For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ క్యాన్సర్ కారక వస్తువులను మీ గదిలోంచి తొలగించండి!

|

ప్రపంచవ్యాప్తంగా మరణాలకు దారితీసే కారణాలలో క్యాన్సర్ అనేది రెండవ ప్రధాన కారణమని తేలింది. వరల్డ్ హెల్త్ అరగనైజేషన్ స్టేటిస్టిక్స్ (WHO) ప్రకారం, 2018లో దాదాపు 9.6 మిలియన్ల మరణాలు కేవలం క్యాన్సర్ ద్వారా మాత్రమే జరిగాయని తెలుస్తోంది.

క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని పెంచేందుకు అనేక కారణాలు తమ పాత్ర పోషిస్తున్నాయి. అనారోగ్యకర లైఫ్ స్టైల్ అనేది ముఖ్యకారణం. స్మోకింగ్ అనేది కూడా తన వంతు పాత్ర పోషిస్తోంది. అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం, శుభ్రతను పాటించకపోవటం, మద్యపానం, జెనెటిక్స్ వంటివి క్యాన్సర్ సమస్య ఎదురవడానికి గల మరికొన్ని కారణాలు.

క్యాన్సర్ సమస్య బారిన పడేసే కొన్ని సాధారణ కారణాల గురించి మనం ఇప్పటివరకు ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు చెప్పుకోబోయే కారణాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. బెడ్ రూమ్ లో సాధారణంగా ఉండే వస్తువులు కూడా క్యాన్సర్ కారకమైనవని తెలిసి షాక్ కి గురవుతారు.

మీకు తెలుసా, మీ బెడ్ రూమ్ లో లభ్యమయ్యే వివిధ వస్తువులు క్యాన్సర్ కి గురిచేస్తాయని? వాటి గురించి మీరు తెలుసుకుంటే కచ్చితంగా షాక్ కి గురవడం సహజం.

కాటన్ పిల్లోస్ మరియు బెడ్ షీట్స్:

కాటన్ పిల్లోస్ మరియు బెడ్ షీట్స్:

మనమందరం పిల్లోస్ ని ఉపయోగిస్తాము. అయితే, కాటన్ పిల్లోస్ ని వాడటం వలన క్యాన్సర్ బారిన పడే ప్రమాదం అధికమని తెలుస్తోంది. దీని వెనుక గల ప్రధాన కారణమేంటంటే, పత్తి సాగులో అనేక పురుగులమందులను అలాగే క్రిమిసంహారకాలను వినియోగిస్తారు. పత్తి సాగు సంరక్షణలో భాగంగా హెర్బిసైడ్స్ ను కూడా స్ప్రే చేస్తారు. ఒక అధ్యయనం ప్రకారం, గ్లైఫోసైట్ ఆధారిత హెర్బిసైడ్స్ అనేవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని తేలింది. కార్సినోజెనెసిస్ జర్నల్ లో పబ్లిష్ అయిన ఈ అధ్యయనం ప్రకారం హెర్బిసైట్స్ లో గ్లైఫాసెట్ అనే క్రియాశీలక పదార్థం లభిస్తుంది. ఇది క్యాన్సర్ బారిన ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ రిస్క్ నుంచి తప్పించుకోవాలంటే ఆర్గానిక్ కాటన్ తో తయారైన బెడ్ షీట్స్ ను మరియు పిల్లోస్ ను ఉపయోగించాలి.

పెయింట్:

పెయింట్:

మనలో చాలా మందికి పెయింట్ వాసన అంటే ఇష్టం. అయితే, దురదృష్టవశాత్తూ, ఇది కూడా క్యాన్సర్ కి దారితీస్తుందని తేలింది. పెయింట్స్ లో క్యాన్సర్ కి దారితీసే అస్థిర కర్బన సమ్మేళనాలు కలిగి ఉంటాయి. మార్చ్ 2018న పబ్లిష్ అయిన జర్నల్ ఆఫ్ ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్ లోని అంశాల ప్రకారం వృత్తిపరంగా పెయింట్ కి ఎక్కువగా ఎక్పోజ్ అయ్యే పెయింటర్స్, ఆర్టిస్ట్స్ మరియు ఇతర వర్కర్స్ లో లంగ్, బ్లాడర్, ఓరల్ మరియు ప్యాంక్రియాస్ క్యాన్సర్ ప్రమాదాలు అలాగే నొన్లింఫోసైటిక్ ల్యుకేమియా ఎక్కువగా తలెత్తే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అందువలన, ఈ రిస్క్ నుంచి రక్షణ కోసం నాన్-వీఓసి పెయింట్స్ ను ప్రిఫర్ చేయాలి.

