏ తో పాటు విటమిన్ సి అనేది దెబ్బతిన్న టిష్యూలను బాగుచేయడానికి పనికి వస్తాయి. ఈ ఆకులలో యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీలు కూడా కలవన్న విషయం గుర్తించాలి. అందువల్ల, దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఈ ఆకులు ఉపశమనం కలిగిస్తాయి.

#15 బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్ డ్రింక్

#15 బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్ డ్రింక్

మొలాసిస్ లో ఆరోగ్యాన్ని సంరక్షించే మెగ్నీషియం, కాల్షియం, పొటాషియంలు పుష్కలంగా లభిస్తాయి. అర్త్రైటిస్ కి సంబంధించిన సమస్యలను తగ్గించడంతో పాటు నాడీపనితీరుని సరిచేయడానికి అలాగే ఎముకలను దృఢంగా ఉంచడానికి ఈ పోషకాలు ఉపయోగపడతాయి. రెండు కప్పుల నీళ్లను తీసుకుని అందులో రెండు టీస్పూన్ల మొలాసిస్ ను కలిపి పానీయాన్ని తయారుచేసుకోవాలి. ఈ పానీయాన్ని రోజూ తీసుకోవడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.

16. వైట్ విల్లో టీ

16. వైట్ విల్లో టీ

వైట్ విల్లోని సహజసిద్ధమైన ఆస్ప్రిన్ గా పేర్కొంటారు. ఎందుకంటే, వైట్ విల్లోలో పెయిన్ రిలీవింగ్ ప్రాపర్టీస్ పుష్కలంగా కలవు. ఇందులోనున్న సలిసిన్ అనే పదార్థం వలన దీనికి పెయిన్ రిలీవింగ్ లక్షణాలు వచ్చాయి. కొన్ని కప్పుల నీళ్లను మరిగించి అందులో 3 టీస్పూన్ల వైట్ విల్లో బార్క్ పౌడర్ ని కలిపి టీ ని తయారుచేయండి. ఈ టీని రోజుకు రెండు సార్లు తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

#17 వ్యాయామం

#17 వ్యాయామం

కొన్ని తేలికపాటి వ్యాయామాలతో మోకాలి నొప్పిని తగ్గించుకోవచ్చు. అయితే, మోకాలిపై ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకోవడం మంచిది. మోకాలి కీళ్లలో స్టిఫ్ నెస్ తో పాటు నొప్పిని తగ్గించగల సామర్థ్యం వ్యాయామానికి కలదు. వీటితో పాటు, వ్యాయాయం వలన అదనపు బరువు కూడా తగ్గుతుంది. ఫలితంగా, మోకాలిపై ఒత్తిడి తగ్గి మోకాలి నొప్పులు తగ్గుముఖం పడతాయి.

#18 పెప్పెర్మింట్ మరియు యూకలిఫ్టస్ ఆయిల్

#18 పెప్పెర్మింట్ మరియు యూకలిఫ్టస్ ఆయిల్

యూకలిఫ్టస్ లో నొప్పిని తగ్గించే గుణాలు కలవు. ఈ గుణాలు దీర్ఘకాలిక మోకాలి నొప్పులను తగ్గించడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అలాగే, మోకాలి వద్దనున్న అసౌకర్యం కూడా తొలగిపోతుంది. ఈ ఆయిల్స్ ని తరచూ వాడితే సమర్థవంతమైన ఫలితాలను పొందవచ్చు.

#19 ఖర్జూర పండు

#19 ఖర్జూర పండు

ఖర్జూర పండులో ఏ, బీ, సి విటమిన్లు పుష్కలంగా కలవు. అలాగే, ఐరన్ తో పాటూ ఫాస్ఫరస్ అనే మినరల్స్ కూడా కలవు. అందుచేత, ఒత్తిడిని తగ్గించడంతో పాటు మోకాలి నొప్పులను తగ్గించేందుకు రోజూ కొన్ని ఖర్జూర పళ్లను తీసుకుంటే మంచిది.

#20 జునిపెర్ బెర్రీ టీ

#20 జునిపెర్ బెర్రీ టీ

ఇందులో లభించే టెర్పినేన్-4-ఆల్ అనే పదార్థానికి ఒత్తిడిని అలాగే బాధను తగ్గించే స్వభావం కలదు. తరచూ ఈ టీని తీసుకోవడం వలన మోకాలి వాపు వలన కలిగే అసౌకర్యం తగ్గుతుంది. గర్భిణీలు మాత్రం దీనిని తీసుకోకూడదు.

ఇవన్నీ చిన్నపాటి నుంచి దీర్ఘకాలిక మోకాలి నొప్పులను తగ్గించేందుకు ఉపయోగపడే సహజసిద్ధ నివారణ పద్ధతులు.

ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి!

ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ ప్రియమైన వారికి షేర్ చేయండి.

English summary

Home Remedies To Get Rid Of Knee Pain Fast

Home Remedies To Get Rid Of Knee Pain Fast, The knee is one of the most complex joints in the body and literally supports the whole body and helps in balance. Knee pain can bring a lot of inconvenience to one's life and if not treated early, it can become a chronic issue. Here are some interesting and helpful home reme
Desktop Bottom Promotion