For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీడకలలొస్తున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే ఆ కలలు రమ్మంటే కూడా రావు, డిప్రెషన్,ఆందోళనలు కూడా దూరం

ఈ పీడకలల గురించిన వైజ్ఞానిక ఆధారాలు ఇంకనూ పూర్తి స్థాయిలో లేని కారణంగా, వీటి గురించి అనేక మత పరమైన, మరియు ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ప్రచారంలో ఉంటున్నాయి. కొన్ని సందర్భాలలో ఈ పీడకలలు మనం తరచుగా మరచిపోతున్

|

పీడకలలు లేదా చెడు కలలు, వాస్తవానికి కొన్ని ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. క్రమంగా కలత, వ్యాకులత లేదా అసాధారణ భయాలు వంటి అనేక అంశాలు తోడవుతాయి. ఒక్కోసారి సమస్యాత్మకంగా స్లీప్ పెరాలసిస్ ఎదురవుతుంటుంది. రాత్రి సమయాలలో ముఖ్యంగా నిద్ర వేళల్లో తరచుగా ఈ పీడకలలు వస్తుంటాయి. కొందరు తమ కలలను తిరిగి జ్ఞాపకం చేసుకోగలరు, కానీ కొందరికి మాత్రం నిద్ర లేయగానే కలలు జ్ఞాపకాల నుండి పక్కకు తొలగిపోతుంటాయి. మీరు తరచుగా తప్పిస్తున్న కొన్ని సమస్యలను లేదా అంశాలను జ్ఞప్తికి తెచ్చే మార్గంలో భాగంగా, మీరు అచేతన స్థితిలో ఉన్నప్పుడు అవన్నీ, పీడకలల రూపంలో వస్తుంటాయి.

ఒక్కోసారి ఒకే కల తరచుగా పునరావృతమవుతూ, మనిషిని ఒకరకమైన మానసిక పరిస్థితికి కూడా గురిచేస్తుంటాయి. క్రమంగా బ్రాంతికి లోనుకావడంతో పాటు, అవాస్తవాలను వాస్తవంగా మానసిక ధృవీకరణ చేసుకోవడం వంటివి కూడా జరుగుతుంటాయి. కానీ అదృష్టవశాత్తూ, ఇటువంటి పీడకలలను తగ్గించడానికి ఉత్తమమైన సహజ నివారణా మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉపశమన ప్రభావాలను అధికంగా కలిగిన ఈ మూలికలు పీడకలలను నివారిస్తూ మంచి నిద్రను ప్రసాదించగలవని సూచించడమైనది.

ఈ పీడకలల గురించిన వైజ్ఞానిక ఆధారాలు ఇంకనూ పూర్తి స్థాయిలో లేని కారణంగా, వీటి గురించి అనేక మత పరమైన, మరియు ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ప్రచారంలో ఉంటున్నాయి. కొన్ని సందర్భాలలో ఈ పీడకలలు మనం తరచుగా మరచిపోతున్న అంశాల గురించి హెచ్చరిస్తూ, మనల్ని జాగురూతులను చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఒకరకంగా రక్షణ యంత్రాంగం వలె పనిచేస్తుంది. నేటికి కూడా శాస్త్రవేత్తలు సైతం, మానవ మెదడు యొక్క పనితీరుని పూర్తి స్థాయిలో తెలుసుకోలేకపోయారు అన్నది నిజం.

20 Home Remedies For Night Mares

ఏదిఏమయినప్పటికీ పీడకలల వెనుక కొన్ని శాస్త్రీయ సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. పీడకలలు అనేవి ఒత్తిడి మరియు నాడీ సంబంధిత రుగ్మతల ఫలితంగా ఉండే అవకాశాలుగా ఉన్నాయని చెప్పబడింది. శస్త్రచికిత్స వంటి ఒక బాధాకరమైన సంఘటనలను ఎదుర్కోవడం, ప్రియమైన వారిని కోల్పోవడం, ఏదైనా దాడి లేదా తీవ్రమైన ప్రమాదాల వంటి అంశాల కారణంగా కూడా పీడకలలు కలుగుతుంటాయి. రోజువారీ జీవితంలో ఒత్తిడి, గర్భం, మందులు, ఆర్థిక పరమైన ఆందోళనలు, అనారోగ్యం లేదా జ్వరం మరియు ఇతర నిద్రలేమి సమస్యలు కూడా రాత్రి వేళల్లో మన కలలను ప్రభావితం చేయవచ్చు.

