For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెంటనే మంచి మూడ్ రావాలంటే ఇలా చేస్తే సరి!

మన ఆరోగ్యానికి మంచి మందు ఏమిటో తెలుసా? మన మూడ్... అది బాగుంటే మనం ఏదైనా హ్యాపీగా చేయోచ్చు. మన పక్కన ఉన్న కొందరు మన మూడ్ పోగొడుతుంటారు. అనవసరంగా రాద్దాంతం చేస్తూ ఉంటారు. మీరు అలాంటి వారిని అస్సలు పట్టి

By Y. Bharath Kumar Reddy
|

మన ఆరోగ్యానికి మంచి మందు ఏమిటో తెలుసా? మన మూడ్... అది బాగుంటే మనం ఏదైనా హ్యాపీగా చేయోచ్చు. మన పక్కన ఉన్న కొందరు మన మూడ్ పోగొడుతుంటారు. అనవసరంగా రాద్దాంతం చేస్తూ ఉంటారు. మీరు అలాంటి వారిని అస్సలు పట్టించుకోవొద్దండి. లేదంటే మీ మూడు పోద్ది. చేసే పనిపై ఇంట్రెస్ట్ కూడా రాదు.

మీరు ఎప్పుడైతే కాస్త మూడీగా ఉంటారో అప్పుడు మీ మదిలో ఏవేవో ఆలోచనలు మెదులుతాయి. ఒత్తిడికి గురవుతారు. మానసికంగా సతమతమైపోతుంటారు. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ లో పని చేసి బాగా అలిసిపోయారనుకోండి.. ఆ టైమ్ లో మీ ఫ్రెండ్ ఫోన్ చేసి బాబాయ్.. పార్టీ ఉంది వచ్చేసెయ్ అంటారనుకోండి.

మీ అప్పడు ఇచ్చే అప్పుడిచ్చే ఆన్సర్ ఏమిటంటే.. ఏం పార్టీరా బాబూ.. ఉదయం నుంచి అసలు మనస్సు బాగోలేదు.. ఆఫీసులో ఈ రోజు చుక్కలు చూపించారు అని సమాధానమిస్తారు. తర్వాత ఇంట్లోనే కాస్త రిలాక్స్ అవుదామనుకుంటారు.

how to boost mood instantly

మీకు మూడ్ బాగాలేకపోవడం అనేది ఇలా చాలా విషయాలపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు ఇది పరోక్షంగా మీ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అయితే రోటిన్ లైఫ్ లో మనకు ప్రతి విషయం మూడ్ తో లింక్ అయి ఉంటుంది. అలాగే మీకు మంచి మూడ్ ఉందనుకోండి.. దాని వల్ల మీకు అన్ని ప్రయోజనాలే కలుగుతాయి. మీరు చేసే పనిని కాస్త ఆసక్తిగా చేసే అవకాశం ఉంటుంది.

ఒక వేళ మీరూ ఎప్పుడూ మూడ్ అవుట్ లో ఉంటే మాత్రం చాలా రోగాల బారిన పడాల్సి వస్తుంది. అధిక రక్తపోటు, తలనొప్పి, జీర్ణ సమస్యలు, గుండె జబ్బులు తదితర వాటి బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువగా ఒత్తిడికి గురవ్వాల్సి వస్తోంది. అందువల్ల ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నించండి.

మీ మూడ్ బాగా ఉండాలంటే కొన్ని చిట్కాలున్నాయి ఇవి బ్రెయిన్ ను ఉత్తేజపరిచి మీలో ఎండోర్ఫిన్ అనే హార్మోన్ విడుదల కావడానికి సాయం చేస్తాయి. దీన్నే ఫీల్ గుడ్ హార్మోన్ అని కూడా అంటారు. మరి ఇది ఉత్పన్నంకావాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు.

# 1: మంచి పరిమళాన్ని వాసన చూడండి

# 1: మంచి పరిమళాన్ని వాసన చూడండి

వనిల్లా లేదా లావెండర్ సెంట్ వాసన చూస్తే మీ మూడ్ ఒక్కసారిగా మారిపోతుంది. దీంతో ఎండార్ఫిన్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగూ మీ మెదడు కూడా బాగా పని చేస్తుందంట.

అందువల్ల ఎప్పుడైనా మూడ్ అవుట్ లో ఉంటే మీరు ఇలా చేయండి. వెంటనే మీరు మంచి మూడ్ లోకి వెళ్తారు.

# 2: జిన్సెంగ్ టీ తాగండి

# 2: జిన్సెంగ్ టీ తాగండి

జిన్సెంగ్ టీ ని తాగారనుకోండి మీలో ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. లేదంటే కాస్త జిన్సెంగ్ పొడిని తీసుకుని వేడి నీటిలో కలిపి తాగండి మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని ఆమ్లజనకాలు ఎండోర్ఫిన్లను విడుదల చేయడానికి సాయం చేస్తాయి. దీంతో మీ మానసిక స్థితి మెరుగుపరుడుతుంది.

