For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నిద్రలేమిని పోగొట్టేందుకు, ఈ 9 అద్భుతమైన టీలను తాగండి !

  |

  నిద్రలేమి మీ పనితీరును ఎక్కువగా ప్రభావితం చేసే సమస్యలో చాలా ప్రధానమైనది. నిద్రలేమి వల్ల మీరు సరిగా నిద్రించలేని ఫలితంగా మగతను కలిగివుంటారు. నిద్రలేమి సమస్య సంభవించడానికి అనేక కారణాలు ఉన్నాయి, దానిని సమర్ధవంతంగా ఎదుర్కొనే కొన్ని రకాల హెర్బల్ టీలను గూర్చి ఇక్కడ మనము చర్చించుకోబోతున్నాము !

  సైనస్ అలెర్జీలు, జీర్ణశయాంతర సమస్యలు, ఆర్థరైటిస్, ఎండోక్రైన్ సమస్యలు, ఉబ్బసం, నరాల తీవ్రతలు, దీర్ఘకాలిక నొప్పులు & వెన్ను నొప్పి వంటివి కొన్ని కారణాల వల్ల నిద్రలేమి అనేది సంభవించవచ్చు.

  అయినప్పటికీ, దీర్ఘకాలిక ఉన్న నిద్రలేమికి గల ప్రధాన కారణాలు ఆందోళన, ఒత్తిడి, నిరాశ (లేదా) అనారోగ్యం వంటివి ఉండవచ్చు. నిద్రలేమి కూడా ఆందోళనను, ఒత్తిడిని & అధ్వాన్నంగా ఉండే నిస్పృహ లక్షణాలను కలిగించవచ్చు. ఇతర మానసిక & భావోద్వేగాలకు కారణాలైన కోపం, ఆందోళన, బైపోలార్ డిజార్డర్, మానసిక గాయం & విచారం వంటివన్ని నిద్రలేమి వల్లే ఎదురవుతాయి.

  10 Best Teas That Combat Insomnia

  హెర్బల్ టీలు, వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేసే లక్షణాలతో పూర్తిగా నిండి ఉన్నాయి. వేలాది సంవత్సరాలుగా వివిధ రకాలైన వ్యాధులను నయం చేసే సహజమైన నివారిణిగా ఉంది.

  నిద్రలేమిని ఎదుర్కొనే ఉత్తమ టీల గూర్చి ఇక్కడ వివరించబడ్డాయి.

  1. చమోమిలే-టీ :

  1. చమోమిలే-టీ :

  చమోమిలే-టీ, నిద్రలేమికి సహాయపడే కారకాలతో పోరాడుతుంది. ఇది ఇతర నివారణ లక్షణాలను కలిగి ఉండటంతో పాటు, నిద్రావస్థను నియంత్రించడంలో సహాయపడుతుంది. చమోమిలే-టీను నిద్ర-ప్రేరేపిత పానీయంగా భావిస్తారు. నిద్రించడానికి ముందు ఒక కప్పు చమోమిలే-టీను తాగడం వల్ల మీరు మంచి ఉపశమనాన్ని పొందగలుగుతారు, ఎందుకంటే వీటిలో స్వస్థత పరిచే లక్షణాలతో పూర్తిగా నిండి ఉన్నాది. చమోమిలే-టీ గొంతు నొప్పిని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది.

  2. పసుపు :

  2. పసుపు :

  నిద్రలేమిని ఎదుర్కోవడంలో పసుపు కూడా సహాయకారిగా ఉంటుంది. ఇది వాపులను తగ్గిస్తుంది, మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, కాలేయ నిర్విషీకరణలో (వ్యర్ధాలను బయటకు పంపించడంలో) సహాయపడుతుంది, మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది, మీ జీర్ణ వ్యవస్థను పనితీరును తేలిక చేస్తుంది. అలాగే మీరు వేగంగా నిద్రపోవడానికి సహాయపడటంతో పాటు, మేల్కొనేటప్పుడు మిమ్మల్ని చైతన్యవంతులుగా వుండేటట్లు చేస్తుంది. సాయంత్ర వేళలో, ఒక గ్లాసు వెచ్చని పాలలో కొద్దిగా పసుపును జోడించి తీసుకోవడం వల్ల మీరు రాత్రి వేళలో ఎలాంటి నిద్రాభంగం లేకుండా హాయిగా పడుకోవటానికి సహాయపడుతుంది. ఒక చిన్న గిన్నెలో బాదం పాలును తీసుకుని వాటికి పసుపు, ఏలకులు & పచ్చి తేనెను కలిపి తీసుకోవడం వల్ల మీరు మరింత ఆరోగ్యవంతులుగా ఉంటారు.

  3. వాలెరియన్-రూట్-టీ :

  3. వాలెరియన్-రూట్-టీ :

  వాలెరియన్ రూట్లో ఉపశమన ప్రభావాలతో పాటు, ఆందోళన వ్యతిరేక సామర్థ్యాలను కలిగి ఉన్నందున దీనిని చాలామంది ప్రజలు & వైద్యులు ఉపయోగిస్తారు. ఇది లినిరిన్ అని పిలివబడే ఒక రసాయనాన్ని కలిగి ఉంటుంది, ఇది శరీరంలో ఉపశమన ప్రభావాన్ని చూపుతుంది. పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం, వాలెరియన్-రూట్-టీను మిమ్మల్ని త్వరగా నిద్రించేలా చేసి, మీ నిద్రావస్థ నాణ్యతను మెరుగుపరుస్తుంది. కాబట్టి మీరు నిద్రలోకి జారటానికి కష్టంగా ఉంటే, మీరు దీనికోసమే వెతకాల్సి ఉంటుంది.

