ఒత్తిడిని నియంత్రించే 10 సులభమైన హోమ్ రెమెడీస్!

Subscribe to Boldsky

ఈ రోజుల్లో, తీవ్రమైన పని ఒత్తిళ్ల వలన అలాగే అదనపు బాధ్యతల వలన శారీరక అలాగే మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇక్కడ, ఒత్తిడి వలన ఆరోగ్యం దెబ్బతింటుందని మనం గమనించాలి.

భయానక పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు చాలా మందిలో ఒత్తిడి పెరుగుతుంది. శరీరం అనేక హార్మోన్స్ ని విడుదల చేస్తుంది. ట్రామాటిక్ లైఫ్ ఈవెంట్స్ వలన కూడా ఒత్తిడి కలుగుతుంది.

తలనొప్పి, కండరాల నొప్పులు, చెస్ట్ పెయిన్, కడుపులో ఇబ్బంది, తరచు యూరినేట్ చేయాల్సి రావడం, లైంగిక కోరికలు తగ్గిపోవటం, డ్రై మౌత్, తరచూ జలుబుకు గురవడం, ఎప్పటికీ నిద్రపట్టకపోవటం వంటివి ఒత్తిడికి సంబంధించిన కొన్ని మానసిక అలాగే శారీరక లక్షణాలు.

ఒత్తిడిని నియంత్రించేందుకు ఈ సింపుల్ హోమ్ రెమెడీస్ ఉపయోగకరంగా ఉంటాయి.

1. చమోమైల్ టీ:

1. చమోమైల్ టీ:

చమోమైల్ హెర్బ్ లో ఒత్తిడిని తగ్గించే గుణాలు కలవు. ప్రశాంతబరచి మనసును కుదుటపరిచే లక్షణాలు ఈ హెర్బ్ లో లభిస్తాయి. సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ పై సెడేటివ్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటుంది.

2 టీస్పూన్ల ఎండిన చమోమైల్ ను ఒక కప్పుడు వేడి నీటిలో కలపాలి.

పది నిమిషాల పాటు మరిగించాలి.

రా హనీను టేస్ట్ కోసం జోడించాలి.

ఈ చమోమైల్ టీను రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.

2. ఎప్సమ్ సాల్ట్:

2. ఎప్సమ్ సాల్ట్:

ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడే మరొక అద్భుత పదార్థం ఎప్సమ్ సాల్ట్. ఇందులో మెగ్నీషియం సల్ఫేట్ అధికంగా లభిస్తుంది. ఇది, మీ మానసిక స్థితిని ఇన్స్టెంట్ గా మెరుగుపరుస్తుంది.

మీ బాత్ వాటర్ లో ఒక కప్పుడు ఎప్సమ్ సాల్ట్ ను జోడించండి.

ఇందులో 20 నిమిషాల పాటు ఉండండి.

ఈ పద్దతిని వారానికి రెండు లేదా మూడు సార్లు పాటించండి.

3. మసాజ్:

3. మసాజ్:

సరైన బాడీ మసాజ్ అనేది స్ట్రెస్ రిలీవర్ గా పనిచేస్తుంది. బ్లాక్ అయిన ఎనర్జీ ఛానల్స్ ను ఓపెన్ చేస్తూ స్ట్రెస్ ను తగ్గిస్తుంది. తద్వారా, ఓవరాల్ హెల్త్ ను ఇంప్రూవ్ చేస్తుంది.

ఆలివ్ లేదా కోకోనట్ ఆయిల్ ను మసాజ్ కు ఉపయోగించండి.

నుదుటిపై, మెడపై, భుజాలపై, బ్యాక్ పై అలాగే అరికాళ్ళకి మాసాజ్ చేయండి.

ఈ పద్దతిని రోజూ పాటిస్తే స్ట్రెస్ తగ్గుతుంది.

4. హొలీ బేసిల్:

4. హొలీ బేసిల్:

హొలీ బేసిల్ నే తులసి ఆకులని అంటాము. ఇది సహజమైన యాంటీ స్ట్రెస్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇందులో లభించే ఫైటోకెమికల్స్ అనేవి స్ట్రెస్ ను పారద్రోలడానికి తోడ్పడతాయి.

రోజూ, పది నుంచి 12 తాజా తులసి ఆకులను నమలాలి.

