For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయేరియా (అతిసారం) వ్యాధి చికిత్సకు, అందుబాటులో ఉన్న 10 సహజమైన నివారణ మార్గాలు !

|

కొంచెం కడుపు నొప్పితో, ఎక్కువ సార్లు విరోచనాలు గాని జరుగుతూ మీరు బాధపడుతున్నట్లైతే - ఇవన్నీ కూడా డయేరియా (అతిసారం) వ్యాధి యొక్క లక్షణాలని చెప్పవచ్చు. కొన్ని సార్లు ఈ విధమైన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

ఈ విరోచనాలు ప్రధానంగా బాక్టీరియా మరియు వైరస్ల ద్వారా సంక్రమిస్తుంది. ఇది చాలా అసౌకర్యాన్ని మరియు అననుకూలతను కలిగించవచ్చు.

డయేరియాకు కారణమైన బ్యాక్టీరియా యొక్క వ్యాప్తికి ప్రధాన వాహకాలుగా మనము తీసుకొనే ఆహారం మరియు త్రాగే నీరు ఉన్నాయి కాబట్టి మనము తగిన జాగ్రత్తలను తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే, మనము తీసుకొన్న ఆహారము కడుపులో ఉన్న ప్రేగుల యొక్క కదలికలపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని కలిగిస్తాయి.

అవసరమైన దానికన్నా ఎక్కువ ఆహారాన్ని తీసుకోవటం, కెఫీన్, ఆల్కహాల్ వంటి అసహనాన్ని వ్యక్తపరిచే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల డయేరియా (అతిసారం) ఏర్పడుతుంది. ఈ డయేరియా వల్ల, ప్రేగులలో అసాధారణమైన కదలికల సమస్యలను కలిగి బాధపడటానికి మరియు తరచుగా విరోచనాలు అవ్వటానికి చాలా అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు, కొన్ని ఔషధాల వాడకం వలన కూడా ప్రేగుల కదలికల్లో సమస్యలను కలిగించేవిగా ఉంటాయి.

మనము డయేరియాతో బాధపడుతున్నప్పుడు, దాని తక్షణ చికిత్స కోసం మనము మొదటిగా చేయబోయే పని ఏమిటంటే, అందుబాటులో ఉన్న ఔషధాలను వాడటం. కానీ ఈ ఔషధాలను అన్ని సమయాల్లోనూ ఉపయోగించడం అంత మంచి ఆలోచన కాదు.

కాబట్టి మీరు డయేరియాను కలిగి ఉన్నట్లయితే, దాని చికిత్స కోసం మీ వంటగదిలోనే చాలా రకాల సహజ నివారణలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ సహజ నివారణలు ఎలాంటి దుష్ప్రభావాలన్నీ కలిగి ఉండకపోవటమే అనేది చెప్పుకోవలసిన మరొక అత్యంత గొప్ప విషయం.

డయేరియా (అతిసారం) వ్యాధికి చికిత్స కోసం కొన్ని ముఖ్యమైన ఇంటి చిట్కాలను ఇక్కడ ఇవ్వబడ్డాయి. వాటిని పరిశీలించండి.

1. పెరుగు :

1. పెరుగు :

పెరుగు అనేది ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను కలిగి ఉన్న అత్యంత ప్రసిద్ధి ప్రోబయోటిక్స్లో ఒకటి. ప్రతిరోజు ఒక చిన్న గిన్నెతో పెరుగును (రుచిలేనిది) తీసుకోవడం వలన డయేరియాతో పాటు ప్రేగుకు సంబంధించిన ఏ విధమైన అంటురోగాలను వ్యాపింప చెయ్యకుండా నివారించటంలో సహాయపడుతుంది.

2. నీరు ఎక్కువగా త్రాగాలి :

2. నీరు ఎక్కువగా త్రాగాలి :

మీరు అతిసారంతో బాధపడుతున్నప్పుడు, మీ శరీరం చాలా మటుకు నీటి శాతాన్ని కోల్పోతుంది. ఇందువల్లన మీరు బలహీనంగా మారి, డీహైడ్రేట్ కు గురి కావచ్చు. అందువల్ల సాధారణ రోజుల్లో మీరు త్రాగే పానీయాల మోతాదు కన్నా - ఎక్కువ స్థాయిలో పానీయాలను త్రాగడం వల్ల మీ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది మరియు మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.

నీటితో పాటు, ఎలక్ట్రోలైట్స్ లో ఉత్తమంగా ఉన్న కొబ్బరినీరుని త్రాగటం వల్ల, మీ శరీరాన్ని త్వరగా హైడ్రేట్ చేసేందుకు సహాయపడుతుంది.

3. మెంతులు :

3. మెంతులు :

మెంసిలేజ్ అనే ముఖ్యమైన సమ్మేళనాన్ని మెంతి గింజలు కలిగి ఉంటాయి. ఇది హానికరమైన బ్యాక్టీరియా నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. మీరు ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో మెంతులను ఒక భాగంగా చేసుకోవటం (లేదా) 2-3 టీ స్పూన్ల మెంతి గింజలను తీసుకోవటం (లేదా) రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో మెంతి గింజలను 7 - 8 గంటల సమయం వరకు నానబెట్టి ఆ నీటిని త్రాగటం వలన, అతిసారమును నివారించటంలో ఇది సమర్థవంతంగా సహాయపడుతుంది.

