For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నవరాత్రుల సమయంలో షుగర్ లెవల్స్ ఎలా కంట్రోల్ చేయాలి?

  By Madhavi Lagishetty
  |

  దేవీ నవరాత్రులకు కౌన్ డౌన్ షురూ అయ్యింది. నవరాత్రులను హిందువులు అతిపెద్ద పండగగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తుంటారు. దుర్గాదేవీని ఒక్కోరూపంలో ఊహించుకుంటూ పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు నవరాత్రుల్లో ఉపవాసానికి ఎక్కువ ప్రధాన్యత ఇస్తుంటారు. ఈ తొమ్మిది రోజులు ఉపవాస దీక్షను చేపట్టి దుర్గామాతను పూజిస్తుంటారు.

  పురాణాల ప్రకారం..ఉపవాసం అనేది ఒక వ్యక్తికి హార్ట్ అండ్ సోల్ వంటిది. ఉపవాసం ఆత్మను శుద్ధి చేస్తుంది. ఆధ్యాత్మిక ప్రయోజనాలను పక్కనపెట్టినట్లయితే..ఉపవాసం ఆధ్యాత్మికంగానే కాదు...ఆరోగ్యపరంగానూ ఎంతో మేలు చేస్తుంది. ఉపవాసం వల్ల జీర్ణకోశం శుభ్రపడటమే కాదు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా జీర్ణశయానికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. రక్తంలో షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్లో ఉండటంతోపాటు.. శరీరంలోని గ్యాస్ ను తగ్గిస్తుంది. మెంటల్ క్లారిటీతో పాటు శరీరాన్ని తేలికగా ఉంచుతుంది. నోట్లో నుంచి స్వచ్చమైన శ్వాసను అందిస్తుంది. ఫలితంగా ఆరోగ్యాన్ని మొత్తం కూడా కాపాడుతుంది. ఉపవాస సమయంలో ముఖ్యంగా బరువు చాలా వరకు తగ్గిపోవడంతోపాటు... తొమ్మిది రోజుల పాటు నిరంతరమైన కఠిన ఉపవాసం చేస్తే రక్తంలో షూగర్ లెవల్స్ చాలావరకు తగ్గిపోతాయి.

  రక్తంలో షుగర్ లెవల్స్ ఎందుకు ముఖ్యమైనవి?

  రక్తంలో గ్లూకోజ్ స్థాయి జీవి రక్తంలోని గ్లూకోజ్ మొత్తం కూడా తీసుకునే ఆహారాన్ని తేలికగా జీర్ణం అయ్యేందుకు సహాయపడతాయి. గ్లూకోజ్ రూపంలో రక్తం ట్రాన్స్ పోర్ట్ చేయబడుతుంది.

  శరీరం యొక్క ప్యాంక్రియాస్ ఉత్పత్తి...హార్మోన్ శక్తిని విడుదల చేయడానికి ఇన్సులిన్ గ్లూకోజ్ తో కలిసి పనిచేస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్ 90-130mg/ డెసిలీటర్ ఉంది. అయితే ఫాస్టింగ్ సమయంలో రక్తంలో చక్కెర స్థాయి పడిపోవడంతో వీక్ గా తయారవుతారు.

  షుగర్ స్థాయిని ఎలా మ్యానేజ్ చేయాలి?

  షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలను పాటించి నవరాత్రి తర్వాత కూడా ఆనందంగా ఉత్సాహంగా ఉండండి.

  1. ఆహారాలు కొద్దిగా తీసుకోవాలి:

  1. ఆహారాలు కొద్దిగా తీసుకోవాలి:

  ప్రతి రెండు మూడు గంటలకొకసారి ఆహారం తీసుకోవడం మంచిది. రోజులో అప్పుడప్పుడు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం వల్ల మెటబాలిక్ రేటు క్రమబద్దంగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ మ్యానేజ్ చేయవచ్చు. పెరుగు, స్మూతీస్ మరియు పండ్లు వంటివి శరీరానికి సరిపడా శరీరానికి కావల్సిన గ్లూకోజ్ లెవల్స్ ను ఫుల్ ఫిల్ చేస్తాయి.

  2. వెజిటేబుల్స్ ను జోడించాలి:

  2. వెజిటేబుల్స్ ను జోడించాలి:

  నవరాత్రుల్లో ఎక్కువగా సగ్గుబియ్యం,బంగాళదుంపలను ఉపయోగిస్తుంటారు. వీటితో పాటు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అయిన ఆకుకూరలు, క్యాబేజ్, క్యాప్సికమ్ వంటి ఫైబర్ ఫుడ్స్ ను రోజువారి ఆహారాల్లో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ న్యూట్రీషియన్స్ అందుతాయి.

  3. అమర్నాథ్...

  3. అమర్నాథ్...

  అమరనాథ్ అనేది మాంసక్రుష్ణ రహిత సూపర్-ప్రోటీన్. ఉపవాస సమయంలో ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది పాలతోగానీ కూరగాయాలతోగానీ తీసుకోవచ్చు. రుచికరమైన డాలియాగా తీసుకోవచ్చు.

  రెండోరోజు బ్రహ్మదర్శినిగా దుర్గమ్మ దర్శనం, అవతారం వెనక సీక్రెట్స్..!

  4. పండ్లు మరియు నట్స్...

  4. పండ్లు మరియు నట్స్...

  ఉపవాసం ఉండేవారు పండ్లు మరియు నట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే పండ్లు మరియు నట్స్ లో క్యాలరీలు తక్కువ ఉండటమే కాకుండా ఎక్కువ సమయం ఉండేలా చేస్తాయి. ప్రతిరోజు స్నాక్స్ గా వీటిని తీసుకోవచ్చు. రోస్టెడ్ మఖన, డేట్స్, ఆల్మండ్స్ వంటివి ఆకలిగా ఉన్నప్పుడు తీసుకోవడం మంచిది.

  5. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం...

  5. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం...

  ఫ్లూయిడ్స్ ను ఎక్కువగా మోతాదులో తీసుకోవడం మంచిది. పండ్లు లేదా కూరగాయల నుంచి తీసిన రసాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజు మొత్తం శరీరానికి మంచి ఫ్యూయల్ ను అందిస్తాయి. ఫ్యూయిడ్స్ లో షుగర్ లేదా తేనే లేదా బెల్లంను ఎక్కువగా చేర్చుకోవాలి.

  6. స్వీట్స్ ఎక్కువగా తినండి...

  6. స్వీట్స్ ఎక్కువగా తినండి...

  ఉపవాసంలో సమయంలో ఎక్కువగా ఆకలి వేస్తుంటే...స్వీట్స్ ను ఎక్కువగా తీసుకోవడం మంచింది. స్వీట్స్ మీకు శక్తిని ఇస్తాయి. కానీ తక్కువ మోతాదులో క్యాలరీలు ఉన్న స్వీట్స్ ను తీసుకోవడం మంచిది.

  English summary

  How To Manage Sugar Level During Navratri

  There are certain ways in which you can manage the sugar level during navratri. Know the details here on Boldsky.
  Story first published: Tuesday, September 5, 2017, 17:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more