టూత్ డికేను అలాగే కేవిటీలను అరికట్టే 10 హోంరెమెడీస్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

టూత్ డికే మరియు కేవిటీల వంటి ఓరల్ హెల్త్ ప్రాబ్లెమ్స్ ఈ మధ్య సాధారణంగా మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యతో సగం జనాభా సతమతమవుతున్నారు. పిల్లల్లో, టీనేజర్స్ అలాగే వృద్ధులలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

టూత్ డికే వలన పళ్ళ మధ్యలో రంధ్రాలు ఏర్పడతాయి. వాటిని డెంటల్ కేవిటీస్ అనంటారు. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన ఇవి తలెత్తుతాయి. వీటి వలన పళ్లలోని హార్డ్ టిష్యూస్ దెబ్బతింటాయి. సరైన డెంటల్ హైజీన్ ను పాటించకపోవడం వలన కూడా ఇలా జరుగుతుంది.

కేవిటీస్ బారిన పడే ప్రమాదాన్ని కొన్ని ప్రత్యేకమైన ఫ్యాక్టర్స్ పెంచుతాయి. పళ్ళ మధ్యలో ఆహారపదార్థాలు ఇరుక్కుపోవడం, తరచూ ఎదో ఒకటి తినటం, సరైన ఓరల్ హైజీన్ ను పాటించకపోవడం, డ్రై మౌత్ వంటి కారణాల వలన కేవిటీస్ ఏర్పడవచ్చు. బులీమియా మరియు అనోరెక్సియా వంటి ఈటింగ్ డిజార్డర్స్ అనేవి కూడా తీవ్రమైన దంత సమస్యలను తెచ్చిపెడతాయి.

పళ్ళ నొప్పులు, టూత్ సెన్సిటివిటీ, తినేటప్పుడు అలాగే తాగేటప్పుడు చిన్నపాటి నుంచి విపరీతమైన నొప్పి వంటివి టూత్ డికే మరియు కేవిటీలకు సంబంధించిన కొన్ని సాధారణ లక్షణాలు.

home remedies for tooth decay and cavities

క్రోన్స్, రూట్ కెనాల్స్ మరియు ఫిల్లింగ్స్ అనేవి టూత్ డికే మరియు కేవిటీలకు చేసే కొన్ని ట్రీట్మెంట్స్.

ఈ నేచురల్ రెమెడీస్ ను ప్రయత్నించి కేవిటీలతో పాటు టూత్ డికేను అరికట్టవచ్చు.

1. లవంగం:

1. లవంగం:

ఏ రకమైన దంత సమస్యనైనా సులభంగా తగ్గిస్తుంది లవంగం. ఇందులో యాంటీ ఇంఫ్లేమేటరీ, అనాల్జేసిక్ మరియు యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు కలవు. ఇవి నొప్పిని తగ్గించి కేవిటీలను స్ప్రెడ్ కానివ్వకుండా రక్షిస్తాయి.

లవంగాన్ని నములుతూ ఉంటే లవంగం ఆయిల్ వస్తుంది.

అప్పుడు లవంగాన్ని నాలుగు కింద కొన్ని నిముషాలు ఉంచాలి.

2. ఉప్పు:

2. ఉప్పు:

కేవిటీలను అరికట్టే లక్షణం ఉప్పులో కలదు. వివిధ దంత సమస్యలకు ఉప్పు వలన పరిష్కారం పొందవచ్చు. ఉప్పులో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు కలవు. నోట్లోని ఇంఫ్లేమేషన్ ను తగ్గించి, నొప్పిని అదుపులో ఉంచి బాక్టీరియా గ్రోత్ ను అరికడుతుంది.

ఒక టీస్పూన్ ఉప్పును ఒక గ్లాసుడు వెచ్చటి నీటిలోకి తీసుకోవాలి.

ఈ సొల్యూషన్ ను ఒక నిమిషం పాటు పుక్కిలించాలి.

ఈ పద్దతిని రోజుకు మూడు సార్లు పాటిస్తే ప్రయోజనం ఉంటుంది.

3. గార్లిక్:

3. గార్లిక్:

గార్లిక్ లో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ బయోటిక్ ప్రాపర్టీస్ సమృద్ధిగా కలవు. ఇవి టూత్ డికే ను అలాగే కేవిటీలను సులభంగా తగ్గిస్తాయి.

