For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దోమకాటు వలన సంభవించే ఈ ఏడు భయంకర వ్యాధుల గురించి మనం కచ్చితంగా తెలుసుకోవాలి

దోమకాటు వలన సంభవించే ఈ ఏడు భయంకర వ్యాధుల గురించి మనం కచ్చితంగా తెలుసుకోవాలి

|

దోమకాటు వలన అనేక ప్రాణాంతక వ్యాధులు కలిగే ప్రమాదం ఉంది. దోమకాటు నుంచి రక్షణకు తగిన చర్యలను తీసుకోవాలి.

చాలా చిన్న జీవులైన దోమల వంటివి కేవలం ఒకే ఒక్క కాటుతో మానవుని ఆరోగ్యానిన్ని దెబ్బతీయగలవు.

కేవలం దోమకాటుతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న అనేక సంఘటనల గురించి మనం వార్తల్లో తరచూ చూస్తూనే ఉన్నాం. నిజానికి, దోమకాటు వలన ఆయా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయనడంలో సందేహం లేదు.

7 Dangerous Diseases Spread By Mosquitoes That We Must Know About!

ఈ మధ్యకాలంలో అనేక వ్యాధులతో మానవుడు సతమతమవుతున్నాడు. వాటిలో కొన్ని నీటి ద్వారా వ్యాపిస్తే మరికొన్ని గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్నాయి. ఇంకొన్ని కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతున్నాయి.

అనేక రీసెర్చ్ ల గణాంకాల ప్రకారం దోమకాటు ద్వారా అనేక వ్యాధులు మానవుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా, భారత్ వంటి ట్రాపికల్ దేశాలలో వర్షాకాలంలో దోమలు ఎక్కువగా వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. అప్పటి నుంచి దోమకాటు వలన వ్యాప్తి చెందే వ్యాధుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.

కాబట్టి, మనం నివసించే చోట అలాగే వర్క్ స్పేసేస్ లో దోమలు లేకుండా చూసుకోవాలి.

దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే కొన్ని భయంకర వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. జికా:

1. జికా:

2016లో జికా వైరస్ అనేది ప్రతి ఇంట్లోనూ సాధారణంగా మాట్లాడుకునే ఒక మాటగా మారిపోయింది. 2016కు ముందు ఇది అంత తీవ్రతరంగా లేదు. ఎయిర్ పోర్ట్స్ అలాగే రైల్వే స్టేషన్స్ లో జికా వైరస్ వలన తలెత్తే డేంజర్స్ గురించి అలాగే వ్యాక్సినేషన్ గురించి సైన్ బోర్డ్స్ ను మనం గమనించే ఉంటాము. ఈ వైరస్ యొక్క వ్యాప్తి జికా వైరస్ వ్యాప్తిలో ఉండే దేశాలతో కనెక్ట్ అయ్యే పోర్ట్స్ లో ఎక్కువగా ఉండేది.

ఇండియా, ఆఫ్రికాతో పాటు మరికొన్ని సౌత్ ఈస్ట్రన్ కంట్రీస్ లో జికా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండేది. ఈ వ్యాధి అనేది ఏడెస్ ఏజిప్టి దోమల ద్వారా వ్యాప్తి చెందేది. గర్భిణీలకు ఈ వ్యాధి సోకితే వారి శిశువులో పుట్టుకతో కొన్ని లోపాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది .

2. వెస్ట్ నైల్:

2. వెస్ట్ నైల్:

ఇది దోమల ద్వారా వ్యాప్తి చెందే మరొక్క వైరల్ డిసీజ్. ఆఫ్రికాలోని కొన్ని వెస్ట్రన్ పార్ట్స్ లో నైల్ నదీ ప్రాంతంలో ఈ వ్యాధి ఉద్భవించిందని అంటారు. ఈ వ్యాధి ప్రపంచ దేశాలకూ వ్యాప్తి చెందడం ప్రారంభించింది. ఇండియాతో పాటు కొన్ని సౌత్ ఈస్ట్ ఆసియన్ కంట్రీస్ అలాగే యునైటెడ్ స్టేట్స్ వంటి కంట్రీస్ కు కూడా ఇది వ్యాప్తి చెందింది.

