పీరియడ్స్ లో నొప్పులు, తిమ్మెర్లు తగ్గించే కామన్ ఫుడ్స్!

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

సహజంగా అమ్మాయిలు కౌమార దశ నుండి యవ్వనదశలోకి చేరుకోగానే రుతక్రమం ఏర్పడుతుంది. అయితే ప్రారంభ దశలో పీరియడ్స్ సమస్యలు పలు రకాలుగా ఉంటాయి. ఆ సమయంలో మహిళలకు నెలనెల ఒక గండంగా గడుస్తుంది.

అయితే పీరియడ్స్ సమయంలో సహజంగా కనిపించే రుతుక్రమ తిమ్మెర్లు కొంత మందిలోనే కనబడుతాయి. ఈ లక్షణాలు కనబడకపోయినా కష్టమే. ఎదో వ్యతిరేఖఆరోగ్య సూచనలను సూచిస్తుంది.

ఉదాహరణకు, నెలలో వచ్చే రుతుస్రావానికి కొన్ని రోజుల ముందు కొంత మంది మహిళల్లో చాలా అసౌకర్యంగా ఉంటుంది. వారి రోజువారి పనులు చేసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది.

పీరియడ్స్ లో చర్మం డల్ గా కనబడకుండా..అందంగా..క్లియర్ గా కనబడాలంటే.?

రుతస్రావం అనేది ప్రతి మహిళలలో సహజంగా వచ్చే ఒక అనుభవం, మొదటిసారి పుష్పవతి అయినప్పుటి నుండి వారు మోనోపాజ్ దశ చేరుకునే వరకూ ప్రతి 28నుండి30 రోజులకు ఒకసారి జరుగుతుంది. ప్రతి నెలలో 4నుండి 5 రోజుల రుతుస్రావ దినాలుగా లెకిస్తారు. గర్భం పొందనప్పుడు యుటేరియన్ వాల్ రక్తం రూపంలో వెజైనా నుండి స్రవించడాన్నే రుతుస్రావం అంటారు. పీరియడ్స్ లో తినాల్సిన ఆహారాల గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

రుతుస్రావ సమయంలో మహిళ శరీరంలో వివిధ రకాలుగా హార్మోనులలో మార్పులు జరుగుతాయి. అది యుటేరియన్ వాల్ కు ఇన్ఫ్లమేషన్ జరగడం వల్ల అది తొలగిపోతుంది. దాంతో నొప్పి , అసౌకర్యం విపరీతంగా ఉంటుంది. ఈ కారణంగా పొట్ట ఉదరంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది.

పీరియడ్స్ టైంలో శృంగారం వల్ల పొందే మిరాకిలస్ బెన్ఫిట్స్..!!

కొంత మంది మహిళల్లో ఆ నొప్పి భరించరానంతగా ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్స్ తీసుకోడం వల్ల ముందు ముందు మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆకలి లేకపోవడం, తరచూ మనస్సు మారడం, అలసట మరియు జనరల్ వీక్ నెస్ వంటివి ఉంటాయి. ఈ సమస్యలన్నింటిని తగ్గించుకోవడానికి కొన్ని ఆహారాలున్నాయి. రుతుస్రావ సయంలో వీటిని తీసుకోవడం వల్ల తిమ్మెర్లు, బలహీనత తగ్గుతుంది.

1. మొలకలు:

1. మొలకలు:

మొలకల్లో పోషక విలువలు, యాంటీఆక్సిడెంట్స్, ప్రోటీనులు ఎక్కువ. యాంటీఆక్సిడెంట్స్ నొప్పిని పీరియడ్స్ లో నొప్పిని తగ్గిస్తాయి. ప్రోటీనులు బలహీనతను పోగొడుతుది.

2. సూప్స్:

2. సూప్స్:

చికెన్, వెజిటేబుల్ సూప్స్ పీరియడ్స్ లో నొప్పులను మరియు అలసటను తగ్గిస్తాయి. అలాగే యుట్రస్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

3. శక్తిని అందిస్తుంది:

3. శక్తిని అందిస్తుంది:

జీడిపప్పు, వాల్ నట్స్, డేట్స్ మొదలగు వాటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి పీరియడ్స్ సమయంలో ఇతర వ్యతిరేఖ లక్షణాలను నివారిస్తాయి.

4. తాజా పండ్లు:

4. తాజా పండ్లు:

ఆపిల్ , ఆరెంజె, బొప్పాయి, బనానా మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న ఇతర తాజా పండ్లు తినడం వల్ల యుటేరెన్ ఇన్ఫ్లమేషన్ , అలసటను తగ్గిస్తాయి.

5. ఆకు కూరలు, కూరగాయలు:

5. ఆకు కూరలు, కూరగాయలు:

ఆకుపచ్చగా, తాజాగా ఉండే కూరల్లో ఐరన్ అధికంగా ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది ఎఫెక్టివ్ గా రుత్రస్రావ నొప్పులను నొప్పి తగ్గిస్తుంది.

6. పచ్చిబఠానీలు:

6. పచ్చిబఠానీలు:

పచ్చిబఠానీలలో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఒక చిన్న గిన్నెడు పచ్చిబఠానీల సలాడ్ తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించి, నొప్పులు, తిమ్మెర్లను పోగుడుతుంది. పచ్చిబఠానీలు కూడా శక్తిని పెంచడానికి మంచిది.

7. పాలు:

7. పాలు:

రుతుక్రమ సమయంలో పాలు తాగడం చాలా మంచిది. వీటిలో ప్రోటీన్స్, క్యాల్షియం, పొటాషియంలు అధికంగా ఉంటాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    These Common Foods Reduce Pain & Weakness During Periods!

    Here are a list of foods that you must consume, if you want to reduce period pain and fatigue.
    Story first published: Monday, July 10, 2017, 14:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more