ఒంట్లో బాధ‌లు: 10 సంకేతాలు

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

మ‌న శ‌రీరాలు చాలా క్లిష్ట‌మైన‌వి. అప్పుడ‌ప్పుడు ప‌నిచేసే అవ‌య‌వాల ద‌గ్గ‌ర నుంచి అస్స‌లు నిద్ర‌పోని మెద‌డు దాకా ప్ర‌తి వ్య‌వ‌స్థ ఒక‌దానితో ఒక‌టి ప‌నిచేస్తుంది.

10 Ways How Your Body Tells You Something Is Wrong

అందుకే ఎప్పుడైనా ఏదైనా లోపం క‌నిపిస్తే శ‌రీరంలో క‌దలిక‌లు మొద‌ల‌వుతాయి. శ‌రీరం మ‌న‌కు వివిధ ర‌కాలుగా ఏదో చెప్పాల‌ని చూస్తుంటుంది. అవేమిటో తెలుసుకుందాం...

1. దుర‌ద పొక్కులు, వాపులు

1. దుర‌ద పొక్కులు, వాపులు

చాలా చ‌ర్మ అల‌ర్జీలు కొన్ని ప్రాంతాల‌కే పరిమిత‌మ‌వుతాయి. ఉదాహ‌ర‌ణ‌కు చెవి పోగులు బాగా లేక‌పోతే అక్క‌డ దుర‌ద మొద‌లవుతుంది. అలా కాకుండా దేహం పైన అనేక చోట్ల దుర‌ద పొక్కులు, వాపు లాంటివి ఉంటే డాక్ట‌ర్ను సంప్ర‌దించి త‌గిన వైద్యం చేయించుకోవాలి.

2. ఆక‌లి మంద‌గించ‌డం

2. ఆక‌లి మంద‌గించ‌డం

చాలా ర‌కాల రోగాల‌కు ఆక‌లి మంద‌గించ‌డం ఒక సంకేతంగా ఉంటుంది. ఇది వారాల త‌ర‌బ‌డి అలాగే కొన‌సాగితే క్యాన్స‌ర్ చివ‌రి ద‌శ‌లో ఉన్న‌ట్టు లెక్క‌.

3. విరేచ‌నాలు

3. విరేచ‌నాలు

త‌ర‌చూ బాత్రూమ్‌కు వెళ్ల‌డ‌మో, లేదా పూర్తిగా త‌గ్గ‌డ‌మో గ‌మ‌నిస్తే పేగుల్లో ఏదో బాగాలేద‌ని అర్థం. త‌ర‌చూ మూత్రం వ‌చ్చినా అది డ‌యాబెటిస్‌కు దారి తీయ‌వ‌చ్చు.

4. వ‌ణుకుడు రోగం

4. వ‌ణుకుడు రోగం

చేతులు వ‌ణ‌క‌డం, అస్ప‌ష్ట‌మైన క‌ల‌లు రావ‌డం, కండ‌రాలు బిగుసుకుపోవ‌డం లాంటివ‌న్నీ పార్కిన్‌స‌న్ వ్యాధికి సంకేతాలు కావొచ్చు. రాసేటప్పుడు చేతులు వ‌ణుకుతున్న‌ట్టుగా అనిపిస్తే లేదా మెడ ఇత‌ర భాగాలు మ‌న ప్రమేయం లేకుండా క‌దులుతున్న‌ట్టుగా అనిపిస్తే మాత్రం న్యూరాల‌జిస్టును సంప్ర‌దించ‌డం మంచిది.

5. మూడ్ స్వింగ్స్‌లో మార్పులు

5. మూడ్ స్వింగ్స్‌లో మార్పులు

నెల‌స‌రి స‌మ‌స్య ఉన్న ప్ర‌తిసారీ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఐతే ఇలా కాకుండా ఎప్పుడు ప‌డితే అప్పుడు మూడ్ స్వింగ్స్ వ‌స్తే మాత్రం ఆలోచించాల్సిందే. ఫియోక్రోమోసైటోమా వ్యాధి ఉన్న‌వారికి త‌ర‌చూ అడ్రిన‌లైన్ ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో అనేక స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి.