ఈ వైరస్ బారిన పడిన వారిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. రాను రాను ఈ వైరస్ అనేది ఇంటర్నల్ గా నశిస్తుంది. అయితే, కొంత మందిలో ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. దాంతో బ్రెయిన్ ఇంఫ్లేమేషన్ తో పాటు మరణం కూడా సంభవిస్తుంది.

3. డెంగ్యూ:

3. డెంగ్యూ:

డెంగ్యూ అనే పదం వినగానే జనాల్లో ఒక రకమైన కలవరం కనిపిస్తుంది. ముఖ్యంగా భారత దేశంలో ఈ లక్షణాన్ని గమనించవచ్చు. డెంగ్యూ అనేది ప్రమాదకరమైన వైరల్ డిసీజ్. ఈ వ్యాధి సోకిన వ్యక్తి మరణించే ప్రమాదం ఉంది. దీనికి ప్రత్యేకమైన చికిత్స గాని వ్యాక్సినేషన్ గాని లేదు. డెంగ్యూ అనేది జికా వంటి ఏడెస్ ఏజిప్టి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆసియా, ఆఫ్రికా మరియు కరీబియన్ ఐలాండ్స్ లో దాదాపు 2.5 బిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని అంచనా.

4. చికున్ గున్యా:

4. చికున్ గున్యా:

ఇది ఇంకొక భయంకరమైన వైరల్ డిసీజ్. దీని వలన ఫ్లూ వంటి లక్షణాలు దాడిచేసి రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. ఆర్గాన్స్ ను దెబ్బతీసి ప్రాణాలను పోగొడుతుంది. ఈ వ్యాధి అనేది జికా మరియు డెంగ్యూ వ్యాధులను వ్యాప్తి చేసేటటువంటి ఏడెస్ ఏజిప్టి దోమల జాతి ద్వారానే వ్యాప్తి చెందుతుంది.

ఆసియా మరియు ఆఫ్రికా వంటి అండర్ డెవెలప్డ్ కంట్రీస్ లో చికున్ గున్యా అనేది ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. యునైటెడ్ స్టేట్స్ లో ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించిన కొన్ని సంఘటలను నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

5. సెల్వ్ (St. Louis Encephalitis)

5. సెల్వ్ (St. Louis Encephalitis)

ఈ వ్యాధి అనేది అరుదుగా సంభవించే వ్యాధి. ఇది ప్రపంచంలోని కేవలం ఏడుగురిపైనా మాత్రమే దాడి చేస్తుంది. దోమల ద్వారానే ఈ వ్యాధి తలెత్తే ప్రమాదం ఉంది. ఫీవర్, తలనొప్పి, గందరగోళం, ట్రెమర్స్, కోమా, కన్వల్షన్స్, పరాలసిస్ వంటి లక్షణాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి బ్రెయిన్ ను దెబ్బతీస్తుంది.

ఈ వైరస్ అనేది ఈస్ట్రన్ మరియు సెంట్రల్ యునైటెడ్ స్టేట్స్ కు చెందిన వుడెడ్ మరియు స్వామ్పీ రీజన్స్ లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలు ఈ ప్రాంతాలలో వేగంగా వృద్ధి చెందుతాయి.

7. మలేరియా:

7. మలేరియా:

దోమల ద్వారా వ్యాప్తి చెందే మరొక వైరల్ డిసీజ్ మలేరియా. ఇది దశాబ్దాల తరబడి ప్రజలను వణికిస్తోంది. వ్యాక్సినేషన్స్ ఉన్నా కూడా అవి ఈ వ్యాధిని పూర్తిగా నిరోధించేందుకు తోడ్పడటం లేదని తెలుస్తోంది. ఈ వైరస్ వలన కూడా డీసెంట్రీ మరియు డయేరియా తో పాటు ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

English summary

7 Dangerous Diseases Spread By Mosquitoes That We Must Know About!

Apart from biting, certain species of mosquitoes cause deadly diseases in human beings, many of which do not have a specific treatment or vaccination! These are some of the most dangerous diseases caused by mosquitoes: Zika, West Nile, dengue, chikungunya, SELV (St. Louis Encephalitis), yellow fever, and malaria.
Desktop Bottom Promotion