పీడకలలను నివారించడమెలా ? నేడు మీ బోల్డ్స్కీ మిమ్ములను పీడకలలనుండి బయటకు తీసుకుని వచ్చేందుకు కొన్ని సమర్థవంతమైన సహజ నివారణలను భాగస్వామ్యం చేస్తుంది. ఈ మూలికలు, చిట్కాలు మిమ్ములను పీడకలల నుండి దూరం చేసి, ప్రశాంతమైన నిద్ర వాతావరణాన్ని ప్రసాదించగలవు. ఈ మూలికలను టీ లేదా కషాయాల రూపంలో తీసుకోవచ్చు.

20 Home Remedies For Night Mares

చామంతి టీ :

చామంతి కూడా ఒత్తిడి మరియు ఆందోళనల ఉపశమనానికి సూచించదగిన ఉత్తమమైన మూలికా వనరుగా ఉంది. చామంతి మగతను కూడా దూరం చేస్తుంది. అజీర్తి సమస్యలు కూడా పీడకలలను ప్రేరేపించే కారకాలలో ఒకటిగా ఉంటుంది. ఆహార సంబంధిత మైల్డ్ అలర్జీలను తగ్గించడంలో, లేదా అధికంగా పనిచేసిన జీర్ణవ్యవస్థకు ఉపశమనంగా చామంతి టీ సహాయం చేస్తుంది. క్రమంగా పీడకలలను తగ్గించి, మంచి నిద్రను ప్రసాదించేలా సహాయం చేయగలదు.

20 Home Remedies For Night Mares


వైల్డ్ లెట్యూస్ :

వైల్డ్ లెట్యూస్ శరీరానికి తేలికపాటి ఉపశమన ప్రభావాన్ని కలిగిస్తుంది మరియు ఆందోళనలను తగ్గిస్తూ, మంచి నిద్రను ప్రోత్సహించేలా సహాయం చేయగలదు. క్రమంగా రాత్రివేళల్లో పీడకలలను నివారించడంలో దోహదపడుతుందని చెప్పబడింది.

20 Home Remedies For Night Mares

హాప్స్ :

ఇది పీడకలలను తగ్గించడంలో సూచించదగిన ఉత్తమ సహజ నివారణా మార్గాలలో ఒకటిగా చెప్పబడింది. ఈ మూలిక ఒక బలమైన ఉపశమనంగా పనిచేస్తుంది మరియు త్వరగా నిద్రించేందుకు మీకు సహాయం చేయగలదు. కానీ కొద్దికాలం మాత్రమే ఉపయోగించవలసినదిగా సూచించడమైనది.

20 Home Remedies For Night Mares

పాషన్ ఫ్లవర్ (కృష్ణ కమలం అని వ్యవహరిస్తారు) :

పీడకలలను నివారించగలిగే సమర్థవంతమైన మూలికా నివారణులలో ఇది కూడా ఒకటి. ఈ హెర్బ్ నరాలను మరియు కండరాల విశ్రాంతిలో సహాయపడే ఉపశమన లక్షణాలకు ప్రసిద్ది చెందింది. క్రమంగా శరీరం శాంతియుతంగా నిద్రించడానికి సహాయపడుతుంది.

20 Home Remedies For Night Mares

థైమ్ :

ప్రశాంతమైన నిద్రని అందివ్వడంలో, మరియు ఆరోగ్యకర జీర్ణక్రియలను ప్రోత్సహించడంలో ఎంతగానో సహాయపడే ఈ మూలికా నివారణి, పీడకలలను తగ్గించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుందని చెప్పబడింది. ఇది కండరాలు మరియు శ్వాసకోశ వ్యవస్థను సడలించి, క్రమంగా పీడకలలను తగ్గించి మంచి నిద్రకు సహాయం చేయగలదు.

20 Home Remedies For Night Mares

వలేరియన్ :

ఈ మూలికను నిద్రా మూలిక అని వ్యవహరిస్తారు. ఇది శక్తివంతమైన సహజ సిద్దమైన మత్తుమందుగా చెప్పబడింది. ఇది ఆరోగ్యకరమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. ఇది మీ కండరాలను సడలించడమే కాకుండా, మానసిక విశ్రాంతికి ఎంతగానో దోహదపడుతాయి. క్రమంగా పీడకలలను నివారించడంలో కూడా సహాయం చేయగలదు.