6. పెద్ద‌గా గుర‌క పెడుతుంటే...

6. పెద్ద‌గా గుర‌క పెడుతుంటే...

నిద్ర‌లో బాగా పెద్ద సౌండ్‌తో గుర‌క పెట్టేవాళ్లు సాధార‌ణంగా స్లీప్ అప్నోయా తో బాధ‌ప‌డుతున్న‌ట్టు లెక్క‌,. నిద్ర‌లో ఉండ‌గా ముక్కు నుంచి గాలి రావ‌డం బ్లాక్ అవుతుంది. వీరిలో నాలిక వెన‌క్కి వాలిపోయి గొంతుకు అడ్డం ప‌డుతుంది. దీని వ‌ల్ల శ్వాస తీసుకోవ‌డం క‌ష్టమైపోతుంది. ఇలాంటి సంద‌ర్భాల్లో వెల్ల‌కిలా ప‌డుకోమ‌ని డాక్ట‌ర్లు సూచిస్తారు. ఈ స‌మ‌స్య ఇలాగే కొన‌సాగితే మంచి వైద్యుడ్ని సంప్ర‌దించ‌వ‌చ్చు.

7. ప‌ళ్లు ప‌ట‌ప‌ట‌లాడించ‌డం

7. ప‌ళ్లు ప‌ట‌ప‌ట‌లాడించ‌డం

నిద్ర‌లో ఉండ‌గా ప‌ళ్లు ప‌ట‌ప‌ట కొరికేస్తుంటే దీన్ని బ్ర‌క్సిమ్ అంటారు. ఇది సాధార‌ణంగా సెన్సిటివిటీ ఉన్న‌వాళ్ల‌లో క‌నిపిస్తుంది. ఒత్తిడి వ‌ల్ల ఇది క‌లుగుతుందంటారు. ఒత్తిడి లేనప్పుడు కూడా ద‌వ‌డ‌ల వ‌ల్ల ఈ స‌మ‌స్య ఎదుర‌వ్వ‌చ్చు.

8. ద్ర‌వాల్లో ర‌క్తం

8. ద్ర‌వాల్లో ర‌క్తం

ఉమ్ము, మూత్రం, మ‌లంలో ర‌క్తం వ‌స్తే వెంట‌నే డాక్ట‌ర్ను సంప్ర‌దించడం మంచిది. ఇలా ర‌క్తం రావ‌డం శ‌రీరానికి మంచిది కాదు.

9. క‌డుపులో గ్యాస్‌

9. క‌డుపులో గ్యాస్‌

త‌ర‌చూ తిన్నాక క‌డుపు భారంగా లేదా గొంతు మండుతున్న‌ట్టు అనిపిస్తే గ్యాస్ట్రో స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు లెక్క‌. సాధార‌ణంగా మ‌సాలా ప‌దార్థాలు తిన్న‌ప్పుడు ఇలాంటి భావ‌న వ‌స్తుంది. ఐతే త‌ర‌చూ ఇలా స‌మ‌స్య ఎదురైతే డాక్ట‌ర్ ద‌గ్గ‌ర కెళ్లి క‌డుపు చెక‌ప్ చేయించుకోవ‌డం మంచిది.

10. ప‌చ్చ‌గా మార‌డం

10. ప‌చ్చ‌గా మార‌డం

క‌ళ్లు, చ‌ర్మం, నాలుక ప‌సుపు ప‌చ్చ‌గా మారితే అది జాండిస్‌కు దారి తీయ‌వ‌చ్చు. లివ‌ర్ చెడిపోవ‌డం వ‌ల్లే ఇలా అవుతుంటుంది. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఫిజీషియ‌న్‌ను సంప్ర‌దించ‌డం మేలు.

English summary

10 Ways How Your Body Tells You Something Is Wrong

Did you know that your body is an incredibly complex machine where every system is connected to every other? That's why when there is a problem in one part of your body, you often see the signs of it elsewhere. Like these: increased urination, blood in body fluids, and development of itchy rashes in multiple parts of your body.