వేసవిలో ముక్కు నుంచి రక్తస్రావమవ్వడాన్ని నిరోధించే ఇంటి చిట్కాలు !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

పిల్లలు ఎంతగానో ఎదురుచూస్తున్న వేసవికాలం మొత్తానికి వచ్చేసింది, కానీ ఈ వేసవికాలం మాత్రం తల్లులకి భారం కానుంది.

సాధారణంగా వేసవికాలం అనేది పిల్లలకు ఆటలు విడిదిగా వుంటుంది, లెక్కలేనంత సమయాన్ని ఆటల కోసం, వీడియో గేమ్స్ & ఐస్ క్రీమ్స్ వంటి వాటిపై పిల్లలు ఎక్కువగా కేటాయిస్తారు. మైదానాల్లో పిల్లలు ఉదయం నుంచే కేరింతలు కొడుతుంటారు. క్రికెట్, ఫుట్-బాల్ (లేదా) బాస్కెట్బాల్ వంటి క్రీడలతో మైదానాలు సాయంత్రం వరకూ కళకళలాడతాయి.

కాని ఈ వేసవి అనేది తల్లులను ఇబ్బంది పెట్టే చాలా గడ్డుకాలం, ఎందుకంటే పిల్లల ఆరోగ్య విషయంలో చాలా రకాల సమస్యలను తల్లులు ఎదుర్కొంటారు, వాటిలో ముఖ్యమైనది ముక్కు నుంచి రక్తస్రావం (నోస్ బ్లీడింగ్) జరగడం.

పెద్దలు & పిల్లల్లో ఈ సమస్య అనేది చాలా సాధారణమైనది. ఇది సాపేక్షంగా కనపడే ఒక సాధారణ పరిస్థితి, దీని గూర్చి మీరు ఆందోళన చెందాల్సిన పని ఏమీ లేదు, కాని మీ ముక్కు నుంచి రక్తం బయటకు రావడాన్ని మాత్రం ఒక తీవ్ర భయాందోళనతో కూడిన పరిస్థితిగా మీరు భావించాలి.

ముక్కు నుంచి రక్తస్రావమవమయ్యే (నోస్ బ్లీడింగ్) పరిస్థితిని శాస్త్రీయంగా "ఎపిస్టెక్సిస్" అని పిలుస్తారు. ఈ పరిస్థితి వల్లే మీ ముక్కు రంధ్రాల నుంచి రక్తం బయటకు వస్తుంది. ముక్కు నుంచి రక్తస్రావమవ్వడానికి, మీ ముక్కు రంధ్రాలలో ఉన్న రక్తనాళాలలో ఒక చిన్న రాప్చర్ (రుద్దటం) వల్ల రక్తస్రావం సంభవిస్తుంది. ఈ రక్తస్రావం ఏర్పడటమనేది చాలా సాధారణమైనప్పటికీ అందుకు గల కారణాలు - దాని యొక్క పరిష్కార మార్గాలను గూర్చి చాలా మంది ప్రజలకు తెలియదు.

వేసవికాలంలోనే ఈ పరిస్థితి ఎదురవడం వెనుక అనేక కారణాలున్నాయి. మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో వేసవి అనేది పొడిగాను & చాలా వేడిగానూ ఉంటుంది, ఇది మన ముక్కులోని అంతర్గతంగా ఉన్న సున్నితమైన లైనింగ్ను వదులుగా చేస్తుంది, దీని వలన శ్లేష్మం యొక్క రక్షిత పొర పొడిగా మారుతుంది. వేసవికాలంలోనే ఈ అలెర్జీలు తీవ్రంగా విజృంభిస్తాయి. మన చేతితో ముక్కుని రాప్చర్ (రుద్దటం వంటివి) చేయడం వల్ల ముక్కులోని సున్నితంగా ఉన్న గోడల నిర్మాణంలో ఉన్న రక్తనాళాలు దెబ్బతిని ముక్కు నుంచి రక్తస్రావం కావడానికి ప్రధాన కారణం అవుతుంది.

వేసవిలో ముక్కు నుంచి రక్తస్రావం జరగడమనేది సాధారణం అయినప్పటికీ, ఈ పరిస్థితి ఏ మాత్రం పరిమితం కాలేదు. ఈ సాధారణ దృగ్విషయము ఎప్పుడైనా, ఎక్కడైనా సంభవించవచ్చు. వేసవిలో ఇలా రక్తస్రావం జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.

ఈ రక్తస్రావం ఏర్పడటానికి గల వివిధ కారణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి : అవి,

1) పొడి గాలిని పీల్చడం వల్ల,

2) ముక్కును తీవ్రంగా చీదడం వల్ల,

3) సీజనల్గా వచ్చే అలర్జీల వల్ల,

4) శరీరంలో ఏర్పడిన అధిక వేడి వల్ల.

మీరు తరచుగా ఈ రక్తస్రావాన్ని ఎదుర్కొంటుంటే, ఈ సమస్యను అధిగమించడానికి మీకు సహాయపడే కొన్ని నివారణ చికిత్సలు ఇక్కడ ఉన్నాయి: అవి,

1) ప్రథమ చికిత్స :

1) ప్రథమ చికిత్స :

ముక్కు నుంచి రక్తస్రావాన్ని ఆపడానికి మీరు చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే, మీ ముక్కును చేతివేళ్ళతో పించ్ (నొక్కడం) చేయాలి. మీ తలను నెమ్మదిగా వెనక్కి తిప్పి, మీ నాసికా కుహరాలను నొక్కడం ద్వారా మీ ముక్కు నుంచి రక్తస్రావం జరగకుండా, ఒత్తిడిని కలిగిస్తుంది.