# 3: గ్రూప్ ఎక్సర్ సైజ్

# 3: గ్రూప్ ఎక్సర్ సైజ్

మీరు ఒంటరిగా వ్యాయామం చేయడం కాకుండా స్నేహితులతో కలిసి ఒక గ్రూప్ లో వ్యాయామం చేయండి. దీనివల్ల కూడా మీలో మంచి ఉత్సాహం వస్తుంది. 2009 లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయంలో వెల్లడైంది. ఇలా చేయడం ద్వారా ఎండోర్ఫిన్ల లెవెల్స్ పెరుగుతాయని తేలింది.

# 4: బాగా నవ్వండి

# 4: బాగా నవ్వండి

మీరు రోజులో కనీసం ఒక్కసారైన మనస్ఫూర్తిగా నవ్వితే మంచిది. జోకులు చదవడమో లేదా ఫన్నీ షోస్ చూడటంలాంటివి చేస్తూ ఉండాలి. దీని ద్వారా ఎండోర్ఫిన్ లెవెల్స్ పెరుగుతాయి. అందువల్ల ఈ విధానాన్ని కూడా అనుసరించండి.

# 5: సెక్స్ లో పాల్గొనండి

# 5: సెక్స్ లో పాల్గొనండి

సెక్స్ కూడా మీరు మౌడ్ ఔట్ నుంచి బయటకు వచ్చేందుకు బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ సెక్స్ వల్ల ఉత్సాహంగా మారిపోతారు. సెక్స్ ద్వారా కూడా ఎండోర్ఫిన్స్ హార్మోన్లు వెంటనే విడుదలవుతాయి. అందువల్ల మూడు బాగాలేనప్పుడల్లా మీ పార్టనర్ కు విషయం వివరించి సెక్స్ లో పాల్గొనేందుకు ప్రయత్నిచండి. తర్వాత వచ్చే ఫలితం మీకే తెలుస్తుంది.

# 6: డార్క్ చాక్లెట్

# 6: డార్క్ చాక్లెట్

మీ దగ్గర ఎప్పుడూ ఒక డార్క్ చాక్లెట్ ను ఉంచుకోండి. మీకు ఎప్పుడు మూడు బాగాలేకున్నా మీరు వెంటనే దాన్ని తినండి. ఇందులో ఉండే ఆమ్లజనకాలు ఎండోర్ఫిన్లను పెంచడానికి బాగా పని చేస్తాయి. దీంతో క్షణాల్లో మళ్లీ మీకు ఎక్కడలేని ఉత్సాహం కలుగుతుంది.

# 7: మ్యూజిక్ వినండి, డ్యాన్స్ చేయండి

# 7: మ్యూజిక్ వినండి, డ్యాన్స్ చేయండి

మ్యూజిక్ వింటూ డ్యాన్స్ చేస్తే ఆ కిక్కే వేరబ్బా. మీకు ఇష్టమైన పాటలను వింటే మీలో ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఇక వాటిని వింటూ స్టెప్స్ వేస్తే మీలో పోయిన ఉత్తేజం మొత్తం తిరిగి వస్తుంది. దీంతో మెదడులో ఎండోర్ఫిన్స్ ఉత్పాదనను అనే పెరుగుతుంది. ఫలితంగా వెంటనే మళ్లీ ఉత్సాహంగా మారిపోతారు.

# 8: స్పైసీ ఆహారాలు తినండి

# 8: స్పైసీ ఆహారాలు తినండి

మీరు మూడ్ ఔట్ లో ఉన్నప్పుడు కాస్త స్పైసీ ఆహారాలు తినండి. ఇవి మెదడును ఉత్తేజపరుస్తాయి. మీలో ఎక్కడలేని ఉత్సాహాన్ని మళ్లీ తీసుకొస్తాయి. ఇవి ఎండార్ఫిన్లు ఎక్కువగా ఉత్పత్తి కావడానికి ఉపయోగపడతాయి.

# 9: లాంగ్ రన్ చేయండి

# 9: లాంగ్ రన్ చేయండి

అలాగే లాంగ్ రన్ లేదా జాగింగ్ కు వెళ్లారనుకో మీలో మంచి ఉత్తేజం వస్తుంది. మూడ్ అవుట్ నుంచి మీరు బయటపడొచ్చు. అలా ఫ్రెండ్స్ తో కలిసి ఒక రౌండ్ కొట్టిరండి. పోయినా ఉత్సాహం అంతా మళ్లీ వస్తుంది.

ఇలా చేయడం వల్ల కూడా ఎండోర్ఫిన్లు ఎక్కువగా ఉత్పత్తి అయి మీకు మంచి మూడ్ వస్తుంది. ఇవన్నీ పాటించి చూడండి. మీలో ఎక్కడలేని మూడ్ దానంతటకు అదే వస్తుంది.

Read more about: mood dance chocolate మూడ్
English summary

tips to improve your mood instantly

Have a look at some of the simple tips which can help boost the endorphin levels in the brain and put you in a good mood instantly.
Desktop Bottom Promotion