మూడు నుంచి నాలుగు గార్లిక్ క్లోవ్స్ ని క్రష్ చేసి అందులో పావు టీస్పూన్ రాక్ సాల్ట్ ని జోడించండి.

దీనిని ఇంఫెక్టెడ్ టూత్ కి అప్లై చేయండి.

పదినిమిషాల పాటు అలాగే ఉంచి రిన్స్ చేయండి.

ఇలా రోజుకు రెండు సార్లు చేయండి.

4. లికోరైస్:

4. లికోరైస్:

మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచేందుకు లికోరైస్ రూట్ అమితంగా ఉపయోగపడుతుంది. కేవిటీని కలిగించే బాక్టీరియా గ్రోత్ ను నశింపచేస్తుంది.

ఎండిన లికోరైస్ రూట్ పౌడర్ తో బ్రష్ చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

5. పసుపు:

5. పసుపు:

పసుపులో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ కలవు. ఇవన్నీ చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచి టూత్ డికే ను అరికడతాయి.

కాస్తంత పసుపుని ప్రభావిత పంటిపై అప్లై చేయండి.

కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి.

6. వేపాకులు:

6. వేపాకులు:

వేపలో కేవిటీలను అరికట్టే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వేపలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ కలవు. ఇవి కేవిటీలను కలిగించే బాక్టీరియాను సులభంగా నశింపచేస్తాయి.

వేపాకుల రసాన్ని పళ్ళపై అలాగే చిగుళ్లపై రబ్ చేయండి.

కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి రిన్స్ చేయండి.

ఇలా రోజుకు రెండు సార్లు చేయండి.

7. ఉసిరి:

7. ఉసిరి:

ఉసిరి లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే విటమిన్ సి కూడా సమృద్ధిగా లభిస్తుంది. బాక్టీరియాపై పోరాటం జరిపి ఇన్ఫెక్షన్స్ ను అరికట్టే సామర్థ్యం ఉసిరిలో కలదు.

ప్రతి రోజూ తాజా ఉసిరిని తీసుకోండి.

8. నట్ మెగ్:

8. నట్ మెగ్:

నట్ మెగ్ ఎక్స్ట్రాక్ట్ లో లభించే యాంటీకెరియోజెనిక్ ప్రాపర్టీస్ అనేవి కేవిటీలను అరికట్టేందుకు అలాగే కెరియోజెనిక్ ఓరల్ బాక్టీరియా వలన కలిగే టూత్ డీకేను అరికట్టేందుకు తోడ్పడతాయి.

కాటన్ శ్వాబ్స్ ని ఉపయోగించి నట్ మెగ్ ఆయిల్ ను దంతాలపై నేరుగా అప్లై చేయండి.

9. వీట్ గ్రాస్:

9. వీట్ గ్రాస్:

వీట్ గ్రాస్ లో లభించే యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు టూత్ డికే మరియు కేవిటీలపై పోరాటం జరుపుతాయి.

అర గ్లాసు వీట్ గ్రాస్ జ్యూస్ ను రోజూ ఖాళీ కడుపుతో తీసుకోండి.

10. టీ ట్రీ ఆయిల్:

10. టీ ట్రీ ఆయిల్:

టీ ట్రీ ఆయిల్ మీ నోటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. చిగుళ్ళను దృఢంగా ఉంచుతుంది. ఈ ఆయిల్ లో లభించే యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ అనేవి వివిధ దంత సమస్యలపై పోరాటం జరుపుతాయి.

మీ పళ్ళను అలాగే చిగుళ్ళను కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ తో మసాజ్ చేయండి.

ఆ తరువాత వెచ్చటి నీటితో మసాజ్ చేయండి.

English summary

10 Home Remedies For Tooth Decay And Cavities

Summery: Dental cavities are holes which form inside the teeth caused by tooth decay. It is the world's most common oral health problem. Factors that increase the risk of getting cavities are certain foods that stick to your teeth, frequent snacking, etc. The home remedies for tooth decay are cloves, tea tree oil, salt, garlic, turmeric, etc.
Story first published: Saturday, March 31, 2018, 13:20 [IST]