ఎలా చేయాలి:

• మీ ముక్కు యొక్క మృదువైన భాగాన్ని 5 నిమిషాల పాటు నొక్కి పట్టుకోండి.

• అలా ఒత్తిడిని తగ్గించి - కొంత సమయం వరకు నిటారుగా కూర్చోండి.

• ఇలా చేసిన వెంటనే మీ ముక్కు నుంచి రక్తస్రావం జరగడం ఆగిపోతుంది.

2) ఉల్లిపాయరసం :

2) ఉల్లిపాయరసం :

ఉల్లిపాయ నుంచి వచ్చే ఘాటైన వాసన రక్తస్రావమును ఖచ్చితంగా ఆపగలదు. అలాగే, రక్తాన్ని గడ్డకట్టించడానికి ఉల్లిపాయ అనేది ఒక సమర్థవంతమైన పరిష్కారం. కాబట్టి ఈ నివారణ పద్ధతి, పైన చెప్పిన పద్ధతి కంటే చాలా వేగంగా పనిచేస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

• తాజాగా సేకరించిన ఉల్లిపాయ రసాన్ని తీసుకోండి.

• ఒక శుభ్రమైన డ్రాపర్ను ఉపయోగించి, ప్రతి ముక్కులో 2-3 చుక్కల ఉల్లిపాయ రసాన్ని వేయండి.

• మీ తల కొద్దిగా వంచి 5 నిమిషాల పాటు అలానే ఉంచండి.

3) కోల్డ్ కంప్రెస్ :

3) కోల్డ్ కంప్రెస్ :

"కోల్డ్ కంప్రెస్" అనేది ముక్కు నుంచి జరిగే రక్తస్రావాన్ని వెంటనే ఆపగలిగే మరొక అత్యంత ప్రభావవంతమైన పద్ధతి. ఇది రక్తనాళాలను నియంత్రిస్తూ, వాటిని నుంచి రక్తస్రావం జరగకుండా ఆపేస్తుంది. ముక్కు నుంచి రక్తస్రావాన్ని ఆపడానికి మీరు మంచు గడ్డలను ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ వివరించారు. వివరించారు

ఎలా ఉపయోగించాలి:

• ఒక శుభ్రమైన టవల్లో కొన్ని మంచు గడ్డలను వేయండి.

• మీ తలను కొద్దిగా పక్కకు వంచి, ఆ మంచు గడ్డలతో మీ ముక్కుపై ఒత్తుతూ ఒత్తిడిని కలిగించండి.

• 2-3 నిమిషాల పాటు మీరు ఇలానే చేయండి (లేదా) మీరు కంఫర్టబుల్గా ఉండే వరకు ఈ పద్ధతిని కొనసాగించండి.

4) కొత్తిమీర :

4) కొత్తిమీర :

భారతీయుల అన్ని వంటశాలలో సాధారణంగా కనిపించే పదార్ధాలలో ఇది ఒకటి. దీనిని వంటశాలకు సంబంధించిన అన్ని పదార్థాలలో ఉపయోగిస్తారు. కొత్తిమీర కూడా ముక్కు నుంచి వచ్చే రక్తస్రావాన్ని అడ్డుకోగలదు. కొత్తిమీరలో ఉండే శీతలీకరణ లక్షణాలు, ముక్కు నుంచి వచ్చే రక్త స్రావాన్ని అడ్డుకోవడంలో బాగా పనిచేస్తాయి.

ఎలా ఉపయోగించాలి:

• కొన్ని కొత్తిమీర ఆకులు తీసుకోని, వాటిని మిక్సీలో వేసి చాలా తక్కువ నీటితో కలిపి బాగా మిక్స్ చేయండి.

• అలా తయారైన మిశ్రమం నుంచి సేకరించిన రసాన్ని, ప్రతి ముక్కులో 2-3 చుక్కలుగా వేయండి.

5) పెట్రోలియం జెల్లీ:

5) పెట్రోలియం జెల్లీ:

మానవునికి ఎదురయ్యే అన్ని రకాల పరిస్థితుల్లో ఎప్పటికీ తోడుగా ఉండే ఒక మంచి నేస్తం ఈ పెట్రోలియం జెల్లీ. ఈ పెట్రోలియం జెల్లీ కూడా మీ ముక్కు నుంచి వచ్చే రక్తస్రావాన్ని సమర్థవంతంగా ఆపడానికి ఉపయోగించబడుతోంది. ముక్కు పొడిబారడం అనే సమస్య కారణంగా కూడా ముక్కు నుంచి రక్తస్రావం అనేది జరుగుతుంది. పెట్రోలియం జెల్లీ, ఈ సమస్యను దాని మూలాలు నుండి తొలగిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

• మీ ముక్కు లోపల కొన్ని పెట్రోలియం జెల్లీని అప్లై చేయండి.

• దీన్ని తగినంత మోతాదులో మాత్రమే ఉపయోగించండి, అలాకాకుండా మోతాదుకు మించి దీనిని ఉపయోగించినట్లయితే మీకు మరిన్ని సమస్యలను కలిగించగలదు.

English summary

Combat Nose Bleeding In Summers With These Home Remedies

Many of us suffer from nose bleeding during summers. Nose bleeding is caused because the moisture present in the nasal dries up. This causes rupturing of the blood vessels in the nose whenever we pick it. We can stop the nose bleeding with the help of a cold compress, by keeping your nostril moist using petrolium jelly or oil..
Story first published: Saturday, April 7, 2018, 18:00 [IST]