ప్యాంక్రియాటిక్ (క్లోమగ్రంధి) క్యాన్సర్ ను గుర్తించే సెల్ఫీ, స్మార్ట్ ఫోన్ యాప్

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది U.S. లో చాలా అరుదుగా ఉంటుంది. ఈ క్యాన్సర్ మరణానికి ప్రధాన కారణంగా ఉంది, ఎందుకంటే ప్రారంభ విశ్లేషణ కష్టం. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి పరిశోధకులు అభివృద్ధి చేసిన ఒక స్మార్ట్ఫోన్ యాప్ అలాగే 3D-ముద్రిత పెట్టె, వంటి వాటి సహాయంతో ఈ పరిస్థితిని మార్చవచ్చు.

బిల్లిస్క్రీన్ గా పిలువబడే ఈ యాప్ ను, కంప్యూటర్ విజన్ అల్గోరిథంలను అలాగే మెషిన్ లెర్నింగ్ అల్గోరిథంలను ఉపయోగించి - ఒక వ్యక్తి యొక్క కళ్ళకు సంబంధించిన ఫోటోలో కామెర్లు గుర్తిస్తారు. ప్రత్యేకించి, తెల్ల కనుగుడ్డు భాగంలోని శ్వేతపటాలలోని రేణువుల యొక్క కృత్రిమ స్థాయిలను కొలుస్తుంది. పచ్చకామెర్లు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యొక్క ముందస్తు లక్షణం మరియు అనేక ఇతర వ్యాధులు, బిలరుబిన్ (ఈ రేణువుల) యొక్క పెరుగుదల వలన వస్తాయి.

ప్యాంక్రియాటిక్(క్లోమ గ్రంధి) క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు!

pancreatic cancer

రక్తపరీక్ష ద్వారా బిలరుబిన్ స్థాయిని తెలుసుకోవచ్చు. కానీ దీనికి ఒక ప్రొఫెషనల్ కేర్ అవసరం ఉంటుంది అలాగే తరచుగా పరీక్ష చేయడం వల్ల అసౌకర్యానికి గురవుతారు కూడా.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదానికి గురయ్యే వ్యక్తులను బిల్లీ స్క్రీన్ పై పరీక్షించడం చాలా సులభము.

ఒక ప్రత్యేకమైన కళ్లద్దాలు, 3D-ముద్రిత పెట్టెను ఉపయోగించి కంటిపై పడే కాంతిని నియంత్రించి స్మార్ట్ ఫోన్ కెమెరా ద్వారా ఆ వ్యక్తి యొక్క ముఖ భాగానికి ఫొటోలు తీస్తారు. 70 మంది రోగులపై చేసిన అధ్యయనంలో బిలిరుబిన్ను - రక్తపరీక్షతో పోలిస్తే, బిల్లిస్క్రీన్ "సరిగ్గా ఆందోళన కలిగిన కేసులను 89.7% సమయంలో గుర్తించింది."

pancreatic cancer

పై విచారణ ద్వారా తెలుసుకొన్న అనేక విషయాలను ఇంటరాక్టివ్, మొబైల్, ధరించగలిగే మరియు ఉబిక్వితౌస్ (Ubiquitous) టెక్నాలజీలలోACM యొక్క పత్రికలో ప్రచురించబడ్డాయి.

"ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్న వారు ఈ సమస్యను తెలుసుకోవడంలో ఆలస్యం అవుతున్నారని,"- పాల్ జి.అలెన్ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో డాక్టర్ విద్యార్థి అయిన 'అలెక్స్ మారికాకిస్' చెప్పారు.

pancreatic cancer

"ప్రజలు ఈ సాధారణ పరీక్షను తమ స్వంత గృహాలలో రహస్యంగా - నెలకి ఒకసారి చొప్పున పరీక్షించుకుంటే, ముందుగానే చికిత్సను ప్రారంభించి ఈ వ్యాధిని అరికట్టడం ద్వారా అనేక మంది జీవితాలను కాపాడవచ్చు."

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నివారణకు 10 ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీస్...

యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ యొక్క ఉబిక్వితౌస్ కంప్యూటింగ్ లాబ్ నుండి పరిశోధనలో భాగంగా రూపొందించబడిన బిల్లీ స్క్రీన్ ఆధారంగా, అప్పుడే పుట్టిన శిశువుల యొక్క చర్మాన్ని ఫోటో తీసి కామెర్లను గుర్తించే ఒక స్మార్ట్ఫోన్ అప్లికేషన్ను రూపకల్పన చేశారు.

pancreatic cancer

కాంతి-నియంత్రణ పెట్టెను, అద్దాల వంటి పరికరాలు అవసరం లేకుండా, వాటి అవసరాన్ని తీసివేయడం కోసం ఈ పరికరం యొక్క రూపకల్పనను మెరుగుపరచడానికి బృందం కృషి చేస్తోంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని - కామెర్లతో పాటు అంతర్లీనంగా ఉన్న ఇతర వ్యాధుల పరిస్థితులను ఎక్కువ మంది ప్రజలలో తెలుసుకునేందిగా ఈ యాప్ను పరీక్షిస్తున్నారు.

English summary

A selfie and a smartphone app could catch pancreatic cancer early

The app, dubbed BilliScreen, uses computer vision algorithms and machine learning algorithms to detect jaundice in a photo of a person’s eyes. Specifically, it measures elevated levels of bilirubin in the sclera, the white part of the eye. Jaundice, an early symptom of pancreatic cancer and a number of other diseases, is caused by a buildup of bilirubin.
Story first published: Wednesday, September 6, 2017, 8:00 [IST]
Subscribe Newsletter