4. ఆపిల్ సైడర్ వెనిగర్ :

4. ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్లో గొప్ప యాంటీబయోటిక్ లక్షణాలకు ప్రసిద్ధిచెందినదిగా పేర్గాంచినది. ఇది ప్రేగుల చలన (కదలికల) సమస్యల వల్ల వచ్చే నొప్పులకు ఉపశమనాన్ని అందించేందుకు సహాయపడే "పెక్టిన్" అనే పదార్ధాన్ని కలిగి ఉన్నది.

మీరు చెయ్యాల్సిందల్లా ఆహారాన్ని తయారుచేసే క్రమంలో ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ యొక్క కొన్ని చుక్కలను కలపండి. ఇది మీకు ఎంతగానో సహాయపడుతుంది.

5. చమోమిలే-టీ :

5. చమోమిలే-టీ :

చమోమిలే-టీ, ఒక గొప్ప యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు బాగా ప్రసిద్ధి చెందినది, మరియు అతిసారంతో పాటు, జీర్ణశయాంతర ప్రక్రియలో ప్రేగు సంక్రమణకు సంబంధించిన ఇతర ఆరోగ్య సమస్యలను పూర్తిగా నయం చేసేదని కూడా పిలుస్తారు. మీరు అతిసారంతో బాధపడుతున్నప్పుడు చమోమిలే-టీని ఒక రోజులో 2 - 3 సార్లు తాగటం వల్ల వ్యాధి సంక్రమణకు చికిత్సను అందించి, అతిసారాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.

6. పసుపు + మజ్జిగ :

6. పసుపు + మజ్జిగ :

పసుపు అనేది యాంటీసెప్టిక్ లక్షణాలు చెందినదిగా ప్రసిద్ధి పొందింది మరియు గ్యాస్ట్రిక్ను ఉపసంహరించేదిగా కూడా ఉన్నది. ఒక చిన్న పసుపుకొమ్ము లను తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి, మెత్తని పొడిగా మార్చి, ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకొని మజ్జిగలో కలిపి త్రాగాలి. ఇలా చేయడం వల్ల అతిసారం నుండి వెంటనే ఉపశమనాన్ని కలిగిస్తుంది.

7. తేనె :

7. తేనె :

డయేరియా చికిత్సకు సహాయపడే ఉత్తమ సహజ పదార్థాలలో తేనె కూడా ఒకటి. మీరు డయేరియాతో బాధపడుతున్న సమయంలో ఒక గ్లాసు వేడి నీటిలో, 3 - 4 టీ స్పూన్ల తేనెను కలిపి తీసుకోండి. ఈ పానీయం తక్షణమే అతిసారము నుండి శీఘ్రమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది.

8. అరటి :

8. అరటి :

మీరు డయేరియాతో బాధపడుతున్నప్పుడు తీసుకోవాల్సిన అత్యుత్తమమైన పండ్లలో అరటి అనేది ఒకటి. అరటిలో పొటాషియం మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వలన, డయేరియా నుండి సత్వర ఉపశమనమును పొందేందుకు, అరటి అనేది మంచి సహాయకారిగా పనిచేస్తుంది. అలాగే మీకు కావలసిన శక్తిని అందించేందుకు 1 - 2 అరటి పండ్లు అవసరమవుతాయి. అంతకుమించి ఎక్కువ అరటి పండ్లను తినటం వల్ల అది కడుపు సమస్యలకు దారితీసేదిగా ఉంటుంది.

9. ఆరెంజ్ పీల్ టీ :

9. ఆరెంజ్ పీల్ టీ :

నారింజ-పండు తొక్క అనేది ప్రకృతి సిద్ధమైన పదార్ధాలలో ఒకటిగా ఉంటూ, జీర్ణక్రియను ప్రేరేపించేదిగాను మరియు అతిసారాన్ని నిరోధించడానికి ఇది చాలా సహాయపడుతుంది.

నారింజ పండు యొక్క ను చిన్న ముక్కలుగా చేసి, కుండలో వేడి చేస్తున్న నీటిలో ఈ ముక్కలను జోడించాలి. అలా పైకి పొంగుతూ మరగకాచబడిన వేడి నీటిని, చల్లారనివ్వాలి. ఇలా తయారైన పానీయాన్ని వడకట్టి ప్రతిరోజూ త్రాగాలి. ఇలా త్రాగే పానీయానికి మంచి రుచి కోసం ఒక టీస్పూను తేనెను కలిపి తీసుకోవచ్చు.

10. అల్లం :

10. అల్లం :

కొన్ని సందర్భాలలో, డయేరియా అనేది అజీర్ణం వల్ల కూడా సంభవిస్తుంది. అలాంటి సందర్భంలో కడుపులో ఉపశమనాన్ని కలిగించటం కోసం, అల్లం సహాయపడుతుంది. అల్లంలో ఉన్న సుగుణాలు పొట్ట ఉబ్బరాన్ని తగ్గించేదిగాను, తీసుకొన్న ఆహారం త్వరగా జీర్ణమవ్వడానికి దోహదపడేదిగాను, మరియు జీర్ణశయాంతర ప్రక్రియలో ప్రేగులను ఉత్తేజపరిచేందుకు సహాయపడుతుంది. ఎండిన అల్లం పొడిని రాతి ఉప్పు తో కలిపి తీసుకోవటం వలన అతిసారం నుండి త్వరగా ఉపశమనమును కలిగించుటలో సహాయపడుతుంది.

English summary

Natural Ways To Treat Diarrhoea

Suffering from diarrhoea can cause a lot of discomfort and uneasiness. Loose stools, stomach pain along with a bloated feeling are a few of the major symptoms of diarrhoea. There are a few natural remedies that help to treat diarrhoea.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more