5. అశ్వగంధ

5. అశ్వగంధ

అశ్వగంధను ఇండియన్ జిన్సెంగ్ అని అంటారు. ఇది ఒత్తిడిని తగ్గించేందుకు తోడ్పడుతుంది. స్ట్రెస్ ను అలాగే ఆందోళనను నియంత్రిస్తుంది.

ఒక గ్రాము ఎండిన అశ్వగంధ పొడిని ఒక కప్పుడు మరిగిన పాలలో కలపాలి.

ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు సేవించాలి.

6. గ్రీన్ టీ

6. గ్రీన్ టీ

ఒక కప్పుడు గ్రీన్ టీ లో అనేక పోలీ ఫెనాల్స్ లభిస్తాయి. ఇవి కేట్చిన్స్ కి నిలయం. అందువల్ల స్ట్రెస్ నియంత్రణలో ఉంటుంది. రిలాక్సేషన్ ను పెంపొందించి ఫోకల్ మరియు మెంటల్ అలర్ట్ నెస్ ను ఇంప్రూవ్ చేస్తుంది.

2 టీస్పూన్ల గ్రీన్ టీ ఆకులను మరుగుతున్న ఒక కప్పుడు నీటిలోకి తీసుకోండి.

5 నిమిషాల పాటు మరిగించండి.

వడగట్టి కొంత తేనెను జోడించండి.

ఈ టీను రోజుకు మూడు సార్లు సేవించండి.

7. విటమిన్ B:

7. విటమిన్ B:

స్ట్రెస్ ను తగ్గించి మూడ్ ను ఇంప్రూవ్ చేసే సామర్థ్యం విటమిన్ బీ లో కలదు. B1, B2, B3, B5, B6, B7, B9 మరియు B12 అనేవి 8 B విటమిన్స్. ఇవన్నీ, నెర్వస్ సిస్టమ్ పనితీరును మెరుగుపరుస్తాయి.

బీన్స్, బఠాణీలు, పీనట్స్, స్పినాచ్, కాలే, హోల్ గ్రైన్స్, అవొకాడో, పొటాటో, ఎగ్స్ మరియు డైరీ ప్రోడక్ట్స్ లో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది.

8. కేల్షియం మరియు మెగ్నీషియం:

8. కేల్షియం మరియు మెగ్నీషియం:

స్ట్రెస్ లెవెల్స్ ను తగ్గించి మజిల్స్ ను రిలాక్స్ చేసి తలనొప్పిని తగ్గించేందుకు కేల్షియం మరియు మెగ్నీషియమనే అద్భుతమైన మినరల్స్ తోడ్పడతాయి.

కేల్షియం మరియు మెగ్నీషియం పుష్కలంగా లభించే ఆర్గానిక్ యోగర్ట్, సాల్మన్, లీఫీ గ్రీన్ వెజిటబుల్స్, బ్రొకోలీ, అవొకాడో మరియు నట్స్ ని తీసుకోవడం మంచిది.

9. యోగా

9. యోగా

ఒత్తిడిని తగ్గించేందుకు యోగా తోడ్పడుతుంది. ప్రతి రోజూ యోగాను చేయడం ద్వారా స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుదల పడతాయి. మీ మానసిక స్థితి మెరుగవుతుంది.

ఈగిల్ పోజ్, థండర్ బోల్ట్ పోజ్, చైల్డ్ పోజ్ వంటి కొన్ని పోజెస్ ని ప్రయత్నించడం ద్వారా స్ట్రెస్ ను అదుపులో ఉంచవచ్చు.

10. స్లో మరియు డీప్ బ్రీతింగ్

10. స్లో మరియు డీప్ బ్రీతింగ్

స్లో మరియు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది ఒత్తిడిని తగ్గిస్తుంది. మెదడును ప్రశాంతపరచి మజిల్స్ ను రిలాక్స్ చేస్తుంది.

మీ కళ్ళను మూసుకుని అయిదు కౌంట్స్ వరకు డీప్ బ్రెత్ ని తీసుకోండి.

ఇప్పుడు అయిదు కౌంట్స్ వరకు బ్రెత్ ని హోల్డ్ చేయండి.

ఇలా ఐదు సార్లు చేయండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    10 Simple Home Remedies To Eliminate Stress

    Stress tends to affect our physical and mental health due to additional work problems, financial problems and relationship problems. You can try out these simple home remedies to eliminate stress such as chamomile tea, body massage, Epsom salt, green tea, basil leaves, etc.Nowadays, with too much of work pressure and other added responsibilities
    Story first published: Tuesday, March 20, 2018, 16:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more