మీ మెడనొప్పిని తక్షణమే నివారించేందుకు సహాయపడే సహజసిద్ధమైన పదార్థాలు

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేసింది. మన రోజువారీ పనిలో ఎక్కువ భాగం కంప్యూటర్ల మీదనే ఆటోమేటెగా అవుతుంది. మన పని సాఫీగా కొనసాగడానికి సాధ్యమయ్యే విధంగా స్మార్ట్ ఫోన్లు మరియు ల్యాప్ ట్యాప్ ల వంటివి సులభతరంగా మారాయి.

కానీ టెక్నాలజీ దాని స్వంత సమస్యలతో మన ముందుకు వస్తుంది. కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ స్క్రీన్ వద్ద నిరంతరంగా కనిపించే దృశ్యాలు, మీ కళ్ళును పొడిగాను మరియు చూపు మందగించడాన్ని కలిగిస్తాయి. ఇలా మన చూపును మాత్రమే కాకుండా, మన మెడని కూడా చాలా దెబ్బతీస్తోంది. ఇది మెడ నొప్పితో, "గొంతు-నొప్పిగా" కూడా పిలువబడుతుంది.

మన మెడ చాలా మృదువైనది, కానీ అధిక శ్రమకు మరియు ఒత్తిడికి కూడా గురయ్యే అవకాశం ఉంది. అక్షరాలా చెప్పాలంటే, ఇలా మన తల యొక్క అధికమైన భారాన్ని ఏడు వెన్నుపూసల వరుస క్రమం పై పడేటట్లుగా మద్దతును ఇస్తుంది. అలా వాటి ఎముకలకు మధ్య గల పీచు మృదులాస్థి అనే పదార్థం షాక్ను తట్టుకొనే శోషక చర్యగా పనిచేస్తుంది. వాటికి సంబంధించిన నరాలు మెడ గుండా ప్రసరించేవి చాలా ఉన్నాయి.

Natural Ingredients To Help Relieve Neck Pain Instantly

మన మెడలోని కండరాలు విశ్రాంతిని తీసుకోనందున, బాగా సంకోచించి నొప్పి కలుగుట కారణమవుతుంది. ఇందుకు కారణం, అసౌకర్యమైన భంగిమలలో మెడను ఉంచటం వల్ల గాని (లేదా) చాలాకాలం పాటు ఒకే స్థితిలో మెడను ఉంచటం. ఈ మెడనొప్పికి మరొక కారణం, అసౌకర్యమైన దిండ్లపై పడుకునేటప్పుడు లేదా, కంప్యూటర్లు / మొబైల్ స్క్రీన్లను ఎక్కువ కాలం చూస్తూ ఉండటం వల్ల కూడా కావచ్చు. అసౌకర్యమైన రహదారిపై ప్రయాణించేటప్పుడు అకస్మాత్తుగా వచ్చే కుదుపుల కారణంగా మెడనొప్పి రావడం జరుగుతుంది.

మెడనొప్పి చాలా అసౌకర్యంగా ఉంటుంది మరియు దాని విముక్తి కోసం వెంటనే హాజరుకావడం చాలా అవసరం. అక్కడ నొప్పిను నివారించే బామ్ లు మరియు మాత్రలు చాలా ఉన్నాయి; కానీ ఆ నొప్పి స్వభావం నుండి విముక్తిని కలిగించే రెండు శక్తివంతమైన పదార్థాలు ఉన్నాయి, అవి ఆలివ్ నూనె మరియు ఉప్పు, వీటి కలయిక దాదాపుగా మీ మెడను ఉపశమనం చేస్తుంది.

మన మనుషుల కోసం ఆలివ్ నూనె అనేది అద్భుతమైన వరం. ఇది మన శరీరానికి ఆరోగ్యకరమైన చమురుగా భావించవచ్చు. అలాగే మన శరీరంలోనొప్పి ఉన్న ప్రాంతాల్లో దానిని వాడటం వలన త్వరిత ఉపశమనమును అందించేదిగా ఉంటూ, ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

Natural Ingredients To Help Relieve Neck Pain Instantly

యాసిరిన్ వంటి ఔషధాలలో కనిపించే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లను, తాజాగా సేకరించిన ఆలివ్ నూనెలో అదనంగా కలిగి ఉన్నది. ఇది మన శరీరంలో నొప్పిని కలిగించే రసాయనాల ఉత్పత్తిని నిరోధిస్తుంది. అంతే కాదు ఈ నూనె కండరాలను వదలు చేసి త్వరగా నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఆలివ్ నూనెతో పాటు ఉప్పు కూడా చేర్చితే ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది.