  4. లెమన్-బామ్-టీ :

  4. లెమన్-బామ్-టీ :

  లెమన్ బామ్ టీ కూడా ఒత్తిడిని, అజీర్ణమును, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ నిద్రను పెంచుతుంది & చల్లటి గొంతు ప్రభావాలను వేగంగా నయం చేయడంలో సహాయపడుతుంది. ఈ లెమన్-బామ్-టీ నిద్రలేమికి ఒక అద్భుతమైన హెర్బ్లా పనిచేస్తుంది, అలాగే ఇది చమోమిలే & వలేరియన్ వంటి ఇతర మూలికలతో కలిపి ఉన్నప్పుడు, ఇది మంచి నిద్ర-ప్రేరేపిత లక్షణాలను కలగచేస్తుంది. లెమన్-బామ్ అనేది ఒక మూలికల జాతికి చెందిన సభ్యత్వం కలిగి ఉండటం వల్ల దీనిని ఔషధాలలోనూ, వంటలోనూ ఉపయోగిస్తారు.

  5. లైమ్-బ్లోసమ్-టీ :

  5. లైమ్-బ్లోసమ్-టీ :

  ఈ లైమ్-బ్లోసమ్-టీ అనేది కేవలం నిద్రలేమిని పరిగణించడమే కాకుండా ఆందోళనను, భయము & ధమనులలో పెరిగిన ఒత్తిడిని కూడా నివారిస్తుంది. దీర్ఘకాలిక అలసటను దూరం చేసేందుకు ఈ మూలికా టీను అందరి కోసం సిఫార్సు చేయబడింది, ఎందుకంటే ఇది ఒత్తిడులను & ఇతర శోథలను తొలగిస్తుంది. నిద్రించే ముందు ఈ టీను తాగడం వల్ల మీ నాడీవ్యవస్థపై ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించకుండా లోతైన సంతృప్తినిచ్చే నిద్రను ప్రేరేపిస్తుంది.

  6. లావెండర్-టీ :

  6. లావెండర్-టీ :

  లావెండర్ అనే హెర్బ్, సుగంధ భరితమైన & సున్నితమైన సువాసనను కలిగి ఉన్నట్లుగా ప్రసిద్ధికెక్కింది. దీనిలో ఉండే ఔషధ లక్షణాలు అద్భుతమైనవి కావున, మీ నిద్రలేమిని నయం చేయగలవు. ఒక కప్పు లావెన్డర్-టీ మీ శరీరమును, మనసును తేలిక చేసి, సులభంగా నిద్రపోవటానికి సహాయపడుతుంది. శ్వాసనాళముల వాపును, ఉబ్బసమును & జలుబు వంటి ప్రభావాలను తగ్గించడానికి లావెండర్-టీను ఛాతీపై కూడా అప్లై చేసుకోవచ్చు.

  7. బనానా-టీ :

  7. బనానా-టీ :

  ఇది మీకు వింతగా అనిపించవచ్చు కానీ, ఈ బనానా-టీ నిజంగా నిద్రలేమికి బాగా సహాయపడుతుంది. నిద్రపోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారికి అరటితొక్కతో చేసిన టీ చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. అరటి తొక్కలో పొటాషియం & మెగ్నీషియంలో పుష్కలంగా ఉంటాయి; అందులో గల మెగ్నీషియం నిద్ర నాణ్యతను మెరుగుపడేలా చేస్తుంది. ఈ టీ తాగుతూ ఉండటం వల్ల మీ రక్తనాళాలకు, కండరాలకు విశ్రాంతిని చేయ కూర్చడంలో సహాయపడుతుంది.

  8. పాషన్-ఫ్లవర్ టీ :

  8. పాషన్-ఫ్లవర్ టీ :

  ఈ పాషన్-ఫ్లవర్ టీ, మీలో ఉన్న ఆందోళనలను ఉపసంహరించి, మంచి నిద్రను కలిగించడం కోసం సంప్రదాయబద్ధంగా వినియోగించబడుతున్నది. ఈ టీను తాగటం వల్ల నిద్రలేమికి శక్తివంతమైన చికిత్సను చేయడంతో పాటు, నాణ్యమైన నిద్రను మీకు మెరుగుపరచగలదని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక వారంపాటు ఈ టీను క్రమం తప్పకుండా తాగేవారిని, తాగని వారితో పోల్చితే మెరుగైన నిద్రను కలిగి ఉన్నారు.

  9. దాల్చినచెక్క-టీ :

  9. దాల్చినచెక్క-టీ :

  దాల్చినచెక్క ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగి ఉంది. అది నిద్రలేమి సమస్యకు మాత్రమే చికిత్సను చేయకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, శరీర బరువును తగ్గించడం, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం, మీలో రోగనిరోధక వ్యవస్థను పెంపొందించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, వాపులను తగ్గించడం మొదలైన వాటిని కూడా చేస్తుంది. మీరు నిద్రపోతున్నప్పుడు ఆ సౌకర్యాన్ని కలిగి ఉంటే, దాల్చినచెక్కతో చేసిన టీను తాగండి. ఇది మీకు వేగవంతమైన నిద్రను కలిగించి, మీ నిద్రను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది.

  English summary

  10 Best Teas That Combat Insomnia

  The main causes of chronic insomnia are anxiety, stress, depression or may be some sort of illness. Herbal teas are known for treating insomnia and they have a natural way of treating a variety of ailments for thousands of years. The herbal teas for combating insomnia are chamomile tea, turmeric tea, lemon balm tea, lavender tea, banana tea, etc.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more