అజీర్ణ మరియు గాస్ సమస్యలకు ఇంటి చిట్కాలు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

అజీర్ణ సమస్యలకు గురైనప్పుడు, తరచుగా ఏం చేస్తుంటారు? తక్షణ ఉపశమనానికి antacids పై ఆధారపడుతూ ఉంటారు, అంతేగా ? ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినా, తరచుగా వాడడం వలన అనేక దుష్ప్రభావాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. మరియు ఇవి పని చేయడానికి కూడా చాలా సమయమే పడుతుంది. కానీ కొన్ని ఇంటి చిట్కాలను అనుసరించడం ద్వారా సత్వర ఉపశమనాన్ని ఇవ్వడంతో పాటు దుష్ప్రభావాలు దరికి రాకుండా చూడగలవు.

అజీర్ణం లేదా అజీర్తి అనేది దీర్ఘకాలిక సమస్యగా కూడా మారవచ్చు. దీనిని డైస్పెప్సియా గా కూడా వ్యవహరిస్తుంటారు. ఈ అజీర్ణం కారణంగా కడుపులో నొప్పి, మంట లేదా అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మరియు ఆహారం సరిగ్గా జీర్ణంకాక, వ్యర్ధ మరియు విష పదార్ధాలు పేరుకుని పోయే అవకాశం ఉంటుంది. ఈ అజీర్తి సమస్యలకు కారణం సగం మన ఆహారపు అలవాట్లే.

10 Home Remedies For Indigestion And Gas

ఎక్కువ కారంతో మరియు మసాలాతో కూడుకున్న ఆహారాలు, డీప్ ఫ్రైడ్ పదార్ధాలు, తిన్న వెంటనే పడుకునే అలవాట్లు, ధూమపానం, మద్యపానం, మరియు ఆస్పిరిన్, ibuprofen వంటి మందులు, ఆసిడ్ రిఫ్లెక్స్ , జీర్ణాశయ కాన్సర్, అల్సర్ మరియు పెద్దపేగు సంబంధిత సమస్యల వంటి అనేక కారణాల మూలంగా అజీర్ణం సంభవిస్తుంది.

కడుపు ఉబ్బరం,వాంతులు, గుండెల్లో మంట, కడుపులో వికారం, రక్తపు వాంతులు, మింగడంలో సమస్యలు వంటివి అజీర్ణానికి ప్రధాన సంకేతాలుగా ఉంటాయి.

కానీ ఈ అజీర్ణ మరియు ఆపానవాయువుల సమస్యల నివారణకు కొన్ని ఇంటి చిట్కాలు చక్కగా పని చేస్తాయి.

1. ఆపిల్ సైడర్ వెనిగర్

1. ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది, ఇది కడుపులో ఆమ్లత్వ స్థాయిలను తగ్గిస్తుంది.

ఒక గాజు వెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ 2 టీస్పూన్లు కలపాలి. దానికి కొoచెం తేనె జోడించి సేవించండి.

అజీర్ణం నుండి ఉపశమనం పొందడానికి ఈ పానీయం చక్కటి పరిష్కారం.

2. పాలు

2. పాలు

చల్లని పాలు త్రాగటం మూలంగా మీ కడుపులో అజీర్ణ సంబంధిత ఆమ్లాలు తగ్గుముఖం పట్టడంలో సహాయపడుతుంది. చల్లటి పాలు కడుపులోని ఆమ్లాలను తటస్థం చేయడానికి మరియు అజీర్ణం చికిత్సకు కూడా సహాయపడుతుంది.

కొవ్వు రహిత పాలు ఒక కప్పు చొప్పున రోజులో రెండుసార్లు త్రాగాలి.

3. పెప్పర్మిoట్ టీ(పుదీనా)

3. పెప్పర్మిoట్ టీ(పుదీనా)

పెప్పర్మిoట్ లోని మెంథోల్ చలువకి మరియు జీర్ణ ప్రక్రియను సున్నితంగా చేయుటకు ప్రసిద్ది. ఇది జీర్ణ సమస్యలకు మరియు కడుపు కండరాల మంటకు తక్షణ ఉపశమనాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది.

ఒక కప్పు వేడి నీటిలో 6 పిప్పర్మెంట్ ఆకులు కలపండి.

5 నుండి 10 నిముషాల వరకు అలాగే ఉంచండి. తర్వాత కొంత తేనెని కలిపి సేవించండి. రోజులో రెండు మూడు సార్లుగా తీస్కోవడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.