ఉప్పులో, ముఖ్యంగా ఎప్సోమ్ లవణాలు (అనే ఉప్పు), సహజమైన నొప్పి నివారిణి. వాటిలో మెగ్నీషియం సల్ఫేట్ శరీర నొప్పుల నుండి ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది. మెగ్నీషియం చర్మంలోకి నొప్పిని గుర్తించి, గ్రహించే మెదడు యొక్క సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కండరాల ఉపశమనాన్ని ప్రోత్సహించడానికి సల్ఫేట్ టాక్సిన్లను విడుదల చేసి మరియు ప్రోటీన్లను రూపాంతరం చెందుతుంది.

ఈ రెండు అద్భుతమైన పదార్ధాల కలయిక మెడ నొప్పిని తగ్గించడానికి పురాతనమైన చికిత్సా పద్ధతిగా ఉంది. ఈ పద్ధతిని పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. అందుకే ఇది బాగా ప్రసిద్ది చెందినది.

మెడ నొప్పి నుండి మీరు ఉపశమనం పొందడానికి ఈ క్రింది పదార్ధాలను ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ ఉంది.

Natural Ingredients To Help Relieve Neck Pain Instantly

కావలసినవి:

1) ఉప్పు - 5 టేబుల్ స్పూన్స్ (ప్రధానంగా, ఎప్సోమ్ ఉప్పు)

2) ఆలివ్ నూనె - 10 టేబుల్ స్పూన్స్

3) ఒక శుభ్రమైన గాజు పాత్ర

విధానం:

ఒక గాజు పాత్రలో పైన చెప్పిన పదార్థాలు తీసుకొని, బాగా కలపాలి.

ఆ మిశ్రమం పై మూత మూసి వేయండి మరియు కొన్ని గంటలు చల్లని ప్రదేశాల్లో ఈ మిశ్రమాన్ని నిల్వ చేయ్యాలి.

కొన్ని గంటల తరువాత, దాని రంగు మారుతుంది.

ఈ మిశ్రమాన్ని ఉపయోగించి 2-3 నిమిషాలు మీ మెడను మృదువుగా మసాజ్ చెయ్యండి. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది మరియు నొప్పిని తగ్గిస్తుంది. అంతే కాకుండా, మర్దన చెయ్యడం వల్ల ఆ నొప్పి ఉద్రిక్తత యొక్క ఉపశమనం కలిగించడానికి సహాయం చేస్తుంది. ఈ హోం రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మెడ నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

ఆ మిశ్రమాన్ని అప్లై చేసిన తర్వాత కొన్ని గంటల తర్వాత నొప్పి తగ్గినట్లు అనిపిస్తే ఆ ప్రాంతాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడవండి మరియు ఉత్తమ ఫలితాల కోసం ప్రతి రోజూ ఈ విధంగానే అప్లై చేయండి. నొప్పి తగ్గే వరకూ ఎన్ని రోజులైన ఈ హోం రెమెడిని మీరు ప్రయత్నించవచ్చు. క్రమం తప్పకుండా ప్రయత్నిస్తుంటే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.

ఈ హోం మేడ్ రెమెడీని ఉపయోగించం వల్ల పట్టేసిన మెడ కండరాలు వదులవుతాయి. మెడ నొప్పి తగ్గుతుంది.

English summary

Natural Ingredients To Help Relieve Neck Pain Instantly

Neck pain can be very uncomfortable and needs to be attended to immediately. There are a lot of pain balms and tablets out there; but there are two powerful ingredients from nature, the combination of which will relieve your neck pain almost instantly; which are olive oil and salt.
Subscribe Newsletter