20 Home Remedies For Night Mares

సేజ్ :

పీడకలలను ఎలా ఆపాలి ? అన్న ప్రశ్న తలెత్తగానే, మొట్టమొదట గుర్తొచ్చే హెర్బ్ ఇది. అనేకరకాల ఔషధ గుణాల కలయికగానే కాకుండా, పీడకలలను నివారించడంలో కూడా ఉత్తమ ప్రభావాలని కలిగిఉంటుందని చెప్పబడింది. ఇది గొంతు మరియు మైగ్రెయిన్స్ సమస్యలను నివారించే అనాల్జేసిక్ లక్షణాలలో ప్రసిద్ది చెందింది.

20 Home Remedies For Night Mares

కన్నా హెర్బ్ :

ఇది ఒక యాంటిడిప్రెసెంట్ వలె పనిచేయడం ద్వారా మెదడుకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ మూలిక, మీ మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ అయిన సెరోటోనిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఈ సెరోటోనిన్ మీకు సంతోషాన్ని కలుగజేసే హార్మోన్ వలె పనిచేస్తుంది. ఉదయాన్నే ఈ మూలికను తీసుకోవడం ద్వారా, ఒత్తిడిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. క్రమంగా పీడకలల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.

20 Home Remedies For Night Mares

జిన్సెంగ్ :

పీడకలలను నివారించడానికి సూచించదగిన ఔషదంగా జిన్సెంగ్ ఉంటుంది. ఇది పీడకలలను నివారించి మంచి నిద్రను ప్రోత్సహించడంలో సహాయం చేస్తుంది. ఇది ఒత్తిడి కారక హార్మోనులైన కార్టిసాల్, అడ్రినలిన్ స్థాయిలను క్రమబద్దీకరించడం ద్వారా మానసిక ప్రశాంతతను చేకూర్చి మంచి నిద్రను ప్రేరేపించగలదు.

20 Home Remedies For Night Mares

లెమన్ బామ్ :

ఈ హెర్బ్ నరాలను శాంతపరచి, మానసిక ఉపశమనానికి దోహదపడుతూ, మంచి నిద్రను ప్రేరేపించగలదు. ఈ మూలికతో చేసిన టీ తరచుగా తీసుకోవడం మూలంగా పీడకలలు కూడా దూరమవుతాయని చెప్పబడింది.

20 Home Remedies For Night Mares

స్కల్ కాప్ :

ఇది నిద్ర నాణ్యత మరియు వ్యవధిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా అనేక నాడీ రుగ్మతలను సమర్దవంతంగా తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. మరియు ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు సైతం ఉపశమనంగా ఉంటుంది. ఫలితంగా పీడకలలకు దూరంగా, మంచి నిద్రను ఆస్వాదించగలుగుతారు.

20 Home Remedies For Night Mares

కాయన్నే పెప్పర్ (కాప్సికం) :

ఇది, శరీర ఉష్ణోగ్రతలను తగ్గించడం ద్వారా మంచి నిద్రను ప్రోత్సహించగలదు. మానసిక ఉపశమనానికి సహాయం చేస్తూ, నరాలను శాంత పరుస్తుంది. క్రమంగా పీడకలలను నివారించగలదు. కావున తరచుగా మీ ఆహార ప్రణాళికలలో కాప్సికం ఉండేలా చూసుకోవడం మంచిదిగా సూచించబడుతుంది.

20 Home Remedies For Night Mares


లేడీ స్లిప్పర్ ఫ్లవర్ :

ఇది పేరుకు తగినట్లే పీడకలలను తరిమి, మానసిక ఉపశమనాన్ని అందిస్తూ మంచి నిద్రను ప్రోత్సహించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నరాలను శాంతపరచడమే కాకుండా, ఆందోళనలను తగ్గించడం ద్వారా ఉపశమనాన్ని అందివ్వగలదు. కొన్ని తీవ్ర భయాందోళనలను కూడా దూరం చేస్తుంది.

20 Home Remedies For Night Mares

వుడ్ బెటోనీ :

ఇది తేలికపాటి ఉపశమన చర్యను కలిగి ఉంటుంది మరియు భావోద్వేగ ఉద్రిక్తతలు, తలనొప్పి మరియు ముఖానికి సంబంధించిన నొప్పినుండి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది. దీని సారం లేదా టీ సేవించడం ద్వారా, పీడకలల నుండి స్వాంతన పొందగలరని చెప్పబడింది.

20 Home Remedies For Night Mares

B విటమిన్స్ :

వీటిని ఒత్తిడి వ్యతిరేక విటమిన్లుగా సూచిస్తారు. ఇవి నాడీ వ్యవస్థ యొక్క సరైన పనితీరును ప్రోత్సహించడంలో సహాయం చేయగలవు. మానసికంగా మరియు శారీరికంగా నరాల సడలింపునిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను తరచుగా అందివ్వాలి. ఒక్కోసారి మనం తీసుకునే ఇతర ఔషధాలు, శరీరంలోని పోషకాల మీద ప్రభావాలను చూపి వాటి తగ్గుదలకు కారణంగా మారుతాయి. కావున శరీరానికి తగినంత బి విటమిన్ అందిస్తున్నారని నిర్ధారించుకోండి. కేవలం అందుచేతనే, వైద్యులు కూడా మందులతో పాటుగా బి-విటమిన్ సప్లిమెంట్స్ కూడా జతచేస్తుంటారు. B విటమిన్ల మూలాలుగా మాంసం, ట్యూనా, లివర్, లెగ్యూమ్స్ (పప్పులు లేదా బీన్స్), తృణధాన్యాలు, బంగాళాదుంపలు, అరటిపండ్లు, మిరపకాయలు, గుడ్లు మరియు మొలాసిస్ ఉన్నాయి.

20 Home Remedies For Night Mares

వెల్లకిలా పడుకోకండి :

నిజానికి వెల్లకిలా పడుకోవడం మంచిదని అనేకమంది సూచిస్తుంటారు. అందులో ఎటువంటి తప్పూ లేదు. మిలటరీ పొజిషన్ మంచి నిద్రకు దోహదం చేస్తుంది. కానీ, పీడకలలు వేధిస్తున్న ఎడల, మీ పొజిషన్ మార్చే ప్రయత్నం చేయండి. ఒక్కోసారి పీడకలలు అధికమైతే స్లీప్ పెరాలసిస్ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని, కొన్ని పరిశోధనల్లో తేలింది. స్లీప్ పెరాలసిస్ తలెత్తితే, నిద్రలేయాలని మెదడు సూచించినా కూడా శరీరం కదలలేని అచేతన స్థితికి గురవుతుంది. ఒక్కోసారి ఈ పరిస్థితి కొద్ది నిమిషాలే ఉన్నా కూడా, ఒక్కోసారి తీవ్రంగా మారుతుంది. క్రమంగా శ్వాస మీద ప్రభావం చూపి, ప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చు. మనదేశంలో సంవత్సరానికి కోటి మందికి పైగా ఈ స్లీప్ పెరాలసిస్ బారిన పడుతున్నారని అంచనా.

20 Home Remedies For Night Mares

కెఫీన్ మరియు ఆల్కహాల్ :

నిద్రకు ముందు కనీసం కొన్ని గంటల ముందు వీటిని తీసుకోవడం నివారించడం మంచిది. ఇవి మీ నిద్రను నాశనం చేయడమే కాకుండా. ఆందోళనా స్థాయిలను పెంచి, పీడకలలకు దారితీస్తుంది.

20 Home Remedies For Night Mares

రిలాక్స్ :

తేలికపాటి సంగీతం, వెచ్చని నీటితో స్నానం, ధ్యానం, నిద్రకు కనీసం గంట ముందు టెలివిజన్లు, సెల్ ఫోన్లు మరియు కంప్యూటర్లకు దూరంగా ఉండడం, ఏదైనా ఆహ్లాదభరితమైన అంశాల గురించి చర్చించడం వంటివి ఆచరించడం మంచిది.

20 Home Remedies For Night Mares

ఒత్తిడి నిరోధకాలు :

మీరు పీడకలలతో బాధపడుతున్న ఎడల, హింసాత్మక చలనచిత్రాలను చూడటం లేదా నిద్రకు ముందు భారీ సంగీతాన్ని వినడం మంచిది కాదు. పుస్తకాన్ని చదవడం మరియు మెలోడీ గీతాలను వినడం ద్వారా మానసిక విశ్రాంతిని ఇచ్చే ప్రయత్నం చేయండి.

20 Home Remedies For Night Mares

సెయింట్-జాన్ వోర్ట్ :

ఈ హెర్బ్ కూడా డిప్రెషన్, ఆందోళనలను తగ్గించి పీడకలలను దూరంచేస్తూ మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.

English summary

పీడకలలొస్తున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే ఆ కలలు రమ్మంటే కూడా రావు, డిప్రెషన్,ఆందోళనలు కూడా దూరం

20 Home Remedies For Night Mares
Desktop Bottom Promotion