4. తేనె

4. తేనె

తేనె అజీర్తి చికిత్సలో సహాయపడే వివిధ పోషకాల మిశ్రమాలకు గొప్ప మూలం. ఇది మంటను తగ్గించడానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది, అందువలన అజీర్ణం తగ్గించుటలో ఎక్కువగా వినియోగిస్తారు.

ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ తేనె ను జోడించండి.

భోజనానికి గంట ముందు సేవించడం మంచిది. నీటితో కలపకుండా నేరుగా కూడా తేనెను ఒక teaspoon తీస్కోవచ్చు.

5. అలోవెరా జ్యూస్

5. అలోవెరా జ్యూస్

అలోవేరా రసం విటమిన్లు, ఖనిజాలు, మరియు అమైనో ఆమ్లాలతో నిండి ఉంటుంది, ఇది మీ శరీరమును హాని చేసే పదార్ధాలను తొలగించుటలో సహాయం చేస్తుంది. మరియు జీర్ణక్రియను పెంచుతుంది.

మీ భోజనానికి ముందు రోజుకు రెండుసార్లు కప్పులో నాల్గవభాగాన కలబంద (అలోవెరా) రసం తీసుకోండి.

6. కొబ్బరి నూనె

6. కొబ్బరి నూనె

కొబ్బరి నూనె, లారిక్ యాసిడ్ మరియు కాప్రిక్ యాసిడ్ వంటి సంతృప్త కొవ్వులు కలిగి ఉంటుంది. ఇది మీ కడుపుకు ఉపశమనం కలగజేస్తుంది. తద్వారా ఆపానవాయువులకు మరియు అజీర్ణ సంబంధిత సమస్యలకు తక్షణ ఉపశమనంగా ఉంటుంది.

మీకు ఇష్టమైన పానీయం లేదా సలాడ్తో కొబ్బరి నూనె కలపి తీసుకోవచ్చు . లేదా కొబ్బరి నూనె తో వంట కూడా ప్రయత్నించవచ్చు.

7. ఫెన్నెల్ విత్తనాలు

7. ఫెన్నెల్ విత్తనాలు

ఫెన్నెల్ విత్తనాలు మీ కడుపు నుండి వాయువుని తొలగించడంలో సహాయపడే కార్మినేటివ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ప్రతి భోజనం తర్వాత సోపు(ఫెన్నెల్) గింజలను ఒక టీస్పూన్ తీసుకోవడం కూడా మంచిదే.

8. చామంతి టీ

8. చామంతి టీ

చామంతి టీ అజీర్ణ చికిత్స కోసం మరొక ప్రసిద్ధ ఇంటి చికిత్సగా చెప్పబడుతుంది. ఇది జీర్ణ వాహిక కండరాలను సడలిస్తుంది, తద్వారా జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.

ఒక కప్పు వేడి నీటిలో చామంతి టీ 1 teaspoon జోడించండి.

5 నుండి 10 నిముషాలు నానునట్లు ఉంచండి. ఇందులో కొంచం తేనెను కలిపి రోజులో రెండు మూడు సార్లుగా తీసుకోవడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది.

9. దాల్చిన చెక్క

9. దాల్చిన చెక్క

దాల్చిన చెక్క మీ జీర్ణాశయం యొక్క కండరాలను విశ్రాంతినిచ్చే క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంది.

ఒక కప్పు వేడి నీటిలో ఒక అంగుళo పొడవు ఉన్న దాల్చిన చెక్కను కానీ లేదా పొడిని కానీ జోడించండి.

5 నుండి 10 నిముషాలు నానబెట్టిన తర్వాత, కొంచం తేనేని జోడించి సేవించండి.

10. మజ్జిగ

10. మజ్జిగ

కడుపులో ఆమ్ల తటస్థీకరణకు సహాయపడే లాక్టిక్ ఆమ్లం మజ్జిగలో ఎక్కువగా ఉంటుంది, తద్వారా అజీర్ణం తగ్గుదలలో సహాయపడుతుంది. మీరు అజీర్ణానికి గురైనప్పుడు చల్లని మజ్జిగ ఒక కప్పు త్రాగాలి.

English summary

10 Home Remedies For Indigestion And Gas

Indigestion is a chronic medical condition, referred to as dyspepsia. Indigestion often causes pain or discomfort in the stomach and makes it difficult to digest food. The home remedies to treat indigestion are apple cider vinegar, cold milk, peppermint tea, honey, aloe vera juice, coconut oil, fennel seeds, etc.
Story first published: Monday, March 26, 2018, 20:00 [IST]