ఎయిర్ ఫ్రెషెనర్స్:

ఎయిర్ ఫ్రెషెనర్స్:

ఎయిర్ ఫ్రెషెనర్స్ వలన చక్కని పరిమళం గదంతా ఆక్రమించబడుతుంది. అందువలన, తరచూ, వీటిని బెడ్ రూమ్ లో స్ప్రే చేస్తూ ఉంటారు. బాత్ రూమ్స్ మరియు వర్క్ ప్లేసెస్ లో కూడా వీటికి ప్రాధాన్యత కలదు. మరి, ఇవి క్యాన్సర్ కారకమని మీకు తెలుసా? వీటి వలన క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువవుతుంది. వీటికి దూరంగా ఉండండి. ఎయిర్ ఫ్రెష్నర్స్ బదులు మల్లె మరియు గులాబీలను వినియోగించడం ప్రారంభించండి. ఎసెన్షియల్ ఆయిల్స్ తో చక్కటి నేచురల్ స్ప్రేస్ ను ఇంటివద్దే తయారుచేసుకోవచ్చు.

సింథెటిక్ లెదర్ ఫర్నీచర్:

సింథెటిక్ లెదర్ ఫర్నీచర్:

పోలైవినిల్ క్లోరైడ్ (పీవీసి) అనే ప్లాస్టిక్ పాలిమర్ ను ఉపయోగించి సింథెటిక్ లెదర్ ను తయారుచేస్తారు. ఇది ప్రమాదకరం. ఇందులో ప్రమాదకరమైన ఎన్నో కెమికల్స్ ను వినియోగిస్తారు. కాబట్టి, ఇటువంటి సింథెటిక్ లెదర్ తో తయారయ్యే ఫర్నీచర్ ను వినియోగించడాన్ని అవాయిడ్ చేయండి. అలాగే, మెలమైన్, పార్టికల్ బోర్డు, మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డు (ఎండీఎఫ్) ఫర్నీచర్స్ ని అవాయిడ్ చేయండి. వీటిలో టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి. అందువలన, వుడ్ ఫర్నీచర్ ను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యతనివ్వండి. ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి.

వాటర్ ప్రూఫ్ కుషన్స్ మరియు పిల్లోస్ ని వాడటాన్ని అవాయిడ్ చేయాలి. వీటిలో ప్రమాదకర పదార్థాలు ఉంటాయి. అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి, ఫర్నీచర్ ను కొనుగోలు చేసేటప్పుడు సింథటిక్ లెథర్ తో తయారయ్యే వాటిని ప్రిఫర్ చేయవద్దు.

గ్యాడ్జెట్స్ మరియు ఎలెక్ట్రానిక్ డివైసెస్:

గ్యాడ్జెట్స్ మరియు ఎలెక్ట్రానిక్ డివైసెస్:

నిద్రపోయేటప్పుడు సెల్ ఫోన్స్ ను దగ్గరగా ఉంచుకోవడం సాధారణ అలవాటుగా మారిపోయింది. అలాగే మన గదులలోనే టీవీ, కంప్యూటర్ వంటి కొన్ని ఎలెక్ట్రానిక్ డివైస్ లు కూడా స్థానం సంపాదించేసాయి. ఈ డివైసెస్ నుండి ఎలెక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్స్ అనేవి విడుదలవుతాయి. ఇవి క్యాన్సర్ కారకమైనవి. అలాగే వీటికి ఎక్కువకాలం ఎక్పోజ్ అవడం వలన క్యాన్సర్ కి గురయ్యే ప్రమాదం ఎక్కువవుతుంది. క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే, ఈ డివైసెస్ ను నిద్రపోయేటప్పుడు ఆఫ్ లో ఉంచాలి. దీని వలన, క్యాన్సర్ బారిన పడే ప్రమాదం తగ్గడంతో పాటు నిద్రకు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఎదురవదు.

మ్యాట్రెసెస్ మరియు డ్రేప్స్:

మ్యాట్రెసెస్ మరియు డ్రేప్స్:

డ్రేప్స్ మరియు సౌకర్యాన్ని అందించే మ్యాట్రెసెస్ ను ఫ్లేమ్ రిటార్డెన్ట్స్ వంటి కొన్ని కెమికల్స్ లో ముంచుతారు. వీటి వలన క్యాన్సర్ వంటి వివిధ అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ కెమికల్స్ అనేవి బ్రెయిన్ డెవలప్మెంట్ ను అడ్డుకుంటాయి. అందువలన, హార్మోన్స్ లో అసమతుల్యం ఏర్పడుతుంది. ఆర్గానిక్ మ్యాట్రెసెస్ ను ప్రిఫర్ చేయడం ద్వారా ఈ సమస్యల నుంచి రక్షణను పొందవచ్చు.

English summary

Get Rid Of These Cancer-causing Things From Your Room!

There are various causes that trigger cancer, some of these causes are related to an unhealthy lifestyle. Smoking is one of the main causes triggering this disease, other causes include not following a healthy diet, sedentary lifestyle, personal hygiene, excess alcohol consumption, genetics, etc.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more