Latest Updates
-
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.!
ఒక్క నెలలో ఆస్త్మా లక్షణాలను నివారించే ఈజీ హోం రెమెడీ
ఆస్త్మా లక్షణాలను నివారించే ఈజీ హోం రెమెడీ
ఆస్థమా ప్రస్తుతం ప్రపంచంలో పలువురిని వేధిస్తున్న సమస్య.ఆధునిక జీవన శైలి,కాలుష్యం కారణంగా పలువురు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందినే ఆస్తమా అంటారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులలో అలర్జీ రియాక్షన్ ద్వారా ఊపిరితిత్తులలో గాలిమార్గానికి అడ్డంకులు ఏర్పడి శ్వాసపీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.
దీనివల్ల పిల్లికూతలు, దగ్గు, ఆయాసం, ఛాతీలో నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. శ్వాసకోశమార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుచించుకపోవడం వల్ల ఆస్తమా వస్తుంది. ఇది పిల్లలలోను పెద్దవారిలోను కూడా కనిపిస్తుంది. అయితే ఇద్దరిలోనూ కారణాలు వేరువేరుగా ఉంటాయి. ఈ వ్యాధి ప్రధాన లక్షణం ఆయాసం.

ప్రపంచ గణాంకాల ప్రకారం 40 శాతం మంది ప్రజలు ఆస్త్మాతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఆస్త్మాను ప్రారంభంలో గుర్తించినట్లైతే చికిత్స సులభం అవుతుంది. ఆస్త్మాను నివారించుకోవచ్చు. ప్రారంభలో లక్షణాలు గుర్తించినట్లైతే, లక్షణాలను ప్రారంభంలో కంట్రోల్ చేయడం సులభం అవుతుంది. శ్వాసవ్యవస్థ మీద ప్రభావం చూపే ఈ ఆస్త్మా వ్యాధి శ్వాసనాళంలో మ్యూకస్ అడ్డుపడటం వల్ల శ్వాసతీసుకోవడం కష్టం అవుతుంది .
కొంత మందిలో తక్కువ ఇబ్బంది ఉంటే, కొంత మందిలో తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తుంది. ఎప్పుడూ శ్వాస అందకపోవడం జరుగతుంది, అయితే లైఫ్ స్టైల్ మార్చుకోవడం, తగిన చికిత్స తీసుకోవడం వల్ల ఆస్త్మాను నివారించుకోవచ్చు.

ఆస్తమాతో బాధపడే వారు క్రోనిక్ డిజార్డన్ ను కంట్రోల్లో ఉంచుకోవాలంటే సరైన ఆహారనియమాలను పాటించాలి. ఆరోగ్యకరమైన విటమిన్స్ ఎ, ఇ, సి మరియు బీటాకెరోటిన్ వంటివి గొప్పసహాయకారిగా పనిచేస్తాయి. ఆస్త్మాతో బాధపడే వారు ,వాటి లక్షణాలను న్యాచురల్ గా తగ్గించుకోవాలంటే అందుకు ఒక హోం మేడ్ రెమెడీ ఉంది.
కావల్సినవి
పచ్చి ఉల్లిపాయ రసం 3 టేబుల్ స్పూన్లు
తేనె 1 టేబుల్ స్పూన్
ఈ హోం మేడ్ రిసిపి ఆస్త్మాను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల ఆస్త్మా లక్షణాలను దూరం చేస్తుంది.
ఆస్త్మా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. మెడికేషన్తో పాటు ఈ న్యాచురల్ రెమెడీ కూడా ఫాలో అవ్వొచ్చు

అలాగే డైట్, వ్యాయామం ఫాలో అవ్వాలి, దాంతో ఆస్త్మా లక్షణాలను నివారించుకోవచ్చు.
ఉల్లిపయాలు పవర్ ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఇది మ్యూకస్ ను నివారిస్తుంది,. నాజల్ ట్రాక్ ను క్లీన్ చేస్తుంది. శ్వాస బాగా ఆడే విధంగా పనిచేస్తుంది.
తేనెలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి, ఇది కూడా మ్యూకస్ ను క్లియర్ చేస్తుంది. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వ్యాధినిరోధకతను పెంచుతుంది. ఆస్త్మాతో పోరాడుతుంది.
తయారీ
పైన సూచించిన పదార్థాలను తీసుకుని
బాగా మిక్స్ చేయాలి. పేస్ట్ లా తయారయ్యే వరకూ మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ ఉదయం ఒక నెలరోజులు తీసుకోవాలి.
మంచి ఫలితాలకోసం నెలపైన కూడా తీసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications