For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైనస్ చికిత్సకై వెల్లుల్లి ఎలా వాడాలి?

|

చలికాలం వేగంగా దూసుకొస్తోంది. అది తనతో పాటు వివిధ ఆరోగ్యసమస్యలను కూడా తెస్తుంది.

ఈ రుతువులో చాలామంది ఇన్ఫెక్షన్లు, ఫ్లూ బారిన ఈ కారణం వలనే పడతారు. అందరూ ఈ చలి వాతావరణంలో లోపల ఉండటానికి ఇష్టపడతారు.ఇది ఇదివరకే అనారోగ్యంగా ఉన్నవారి నుంచి ఇన్ఫెక్షన్లు కొత్తవాళ్ళకి అంటుకునేట్లా చేస్తుంది. ఈ సీజన్లో వెలుతురు తక్కువగా ఉండటం వలన ఇంటి లోపల వెచ్చగా మారి, బయట చల్లగా సూక్ష్మజీవులు మరింత పెరిగేట్లా చేస్తుంది.

<strong>సైనస్ ఇన్ఫెక్షన్ కు సహజ నివారణోపాయాలు</strong>సైనస్ ఇన్ఫెక్షన్ కు సహజ నివారణోపాయాలు

అన్నిటికన్నా సాధారణ ఇన్ఫెక్షన్ మరియు చాలా సులభంగా ఒకరినుంచి మరొకరికి వ్యాపించేది సైనస్ ఇన్ఫెక్షన్. ఇది కలిగించే వైరస్ సులభంగా వ్యాపిస్తుంది.

garlic remedies for sinus

సైనస్ లు తలలోని ఎముకల వద్ద ఉండే దారులు. ఇవి గాలి మరియు మ్యూకస్ సరిగా ప్రవహించటాన్ని సమన్వయించేవి. ఈ దారిలో ఉండే సన్నని వెంట్రుకలు గాలిలో అనవసర వస్తువులను ప్రవహించకుండా ఆపేస్తాయి.

వైరస్ ఆ దారిలోకి వచ్చినపుడు, ఉపరితలంపై అతుక్కుని దాన్ని వాచేలా చేస్తుంది. దీనివల్ల ఆ దారి మూసుకుపోయి అవరోధం ఏర్పడుతుంది. శరీరం ఇన్ఫెక్షన్ తో పోరాడటానికి మరింత ఎక్కువ మ్యూకస్ ను ఉత్పత్తి చేయటం వలన సమస్య మరింత పెద్దదవుతుంది.

garlic remedies for sinus

సైనస్ గ్రంథులు మూసుకుపోయినప్పుడు మనకి తలనొప్పి వస్తుంది.ఇది ఎందుకంటే సైనస్ దారులు గాలిసంచుల్లా ఉపయోగపడి తల బరువును తగ్గిస్తాయి. అందుకని మూసుకుపోయిన సైనస్ ల వల్ల తల ఎక్కువ బరువుగా అన్పిస్తుంది.

రోజువారి జీవితంలో సైనస్ సమస్య చిరాకును తెప్పిస్తుంది. దీనికి మంచి చికిత్స సహజపదార్థాలు, ముఖ్యంగా వెల్లుల్లి వాడకం.

garlic remedies for sinus

చాలామందికి దాని ఘాటు వాసన మరియు రుచి నచ్చదుకానీ వెల్లుల్లి అద్భుతమైన సైనస్ ఉపశమనకారి.

సైనస్ దారుల్లో లోపలి ఉపరితలంపై వాచి ఇన్ఫెక్షన్ రావటం వలన, వెల్లుల్లి ఆ వాపును తగ్గించి సమస్య మూలానికి చికిత్స చేస్తుంది. అందులో ఉండే సల్ఫర్ మూలకం ఆలిసిన్ దీనికి కారణమవుతుంది.

వాపు తగ్గాక, మ్యూకస్ బయటకి వెళ్ళాక ఆ దారి మళ్ళీ తెరుచుకుంటుంది. ఇది మంచి యాంటీబయాటిక్ కూడా.

garlic remedies for sinus

సైనస్ ఇన్ఫెక్షన్ల లక్షణాలను తగ్గించే మంచి వెల్లుల్లి డ్రింక్ తయారీ విధానం ఇదిగో.

వెల్లుల్లి మరియు ముల్లంగి డ్రింక్ –

ఈ పానీయంలో వెల్లుల్లితోపాటు ఉల్లిపాయలు, ముల్లంగి వంటి ఇతర పదార్థాలు కూడా ఉంటాయి. రెండిటిలో సల్ఫర్ ఎక్కువగా ఉండి సైనస్ కి బాగా పనిచేస్తుంది.

ఉల్లిపాయల ఘాటైన వాసన సైనస్ దారులను తెరుస్తుంది. దానిలోని బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు వైరస్ ను చంపేస్తుంది. మరోవైపు ముల్లంగి మ్యూకస్ ను తొలగించి, శరీరం నుంచి బయటకు పంపేస్తుంది.

garlic remedies for sinus

కావాల్సిన వస్తువులు

5-6 వెల్లుల్లి రెబ్బలు

1 చెంచా నిమ్మరసం

1 ఉల్లిపాయ

2-3 ముల్లంగి

1 చెంచా తేనె

సైనస్ కి వెల్లుల్లి చిట్కాలు

<strong>సైనస్ ఇన్ఫెక్షన్: ఆయుర్వేద నివారణలు</strong>సైనస్ ఇన్ఫెక్షన్: ఆయుర్వేద నివారణలు

garlic remedies for sinus

తయారీపద్ధతి :

1. వెల్లుల్లి మరియు ఉల్లిపాయ పై తొక్కలు తీసేయండి.

2. ఉల్లిపాయ మరియు ముల్లంగిలను చిన్న ముక్కలుగా తరగండి.

3. మూడు వస్తువులను కుండలాంటి గిన్నెలో మరిగించండి.

4. 15 నిమిషాల తర్వాత ఆ ద్రవాన్ని వడగట్టండి.

5. నిమ్మరసం, తేనె జతచేసి దాన్ని తాగండి.

garlic remedies for sinus

ఎక్కువ ప్రభావం చూపటానికి ఈ పానీయం గోరువెచ్చగా ఉండాలి. అలాగే సైనస్ సమస్య చాలా సాధారణం మరియు సులభంగా వ్యాపిస్తాయి. అందుకని మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. మీ చేతులను నీరు లేకపోయినా కూడా శానిటైజర్ తో శుభ్రం చేసుకుంటూ ఉండండి.సాధారణంగా ఈ సహజ చిట్కాలన్నీ పనిచేస్తాయి కానీ లక్షణాలు ఇంకా తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించండి.

English summary

Best Way To Use Garlic To Treat Sinus

Garlic helps in treating sinus. Know about the recipe to use garlic in treating sinus.
Desktop Bottom Promotion